Jump to content

Amaravati


Recommended Posts

Give priority to create social infra: Chandrababu Naidu

THE HANS INDIA |   Oct 29,2018 , 03:02 AM IST
   

 
 
Give priority to create social infra: Chandrababu Naidu
Give priority to create social infra: Chandrababu Naidu
 
 
Vijayawada: Chief Minister N Chandrababu Naidu directed AP Capital Region Development Authority (APCRDA) officials to give top priority for development of social infrastructure in Amaravati on par with crucial constructions such as Secretariat, Assembly and High Court and submit a report explaining the detailed plan mentioning timelines.
 
 
 
 
As the government estimates that Amaravati would see an exponential growth in population and rapid economic development in near future, creating social  infrastructure is vital for a strong economy and it must be done on a war footing, the Chief Minister said during a teleconference with APCRDA and Amaravati Development Corporation (ADC) officials here on Sunday.  
 
“We are creating history by building the world’s tallest Secretariat building with 212 metres height in 41 acres and first diagrid building in India. Also, for the first time in India, we are introducing twin lift system, which is most efficient vertical transportation system in the world,” the Chief Minister said. He asked the officials to follow the same standards in creating the social infrastructure also.
 
“As we have promised the best infrastructure and world class living standards to the people and global investors, the CRDA has to put special focus on fulfilling the same and expedite social infrastructure works,” the Chief Minister said.
 
Principal Secretary for Energy and APCRDA, Ajay Jain, explained to the Chief Minister that all the infrastructure works such as roads, water supply and sewerage works worth Rs 14,360 crore in Amaravati were in full swing. Construction of housing facility for people’s representatives and employees was going on at rapid pace, he said. 
 
Construction has commenced for the Secretariat and HoDs Complex to create built up area of 69.8 lakh square feet in 5 towers at a cost of Rs 4,890 crore and High Court in 12.5 lakh square feet, he said.  
 
CRDA Commissioner Ch Sreedhar briefed the Chief Minister that the CRDA successfully completed the 1st phase of land allotment for star hotels in the capital city and bidding was in progress for 2nd phase of land allotments for another eight hotels. Some of the hotel groups have started construction and they were given target date of completion by the end of September, 2019.
 
India’s largest 60-berth Marina water sports training center and ancillary facilities would come on River Krishna, which would be completed by September, 2019, he said. He also said some of the national and global schools had been allotted lands for setting up campuses and the construction works were under process.
 
Minister for Municipal Administration P Narayana, CMO officials Satish Chandra, G Sai Prasad, ADC chairperson, Lakhsmi Parthasaradhi, Special Commissioner Rama Manoharara Rao, Additional Commisioner Shan Mohan and other senior officials participated in the teleconference.
Link to comment
Share on other sites

అమరావతి హ్యాపీనెస్ట్‌పై సీఎం సమీక్ష

0429453110APCMCRDA.JPG

అమరావతి: రాజధానిలో ప్రజా గృహ నిర్మాణ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రాజధానిలో చేపడుతున్న ఈ మొట్ట మొదటి ప్రాజెక్టును అత్యుత్తమ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టంచేశారు. సీఆర్‌డీఏ పనుల పురోగతిపై సీఎం ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రజల కోసం చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుపై సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘అమరావతి హ్యాపీనెస్ట్’ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రజలలో ఇప్పటికే ఆసక్తి పెరిగిందని సీఎం అన్నారు. ప్రజల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం సూచించారు. సొంత గృహాలు కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల కోసం హ్యాపినెస్ట్ తరహాలో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు ఉంటుందన్నారు.

నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో ఆరు టవర్లలో 600 ఫ్లాట్లను జీ+18 విధానంలో నిర్మించనున్నారు. చ.అడుగు ధర సుమారు 3,500 రూపాయలుగా ఆరు కేటగిరీల్లో ప్లాట్ల పరిమాణాలు ఉండనున్నాయి. వెబ్‌పోర్టల్‌లో ఒక్కో ఫ్లాట్‌ను నిశితంగా పరిశీలించుకునేందుకు వీలుగా త్రీడీ గ్రాఫిక్స్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నవంబర్‌ 9 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నారు.

మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం విధానంలో దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రాజధానిలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు నిర్మాణంపై కచ్చితమైన కార్య ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో న్యాయనగరి అద్భుతం, అమోగం అన్నారు ఢిల్లీలో న్యాయమూర్తులు

 

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న.. జస్టిస్‌ సిటీ అద్భుతమని, ఇలాంటి నగరం దేశంలోనే ఉండదని పలువురు న్యాయమూర్తులు కొనియాడారు. జస్టిస్‌ సిటీ కలకాలం వర్ధిల్లాలని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఆకాంక్షించారు. జస్టిస్‌ సిటీ విశేషాలను చాటిచెప్పడానికి సీఆర్‌డీఏ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా మంగళవారం ఢిల్లీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాయి. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ శాంతాన గౌడార్‌, జస్టిస్‌ వినీత్‌ సరన్‌, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ ప్రతిభా, జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌, ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు.

24-ap-35252.jpg

జస్టిస్‌ సిటీ 3డీ డిజైన్ల ద్వారా న్యాయమూర్తులకు సిటీ వివరాలను, ప్రాముఖ్యతను, నిర్మాణ శైలిని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రవీంద్ర భట్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ సిటీ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌ మాట్లాడుతూ.. తాను ఈ ఏడాది ఆగస్టు 18న జస్టిస్‌ సిటీ ప్రాంతాన్ని సందర్శించానని వివరించారు. కోర్టు హాళ్లు, ఇతర గదులను విశాలంగా నిర్మిస్తున్నారని చెప్పారు. జస్టిస్‌ ప్రతిభా మాట్లాడుతూ.. ఈ సిటీ కలకాలం నిలవాలని ఆకాంక్షించారు. అమరావతి ఎప్పుడూ అమరంగా ఉంటుందని స్పష్టం చేశారు. జస్టిస్‌ సిటీ పరిశీలనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని న్యాయమూర్తుల కమిటీ తరలి వస్తోంది. నవంబరు 3న ఈ కమిటీ అమరావతి పరిధిలోని నేలపాడులో నిర్మాణంలోని హైకోర్టు తాత్కాలిక భవనం పనులను, న్యాయమూర్తుల నివాసగృహాల సముదాయాన్ని పరిశీలించనుంది. లండన్, న్యూఢిల్లీ మహా నగరాల్లోని నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకొని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ప్రభుత్వ నగరి నిర్మాణం కాబోతున్నట్లు ఎపి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.నవ్యాంధ్ర రాజధానిలో ప్రభుత్వ నగరి అమరావతిని ప్రత్యేకంగా…ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

24-ap-43643.jpg

అందుకే లండన్, న్యూఢిల్లీ మహా నగరాల్లోని నిర్మాణాలే స్ఫూర్తిగా ఈ ప్రభుత్వ నగరి నిర్మాణం చెయ్యాలని ఎపి ప్రభుత్వం తలపోస్తోంది. ఈ మేరకు రాజధాని నిర్మాణ డిజైన్ల తయారీకి ఎంపికైన లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్‌ సంస్థ…ఈ ప్రభుత్వ నగరిలోని డిజైన్ల తయారీకి ముందు లండన్, వాషింగ్టన్, న్యూఢిల్లీలోని ప్రభుత్వ భవనాలు, ప్రధాన వీధులు, ఇతర ఆకర్షణీయ వసతులపై పరిశీలన జరిపింది. తదనంతరం అమరావతిలోని అడ్మినిస్ట్రేటివ్‌ సిటీ నిర్మాణానికి సంబంధించి డిజైన్లను రూపొందించి ప్రభుత్వానికి అందించింది.

Link to comment
Share on other sites

సహనాన్ని పరీక్షించొద్దు
రాజధాని రహదారుల నిర్మాణంలో  జాప్యంపై సీఎం ఆగ్రహం
  గడువులోగా చేయకపోతే కఠినంగా  వ్యవహరిస్తామని హెచ్చరిక
భూసేకరణలో ఆలస్యంపైనా అసంతృప్తి
ఈనాడు - అమరావతి
31ap-main2a.jpg

రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతుండటంపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) నిర్మాణం ఇప్పటివరకు పూర్తికాకపోవడం, భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేకపోవడంపై మండిపడ్డారు. ఈ రహదారిని నిరర్థక ఆస్తిగా మార్చేశారని ఆగ్రహించారు. రాజధాని అమరావతిని, జాతీయ రహదారితో అనుసంధానిస్తూ మొత్తం 23 కి.మీ.మేర ఈ రహదారి నిర్మించాల్సి ఉంది. తొలి దశలో 18 కి.మీ.లకుగాను నాలుగు కి.మీ.మేర నిర్మాణం భూసేకరణ సమస్య వల్ల ఆగిపోవడం, రెండో దశ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజధాని పనుల పురోగతిపై ఆయన బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ, ఇతర విభాగాల అధికారులతో సమీక్షించారు. తాను పదేపదే చెబుతున్నా మార్పు రావడం లేదని, తన సహనాన్ని పరీక్షించవద్దని ఆయన నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులను హెచ్చరించారు. ‘భూసేకరణకు ఇంకా ఎన్నేళ్లు పడుతుంది? మీరింకా సంప్రదాయ పద్ధతులను పట్టుకుని వేళ్లాడుతున్నారు. నాకు చెడ్డపేరు తెస్తున్నారు’ అని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రధాన అనుసంధాన రహదారి రెండో దశ పనుల్లో భాగంగా కల్వర్టులు, రైల్వే ఓవర్‌బ్రిడ్జి వంటి పనులకు ఇప్పుడే అనుమతులు తెచ్చుకోవచ్చు కదా? భూసేకరణ జరిగేంత వరకు ఆగడం ఎందుకు?’ అని ఆయన అధికారులను ప్రశ్నించారు. భూసేకరణ పూర్తయిన రెండు నెలల్లోనే తొలిదశ ప్రాజెక్టులోని మిగతా నాలుగు కి.మీ.ల పనులు చేస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ రహదారిని ఎనిమిది వరుసలుగా నిర్మిస్తున్నామని, ప్రస్తుతం కల్వర్టు పనులు చేస్తున్నామని, వాటి రీడిజైన్‌ వల్ల పనుల్లో కాస్త జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధాన అనుసంధాన రహదారి నిర్మాణం తొలి దశ పనులు డిసెంబరుకు పూర్తి చేయాలని, రెండో దశకు సంబంధించిన కల్వర్టులు, ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం సమాంతరంగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

చేయలేకపోతే వెళ్లిపోండి..: కొన్ని రహదారుల నిర్మాణం డిసెంబరునాటికి పూర్తి చేయాల్సి ఉండగా 50 శాతం కూడా చేయలేదని, 30 రోజులే సమయం ఉందని, ఎప్పుడు చేస్తారని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి నిలదీశారు. వారు ఏవో కారణాలు చెప్పగా.. సాకులు చెప్పడం మానేసి పనులు చేయాలని హెచ్చరించారు. సమయానికి పనులు పూర్తి చేయలేకపోతే వెళ్లిపోవచ్చని, వేరే వారిని పెట్టుకుంటామని స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థలవద్ద అవసరమైన సంఖ్యలో మానవ వనరులు లేకపోవడం వల్లే పనుల్లో జాప్యం జరుగుతోందని పురపాలక మంత్రి పి.నారాయణ సీఎం దృష్టికి తెచ్చారు. పేరున్న సంస్థలని పనులు అప్పగిస్తే లెక్కలేనట్టు వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజధానిలో చేపట్టే ప్రతి ప్రాజెక్టును ప్రారంభించే తేదీలతో సహా కచ్చితమైన కార్య ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.

‘హ్యాపీనెస్ట్‌’ లోగో, బ్రోచర్‌ ఆవిష్కరణ
రాజధానిలో సీఆర్‌డీఏ చేపడుతున్న గృహనిర్మాణ ప్రాజెక్టు ‘అమరావతి హ్యాపీనెస్ట్‌’ లోగో, బ్రోచర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం ‘హ్యాపీనెస్ట్‌’ తరహాలో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టును నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల్లో చేపడుతున్నామని, 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి దశలో ఆరు టవర్లలో 600 ఫ్లాట్లు నిర్మిస్తామన్నారు. హ్యాపీనెస్ట్‌ పోర్టల్‌ నవంబరు తొమ్మిదినుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారు విధిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు అందజేయాలని సూచించారు. మొదట వచ్చినవారికి ప్రాధాన్యం అన్న విధానంలో పారదర్శకంగా ఫ్లాట్లు విక్రయించాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘అమరావతి హ్యాపీనెస్ట్‌’ ప్రాజెక్టుకు ‘సీ ఫ్యూచర్‌.. బీ ఫ్యూచర్‌’ అన్న ట్యాగ్‌లైన్‌ పెట్టడం అభినందనీయమని తెలిపారు. కొనాలనుకునే ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కొన్ని ప్రదేశాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు.

