Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
విశాఖలో కేన్సర్‌ మెగా పరిశోధన కేంద్రం
 
  • రూ.3 వేల కోట్లతో ఏర్పాటు.. ఏపీఐఐసీ భాగస్వామ్యం
  • 360 ఎకరాలు కావాలి.. డీపీఆర్‌ అందజేసిన ‘వ్యాస్‌’
హైదరాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): విశాఖ సమీపంలో మూడు వేల కోట్ల భారీ వ్యయంతో కేన్సర్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ సంస్థ ఏపీఐఐసీ 26 శాతం వాటా తీసుకోవాలని యోచిస్తోంది. అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ నిపుణురాలు డాక్టర్‌ హిమబిందు ప్రమోటర్‌గా ఉన్న వ్యాస్‌ కేన్సర్‌ పరిశోధనా కేంద్రం దీని ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందచేసింది. దీనికి అవసరమైన రాయితీలపై గత అక్టోబరులో జీవో కూడా జారీ చేసింది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రమోటర్లు తాజాగా డీపీఆర్‌ కూడా అందచేశారు. గురువారం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ డీపీఆర్‌ను పరిశీలించారు. ఈ సంస్థకు భూమి కేటాయింపుపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. విశాఖ సమీపంలో 360 ఎకరాల స్థలం కావాలని ఈ సంస్థ కోరింది. పరిశోధనా కేంద్రం భవనాలతోపాటు ల్యాబులు, పరిశోధకులకు వసతిని కూడా అక్కడే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రత్యక్షంగా పన్నెండు వేల మందికి, పరోక్షంగా పదిహేడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. కేన్సర్‌ పరిశోధనలో ముందంజలో ఉన్న ఐఐటీ చెన్నైతోపాటు బయోకాన్‌, టెక్‌ మహేంద్రా, అమెరికాకు చెందిన హెల్త్‌ కేర్‌ గ్రూప్‌, ఎధికో తదితర సంస్థలు ఈ పరిశోధనా కేంద్రంలో భాగస్వాములుగా ఉం టాయి. ఈ కేంద్రం ఏర్పాటుకు ఫైజర్‌ తదితర ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు వెంచర్‌ కాపిటలిస్టులుగా ఉండబోతున్నారని వ్యాస్‌ సంస్థ తెలి
Link to comment
Share on other sites

ఏపీకి మాస్టర్‌కార్డ్‌ టెక్నాలజీ సెంటర్‌!
 
  • విశాఖలో ఏర్పాటు చేయాలని కోరిన చంద్రబాబు
 
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): విశాఖ ఫిన్‌ టెక్‌ కేంద్రంలో మాస్టర్‌ కార్డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆ సంస్థను కోరారు. మాస్టర్‌కార్డ్‌ ఇంటర్నేషనల్‌ మార్కెట్స్‌ ప్రెసిడెంట్‌ ఏన్‌ కేన్స్‌తో దావోస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తమ సంస్థ ఆసియా కార్యకలాపాల విభాగాధిపతికి ఈ ప్రతిపాదన తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని కేన్స్‌ హామీ ఇచ్చారు. చంద్రబాబుతో ఎయిర్‌బస్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డర్క్‌ హోక్‌ కూడా భేటీ అయ్యారు. కాగా, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ ప్రశంసించారు. తనను కలిసేందుకు వచ్చిన బజాజ్‌ను శాలువాతో సత్కరించి కొండపల్లి బొమ్మలను సీఎం బహూకరించారు. అబిరాజ్‌ గ్రూపు ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

paper news ok....ground lo avuthunnayaa 2mn5gzo.gif

 

 

avutunnayi kaani ayyayi ane news kantey emi ledhu emi raledhu ani news jagga batch okatiki 100 times chepptunnayi

Link to comment
Share on other sites

విజయవాడకు గిడ్డంగుల సంస్థ: ఎల్వీఎస్సార్కే
 
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థను ఏప్రిల్‌లో విజయవాడకు తరలిస్తామని.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎల్వీఎసార్కే ప్రసాద్‌ వెల్లడించారు. గురువారం ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.240 కోట్లతో 4 లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములను నిర్మించనున్నామన్నారు. విశాఖ, భీమవరంలో ఆక్వా శీతల గిడ్డంగులు, గుంటూరులో మిర్చి, పసుపు గిడ్డంగుల నిర్మాణానికి కేంద్రం రూ. 123 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.
Link to comment
Share on other sites

పెట్టుబడుల పండగ!
 
