Jump to content

Amaravati


Recommended Posts

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చదరపుఅడుగు ధర రూ.4,000 నుంచి రూ.7,000 మధ్యనే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. 

Arehoo, idhi mamulu comedy kaadu

Link to comment
Share on other sites

హ్యాపీనెస్ట్‌ ప్లాట్ల బుకింగ్‌కు అనూహ్య స్పందన
09-11-2018 12:43:39
 
636773643662243573.jpg
విజయవాడ: సీఆర్డీఏ హ్యాపీనెస్ట్‌ ప్లాట్ల బుకింగ్‌కు అనూహ్య స్పందం లభిస్తోంది. బుకింగ్ ప్రారంభమైన వెంటనే దాదాపు 75 వేలమంది సర్వర్‌తో అనుసంధానం అయ్యారు. హ్యాపీనెస్ట్‌లో ఇప్పటి వరకు 150 ఫ్లాట్ల బుకింగ్‌ పూర్తి అయినట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. లక్షా 10వేలమంది సర్వర్‌తో అనుసంధానం అయ్యారని, ఎక్కువ తాకిడితో సర్వర్‌ నెమ్మదించినట్లు తెలిపారు. ఈనెల 15న మరోసారి 300 ఫ్లాట్ల బుకింగ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే వేగంగా ఫ్లాట్ల బుకింగ్‌ జరిగిందని శ్రీధర్‌ వెల్లడించారు.
Link to comment
Share on other sites

మరావతి ‘హ్యాపీనెస్ట్‌’ ఫ్లాట్లకు భారీ స్పందన
105514HAPPYNEST1A.JPG

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న ‘హ్యాపీ నెస్ట్‌’ ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. నేలపాడు వద్ద చేపట్టే హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా జీప్లస్‌ 18 పద్ధతిలో నిర్మించే 300 ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని సీఆర్‌డీఏ కల్పించింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే వారికి సహాయపడేందుకు విజయవాడలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 20 హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఫ్లాట్లు బుకింగ్‌ చేసుకునేందుకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. లక్ష మందికిపైగా సర్వర్‌తో అనుసంధానం కావడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీంతో మొదటి గంటలో కేవలం 72 ఫ్లాట్లు మాత్రమే బుక్‌ అయ్యాయి. తొలిదశలో బుకింగ్‌లు పూర్తయిన వెంటనే మరో 300 ఫ్లాట్ల బుకింగ్‌ చేపట్టేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది.

105533HAPPYNEST1B.JPG

అవగాహన సదస్సుకు భారీ స్పందన
రాజధాని అమరావతిలో నిర్మించనున్న హ్యాపీనెస్ట్‌ ఫ్లాట్ల బుకింగ్‌పై సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ సదస్సుకు సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. సదస్సుకు హాజరైన వారికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరాలు తెలియజేశారు. ఆయా టవర్లలోని ఫ్లాట్ల వైశాల్యం, వివిధ ఫ్లోర్లలో ధరలు, ఆన్‌లైన్‌లో ఎలా బుకింగ్‌ చేసుకోవచ్చో అవగాహన కల్పించారు.

105552HAPPYNEST1C.JPG

Link to comment
Share on other sites

సీఆర్డీఏలో 300 ఫ్లాట్ల విక్రయం పూర్తి: శ్రీధర్
09-11-2018 14:21:48
 
636773701100208163.jpg
విజయవాడ: సీఆర్డీఏలో 300 ఫ్లాట్ల విక్రయం పూర్తి అయినట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక సమస్యలు లేకుండా ఈనెల 15న మరో 300 ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నామని చెప్పారు. ఈసారి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రావన్నారు. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ ఫ్లాట్ల విక్రయం ద్వారా తెలిసిపోతోందని ఆయన పేర్కొన్నారు. రైతులు కూడా డెవలపర్ల ద్వారా ఫ్లాట్లు నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌ నాటికి 1200 ఫ్లాట్లను పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి రాజధాని, సీఎంపై నమ్మకంతోనే ఫ్లాట్లన్నీ బుక్కయ్యాయని శ్రీధర్ వెల్లడించారు
Link to comment
Share on other sites

అమరావతిలో స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రతిపాదనలు
సీఆర్డీఏ కమిషనర్‌ను కలిసిన వీవీఎస్‌ లక్ష్మణ్‌
9ap-state4a.jpg

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: నవ్యాంధ్రలో క్రీడల అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన సీఆర్డీఏ కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ని కలిశారు. అమరావతిలో క్రికెట్‌ అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆసక్తి తనకు ఎప్పటి నుంచో ఉందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తానని కమిషనర్‌ చెప్పారు.