Link to comment
Share on other sites

అందుబాటు ధరలో ‘హ్యాపీనెస్ట్‌’
01-11-2018 03:13:25
 
636766388066514093.jpg
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. అంతా పారదర్శకం
  • నవంబరు 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • అత్యుత్తమంగా నిర్మించండి: సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): కొత్త తరం కోరుకునే అన్ని రకాల సదుపాయాలతో అత్యుత్తమంగా ‘హ్యాపీనె్‌స్ట’ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమాజంలోని అన్ని వర్గాలవారు కొనుగోలు చేయగలిగేలా అందుబాటు ధరలను ఉంచిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రజల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగిందని, వారి అంచనాలను అందుకునేలా నిర్మాణం జరగాలని చెప్పా రు. మొదటవచ్చిన వారికి తొలి ప్రాధాన్యమనే విధానంలో దరఖాస్తులను స్వీకరించాలని, కొనుగోలుదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సాధారణ ప్రజల కోసం అమరావతిలో సీఆర్డీయే నిర్మించదలచిన 2, 3 బెడ్‌రూమ్స్‌ అపార్ట్‌మెంట్ల సముదాయం ‘హ్యాపీనెస్ట్‌’కు సంబంధించిన లోగో, బ్రోచర్‌లను బుధవారం సీఎం ఆవిష్కరించారు.
 
నేలపాడుకు సమీపంలో 14.46 ఎకరాల్లో, ఒక్కొక్కటి 19 అంతస్థులు ఉండే 12 టవర్లలో మొత్తం 1200 అపార్ట్‌మెంట్లతో ఈ హ్యాపీనెస్ట్‌ రూపుదిద్దుకోబోతోందని, తొలి దశలో 600 ఫ్లాట్లతో 6 టవర్లను నిర్మిస్తున్నట్లు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సీఎంకు తెలిపారు. వీటిల్లో చదరపు అడుగు ధరను రూ.3,500లుగా నిర్ణయించామని, ఈ ఫ్లాట్లను కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 9 నుంచి ఈ ప్రాజెక్ట్‌కు చెందిన వెబ్‌ పోర్టల్‌ ప్రారంభమవుతుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిలో సొంత ఇల్లు ఉండాలనుకునే ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం హ్యాపీనెస్ట్‌ తరహాలోనే మరొక ప్రత్యేక ప్రాజెక్ట్‌ను నిర్మించాల్సిందిగా సూచించారు. సీఆర్డీయే పరిధిలో అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కోసం ప్రత్యేకంగా ప్లానింగ్‌ ఆర్కిటెక్ట్‌ను నియమించాలని చెప్పారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సీడ్‌ యాక్సెస్‌ జాప్యంపై సీఎం అసంతృప్తి
01-11-2018 09:41:16
 
636766620780395433.jpg
  • భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి
  • డిసెంబరుకల్లా రహదారిని సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థలకు ఆదేశాలు
  • రాజధాని పనుల్లో నాణ్యత ఉండాలి... సకాలంలో పూర్తి కావాలి
  • ఏ విషయంలో తేడా వచ్చినా సహించేది లేదు
  • అమరావతి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి
 అమరావతి(ఆంధ్రజ్యోతి): రాజధానిలో ప్రవేశించేందుకు ప్రధాన మార్గమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది డిసెంబర్‌లోగా సిద్ధం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్మాణ సంస్థలను ఆదేశించారు. అమరావతికి జీవనాడి లాంటిదైన ఈ అత్యంత కీలక రహదారి నిర్మాణంలో జాప్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన భూమిని భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించడంలో అధికారుల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమన్నారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పన పనులపై కూడా ఆయన పెదవి విరిచారు. రాజధానిలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. లే అవుట్ల అభివృద్ధి, ప్రధానమైన మౌలిక వసతుల నిర్మాణాలు మొదలెట్టిన రోజు నుంచి పనులు పూర్తయి, వాటిని ప్రారంభించే వరకు పకడ్బందీ ప్లానింగ్‌తో ముందుకు సాగాలన్నారు. ఈ పనులన్నింట్లో సూక్ష్మస్థాయి వరకు అధికారులు, నిర్మాణ సంస్థలకు స్పష్టత ఉండాలన్న ఆయన ఇకపై వాటిని రియల్‌ టైం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తానని తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏపీసీఆర్డీయేపై బుధవారంముఖ్యమంత్రి సమీక్షించారు.
 
