Jump to content

Amaravati


Recommended Posts

జీఏడీ టవర్‌ ‘రికార్డ్‌!’
05-01-2019 03:22:32
 
636822553534762975.jpg
  • 55 గంటల్లోనే ముగిసిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌
  • 58 గంటల్లో టవర్‌ నెంబర్‌ 3కి పునాది
  • 10 గంటల ముందే పూర్తయిన పనులు
అమరావతి/తుళ్లూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): శాశ్వత సచివాలయ కాంప్లెక్స్‌లోని జీఏడీ టవర్‌(సీఎం, సీఎస్‌ల కార్యాలయం)కు సంబంధించిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ రికార్డు సమయంలో పూర్తయింది! 50 అంతస్థుల భారీ టవర్‌కు చెందిన పునాది పనులు కేవలం 55 గంటల్లోనే ముగిశాయి! బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ పనులు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిశాయి. వాస్తవానికి ఈ ఫౌండేషన్‌కు సుమారు 72 గంటల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేసినా 17 గంటల ముందే పనులు పూర్తయ్యాయి. గత నెల 27న 2వ నంబర్‌ టవర్‌(40 అంతస్థులు) ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు పూర్తయ్యేందుకు 65 గంటలు పట్టగా, దానికంటే పెద్దదైన జీఏడీ టవర్‌ పనులు 10 గంటల ముందే పూర్తవడం విశేషం. కాగా.. మంగళవారం ప్రారంభమైన 3వ నంబర్‌ టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రక్రియ కూడా శుక్రవారం(58 గంటలు) ముగిసింది.
 
జేఏడీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకతలు
  • సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని 5 టవర్లలో ఒక్క జీఏడీ టవర్‌లో 50 అంతస్థులు ఉంటాయి.
  •  జీఏడీ టవర్‌ ఫౌండేషన్‌ కొలతలు 53 మీటర్ల పొడవు, 53 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు కాగా మిగిలిన 4 టవర్ల పరిమాణం 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు మాత్రమే.
  •  జీఏడీ టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు 11,236 టన్నుల కాంక్రీట్‌ పట్టగా, మిగిలిన 4 టవర్లకు సగటున అవసరమయ్యే కాంక్రీట్‌ ఒక్కొక్కదానికి 10,800 టన్నులు మాత్రమే.
  •  జీఏడీ టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల్లో సుమారు 500 మంది కార్మికులు శ్రమించారు.
 
కాంక్రీట్‌ మరింత గట్టిగా
ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు పూర్తయిన జీఏడీ, 3వ నంబర్‌ టవర్ల పునాదికి అడుగున, పైన ప్లాస్టిక్‌ షీట్లు, మధ్యన 50 మిల్లీమీటర్ల థర్మోకోల్‌ షీట్‌ను అమర్చారు. తద్వారా కాంక్రీట్‌లోని చెమ్మ ఆవిరై పోకుండా ఉండి, లోలోపలే ఇంకిపోయి, కాంక్రీట్‌ను ఆశించిన విధంగా గట్టి పరుస్తుంది.
Link to comment
Share on other sites

 
 
 
 
 
 
 

2\3 Overall, 1500 men, officers worked day and night and completed 3 towers raft work just in a span of 7 days. Dr. Sreedhar Cherukuri IAS, Commissioner, APCRDA inspected the Secretariat and HOD GAD Towers and appreciated the teamwork

1 reply 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
 

3\3 Mr Shan Mohan Sagili IAS, Additional Commissioner, APCRDA, Chief Engineer Mr M. Venkateshwara Rao and Superintending Engineer Mr Shaik Jani Basha accompanied the Commissioner during this visit.