Link to comment
Share on other sites

హ్యాపీనెస్ట్‌’కి అనూహ్య స్పందన!
మొత్తం 300 ఫ్లాట్ల బుకింగ్‌
విపరీతమైన ఒత్తిడితో తగ్గిన సర్వర్‌ సామర్థ్యం
గురువారం అందుబాటులోకి మరో 300 ఫ్లాట్లు
మరో మూడు విడతలు బుకింగ్‌ ప్రక్రియ
9ap-main8a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రజలకు విక్రయించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చేపడుతున్న తొలి గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్‌’కి అనూహ్య స్పందన లభించింది. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు బుక్‌ చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన వారూ పోటీ పడ్డారు. తొలివిడతగా శుక్రవారం 300 ఫ్లాట్లు అందుబాటులో ఉంచగా... సాయంత్రానికి మొత్తం బుకింగ్‌ పూర్తయింది. ‘హ్యాపీనెస్ట్‌’ వెబ్‌సైట్‌ని ఊహించిన దానికంటే ఒకేసారి 1.10 లక్షల మంది యాక్సెస్‌ చేశారు. దాంతో ఫ్లాట్లు బుక్‌ చేసుకోవాలనుకున్న వారు సర్వర్‌ క్రాష్‌ అయిందంటూ...ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సర్వర్‌ సామర్థ్యాన్ని పెంచడంతో బుకింగ్‌ సాఫీగా జరిగింది. ఈ ప్రక్రియను సీఆర్‌డీఏ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఫ్లాట్లు బుక్‌ చేసుకోలేని వారికి కార్యాలయం ఆవరణలో 26 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

9ap-main8b.jpg

బెంగళూరు వాసికి తొలి ఫ్లాట్‌
* మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా... శుక్రవారం ఏ, బీ, సీ టవర్లలోని ఫ్లాట్లను బుకింగ్‌ కోసం ఉంచారు.
* ఉదయం 9 గంటల 42 సెకన్లకు బెంగళూరుకి చెందిన ఎం.కృష్ణతేజ తొలి ఫ్లాట్‌ను, 9 గంటల 3 నిమిషాల 22 సెకన్లకు రెండో ఫ్లాట్‌ని గుంటూరుకి చెందిన యడ్లపాటి అమరనాథ్‌ బుక్‌ చేసుకున్నారు.
* ఇక్కడ కార్యాలయానికి వచ్చిన వారిలో హైదరాబాద్‌ ఏజీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ ఆడిటర్‌ పి.హనుమంతరావు హెల్ప్‌డెస్క్‌ ద్వారా తొలి ఫ్లాట్‌ తీసుకున్నారు.
* సుమారు ఏడెనిమిది వందల మంది వచ్చినా... హెల్ప్‌డెస్క్‌ల ద్వారా కేవలం ఏడుగురు మాత్రమే ఫ్లాట్లకు నమోదు చేసుకోగలిగారు.
* ఆన్‌లైన్‌లో ఉదయం 9-10 గంటల మధ్య 72 మంది, 10 నుంచి 12 గంటల మధ్య మరో 100 మంది ఫ్లాట్లు బుక్‌ చేసుకోగా... సాయంత్రానికి 300 ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ ముగిసింది.
* మరో 300 ఫ్లాట్ల సమాచారం శుక్రవారం సాయంత్రం నుంచే వెబ్‌సైట్‌లో ఉంచుతామని... వచ్చే గురువారం ఆ 300 ఫ్లాట్లకు బుకింగ్‌ ప్రారంభిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ చెప్పారు.
* ఇకపై ప్రతి గురువారం 300 ఫ్లాట్ల చొప్పున మొత్తం 1200 ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
* 1200 నుంచి 1500 చ.అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లకు ఎక్కువ డిమాండ్‌ వచ్చిందని, మధ్యతరగతి ప్రజలు, మొదటిసారి సొంత ఇల్లు కొనుక్కుంటున్న వారు ఎక్కువ ఆసక్తి చూపించారని వివరించారు. తాము కూడా 50 శాతం ఫ్లాట్లు ఈ కేటగిరీల్లోనే నిర్మిస్తున్నామన్నారు.
* ఈ నెలాఖరుకు టెండర్లు ఖరారు చేసి, డిసెంబరు మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని, 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.

హ్యాపీనెస్ట్‌కి లభించిన స్పందన.. రాజధానిపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రకటించారు. అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్త చేశారు. లక్ష మందికిపైగా యాక్సెస్‌ చేయడంతో సర్వర్‌ సామర్థ్యం పడిపోయిందన్నారు. 2 లక్షల మంది యాక్సెస్‌ చేసేందుకు వీలుగా సర్వర్‌ సామర్థ్యం పెంచుతామని చెప్పారు.