మొత్తం 23 కిలోమీటర్ల పొడవుతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలోని కనకదుర్గమ్మ వారధి నుంచి రాజధానిలోని దొండపాడు వరకు నిర్మించదలచిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఇప్పటికే 14 కిలోమీటర్ల మేర పూర్తి చేసినప్పటికీ భూసేకరణలో అపరిమిత జాప్యం కారణంగా ప్రయోజనం లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం 14 కిలోమీటర్లమేర మాత్రమే పనులు జరుగుతున్నాయని, తొలిదశలో భాగమైన మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు నిర్మించాల్సిన 4కిలోమీటర్ల రహదారి పనులు భూసేకరణలో జాప్యం వల్ల నిలిచిపోయాయని చెప్పారు. నాణ్యత, సమయపాలన అంశాల్లో కచ్చితంగా వ్యవహరించాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
 
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ జోక్యం చేసుకుని, నిర్మాణ సంస్థల వద్ద అవసరమైనంత మానవ వనరులు లేనందువల్లనే పనుల్లో జాప్యం జరుగుతోందని తాము గమనించినట్లు ముఖ్యమంత్రికి చెప్పారు. స్పందించిన సీఎం మానవ వనరుల కొరత కారణంగా అప్పగించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం కంపెనీలకు తగదన్నారు. ‘పనులను నాణ్యంగా చేస్తారని, నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులను పూర్తిచేస్తారని భావించి వాటిని అప్పగించామని, దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఇకపై కఠినంగా ఉంటామని’ తేల్చిచెప్పారు. మానవ వనరులు, నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాల విషయంలో నిర్మాణ సంస్థలు రాజీ పడితే సహించబోమన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు 2వ దశలో రహదారి నిర్మాణంతోపాటు అందులో భాగమైన కల్వర్టులు, ఓవర్‌ బ్రిడ్జి పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
 
నిర్మాణ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ భూసేకరణ ద్వారా అవసరమైన భూమిని సేకరించి, తమకు అప్పజెప్పిన 2 మాసాల్లోగా ఆ భాగంలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయగలమని తెలిపారు. 8 వరుసల ఈ రహదారిలో ప్రస్తుతం 4కల్వర్టుల పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని, వీటి రీడిజైన్‌ కారణంగా పనుల్లో కొంచెం ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.
 
అనంతరం సీఎం అమరావతిలో శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాల నిర్మాణ పురోగతిపై సీఆర్డీయే ప్రదర్శించిన వీడియో ప్రజెంటేషన్‌ను తిలకించారు. సీఆర్డీయే పరిధిలో అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కోసం ప్రత్యేకంగా ప్లానింగ్‌ ఆర్కిటెక్ట్‌ను నియమించాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 
Link to comment
Share on other sites

