Jump to content

Recommended Posts

  • 3 weeks later...
Posted
వాహ్‌...   అరకు కాఫీ 

 

పారిస్‌ పోటీల్లో విశాఖ మన్యం కాఫీకి బంగారు పతకం 
సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ 
పొరుగు రాష్ట్రాలకు కాఫీశాలలను విస్తరిస్తున్న జీసీసీ

3ap-story1a.jpg

విశాఖ మన్యంలో పండుతున్న అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ఇటీవల ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రిక్స్‌ ఎపిక్యూర్‌ 2018లో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. కాఫీ మార్కెట్‌లో ప్రసిద్ధ బ్రాండ్లుగా పేరొందిన సుమత్రా, కొలంబో రకాలతో పోటీపడి బంగారు పతకం సాధించిన తొలి భారతీయ కాఫీ మిశ్రమంగా సత్తా చాటింది.

3ap-story1b.jpg

అరకు కాఫీ రుచే వేరు.. 
విశాఖ జిల్లాలోని చింతపల్లి సముద్ర మట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉండగా... పాడేరు, అరకు ప్రాంతాలు 3000 అడుగుల ఎత్తులో ఉండడంతో ఇక్కడ కాఫీ పంటకు అనుకూల వాతావరణం ఉంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పోలిస్తే ఉత్పత్తి తక్కువే అయినా నాణ్యత ఎక్కువ కావడంతో మన్యం కాఫీకి గిరాకీ ఎక్కువ. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల్లో పండించే కాఫీని అరకు కాఫీగా పిలుస్తారు. విశాఖ మన్యంలో ప్రస్తుతం పార్చిమెంట్‌, అరబికా చెర్రీ, రొబస్టా రకాలు పండిస్తున్నారు. అరబికా రకానికి ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. విదేశాల్లో గిరాకీ ఉన్న సేంద్రియ కాఫీ సాగును రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తోంది. జీసీసీ, ఐటీడీఏ, కాఫీ బోర్డులు గిరిజనుల్లో చైతన్యం నింపి సేంద్రియ పద్ధతులను ఆచరించేలా సహకరిస్తున్నాయి.

3ap-STORY1C.jpg

మన్యంలో సాగు ఇలా.. 
విశాఖ మన్యంలో లక్షన్నర ఎకరాల్లో గిరిజనులు కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. 
అటవీశాఖ పరిధిలో మరో పది వేల ఎకరాల పంట సాగవుతోంది. 
ఏటా 10,500 టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. 
వీటిని గిరిజన సహకార సంస్థతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు.

3ap-story1d.jpg

ఎగుమతికి ‘నాంది’ 
మన్యంలో నాంది ఫౌండేషన్‌ మొదటిసారిగా సేంద్రియ సాగును అమలులోకి తెచ్చి ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంలో చొరవ చూపించింది. ఇలా పారిస్‌లోను అరకు కాఫీశాల ఏర్పాటైంది. విదేశాల్లో అరకు పేరుతో ప్రత్యేకంగా ఓ కాఫీ షాపు తెరిచింది కూడా ఇక్కడే. ప్రిక్స్‌ ఎపిక్యూర్‌ పోటీల్లో పతకం సాధించడం ద్వారా ఈ కాఫీ షాపు మరింత ప్రాచుర్యం పొందడానికి అవకాశం కలిగింది.

3ap-story1e.jpg

పొరుగు రాష్ట్రాలకు విస్తరణ 
అరకు కాఫీని దేశీయంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కృషి చేస్తోంది.  ఆ సంస్థ ఎండీ బాబూరావునాయుడు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం విమానాశ్రయంలో ఈ కాఫీ షాపును ఏర్పాటు చేశారు. రేణిగుంట, విజయవాడ, శంషాబాద్‌, చెన్నై విమానాశ్రయాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఓ ఔట్‌లెట్‌ ఏర్పాటు చేశారు. దిల్లీలోని సుప్రీంకోర్టు ఆవరణలోను, శాస్త్రి భవన్‌లో జీసీసీ ఔట్‌లెట్‌ల ఏర్పాటుకు సంబంధించి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైతు బజార్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాల్లోనూ జీసీసీ కాఫీ శాలలు, ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 

-ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

 

  • 2 weeks later...
Posted

GI Tag, export to foreign countries, 90-day campaign with spicejet, Complimentary cup on flights to 27 destinations and promotions by tourism dept, 100 outlets planned by GCC. Plans are afoot to open Araku coffee outlets on the premises of the Supreme Court, Shastri Bhawan and the North-East Bhawans in New Delhi. Each outlet will provide employment to three tribal youth.

