Jump to content

Amaravati


Recommended Posts

Group of Asia artists drew sketches of current Amaravati villages..This lady is one of the professionals part of that group ....She went around word and finishes drawing sketches on the spot...

amaravati village sketches ni online market lo sell chestundi lo..

https://www.instagram.com/eureca1/                  :cool1:

 

 

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

 

Home-Icon
 
అమరావతిలో నైట్‌ సఫారీ
22-12-2017 07:01:25
 
636495228938403087.jpg
  •  కొండవీడు వద్ద మినీ 
  •  నగరవనంలో రెండు కొండలను కలుపుతూ రోప్‌ వే,
  •  మంత్రి శిద్ధా రాఘరావరావు
(ఆంధ్రజ్యోతి, గుంటూరు): రాజధాని అమరావతిలో సింగపూర్‌ తరహాలో నైట్‌ సఫారీ ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఉందన్నారు. గురువారం ఆయన గుంటూరులోని పర్యావరణ భవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలలో సైన్స్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దీంతో పాటు విజయవాడలోని సైన్స్‌ సెంటర్‌ను ఆధునీకకరిస్తున్నట్లు మంత్రి వివరించారు. వీటితో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో నగర వనంను ఏర్పాటు చేస్తున్నట్తు తెలిపారు. నెల్లూరు నగరవనాన్ని 15 రోజులలో, చీరాల నగరవనాన్ని రెండు నెలలో పూర్తి చేస్తామన్నారు. వైజాగ్‌ జూ ను రూ.36 కోట్లతో అధునికరించటంతో పాటు తిరుపతి జూ ను అధునీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను జవనవరి 15లోపు తిరుపతి గోడౌన్‌కు తరలించాలిన అధికారులను అదేశించారు. 2029నాటికి రాష్ట్రంలో 50శాతం గ్రీన్‌ కవర్‌ సాధించేందుకు నర్సరీల్లో మంచి మొక్కలను పెంచాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు. గుంటూరు నగరవనంలో రెండు కొండలను కలుపుతూ రోప్‌ వే, కొండవీడు వద్ద మినీ జూను ఏర్పాటు చేయనున్నట్ల మంత్రి తెలిపారు. కొండల్లో పచ్చదనం పెంపుదలకు చర్యలు చేపట్టాని మంత్రి ఆదేశించారు. సమావేశంలో సీసీఎఫ్‌ఓ సూర్యనారాయణ, డీఎఫ్‌ఓలు మోహనరావు, భీమయ్య తదితరలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

 

 

ఐకానిక్‌ భవనాలు భళా!
23-12-2017 03:54:26
 
636495980750193525.jpg
ప్రత్యేకతల సమాహారంగా అసెంబ్లీ, హైకోర్టు
పగలైనా..రాత్రైనా కనువిందు చేసేలా నిర్మాణాలు
 
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో ఐకానిక్‌ భవనాలుగా రూపుదిద్దుకోనున్న అసెంబ్లీ, హైకోర్టు సముదాయాలు అమరావతి ప్రతిష్ఠను మరింత పెంచడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండింటి డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఖరారు చేసింది. త్వరలో వీటి నిర్మాణ పనులను ప్రారంభించి 2019 ప్రథమార్థం కల్లా పూర్తి చేయాలని భావిస్తోంది. ఐకానిక్‌ భవనాల డిజైన్లకు సంబంధించిన కొన్ని చిత్రాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. వీటిని పరిశీలిస్తే పగలు..రాత్రి తేడా లేకుండా ఈ భవన సముదాయాలు కనువిందు చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
సృజనాత్మకంగా శాసనసభ
చుట్టూ నీటి కొలను, మధ్యలో సృజనాత్మకతకు సజీవ నిదర్శనంలా టవర్‌ డిజైన్‌లో భారీ భవనం. కొలను మధ్యగా ఏర్పాటు చేసిన సువిశాలమైన నడక మార్గాలు. కొలను చెంతనే కూర్చొని తనివితీరా భవనసముదాయ అందాన్ని తిలకించేందుకూ ఏర్పాట్లు. అమరావతిలో కొలువుదీరనున్న అసెంబ్లీ భవన సముదాయ ప్రత్యేకతలు ఇవి. సీఎం సూచించిన విధంగా అటు పగటి వేళల్లో సూర్యకాంతి, ఇటు రాత్రి సమయాల్లో వెన్నెల సోయగాలు, నక్షత్రకాంతులు అసెంబ్లీ భవనం చుట్టూ ఉన్న నీళ్లల్లో ప్రతిఫలించి, భవనానికి మరిన్ని మెరుపులు అద్దేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
బౌద్ధస్థూపాన్ని తలపించేలా రూపొందించిన హైకోర్టు డిజైన్‌ను ప్రాచీన, ఆధునిక శైలులకు సంగమంగా రూపొందించారు. ప్రధాన భవంతి ముందు చిన్న కొలను, దానిని ఆనుకొని పచ్చిక బయళ్లను తీర్చిదిద్దనున్నారు. వీటి మధ్యగుండా హైకోర్టుకు చేరుకునేందుకు నడకమార్గం ఏర్పాటు చేశారు. హైకోర్టు భవనం ముందు భారీ న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా కోర్టు హాలులో కనిపించే న్యాయదేవత విగ్రహం అమరావతిలో మాత్రం హైకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే దర్శనమివ్వనుంది.
 