హ్యాపీనెస్ట్‌.. చీప్ అండ్ బెస్ట్..!
01-11-2018 09:46:38
 
636766624000073944.jpg
  • రాజధానికి ఇంచుమించుగా, అన్నింటికీ నడిబొడ్డున నిర్మాణం
  • 14.46 ఎకరాల్లో 2 పార్కింగ్‌, జి ప్లస్‌ 18 ఫ్లోర్లతో 12 టవర్లు
  • 1285 చ.అ.నుంచి 2730 చ.అ. విస్తీర్ణంతో 6 కేటగిరీల్లో 1200 టు, త్రీ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు
  • అన్నీ కార్నర్‌, వాస్తుకు పూర్తి అనుగుణంగా.. గాలీ వెలుతురుకు ఢోకా లేదు
  • సెల్‌ఫోన్‌తో ఫ్యాన్లు, ఏసీలు ఇత్యాదివి ఆపరేట్‌ చేసేలా ‘స్మార్ట్‌ ఫ్లాట్లు’
  • జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌, స్పా, యోగా రూమ్‌ తదితరాలతో 50,000 చ.అ. సువిశాల క్లబ్‌ హౌస్‌
  • చ.అ. ప్రాథమిక ధర రూ.3500... నవంబరు 9 నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్‌
అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రజారాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో తొట్టతొలి ప్రజానివాస సముదాయానికి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు బుధవారం శ్రీకారం చుట్టారు. ఒకపక్క అంతర్జాతీయ ప్రమాణాలతో, మరొకపక్క అన్ని వర్గాలకూ అందుబాటు ధరలో ‘హ్యాపినెస్ట్‌’ పేరిట ఏపీసీఆర్డీయే నిర్మించనున్న ఈ భారీ హౌసింగ్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన లోగో, బ్రోచర్‌ను సీఆర్డీయే సమీక్ష సమావేశంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన పలు విశేషాలను కళ్లకు కట్టేలా సీఆర్డీయే ప్రదర్శించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ సమావేశంలో పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. వాస్తుకు పూర్తి అనుగుణంగా, అదే సమయంలో ‘స్మార్ట్‌’గా, పర్యావరణహితంగా, సకల ఆధునిక వసతులతోపాటు చూడగానే ఆకట్టుకునే రూపం, సువిశాల క్లబ్‌హౌస్‌ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలతో జెనెసిస్‌ సంస్థ రూపొందించిన డిజైన్‌ ప్రకారం హ్యాపీనెస్ట్‌ నిర్మితం కానుంది. సదరు విశేషాలిలా ఉన్నాయి.
 
గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు పక్కన.. అన్నింటికీ చేరువలో..
హ్యాపీనె్‌స్టకు సంబంధించిన ప్రధాన ఆకర్షణ దాని లొకేషన్‌! అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌, ప్రభుత్వ గృహసముదాయాలతో కూడిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఇంచుమించుగా పక్కన, నేలపాడుకు చేరువలో ఇది రానుంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయానికి సైతం ఇది 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. శాశ్వత అసెంబ్లీకి 3 కి.మీ., హైకోర్టుకు 2.5 కి.మీ, సెక్రటేరియట్‌ అండ్‌ హెచ్‌వోడీ టవర్లకు 3.5 కి.మీ, అమరావతి సెంట్రల్‌ (శాఖమూరు) పార్క్‌కు 1 కి.మీ, న్యాయమూర్తుల గృహాలకు 2.5 కి.మీ, ముఖ్యమంత్రి నివాసానికి 5.5 కి.మీ, మంత్రుల బంగళాలకు 3 కి.మీ, శాసనసభ్యుల ఇళ్లకు 4 కి.మీ, 4వ తరగతి ఉద్యోగుల అపార్ట్‌మెంట్లకు 1.5కి.మీ. దూరంలో హ్యాపీనెస్ట్‌ రాబోతోంది.
 
రాజధానిలోని సుప్రసిద్ధ సంస్థలైన విట్‌ క్యాంప్‌సకు 1.5 కి.మీ, ఎస్‌.ఆర్‌.ఎం.కు 5.5 కి.మీ, ‘నిఫ్ట్‌’కు 0.1 కి.మీ, ‘ఎన్‌.ఐ.డి.’కి 1 కి.మీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ యూనివర్సిటీకి 3.5 కి.మీ, సద్భావన వరల్డ్‌ స్కూల్‌కు 2.5కి.మీ, స్కాటిష్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు 3 కి.మీ, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి 3 కి.మీ, ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు 6.5 కి.మీ, హెరిటేజ్‌ స్కూల్‌కు 4కి.మీ, ర్యాన్‌ గ్లోబల్‌ స్కూల్‌కు 3.5 కి.మీ, ఐటీ అండ్‌ ఐటీఈఎ్‌సకు 2 కి.మీ, బ్రహ్మకుమారీ్‌సకు 4.5 కి.మీ. దూరంలో ఇది నిర్మితమవనుంది.
 