636210818969312370.jpg
  • నేడు, రేపు విశాఖలో భాగస్వామ్య సదస్సు
  • రూ.6.83 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
  • 42 దేశాల ప్రతినిధులు.. 12 దేశాల మంత్రులు
 
(విశాఖ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
నవ్యాంధ్రలో మరో ‘పెట్టుబడుల పండుగ’కు రంగం సిద్ధమైంది. సాగర నగరి విశాఖపట్నం వేదికగా శుక్రవారం, శనివారం భాగస్వామ్య సదస్సు జరగనుంది. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్యంతో... కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. గత ఏడాది రూ.4,67,577 కోట్ల పెట్టుబడులపై ఒప్పందం కుదరగా... ఈసారి 425 సంస్థలతో రూ.6,83,107 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరే అవకాశముంది. భాగస్వామ్య సదసస్సును తూతూ మంత్రంగా, పేరుగొప్పకు కాకుండా... కుదిరిన ఒప్పందాలను వాస్తవ పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఆషామాషీగా కాకుండా... ఆచితూచి మరి ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తోంది.
 
గత ఏడాది జరిగిన సదస్సు స్ఫూర్తి, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 100 శాతం పెట్టుబడులను పెట్టే సంస్థలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని తీర్మానించారు. ఈసారి... ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు అపోలో, సియట్‌, విప్రో, టాటా, క్రేన్‌, టొరంటో, మొనోట్‌, టీవీఎస్‌, దాసన్‌, డిక్సన్‌, డ్రోన్‌ డిఫెన్స్‌, హిమామి, శ్రీ సిమెంట్స్‌, టోరెంట్‌ పవర్‌, ఎన్‌ఎస్ ఎల్‌ మైనింగ్‌ వంటి పలు సంస్థలు నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పునరుత్పాదక ఇంధనం, వైమానిక, రక్షణ, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, బయో టెక్నాలజీ, జౌలి, వస్త్రాలు, పెట్రో కెమికల్‌, అయిల్‌ అండ్‌ గ్యాస్‌, సిమెంట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టూరిజం, ఐటీ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. ‘సన్‌రైజ్‌ స్టేట్‌’ నినాదంతో... ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ లో మొదటి ర్యాంకు వచ్చిన బలంతో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపడతామని ప్రభుత్వం చెబుతోంది.
 
టెక్స్‌టైల్‌లో రూ.800 కోట్లు
చేనేత, జౌళిశాఖ ఉన్నతాధికారులు టెక్స్‌టైల్స్‌ రంగంలో పేరున్న కంపెనీలతో పెట్టుబడులపై చర్చలు జరిపారు. గోకుల్‌దాస్‌ కంపెనీ, సాయి ఎంటర్‌ప్రైజెస్ తోపాటు మొత్తం 12 కంపెనీలు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటిద్వారా సుమారు 41,600 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం ఈ సంస్థలతో ఒప్పందాలు జరగనున్నాయి. వీటిలో నాలుగు సంస్థలు విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని సెజ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపాయి. మిగిలినవి రాయలసీమలో ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని చేనేత, జౌళి ఉన్నతాధికారి తెలిపారు.
 