అమరావతిలో 30 అంతస్తుల ఐటీ టవర్‌!
ఐటీ కంపెనీలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా సకల వసతులతో కూడిన దాదాపు 10లక్షల చ.అ.కార్యాలయ స్థలం అందుబాటులో ఉండేలా భారీ ఐటీ టవర్‌ నిర్మించాలని సీఆర్డీఏ యోచిస్తున్నట్లు సమాచారం. 30 అంతస్తులతో ఒకే టవర్‌ను నిర్మించాలా... భవిష్యత్తు డిమాండుకు అనుగుణంగా రెండు టవర్లుగా నిర్మించాలా అనే అంశం పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలో ఉన్న ఈ టవర్‌ను డెవల్‌పమెంట్‌ పద్ధతిలో లేదా బీవోటీ విధానంలో ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థల ద్వారా నిర్మింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సీఎం నిర్ణయానుసారం ముందుకు సాగాలని ఈ సంస్థ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీన్ని ఇప్పటికే రాజధానిలో 200ఎకరాల్లో ప్రతిపాదించిన ఐటీ పార్క్‌లో అంతర్భాగంగా కాకుండా, వేరొక ప్రదేశంలో నిర్మిస్తారని సమాచారం.
Link to comment
Share on other sites

 

17న జపాన్‌కు ఉన్నతాధికారుల బృందం
23-12-2017 06:40:42
 
అమరావతి: అమరావతి, విజయవాడ, గుంటూరు తదితర నగరాలు, పట్టణాలు, గ్రామాలతో కూడిన రాజధాని ప్రాంతం కోసం రూపొందించదలచిన సమగ్ర రవాణా ప్రణాళికపై మరో విడత చర్చల నిమిత్తం వివిధ సంస్థలు, విభాగాలకు చెందిన 11మంది ఉన్నతాధికారుల బృందం వచ్చే నెలలో జపాన్‌కు వెళ్లనున్నట్లు తెలిసింది. జనవరి 17వ తేదీ నుంచి 21 లేదా 22 తారీఖుల వరకు సాగనున్న తమ పర్యటనలో ఈ బృంద సభ్యులు సదరు ప్రణాళికను తయారు చేసే బాధ్యతలను స్వీకరించి, గత కొన్ని నెలలుగా ఆ పనిలో నిమగ్నమైన జపాన్‌ నిపుణులతో కీలక సంప్రదింపులు జరపనున్నారు. బృందంలో ఏపీసీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల కమిషనర్లు, విజయవాడ, గుంటూరు పోలీస్‌ కమిషనర్లు, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తదితరులున్నారు.
Link to comment
Share on other sites

 

5000+ Crores Expenditure for Three Buildings in Amaravati

 

5000+ Crores Expenditure for Three Buildings in AmaravatiThe Iconic Buildings of Secretariat, High Court, and Assembly Buildings are going to cost a bomb to the state exchequer. The construction cost alone will cost a whopping 7179 Rupees Per Square foot. According to an estimate, Secretariat construction will cost 2728 Crore while High Court and Assembly will cost 2228 Crore.