https://pbs.twimg.com/media/DskhWqwUUAEmj2O.jpg

  • 2 weeks later...
Posted

హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ప్లస్ అరకు కాఫీ

నవంబర్ 30, 2018

హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ప్లస్ అరకు కాఫీ

హైదరాబాద్ లో కామన్ మ్యాన్ కూడా సేదతీరే అతి చవకైన పానీయం ఇరానీ చాయ్. హైదరాబాద్ ప్రధాన వీధుల్లోనే కాక గల్లీల్లో కూడా ఎక్కడ చూసినా ఇరానీ చాయ్ దర్శనమిస్తుంది. ఇకపై చాయ్ తో పాటు కాఫీ కూడా హైదరాబాదీల జిహ్వ చాపల్యాన్ని తీర్చేందుకు ముందుకొస్తోంది. విశాఖలోని అరకు వ్యాలీలో ప్రాణం పోసుకున్న కాఫీ గింజలు.. హైదరాబాద్ ప్రజలకు కొత్త రుచులు పంచేందుకు వస్తున్నాయి. అది కూడా ఈ డిసెంబర్ నుంచే కావడం విశేషం. 

దాదాపు గత దశాబ్దం క్రితం వరకు అరకు కాఫీ గురించి వినడమే తప్ప దాని రుచి ప్రపంచానికి తెలియదు. అరకు సందర్శన కోసం వచ్చిన టూరిస్టులు తప్ప ఇతరులకు దాని రుచి తెలియదు. అయితే అరకులో ప్రకృతి ప్రసాదించిన కాఫీ ద్వారా స్థానిక గిరిజనులకు ఎంతోకొంత మేలు చేయాలన్న ఉద్దేశంతో నాంది ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2008లో కాఫీ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఎక్స్ పోర్ట్ మొదలైన తొలి రోజుల్లోనే అరకు కాఫీలో ఉండే సహజమైన ఘుమఘుమలకు ప్యారిస్ వాసులు ఫిదా అయిపోయారు. 2009లో మొదటిసారి గ్లోబల్ రికగ్నిషన్ సాధించింది. ఇంటర్నేషనల్ కాఫీ టేస్టింగ్ ఈవెంట్ లో "జెమ్స్ ఆఫ్ అరకు" అన్న పేరు సంపాదించుకుంది. కాఫీకి పాపులాలిటీ పెంచేందుకు విదేశాల్లో జరిగే ఈవెంట్లకు హాజరవడం ద్వారా అరకు కాఫీకి మరిన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ సంవత్సరం ప్యారిస్ లో జరిగిన ఈవెంట్ లో "గ్లోబల్ రికగ్నిషన్-2018 అవార్డు"ను అరకు కాఫీ సొంతం చేసుకుంది. దాదాపు పదేళ్లుగా ప్యారిస్ లోని 30 సెంటర్లలో సేల్ అవుతున్న అరకు కాఫీని.. ఇకపై 100 కేంద్రలాల్లో సేల్స్ కోసం ఉంచుతామని వారు చెబుతున్నారు. 

అదే స్ఫూర్తితో న్యూయార్క్, టోక్యో నగరాలకు కూడా ఎక్స్ పోర్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచేందుకు, అది కూడా డిసెంబర్ మధ్య నుంచే అమ్మకాలు ప్రారంభించేందుకు నాంది ఫౌండేషన్ సన్నాహాలు చేస్తోంది. దీంతో.. పక్క రాష్ట్రంలో తయారైన ఆదివాసుల కల్పతరువు అరకు కాఫీ.. ఇకపై ఇరానీచాయ్ కి సరిజోడుగా హైదరాబాద్ లో ఘుమఘుమలు అందించనుంది. 2007-08లో కిలో కాఫీ రూ. 42 గా ఉండేది. దానికి మార్కెటింగ్ యాక్సిస్ కల్పించాక.. ఇప్పుడదే కిలో రూ. 275 పలుకుతోంది. 


ప్యారిస్ లో 30 చోట్ల అమ్ముతున్నారు. దాన్ని 100 సెంటర్లకు పెంచాలని భావిస్తున్నారు. 
న్యూయార్క్, టోక్యో మార్కెట్స్ కు కూడా తరలించే యోచన. 

  • 1 month later...
Posted
On 12/3/2018 at 10:11 PM, hydking said:

AP lo ekada dorukutundhi?

GCC ( girijan corporation stores lo unnay), rythunestham (called natural products) vaalla stores lo unnay. Gcc products dhorikae stores lo untay.

vijayawada pwd grounds daggara raithu bazaar lo gcc store undhi.

  • 1 month later...
  • 3 weeks later...
  • 3 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...