రెండు వైపుల 82 అడుగులేసి రహదారులు...14.46 ఎకరాల్లో నిర్మాణం..
అటూ ఇటూ 82అడుగుల వంతున వెడల్పుతో సాగే విశాలమైన 2 రహదారుల మధ్యన ఉన్న కార్నర్‌ ప్లాట్‌లో 14.46 ఎకరాల్లో హ్యాపీనెస్ట్‌ నిర్మితం కానుంది. ఇందులో ఒక్కొక్కటి రెండేసి పార్కింగ్‌ ఫ్లోర్లు, గ్రౌండ్‌ ప్లస్‌ 18 అంతస్థులుండే 12టవర్లు వస్తాయి. వీటిల్లో మొత్తం 1200 డబుల్‌, ట్రిబుల్‌ బెడ్‌రూం ప్లాట్లు ఉంటాయి. ఒకపక్క విలాసవంతంగా, ఆధునిక నిర్మాణశైలితో ఉంటూనే మరొకపక్క సంప్రదాయానికి అనుగుణంగానూ, ప్రకృతితో సహవాసం చేసేలా ఈ అన్ని అపార్ట్‌మెంట్లు నిర్మితమవుతా యి. వివిధ వర్గాలవారికి అందుబాటులో ఉండేలా వీటిని 6 సైజుల్లో.. 1285, 1580, 1700, 1965, 2230, 2735 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీటి ధరను ప్రాథమికంగా చదరపు అడుగుకు రూ.3,500లుగా సీఆర్డీయే నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల ద్వారానే వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించిన ఈ సంస్థ నవంబర్‌ 9వ తేదీ నుంచి అమ్మకాలను ప్రారంభించనుంది. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ప్రాతిపదికన ఫ్లాట్లను కేటాయించనున్నారు. తొలిదశలో 7.3 ఎకరాల్లో 600 ఫ్లాట్లను మాత్రమే నిర్మించి, ఆ తర్వాతి దశలో మిగిలిన 600 ఫ్లాట్లు నిర్మించాలని నిర్ణయించారు.
 
అన్నీ కార్నర్‌వే.. అన్నింటికీ ధారాళంగా గాలి, వెలుతురు..
dcSDSDcSDc.jpgఅపార్ట్‌మెంట్లన్నీ తూర్పు, పడమర ఫేసింగ్‌తోనే, అదీ కార్నర్‌వే అయి ఉంటాయి! తద్వారా వాటిల్లో నివసించే వారికి బయటి ప్రకృతి చక్కగా కనిపించడమే కాకుండా ఆ ఫ్లాట్లలోకి పుష్కలంగా గాలి, వెలుతురు వస్తాయి. ఇదే సమయంలో ఇవన్నీ వాస్తుకు పూర్తి అనుగుణంగా ఉండబోతున్నాయి. పైగా అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లూ వీటిల్లో ఉంటాయి. కార్పెట్‌ ఏరియాను అత్యంత సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా నివాసితులకు అదనపు స్థలాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు అత్యాధునిక వసతులన్నీ వీటిల్లో కొలువు దీరుతాయి.
 
స్మార్ట్‌ ఫ్లాట్లు..
అపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా ‘స్మార్ట్‌ హోం’లుగా నిర్మిస్తారు. వీటి తాళం, విద్యుత్తు ఉపకరణాలు ఇత్యాది వాటిని నివాసితులు ఎక్కడి నుంచైనా సెల్‌ఫోన్‌ ద్వారా ఆపరేట్‌ చేయగలగడం వీటి ప్రత్యేకత. ఇంధన పొదుపును సాధ్యమైనంతగా పెంచే నిర్మాణ సామగ్రిని వాడకం, ఇంధన వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించే మీటర్ల ఏర్పాటు వీటిల్లో ఉంటాయి.
 
20 శాతం విస్తీర్ణంలోనే నిర్మాణాలు...
gggdv.jpgకేటాయించిన మొత్తం స్థలంలో సుమారు 80 శాతాన్ని పచ్చదనానికి, ఓపెన్‌ ఏరియాలకు నిర్దేశిస్తారు. అంటే కేవలం 20 శాతం భూమిలోనే నిర్మాణాలు వస్తాయి. తద్వారా ఈ హ్యాపీనెస్ట్‌ పూర్తి గ్రీన్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌గా రూపుదిద్దుకుంటుంది. పైగా పర్యావరణహితమూ, ఇంధన వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గించగలిగే గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సె్‌ప్టలో, ఐజీబీసీ నిర్దేశిత మార్గదర్శకాల ఆధారంగా ఇది నిర్మితమవుతుంది. ఈ 80శాతంలో ఉద్యానవనాలు, వాకింగ్‌ట్రాక్‌లు, వాననీటి సంరక్షణ పథకాలు, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, కామన్‌ ఏరియాల్లోని దీపాలు వెలిగేందుకు సౌరవిద్యుదుత్పాదన యూనిట్లు ఇత్యాదివి ఉంటాయి.
 
