Jump to content

Amaravati


Recommended Posts

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌..
02-12-2018 09:09:40
 
636793385784192406.jpg
రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మితమవుతున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 15 నాటికి దీనిని సిద్ధం చేసేందుకు సీఆర్డీయే అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు శ్రమిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో చేయాల్సిన అంతర్గత వసతులు, ఫర్నిచర్‌పైనా దృష్టి సారించారు. చక్కటి ల్యాండ్‌ స్కేపింగ్‌ను అభివృద్ధి పరిచేందుకు రూ.1.81 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీయే ఈ మధ్యనే టెండర్లు కూడా పిలిచింది.
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైకోర్టు తాత్కాలిక నిర్వహణకు వీలుగా రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను వేగంగా సాగిస్తున్నారు. అమరావతికి వచ్చే ఏడాది ప్రారంభం నాటికి తరలి రానున్న రాష్ట్ర హైకోర్టు కోసం బౌద్ధ స్థూపాకారంలో నిర్మించదలచిన ఐకానిక్‌ భవంతి పూర్తయ్యే వరకూ ఇందులోనే ఈ ఉన్నత న్యాయస్థానం నడవనున్న సంగతి తెలిసిందే. జనవరి 1వ తేదీకల్లా హైకోర్టు నిర్వహణకు వీలుగా ఈ కాంప్లెక్స్‌ను పూర్తి చేసి, అప్పగించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు దీనిని డిసెంబర్‌ 15వ తేదీ నాటికే సిద్ధం చేసేందుకు సీఆర్డీయే అధికారులు, ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్‌ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కంపెనీ సిబ్బంది శ్రమిస్తున్నారు.
 
నిపుణులతో చర్చలు
ఇప్పటికే శ్లాబులు తదితర ప్రధాన పనుల నిర్మాణం దాదాపుగా పూర్తవడంతో సీఆర్డీయే ఉన్నతాధికారులు ఈ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయాల్సిన అంతర్గత వసతులు, ఫర్నిచర్‌పై దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు భవంతితోపాటు వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులను ఇప్పటికే సీఆర్డీయే ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆ ప్రక్రియలో తాము కనుగొన్న అంశాలన్నింటినీ క్రోడీకరించిన వారు తదనుగుణంగా రాజధానిలోని జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌నూ తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని పర్యాయాలు వారు సంబంధిత నిపుణులతో చర్చలు జరిపారు. వాటికి కొనసాగింపుగా అడ్వొకేట్‌ జనరల్‌తో గురువారం భేటీ అయ్యారని తెలిసింది. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీఽధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌లు హైదరాబాద్‌లోని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో జరిపిన ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల చాంబర్లతోపాటు కోర్టు హాళ్లు తదితర ప్రదేశాల్లో ఉండాల్సిన ఫర్నిచర్‌ ఏ రీతిన ఉండాలన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అవసరమైన ఇతర వసతుల కల్పన కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
 
ప్రధాన న్యాయమూర్తి నివాసం కోసం అన్వేషణ
కాగా.. కొద్ది వారాల్లోనే రాష్ట్రానికి హైకోర్టు హైదరాబాద్‌ నుంచి తరలి రానున్న దృష్ట్యా దాని ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల కోసం అనువైన నివాసాలను అన్వేషించే కార్యక్రమాన్ని సీఆర్డీయే, ఇతర శాఖల అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వీరి కోసం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మిస్తున్న బంగళాలు పూర్తయ్యేందుకు కొన్ని నెలలు పట్టనున్నందున ఈలోగా వారు ఉండేందుకు వీలైన భవంతుల కోసం రాజధాని, విజయవాడ, గుంటూరు పరిసరాల్లో అన్వేషిస్తున్నారు. న్యాయమూర్తుల కోసం వివిధ ప్రదేశాల్లోని పలు భవనాలను పరిశీలించిన అధికారులు వాటిల్లో మేలైన వాటిని గుర్తించి, వాటిని ఇటీవల రాజధాని పర్యటనకు వచ్చిన న్యాయమూర్తులకు చూపించారు. వాటిల్లో ఉండవల్లి పరిధిలో ఒక ప్రైవేట్‌ రియాల్టీ సంస్థ నిర్మించిన విల్లాలు బాగున్నాయన్న అభిప్రాయాన్ని అధికులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
అయితే ప్రధాన న్యాయమూర్తి ఉండేందుకు అవసరమైన సువిశాల ఇండిపెండెంట్‌ భవనం కోసం సీఆర్డీయే సాగిస్తున్న అన్వేషణ మాత్రం ఇంకా ముగింపునకు రాలేదని సమాచారం. దీనికోసం పలు ప్రదేశాల్లోని భవనాలను చూసినప్పటికీ అవేవీ అంత అనుకూలంగా లేవని భావిస్తున్న అధికారులు మరింత మేలైన భవంతి కోసం వెతుకులాటను కొనసాగిస్తూనే ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఇది ఒక కొలిక్కి రాగలదని, ఆ వెంటనే ఆయా భవనాలను ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని సీఆర్డీయే ప్రారంభిస్తుందని సమాచారం.
 
జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పనుల పరిశీలన
రాజధానిలోని నేలపాడు వద్ద జరుగుతున్న జ్యుడీషియల్‌ పనులను సీఆర్డీఏ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ శనివారంనాడు పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం ఈనెల 15వ తేదీ నాటికి ప్రణాళిక ప్రకారం పనులను పూర్తిచేయాలని ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ఇంజనీర్లకు స్పష్టం చేశారు. వాహనాల పార్కింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులపై వారితో చర్చించారు. క్లాక్‌ టవర్‌ను సుంద రంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అంతర్గత పనులను పరిశీలించి తగు సూచనలు చేసిన ఆయన అప్రోచ్‌ రోడ్డు ప్రణాళికలపై చర్చించారు. శ్రీధర్‌ వెంట అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.జకరయ్య, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ధనంజయ తదితరులు ఉన్నారు.
 
పచ్చదనం
మరోవైపు హైకోర్టు స్థాయికి అనుగుణంగా జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో పచ్చదనంతోపాటు చక్కటి ల్యాండ్‌ స్కేపింగ్‌ను అభివృద్ధి పరిచేందుకు రూ.1.81 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీయే ఈ మధ్యన టెండర్లు పిలిచింది. పేరుకు హైకోర్టు తాత్కాలిక భవనమే అయినప్పటికీ సదరు ప్రాంగణం ఏ అంశంలోనూ తీసికట్టుగా ఉండరాదన్న అభిప్రాయంతో అందులో ఆహ్లాదం కలిగించే ఉద్యానవనంతో పాటు ల్యాండ్‌ స్కేపింగ్‌ చేయించాలని నిర్ణయించింది. కాంప్లెక్స్‌కు తూర్పు వైపున కనువిందు చేసేలా ఒక పార్కును అభివృద్ధి పరచడంతోపాటు నిర్వహణకు రూ.1.40 కోట్లు, మిగిలిన ఆవరణలో పచ్చదనం- ల్యాండ్‌ స్కేపింగ్‌ అభివృద్ధి, నిర్వహణకు మరో రూ.41 లక్షలు వ్యయమవుతుందని అంచనా వేసింది.
Link to comment
Share on other sites

మూడు గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు
02-12-2018 09:20:58
 
636793392556829745.jpg
తుళ్లూరు: తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో శనివారం మూడు గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయింపు చేశారు. నెక్కల్లు, మల్కాపురం, వెలగపూడి రైతులకు గతంలో కేటాయింపులు జరగని వారికి ప్లాట్లు కేటాయించి ప్రొవిజన్‌ పత్రాలను అందజేశారు. కఫ్యూటర్‌లో లాటరీ తీసి ల్యాండ్సు డైరెక్టర్‌ చెన్నకేశవరావు కేటాయించారు. కొన్ని అనివార్య కారణాల చేత రైతులు కొద్దిమందికి ప్లాట్లు కేటాయింపు జరగలేదని, సమస్యలు పరిష్కరించి విడతల వారీగా ప్లాట్లు కేటాయింపు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ అధికారి చిన నాగేశ్వరావు, ఐటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రెడ్‌ సిగ్నల్‌ బెజవాడ - అమరావతి రైల్వే లైన్‌ లేనట్టే
03-12-2018 08:11:10
 