DwI9InVU8AAYlsr.jpg
DwI9LLEVYAEXETu.jpg
DwI9LLEV4AEGKEt.jpg
Link to comment
Share on other sites

ఉక్కు సంకల్పాన్ని చాటిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌
06-01-2019 02:48:17
 
636823396981421115.jpg
  • గడువు కంటే ముందుగానే కొలిక్కి
  • అధునాతన యంత్రాలతో పోటీగా శ్రమించిన వందల మంది కార్మికులు
  • 9 రోజుల్లో 32 వేల టన్నుల కాంక్రీట్‌ వినియోగం
  • వేడిని అదుపులో ఉంచేందుకు పునాదులపై థర్మోకోల్‌ షీట్లు
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణపు ఉక్కుసంకల్పాన్ని ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ఘనంగా చాటింది. కీలకమైన ఈ మహాయజ్ఞం పక్కా ప్రణాళికతో రికార్డు సమయంలో పూర్తయ్యింది. దేశంలో తొలిసారిగా ఇంతటి భారీస్థాయిలో ఈ తరహా ఫౌండేషన్‌ వేయడం ఒక విశేషమైతే.. దానిని నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయడం గమనార్హం. శుక్రవారంతోనే పూర్తయిన 2, 3, 5 టవర్లకు సంబంధించిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ చేపట్టిన సంగతి తెలిసిందే. దేశ విదేశాలకు చెందిన నిపుణులు, సంస్థల సహాయ సహకారాలు, సూచనలు ఈ నిర్మాణాల్లో కీలకం కాగా, ఏపీసీఆర్డీయే, ఏడీసీ అధికారులు చక్కటి సమన్వయంతో ముందుకెళ్లడంతో ఇది సాధ్యపడింది. సచివాలయ కాంప్లెక్స్‌లోని మొత్తం 5టవర్లలో నాలుగు టవర్లను 40 అంతస్తుల చొప్పున, సీఎం ఉండే జీఏడీ టవర్‌ను 50 అంతస్తులతో నిర్మిస్తున్నారు. వీటిల్లో మూడు టవర్లు (40 అంతస్తులవి రెండు, 50 అంతస్తులది ఒకటి) పునాది కొలిక్కి వచ్చాయి.
 
రికార్డు సమయంలో..!
గత నెల 27న మొదలైన పనులు ఈ నెల 4వ తేదీతో ముగిశాయి. ఒక్కో టవర్‌కు 72 గంటలు పడుతుందని అంచనా వేశారు. కానీ, 2వ నంబరు టవర్‌ (డిసెంబరు 27న మొదలై డిసెంబరు 29న) 66 గంటల్లో, 3వ నంబరు టవర్‌ (ఈ నెల 1వ తేదీ సాయంత్రం మొదలై శుక్రవారం ఉదయానికి) 58 గంటల్లో, 5వ నంబరు టవర్‌(ఈ నెల2న మొదలై శుక్రవారం రాత్రికి) కేవలం 55 గంటల వ్యవధిలోనే పూర్తి చేయడం విశేషం. మిగిలిన రెండు టవర్లకు సంబంధించిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు ఈ నెలాఖరులో చేపడతారు.
 
మహాయజ్ఞం
ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల్లో 1500 మంది కార్మికులు, వందల మంది అధికారులు, పెద్ద సంఖ్యలో నిపుణులు పాల్గొన్నారు. రమారమి 32వేల టన్నుల అత్యంత శక్తిమంతమైన కాంక్రీట్‌ను వినియోగించారు. ఈ కాంక్రీట్‌ను పునాదుల్లో పోసేందుకు అధునాతనమైన బూమ్‌ప్లేసర్లను, పంప్‌లను ఉపయోగించారు. నిర్మాణ పనులను చేపట్టిన ఆయా కాంట్రాక్ట్‌ సంస్థలు తమ ప్లాంట్లలో ఈ కాంక్రీట్‌ను తయారు చేయించి, భారీ వాహనాల్లో టవర్ల వద్దకు చేర్చాయి. పునాదుల్లో వేసే పనిని బూమ్‌ప్లేసర్లు, పంపులు విజయవంతంగా పూర్తి చేశాయి. ఫౌండేషన్‌ పూర్తయిన వెంటనే రెండు వరుసల ప్లాస్టిక్‌ షీట్లు, మధ్యలో 5 సెంటీమీటర్ల థర్మోకోల్‌ షీట్లను (కాంక్రీట్‌లో వేడిని అదుపులో ఉంచేందుకు) పరిచారు. థర్మోకప్లర్ల ద్వారా వాటిల్లో ఎంత ఉష్ణోగ్రత ఉందో నిపుణులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. కాంక్రీట్‌లోనితేమ పూర్తిగా ఇంకిపోయిన అనంతరం షీట్లను తీసివేసి, మిగిలిన నిర్మాణ కార్యక్రమాలను చేపట్టనున్నారు.
 