తొలిదశలోనే సువిశాల క్లబ్‌ హౌస్‌..
తొలిదశలోనే నిర్మాణ సముదాయంలో 50,000చ.అ. విస్తీర్ణంలో సువిశాల క్లబ్‌ హౌస్‌ను నిర్మిస్తారు. ఇందులో జిమ్నాజియం, సానా, యోగా- మెడిటేషన్‌ రూం, పార్టీ లాంజ్‌, రీడింగ్‌ రూం, బిజినెస్‌ సెంటర్‌, కెఫెటేరియా, ప్రివ్యూ థియేటర్‌, సూపర్‌ మార్కెట్‌, ఆస్పత్రి, మందుల దుకాణం, క్రెచ్‌ ఇత్యాదివి ఉంటాయి. ఇంకా టేబుల్‌ టెన్నిస్‌, స్క్వాష్‌, కేరమ్‌ వంటి ఇండోర్‌గేమ్స్‌ ఏర్పాటు చేస్తారు. ఈ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో క్రికెట్‌ ప్రాక్టీసింగ్‌ నెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌ కోర్టులతోపాటు స్కేటింగ్‌ రింక్‌, రాక్‌ క్లైంబింగ్‌, యాంఫీథియేటర్‌ వంటివి కూడా ఉంటాయి.
Link to comment
Share on other sites

 

A workshop was held on the theme,“Amaravati- the Justice City” in the Constitution Club, New Delhi on 30-10-2018. Dr. Sreedhar Cherukuri IAS, Commissioner APCRDA visited this workshop and had given a PowerPoint Presentation on the theme #AMARAVATI- THE JUSTICE CITY #APCRDA

Dq5W4psVYAMY9lY.jpg
Dq5W4pdU4AEp7nW.jpg
Dq5W4tiVsAARzFu.jpg
Dq5W4pdVYAA6V4B.jpg
Link to comment
Share on other sites

AmaravatiVerified account @PrajaRajadhani 28m28 minutes ago

 
 

Sri. Chandrababu Naidu, Honourable Chief Minister of Andhra Pradesh, inaugurated the “HAPPY NEST HOUSING PROGRAM” and launched the logo and brochure yesterday (31-10-2018). Dr. Sreedhar Cherukuri IAS, Commissioner, APCRDA had given a presentation on this project. #APCRDA

Dq5Ug59V4AYWE7s.jpg
Link to comment
Share on other sites

 

సొంత గృహాలు కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల కోసం నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల విస్తీర్ణంలో ప్రజల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మితమవ్వనుంది

Dq7SbziU4AAlvRp.jpg
Dq7Sb_DVsAAGpcf.jpg
Link to comment
Share on other sites

Direct road from Guntur to Amaravati soon

According to information, the existing road will be extended till the E9 Road which is being developed in the capital region.

Published: 02nd November 2018 10:06 AM  |   Last Updated: 02nd November 2018 10:06 AM   |  A+A-

Direct.jpg
By Express News Service

VIJAYAWADA: With an objective to provide road connectivity to Amaravati from Guntur, Andhra Pradesh Capital Region Development Authority (APCRDA) and Roads and Buildings (R and B) department have decided to widen the road between Tadikonda and Thullur. A detailed project report (DPR) for the proposed project will be readied and execution of the same will begin soon, the officials said.

According to information, the existing road will be extended till the E9 Road which is being developed in the capital region. “Guntur District Collector Kona Sasidhar proposed having a direct access to Amaravati from Guntur. He proposed that the existing Gorantla Road, which is a State Highway, towards the capital, be extended till the E9 Road. As it doesn’t need land acquisition, it would not burden the State exchequer,” a senior official explained.

Chief Minister N Chandrababu Naidu, during the Collectors Conference held last month, agreed to the proposal and directed officials concerned to immediately work on it. About 25 km of the road would be widened into a four-lane one. “We will work with the R and B department to take the project forward,” the APCRDA official added. The road extension will help the commuters from Guntur, who travel to the capital via Mangalagiri now, to directly reach Amaravati, the official observed.

The officials said that the availability of a direct access between the capital will give an impetus to Guntur’s development. The APCRDA and R and B are also working on the development of other roads leading to the capital in Guntur district. “A blue print has already been prepared. The works will be taken up in a phased manner,” another official said.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...