ప్రతినిధులు... అతిరథ మహారథులు
విశాఖ భాగస్వామ్య సదస్సులో దాదాపు 4000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. 42 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు ఉంటారు. 12 దేశాల వాణిజ్య మంత్రులు కూడా హాజరవుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్‌, ధర్మేంధ్ర ప్రధాన్‌, పియూష్‌ గోయల్‌, సురేశ్‌ ప్రభు, నితిన్‌ గడ్కరీ, అశోక్‌ గజపతి రాజు, వైఎస్‌ చౌదరి ఈ సదస్సులో పాల్గొంటారు.
 
గత ఏడాది సదస్సు ఫలాలు ఇలా...
గత ఏడాది తొలి భాగస్వామ్య సదస్సు ఫలితంగా... రాష్ట్రానికి రూ.4,67,577 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 328 సంస్థలు తమ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. 38 యూనిట్లలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి విలువ మాత్రమే తీసుకుంటే.. రూ.52,987 కోట్లు. మరో ఆరు యూనిట్లు ట్రయల్‌ రన్‌ దశలో ఉన్నాయి. 16 ప్లాంట్లలో యంత్రాలు అమర్చుతున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.14,700 కోట్లు. 82,595 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 29 కంపెనీల కర్మాగారాల్లో సివిల్‌ పనులు జరుగుతున్నాయి. మరో 6611 కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 13 కంపెనీల ప్లాంట్లు శంకుస్థాపనకు సిద్ధమయ్యాయి. వీటిలో వీటిలో 8 యూనిట్లకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

పారిశ్రామిక దిగ్గజాలతో బాబు భేటీ
 
636210806925876292.jpg
  • విశాఖ చేరుకున్న అనిల్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, శశి రుయా 
  • రెండు రోజులూ ముఖ్యమంత్రి బిజీబిజీ 
 
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక దిగ్గజాలు క్యూకట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ వల్ల ఈ సారి పలువురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఆకర్షణీయమైన పెట్టుబడుల ప్రతిపాదనలతో విశాఖ సదస్సుకు వస్తున్నారు. గురువారం రాత్రికే విశాఖ చేరుకుంటున్న ముఖ్యమంత్రి సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలతో శుక్ర, శని వారాలు బిజీగా ఉంటారు. ఆర్థిక మంత్రి జైట్లీ సదస్సును ప్రారంభించనున్నారు. శుక్రవారం సదస్సు ప్రారంభోత్సవం తర్వాత చంద్రబాబు స్వయంగా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశం కానున్నారు. అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ, ఎస్సార్‌ గ్రూప్‌ శశి రుయా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత కుమార్‌ మంగళం బిర్లా, విక్రమ్‌ కిర్లోస్కర్‌, టాటా కెమికల్స్‌ చీఫ్‌ ఎస్‌ ముకుందన్‌ గురువారం నాడు చంద్రబాబుతో భేటీ కానున్నారు .
 
నౌకా నిర్మాణ కేంద్రం, వ్యూహాత్మక రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమను ఉత్తరాకోస్తాలో ఏర్పాటు చేయనున్నట్టు అనిల్‌ అంబానీ గతేడాది సదస్సులో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఇంకా కార్యరూపం దాల్చలేదు. మొదట అనిల్‌ అంబానీతో భేటీ తర్వాత ఎస్సార్‌ గ్రూప్‌ అధినేత శశిరుయాతో సిఎం సమావేశ మవుతారు తర్వాత కుమార మంగళం బిర్లా, కిర్లోస్కర్‌, ముకుందన్‌తో భేటీ అవుతారు. ఈ చర్చల తర్వాత డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. అరబ్‌ ఎమిరేట్స్‌, ఉక్రెయిన్‌, కాంబోడియా, నేపాల్‌, జాంబియా, జింబాబ్వే, సుడాన్‌ దేశాల నుంచి వచ్చిన వాణిజ్య మంత్రులు, అధికార ప్రతినిధులతో ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఐటిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అంజనా గోన్‌సాల్వేజ్‌, సింగపూర్‌ రాయబారి గోపీనాధ్‌ పిళ్లై కూడా ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. జీటెలీ అధినేత సుభాష్‌ చంద్ర, భారత ఫోర్జ్‌ చైర్మన్‌ బాబా కల్యాణ్‌ కూడా సదస్సులో పాల్గొంటున్నారు.
 