636794215667892193.jpg
  • ఎర్రుపాలెం - అమరావతికి ప్రత్యేక సింగిల్‌ లైన్‌!
  • బోర్డు నుంచి అనుమతులు వచ్చినా.. నిధుల విడుదల నాస్తి
  • రాయనపాడు శాటిలైట్‌ స్టేషన్‌కు లింకు లేదు
 
విజయవాడ - అమరావతి రైల్వేలైన్‌ ప్రతిపాదన ‘దారి’ మళ్లింది. రాజధాని ప్రాంతంలో కీలకమైన ఈ ప్రతిపాదనకు రైల్వే అధికారులు రెడ్‌ సిగ్నల్‌ చూపారు. దీని స్థానంలో తెలంగాణ నుంచి అమరావతికి రైల్వేలైన్‌ను అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. విజయవాడ నగరంతో సంబంధం లేకుండా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి నేరుగా అమరావతికి ప్రత్యేక లైన్‌ను తీసుకు వెళ్లేలా ప్రతిపాదించటం.. రైల్వేబోర్డు ఆమోదించటం చూస్తుంటే అమరావతితో విజయవాడకు, రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం కలగా మారిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): అమరావతికి నూతన రైల్వేలైను ఏర్పాటుకు అధ్యయనం చేసిన అధికారులు విజయవాడ నుంచి అమరావతి అనుసంధానానికి దాదాపుగా రూ.1600 కోట్ల మేర వ్యయం అవుతుందని తొలుత అంచనా వేశారు. రూట్‌ అలైన్‌మెంట్‌తో పాటు అధ్యయన వివరాలను రహస్యంగా ఉంచింది. ఈ ప్రతిపాదనను కొంతకాలం పెండింగ్‌లో ఉంచి ఇటీవల ఎర్రుపాలెం నుంచి నేరుగా అమరావతికి సింగిల్‌ లైన్‌నిర్మాణానికి ప్రతిపాదించింది. దీనికి రూ.333కోట్ల వ్యయం అవతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనను రైల్వేబోర్డు దృష్టికి తీసుకు వెళ్ళటం.. ఇటీవల ఆమోదించటం జరిగిపోయింది. పనుల ప్రారంభానికి ఇంకా నిధులు కేటాయించలేదు. రైల్వే వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) ఈ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఖర్చు తగ్గించుకునేందుకు రైల్వే అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌పరిధిలోనే విజయవాడ జంక్షన్‌ ఒక డెస్టినేషన్‌ పాయింట్‌గా ఉంది.
 
విజయవాడ-అమరావతి అనుసంధానం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఏపీలోని 13 జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలు విజయవాడతో ఎక్కువుగా అనుసంధానమై ఉంటాయి. విజయవాడ మీదుగా అమరావతికి రైల్వే లైన్‌తో ఈ ప్రాంతాల ప్రజలకు విజయవాడ మీదుగా అమరావతికి నేరుగా అనుసంధానం అవుతుంది. రాజధానికి దగ్గర మార్గంగా కూడా ఉంటుంది. ఎర్రుపాలెం నుంచి అయితే ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌ తదితర జిల్లాలకు నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. అమరావతికి - తెలంగాణా ప్రాంతానికి అనుసంధానత కల్పించటంలో తప్పు పట్టకపోయినప్పటికీ అతి ముఖ్యమైన విజయవాడతో అనుసంధానం కల్పి ంచే విషయంలో చూపుతున్న అశ్రద్ధపై రైల్వే కార్మికసంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
 
అమరావతికి నూతన రైల్వే మార్గం ఇలా
ఖమ్మం జిలాల్లో ప్రముఖపుణ్యక్షేత్రం జమలాపురం పరిధిలోని ఎర్రుపాలెం నుంచి అమరావతికి కొత్తలైన్‌ను ప్రతిపాదించటం జరిగింది. అలైన్‌మెంట్‌పై రైల్వే అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఆంధ్రజ్యోతి సేకరించిన సమాచారం మేరకు పెద్దాపురం, అల్లూరు, కంచికచర్ల, కృష్ణానది మీదుగా అమరావతికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. వైకుంఠపురం వైపు గా ఈ మార్గం రాజధానిలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత రైల్వే యార్డు, స్టేషన్‌ తదితరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని భూములు కోరే అవకాశం కనిపిస్తోంది. రాజధాని కోర్‌ ఏరియా కు ఈ ప్రాంతం చాలా దూరం ఉంటుంది.
 