విజయోత్సాహం
సచివాలయంలోని హెచ్‌వోడీ కాంప్లెక్స్‌ను పూర్తి చేసేందుకు 36నెలల వ్యవధి ఉంది. అయితే పనులు ప్రారంభించిన 3 నెలల్లోనే 3 టవర్లకు సంబంధించిన పునాదుల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ విజయోత్సాహంతో గడువులోగానే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలమన్న ఆశాభావాన్ని సీఆర్డీయే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని 24నెలల్లో పూర్తిచేసి, మిగిలిన 12నెలల్లో ఇంటీరియర్లు, ఇతర పనులను పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలపై దృష్టి పెట్టాయి.
Link to comment
Share on other sites

Vijayawada and Amaravati road connectivity: Foundation for 'iconic' bridge soon

For the record, the proposal of an iconic bridge across the Krishna river was not a part of the capital city’s master plan.

Published: 06th January 2019 10:15 AM  |   Last Updated: 06th January 2019 10:15 AM   |  A+A-

bridge.jpg

As the bridge will be built across Krishna river its design was frozen after taking into consideration the necessary clearances required.

By Express News Service

VIJAYAWADA: The construction of the much-touted Iconic Bridge, to be built across Krishna river to provide a bigger road connectivity between Vijayawada and Amaravati, is all set to take off shortly. Chief Minister N Chandrababu Naidu is expected to lay the foundation for the project soon.

Sources in the Amaravati Development Corporation Ltd (ADCL), which is looking after the execution, said the foundation stone-laying ceremony could be held after Sankranti festival.

L&T Construction, which will execute the project, is making necessary arrangements — setting up stock yard and mobilising machinery and material — for the launch of the civil works. “We are ready on our part to launch the works. Once the Chief Minister’s Office (CMO) finalises the date, we will go ahead with the foundation,” an official explained.

ADCL chairperson and managing director (CMD) D Lakshmi Parthasarathy told TNIE that the works would be completed in two years, once the works are launched. “This is the first time that we are going to construct a cable-stayed bridge, which will truly be iconic,” the ADCL chief added. The bridge will come up across the Krishna river from Pavitra Sangamam in Ibrahimpatnam to N10 road near

 
 

 

Uddandarayunipalem in the Amaravati region. It may be noted that the 3.2-km-long six-lane bridge’s design — named Amaravati Dynamic — has been inspired from a yoga pose. The bridge is expected to cost Rs 1,387 crore. 

For the record, the proposal of an iconic bridge across the Krishna river was not a part of the capital city’s master plan. When the ADCL proposed the project, said to be the shortest route to connect Amaravati to Vijayawada, most stakeholders dismissed the idea. 

However, Lakshmi Parthasarathy had made a presentation to Naidu and he approved the proposal. “Getting the project designed was another challenge we faced as our State departments had no prior experience of handling such a project. We brainstormed for several days to get the best design,” another senior official explained.

As the bridge will be built across Krishna river, where the National Waterway-4 project has been proposed by the Centre, its design was frozen after taking into consideration the necessary clearances required.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...