Link to comment
Share on other sites

హాట్‌ కేక్‌లా హ్యాపీ నెస్ట్‌
10-11-2018 02:38:35
 
636774143170223578.jpg
  • తొలివిడత బుకింగ్‌కు భారీ స్పందన..
  • గంటల్లోనే 300 ఫ్లాట్ల బుకింగ్‌ పూర్తి
  • తొలి నిమిషంలోనే మొదటి బుకింగ్‌
  • రద్దీతో తొలుత మొరాయించిన సర్వర్‌
  • సాయంత్రం 6.30కి ప్రక్రియ పూర్తి
  • ఈనెల 15న మరో 300 ఫ్లాట్ల విక్రయం
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో ప్రతిపాదించిన మొట్టమొదటి నివాస సముదాయం ‘హ్యాపీ నెస్ట్‌’కు కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన లభించింది. గంటల వ్యవధిలోనే 300 ఫ్లాట్లు హాట్‌ కేకుల్లా బుక్‌ అయ్యాయి. దీంతో ఈనెల 15వ తేదీన మరో 300 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టాలని సీఆర్డీయే నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో నేలపాడు గ్రామం వద్ద ‘హ్యాపీ నెస్ట్‌’ పేరిట 12 టవర్లతో 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. శుక్రవారం ఏ, బీ, సీ టవర్లలోని 300 అపార్ట్‌మెంట్లకు సీఆర్డీయే ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాసులు ఈ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. నిర్దిష్ట రుసుము చెల్లించి ఫ్లాట్లను బుక్‌ చేసుకున్నారు. దీంతో సాయంత్రానికే మొత్తం ఫ్లాట్లు బుక్‌ అయిపోయాయి.
 
భారీ క్రేజ్‌
అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు సమీపంలో, పలు ప్రముఖ విద్య, వైద్య సంస్థలకు చేరువగా నేలపాడు గ్రామంలో ‘హ్యాపీ నెస్ట్‌’ను నిర్మించనున్నారు. నిర్మాణంలో ఆధునికత, అన్నిరకాల వసతులతోపాటు... మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కోసం 2, 3 బెడ్‌రూం అపార్ట్‌మెంట్లను అందుబాటులో ఉంచారు. ఈ బ్రోచర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గతనెల 31న ఆవిష్కరించారు. అప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఆర్డీయే వెబ్‌సైట్‌, ఫోన్ల ద్వారా వేలాది మంది ‘హ్యాపీ నెస్ట్‌’ వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం బుకింగ్స్‌ ప్రారంభమైన తొలిగంటలోనే 72 ఫ్లాట్లు బుక్‌ అయ్యాయి. సాయంత్రం 6:30 గంటల సమయంలో ఆఖరి ఫ్లాట్‌ బుకింగ్‌ ముగిసింది.
 
కొనుగోలుదారులు తాము ఎంచుకున్న ఫ్లాట్‌ను బట్టి అడ్వాన్సుగా రూ.2.5 లక్షల నుంచి 7 లక్షల వరకూ చెల్లించారు. మరీ ముఖ్యంగా 1200-1500 చదరపు అడుగుల మధ్య ఫ్లాట్లకు విపరీతమైన డిమాండ్‌ కనిపించింది. ఈ స్పందన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు డీ, ఈ, ఎఫ్‌ టవర్లలోని 300 ఫ్లాట్లకు ఈ నెల 15న ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిర్వహించనున్నట్లు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించారు. మిగిలిన 6 టవర్లలోని 600 ఫ్లాట్లను... వారానికి 300 చొప్పున బుకింగ్‌ ప్రక్రియ జరిపి, మొత్తం 1200ల బుకింగ్స్‌ ఈ నెలాఖర్లోగా పూర్తి చేస్తామన్నారు.
 
తొలి నిమిషంలోనే...
శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రారంభం కాగా... 44 సెకన్లలోనే తొలి ఫ్లాట్‌ను బెంగళూరుకు చెందిన ఎం.కృష్ణతేజ బుక్‌ చేసుకున్నారు. మరో మూడు నిమిషాల్లో గుంటూరు వాసి యడ్లపాటి అమర్‌నాథ్‌ పేరిట రెండో బుకింగ్‌ జరిగింది. ఆ తర్వాత రద్దీ విపరీతంగా పెరగడంతో సర్వర్‌ మొరాయించడం మొదలైంది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ల ద్వారా మొదటి ఫ్లాట్‌ను హైదరాబాద్‌లోని ఏజీ కార్యాలయంలో సీనియర్‌ ఆడిటర్‌గా పని చేస్తున్న పి.హనుమంతరావు, 2వ ఫ్లాట్‌ను పోరంకి వాసి వై.కౌసల్య బుక్‌ చేసుకున్నారు. సర్వర్‌ సక్రమంగా పని చేసి ఉంటే... తొలి మూడు నాలుగు గంటల్లోనే మొత్తం ఫ్లాట్లు బుక్‌ అయ్యేవి.
 