 
కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ అనుకూలం
విజయవాడ నుంచి అమరావతికి నూతన రైలు మార్గం వేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా రైల్వే అంచనా వేస్తోంది. వాస్తవానికి తనకున్న వనరులను రైల్వే శాఖ దాచేసే ప్రయత్నం చేస్తోంది. కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ను ఇందులోకి తీసుకు రాకుండా రైల్వేశాఖ జాగ్రత్త పడుతోంది. కృష్ణా కెనాల్‌ అన్నది ఒక జంక్షన్‌. విజయవాడ జంక్షన్‌ మాదిరిగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీ ఉంటుంది. విజయవాడ నుంచి దీనికి అనుసంధానం ఉంది. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లోనే రైల్వేస్టేషన్‌ నిర్మాణం చేపట్టవచ్చు. రాజధాని కోర్‌ ఏరియాకు ఈ ప్రాంతం దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే స్టేషన్‌ను నిర్మించటంతో పాటు ఫుట్‌ఓవర్‌ బ్రడ్జిలు, నూతన ప్లాట్‌ఫామ్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు కాకపోయినా అవసరమైతే కృష్ణాన ది మీద ఉన్న రెండు రైల్వే బ్రిడ్జిలు పక్కనే మరో రైల్వే బ్రిడ్జిని నిర్మించుకోవచ్చు. కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ను ఉపయోగించుకుంటే రైల్వే శాఖపై పెద్దగా వ్యయం కూడా పడదు.
 
 
ప్రతిపాదిత రైల్వేలైను పైనా చిన్నచూపే
ఎర్రుబాలెం నుంచి అమరావతికి ప్రతిపాదించిన నూతన రైల్వేలైను విషయంలో కూడా రైల్వేశాఖ చిన్నచూపే చూసిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతికి సింగిల్‌ రైల్వే లైన్‌ను మాత్రమే ప్రతిపాదించటం గమనార్హం. నూతన రాజధానికి డబ్లింగ్‌ లైన్‌ప్రతిపాదించాల్సి ఉన్నా.. సింగిల్‌ లైన్‌కే రైల్వే అధికారులు ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం. భూ సేకరణ వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా ఉండటానికే ప్రస్తుత అవసరాల రీత్యా ఈ విధానాన్ని ఎంచుకున్నట్టు, రాష్ట్రంపై ప్రేమను వ్యక్తం చేయటం గమనార్హం. రాజధాని ప్రాంతంలో విలువైన భూమిని సేకరించటమే చాలా కష్టం. అలాంటిది డబ్లింగ్‌ కోసం దశాబ్దకాలం తర్వాత భూమిని సేకరిస్తామంటే అప్పుడెంత ఖర్చు ప్రభుత్వంపై పడుతుందోనని రైల్వే అధికారులు ఆలోచించకపోవటం గమనార్హం.
 
 
రాయనపాడు సంగతి ఏమిటి?
నూతన రైల్వే మార్గానికి సంబంధించి రైల్వేశాఖ కనీసం రాయనపాడు శాటిలైట్‌ స్టేషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోకపోవటం గమనార్హం. విజయవాడ ప్రధాన స్టేషన్‌పై భారం పడకుండా చేయటానికి రాయనపాడు శాటిలైట్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. కొన్నిరైళ్ళను విజయవాడతో సంబంధం లేకుండా రాయనపాడు మళ్ళించాలని నిర్ణయించారు. రాయనపాడు శాటిలైట్‌ స్టేషన్‌నుంచి అమరావతికి రైల్వే మార్గం వేయటం కూడా చాలా తేలిక. కృష్ణానది మీదుగా ఒక బ్రిడ్జిని నిర్మించుకుంటే సరిపోతోంది. రాయనపాడును శాటిలైట్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఉన్న రైల్వేశాఖ ఈ దిశగా ఆలోచించకపోవటం బాధాకరం.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...