Jump to content

పుష్కర ఏర్పాట్లు ఓటు బ్యాంక్‌ రాజకీయాలు: జగన్‌


OnlyTDP

Recommended Posts

విజయవాడ: కృష్ణా పుష్కర ఏర్పాట్లు ఓటు బ్యాంక్ రాజకీయాలని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. గురువారం జగన్ పున్నమిఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పుష్కరాల పేరిట గుళ్లు, గోపురాలు, నేతల విగ్రహాలు తొలగించారని మండిపడ్డారు. సదావర్తి సత్రం భూములను బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు మొట్టికాయలు వేసే రోజు త్వరలో వస్తుందని జగన్ అన్నారు.

Link to comment
Share on other sites

పుష్కరాల పేరుతో 1700 కోట్లు వృథా 
19-08-2016 02:46:10
636071715698337746.jpg
  •  ఆ సొమ్ము కృష్ణలో పోశారు: జగన్‌ 
వీరులపాడు: కృష్ణా పుష్కరాల పేరుతో రూ.1700 కోట్లను రాష్ట్రప్రభుత్వం కృష్ణానదిలో పోసిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతిలో కృష్ణానదిలో నీటమునిగి మృతి చెందిన నందిగామ నగేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గురువారమిక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాల సమయంలో నదిలో పడి అక్కడ మృతిచెందిన వారికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి... ఇక్కడ మృతిచెందిన విద్యార్థులకు కేవలం రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడం కంటితుడుపు చర్యగా పేర్కొన్నారు ఏటూరు సమీపంలో గతంలో పుష్కర ఘాట్‌ ఉందని, ఇప్పుడు లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో ఘాట్‌ ఏర్పాటు చేయకపోతే పులిహోర పంపిణీ ఎందుకు చేశారని అడిగారు. హంగూ ఆర్భాటంతో పుష్కరాలను ప్రారంభించారని, యాత్రికులకు మాత్రం సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. సీఎం చంద్రబాబు దేవుడి పేరుతో ప్రజాధనం దోపిడీకి పూనుకున్నారని దుయ్యబట్టారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని, ప్రధాని మోదీని ఆహ్వానించినా రాలేదని చెప్పారు. వర్షాలు లేక రైతులు, రైతుకూలీలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమ కాలువకు గండిపడితే దానిని వైసీపీ కార్యకర్తలే కారణమంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తూ నీటమునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను తమ పార్టీ తరపున ఆదుకుంటామన్నారు. నగేశ్‌ తల్లిదండ్రులను, సోదరిని ఆయన ఓదార్చారు. జగన్‌ వెంట నందిగామ నియోజకవర్గ ఇన్‌చార్జి మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

Oreyy Jaffa ga.. Puskharalu sarigga chesi vundakapothe malli nuvve vachi Puskharalu kuda sarigga cheyalekapoyindhi AP govt ani media ki statement lu ichevadivi gaa

 

BTW veedi vimarsa tho VP ayyadu janalalo..

 

Puskharalaki vachina prathokkadu erpatlu bavunnai annaru

 

Jaffa never disappoints :lol2:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...