అసాధారణ స్పందన...
ఈ సారి సదస్సుకు ఇన్వెస్టర్లు, విదేశీ ప్రతినిధుల నుంచి అసాధారణ స్పందన ఉన్నట్టు సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. వివిధ దేశాల నుంచి దాదాపు 350 మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నట్టు వివరించారు. బడా కార్పొరేట్‌ సంస్థల సిఇఒలతో పాటు ప్రముఖ ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, శాస్త్ఞ్రజ్ఞులు కూడా సదస్సుకు హాజరవుతున్నారు. సదస్సు సందర్భంగా నిర్వహిస్తున్న పలు గోష్ఠుల్లో వారు పాల్గొంటారు. ట్రంప్‌ గెలుపు నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జాతీయ ఆర్థిక పరిణామాలతో పాటు సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన అంశాలు, ఇన్వెస్ట్ మెంట్‌ అవకాశాలపై చర్చలుంటాయని ఆయన తెలిపారు గతేడాది సదస్సులో 4.67 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన ఎంఒయులు కుదిరాయి. అందులో దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువజేసే ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలకెక్కాయి.
Link to comment
Share on other sites

డిండిలో రూ.2740 కోట్లతో ఔషధ నగరి
 
హైదరాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా డిండిలో రూ.2740 కోట్లతో ఔషధ నగరి ఏర్పాటు కానుంది. ఈమేరకు డిండి కెమికల్‌ అండ్‌ ఫార్మా పార్కుతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒప్పందం కుదుర్చుకోనుంది. 18 ప్రసిద్ధ ఔషధ కంపెనీలు ఈ పార్క్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ప్రసాంధ్రులు కూడా భాగస్వాములు కానున్నారు. మొత్తం 64 ఔషధ కంపెనీలను ఈ పార్కులో ఏర్పాటు చేనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా వ్యర్థాలను రీసైక్లింగ్‌ ద్వారా పునర్‌ వినియోగం చేస్తామని ఈ పార్కు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.రాధాకృష్ణ చెప్పారు. నీటిని కూడా రీసైక్లింగ్‌ చేసి వినియోగిస్తామని తెలిపారు. స్థానికుల జీవనోపాధి దెబ్బతినకుండా తాటిచెట్లు, గొర్రెల మేతకు కొంత భూమిని కేటాయిస్తున్నామని చెప్పారు.
Link to comment
Share on other sites

ఐటీలో భారీ పెట్టుబడులు
 

(విశాఖపట్నం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సాంకేతిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం రానున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐటి రంగంలో ప్రపంచ దేశాలతోనేకాకుండా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పడేది. రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో కాస్త వెనుకబడినట్టే కనిపించింది. 2016 జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి అంతగా ఉనికి చాటుకోలేదు కానీ ఈ ఏడాది పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ముందుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటి రంగం విస్తరించి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఎంఒయూలు కుదుర్చుకోనున్న కంపెనీల వివరాలు..
  