 

This is a sensational expenditure but Chandrababu Naidu wants it that way since these structures will stand for generations together. CRDA will call for the tenders very soon and the construction will begin. Naidu will want at least one or all of these buildings to be completed before 2019 elections to showcase as the success of the TDP government.

The state government recently finalised the design of the Assembly while Norman Fosters and Partners Company is busy finalising the designs of the high court and the secretariat. But then, this expenditure is too much for the state which is reeling under severe financial pressure due to the deficit budget inherited from the state bifurcation.

Link to comment
Share on other sites

 

 

అమరావతిపై ప్రపంచం దృష్టి
25-12-2017 01:16:22
 
  • ఇక్కడ పెట్టుబడులకు పలు దేశాల ఆసక్తి
  • హార్వర్డ్‌ వర్సిటీ కేస్‌స్టడీగా మన ల్యాండ్‌పూలింగ్‌
  • చారిత్రక నేపథ్యాన్ని రాష్ట్రపతికి వివరించాలి: సీఎం
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): అమరావతి గురించి తెలుగువారంతా గొప్పగా చెప్పుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 27న విజయవాడ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆదివారం అధికారులతో సీఎం సమీక్షించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, పలు దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
 
రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతికి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమరావతి చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా వివరించడంతో పాటు రాజధాని నగరాన్ని ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేయనుందో తెలియజేయాలన్నారు. ప్రపంచంలోని 10 అద్భుత రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలిపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు.
 
రాజధానికి భూమిని సేకరించడంలో అనుసరించిన విధానాలను, ప్రత్యేకించి ల్యాండ్‌ పూలింగ్‌ గురించి రాష్ట్రపతికి క్షుణ్ణంగా వివరించాలని చెప్పారు. రాజధాని నగరం గొప్పతనం తెలిసేలా సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కృష్ణా తీరంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. అమరావతి ల్యాండ్‌పూలింగ్‌ విధానాన్ని హార్వర్డ్‌ యూనివర్సిటీ కూడా కేస్‌ స్టడీగా తీసుకుందని, ఇది మనకెంతో గర్వకారణమని చెప్పారు. అమరావతి వల్ల చేకూరే ఆర్థిక, అభివృద్ధి ఫలాలు అన్ని జిల్లాల్లోని ప్రజలకు సైతం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
 
రాష్ట్రపతి రాక సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రదర్శనలో రోడ్లు, భవనాలు, శాఖమూరు పార్క్‌, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ భవనాలు తదితర నమూనాలను ఉంచనున్నట్లు సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ శ్రీధర్‌... సీఎంకు తెలియజేశారు. సమీక్షలో పురపాలక మంత్రి నారాయణ, ప్రత్యేక సీఎస్‌ సతీశ్‌చంద్ర, సీఎం ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి పాల్గొన్నారు
Link to comment
Share on other sites

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో రెండో దశ ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి నిర్మాణాలు పూర్తి చేసిన ప్రభుత్వం ప్రాథమిక, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్సీలు, సచివాలయ ఉద్యోగుల కోసం 3,840 అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ఆర్భాటం లేకుండా ప్రారంభించిన 61 టవర్ల నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది ప్రభుత్వం.
 
అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక దశ ప్రారంభమైంది. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వసతి సదుపాయాలతో పాటు సీడ్ కేపిటల్‌లో సచివాలయం, శాఖాధిపతుల భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అటు రహదారులు, ఇటు వసతి సౌకర్యాలు, మరో వైపు కార్యాలయాల నిర్మాణాలు అన్నీ సమాంతరంగా ప్రారంభించింది. 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా సాగుతున్న ఈ నిర్మాణాలకు బాహ్య ఆకృతి తీసుకొచ్చి 2019లో ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే రాజధానిలోని ప్రస్తుతం ఉన్న వెలగపూడి సచివాలయానికి ఆరు కిలో మీటర్ల దూరంలో శాశ్వత సచివాలయానికి మూడు కిలో మీటర్ల దూరంలో రాయపూడి, నేలపాడులో 61 టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...