నెలలోనే పనులు మొదలు
9happpy12.jpg‘‘అమరావతిపట్ల ప్రజల నమ్మకానికి ఇది అద్దం పట్టింది. ఇంతటి స్పందనను ఊహించలేకపోయాం. అందుకే సర్వర్‌లో సమస్య తలెత్తింది. మధ్యాహ్నం నుంచి సర్వర్‌ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో సమస్యలు తగ్గాయి. బుకింగ్‌లు పూర్తయిన ఏ, బీ, సీ టవర్ల నిర్మాణానికి వారంలోనే టెండర్లను పిలిచి... త్వరగా ఖరారు చేసి, ఆపై నెలలోపే పనులు మొదలయ్యేలా చూస్తాం. ఏపీ రెరా చట్టం ప్రకారం ప్రాజెక్టు పూర్తికి మూడేళ్ల ఏళ్ల సమయమున్నప్పటికీ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’.
- చెరుకూరి శ్రీధర్‌,
సీఆర్డీయే కమిషన
Link to comment
Share on other sites

కొండవీటి ఎత్తిపోతల.. సంసిద్ధం
10-11-2018 08:15:43
 
636774345415752507.jpg
  • నెలాఖరుకు జలనవరుల శాఖకు అప్పగింత
  • రూ.237 కోట్లతో పూర్తయిన పథకం
  • రెండు నెలల కిందట ప్రారంభించిన సీఎం
  • మిగిలిన పనులు దాదాపు పూర్తి
  • రాజధానిలో భారీ నిర్మాణం
మంగళగిరి: రాజధాని అమరావతికి వరద ముంపు నుంచి పూర్తి స్థాయి రక్షణ కల్పించేందుకు వుద్దేశించి చేపట్టిన కొండవీటివాగు ఎత్తిపోతల పథకం సిద్ధమైంది. 2016 మార్చి 30వ తేదీన రూ.237 కోట్ల వ్యయంతో శంకుస్థాపన జరుపుకున్న ఈ పథకాన్ని కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ అన్నీ హంగులతో పూర్తిచేసింది. పథకంలో వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌ సంపు పనులు మిగిలివుండగా సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పథకాన్ని ప్రారంభింపజేశారు. ఎత్తిపోతలకు సంబంధించి సాంకేతికంగా అన్నీ ప్రధాన నిర్మాణాలు పూర్తికాగా.. కొద్దిశాతం మేర సంపు నిర్మాణ పనులు....మరికొన్ని గ్రీనరీ పనులు మాత్రమే మిగిలివున్నాయి. ఈ పనులను కూడ ఈ నెలాఖరులోగా పూర్తిచేసి జలనవరుల శాఖకు పథకాన్ని అప్పగిస్తామని మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
 
పకడ్బందీగా డెలివరీ పాయింట్‌
aberae.jpgకొండవీటివాగునుంచి వచ్చే వరదనీటిని కృష్ణా ఎగువ కరకట్ట వద్ద అది కృష్ణానదిలో కలిసేచోట వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌గా ఓ చెరువు వంటి సంపును ఏర్పాటు చేశారు. దీనినుంచి ఉత్తరంగా నదిలోకి అయిదువేల క్యూసెక్కుల నీటిని మోటార్ల సాయంతో ఎత్తిపోసేందుకు మోటారు హౌస్‌, డెలివరీ సిస్టమ్‌ను పకడ్బందీగా ఏర్పాటుచేశారు. అలాగే సంపుకు తూర్పుముఖంగా ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ అనే లాకులతో కూడిన వంతెనను ఏర్పాటుచేసి దీని ద్వారా మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లిస్తారు. రాజధాని నీటి అవసరాల కోసం కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలో అంటే నీరుకొండ, కృష్ణాయపాలెంలలో ఏర్పాటయ్యే జలాశయాలు వరదనీటితో నిండి.. ఇంకా వరదనీరు వచ్చే అవకాశాలు వున్నపుడే ఈ ఎత్తిపోతలకు పనిచేసే అవకాశం కలుగుతుంది.
 