PHOTO%201.jpg 
PHOTO%202.jpg
Link to comment
Share on other sites

665 ఒప్పందాలు.. 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు
 
636212544879083247.jpg
  • విశాఖ సదస్సులో భారీ పెట్టుబడి ఒప్పందాలు
  • 22.34 లక్షల మంది ఉపాధికి చాన్స్‌
  • భాగస్వామ్య సదస్సు గ్రాండ్‌ సక్సెస్‌
(విశాఖ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
విశాఖ సాగర తీరంలో రెండు రోజుల పాటు భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, గెయిల్‌, ఆర్‌ఈసీ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదిరాయి. సదస్సు తొలి రోజు శుక్రవారం 128 సంస్థలతో రూ.4.25 లక్షల కోట్ల మేర అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదరగా, రెండో రోజు ఏకంగా 537 సంస్థలతో రూ.6,29,590 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. మొత్తంమీద 665 సంస్థలతో కుదిరిన ఈ ఒప్పందాల విలువ రూ.10,54,590 కోట్లు. ఈ ఎంవోయూలను అమలుచేయడం ద్వారా 22.34 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని పారిశ్రామిక సంస్థలు భరోసా ఇచ్చాయి. వరుసగా రెండోసారి విశాఖలో నిర్వహించిన ఈ సదస్సు గత ఏడాది కంటే రెండున్నర రెట్ల మేర అధికంగా పెట్టుబడి ఒప్పందాలను రాబట్టగలగడం భారీ విజయానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. తొలి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సదస్సుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మాలా సీతారామన్‌ అధ్యక్షతవహించారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్‌ ప్రభు, అశోక్‌ గజపతిరాజు, ధర్మేంద్ర ప్రదాన్‌, నితిన్‌ గడ్కరీ, సుజనా చౌదరి పాల్గొన్నారు. ఎనిమిది దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, దాదాపు 1500 మంది వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంతా తానై ఈ సదస్సును నడిపించారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సదస్సును నిర్వహిస్తామని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.
 
YRK_9429.jpg patanjali.jpgYRK_9904.jpg
 
ఒప్పందం చేసుకున్న ప్రధాన పరిశ్రమల వివరాలు
రిషి డెకార్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌, ఇందాని గ్లోబల్‌, డ్రోన్‌ డిఫెన్స్‌, సియట్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, అపోలో టైర్స్‌, టాటా కెమికల్స్‌, విప్రో, ఓఎన్‌జీసీ, హెచ్ పీసీఎల్‌-గెయిల్‌, ఆర్‌ఈసీ.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో: పతంజలి ఆయుర్వేదిక్‌, పార్లే ఇంధనం, మౌలిక సదుపాయాల్లో: జీఎంఆర్‌, రామ్‌కో, గమేశా, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ఎనర్జీ డెవల్‌పమెంట్‌
ఏపీసీఆర్‌డీఏ పరిధిలో: బీపీసీఎల్‌, టోరెంట్‌ పవర్‌, టాటా పవర్‌, ఐఓసీఎల్‌, బీఆర్‌ఎస్‌ మెడిసిటీ
ఉన్నత విద్యలో: విట్‌, అమిటీ, ఎస్‌ఆర్‌ఎం, ఐఎఫ్ ఎంఆర్‌ వర్సిటీ, అమృత వర్సిటీ, ఎడిబోన్‌ ఇంటర్నేషనల్‌
మైనింగ్‌ రంగంలో: ఇమామి సివెంట్‌, చెట్టినాడ్‌, శ్రీ సిమెంట్‌
ఈడీబీలో: నెక్స్ట్‌ ఆర్బిట్‌, ఎన్‌ఎస్ ఎల్‌ మైనింగ్‌, జింగ్రాంగ్‌
టెక్స్‌టైల్‌ అండ్‌ అపెరల్‌లో: గోకుల్‌ దాస్‌ ఎక్స్‌పోర్టు, శాహి ఎక్స్‌పోర్టు
ఐటీలో: పీపుల్‌ టెక్‌, కార్వే, వీటెక్‌ వెబ్‌, ఇండో అమెరికన్‌ సొసైటీ, ఎఎన్‌ఎస్ ఆర్‌ కన్సల్టింగ్‌
పర్యాటకంలో: ఎయిర్‌ బీఎన్‌బీ హోమ్‌ స్టేస్‌, ఫీడ్‌బ్యాక్‌ గ్రూప్‌, బీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, జీ అండ్‌ సీ గ్రూప్‌


ఏ శాఖ.. ఎన్ని ఒప్పందాలు?
3456344.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...