పంప్‌హౌస్‌ నిర్మాణం.. రూ.160.5 కోట్లు
werfWRW.jpgఈ పథకంలో అత్యంత ప్రధానమైంది మోటారు కమ్‌ పంప్‌హౌస్‌. దీనిని ఎగువ కృష్ణా కరకట్టకు దక్షిణంగా ఎకరం వీస్తీర్ణంలో రూ.34 కోట్ల వ్యయంతో చేపట్టి సుమారు రూ.90 కోట్ల వ్యయంకాగల మెషినరీని ఇందులో ఏర్పాటు చేశారు. ఈ పంపుహౌస్‌ కోసం మొత్తం 14 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను గావించారు. మొత్తంగా ఈ పంప్‌హౌస్‌లో ఒక్కోటి 1,600 కిలోవాట్‌ల సామర్ధ్యం కల 16 పంపులను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి స్టాండ్‌బైగా వుంటుంది. 15 పంపుల సాయంతో 5,297 క్యూసెక్కుల నీటిని సంపు నుంచి తీసుకుని కరకట్ట ఆవలవున్న కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. ఈ పంప్‌హౌస్‌లోనే ప్రెజర్‌ మెయిన్స్‌ పేరిట మరో రూ.36.5 కోట్ల వ్యయం కాగల మెషినరీని అమర్చారు. అంటే పంప్‌హౌస్‌ నిర్మాణం.. అందులోని మెషినరీతో కలుపుకుని మొత్తం రూ.160.5 కోట్లను వెచ్చించారు.
 
  • పథకంలో మరో ప్రధాన నిర్మాణం డెలివరీ సిస్టమ్‌. కరకట్ల ఆవలివైపు.. అంటే నదీముఖం వెంబడి రూ.21 కోట్ల వ్యయంతో 1.20 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. పంప్‌హౌస్‌ నుంచి కరకట్టకు నాలుగుమీటర్ల దిగువ నుంచి ఏర్పాటుచేసిన 16 పైపుల ద్వారా డెలివరీ సిస్టమ్‌ను అనుసంధానం చేశారు. సంపు నుంచి పంపుహౌస్‌ ద్వారా 5,297 క్యూసెక్కుల నీటిని తీసుకుని ఈ డెలివరీ సిస్టమ్‌ సాయంతో నదిలోకి ఎత్తిపోస్తారు.
  • పథకంలో ఇంకో ముఖ్య నిర్మాణం ఎస్కేప్‌ రెగ్యులేటర్‌. దీనిని రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ కొత్త హెడ్‌
 
రెగ్యులేటర్‌ నుంచి దక్షిణంగా రెండొందల మీటర్ల దూరంలో కాలువకు పశ్చిమంగా పీడబ్ల్యూడీ వర్కుషాపు రోడ్డుమీద 12 మీటర్ల లోతులో దీనిని నిర్మించారు. మొత్తం ఐదు గేట్లు... ఏడువేల క్యూబిక్‌మీటర్లతో కూడిన కాంక్రీట్‌ నిర్మాణమిది. వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌గా వుండే సంపుకు తూర్పువైపు దీనిని ఏర్పాటుచేశారు. సంపు నుంచి సహజ ప్రవాహంతో రెగ్యులేటర్‌ గేట్ల సాయంతో ఐదువేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణా పశ్చిమ ప్రధానకాలువలోకి మళ్లించేందుకు ఇది తోడ్పడుతుంది. కొండవీటివాగు కృష్ణానదిలో కలిసేచోట కరకట్ట నుంచి 250 మీటర్ల దూరంలో 110/110 మీటర్ల విస్తీర్ణంలో సంపు నిర్మాణం చేపట్టారు.
 
EFAHEF.jpgఇది ఆరున్నర మీటర్ల లోతులో వుండి కొండవీటివాగు వరద నీటికి కలెక్షన్‌ పాయింట్‌గా వినియోగపడుతుంది. ఇందులో సుమారు 0.1 టీఎంసీ నీటిని నిల్వ చేయొచ్చు.ఈ సంపును అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సంపుకు నాలుగు చెరగులా చూడచక్కనైనరీతిలో గ్రీనరీని ఏర్పాటు చేస్తారు. మొత్తం పథకాన్ని నడిపించేందుకు 132/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్షేషన్‌ను రూ.25 కోట్లకు పైగా వ్యయంతో ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. వీటికితోడు రూ.4.5 కోట్ల వ్యయంతో అదనంగా మరో నాలుగు జనరేటర్లను కూడ నిరంతరం అందుబాటులో వుండేలా చర్యలు చేపట్టారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...