Jump to content

Amaravati


Recommended Posts

రాజధానిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఎప్పుడో..?
23-05-2018 07:59:10
 
636626591520826255.jpg
  • కళ్లు కాయలు కాసేలా చూస్తున్న అసైన్డ్‌ రైతులు
  • ఇరిగేషన్‌ నుంచి అనుమతే ఆలస్యం
  • శాఖల మధ్య సమన్వయ లోపంతో జాప్యం
రాజధానిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కోసం అసైన్డ్‌ రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కేటాయించిన ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలనుకునేసరికి ఈ అసైన్డ్‌ భూములు ఇరిగేషన్‌ శాఖ కింద ఉన్నట్లు రికార్డుల్లో తెలిసింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచింది. దీంతో అసైన్డ్‌ భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వారంతా సీఆర్డీయే కార్యాలయం చుట్టూ కాళ్లరిగిలా తిరుగుతున్నారు. అధికారులు మాత్రం అదిగో ఇదిగో అంటూ జాప్యం చేస్తున్నారు.
 
గుంటూరు: రాజధాని నిర్మాణం కోసం వేలాది మంది రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో భూములు ఇచ్చారు. ఇందులో భాగంగానే తుళ్లూరుకు చెందిన 182 మంది రైతులు తమ ఆధీనంలో ఉన్న 170 ఎకరాల అసైన్డ్‌ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. వీరితో పాటు నేలపాడు, నవులూరు, నీరుకొండ గ్రామాలకు చెందిన సుమారు 80 మంది రైతులు మరో 57 ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పరిహారంతో పాటు కౌలు, ఇతరత్రా సదుపాయాలు అన్నీ సీఆర్డీయే వారికి కల్పించింది. అదే విధంగా ప్లాట్ల కేటాయింపు సమయంలో వీరికి ఫలానా చోట అంటూ ప్లాట్లు కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కేటాయించిన ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలనుకునే సరికి ఈ అసైన్డ్‌ భూములు ఇరిగేషన్‌ శాఖ కింద ఉన్నట్లు రికార్డుల్లో తెలిసింది. దీంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచి పోయింది. ఈ విషయం తెలిసి అసైన్డ్‌ భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు అన్యాయం జరుగుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇప్పుడు ఇలా..
ఈ భూములు 1950 నుంచి తమ కుటుంబాల ఆధీనంలో ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దీనికి సంబంధించి 1960లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చినట్లు వారు తెలిపారు. పట్టాలు ఇచ్చే సమయంలో, ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇచ్చే సమయంలో, పరిహారం తీసుకునే సమయంలో, కౌలు ఇచ్చే సమయంలో, ప్లాట్ల కేటాయింపు సమయంలో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్‌ శాఖకు చెందిన ఈ భూములు కింద ప్లాట్లు అసైన్డ్‌ రైతులకు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే యాక్ట్‌ 22 ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు సీఆర్టీయే అధికారులకు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సీఆర్టీయే అధికారులు ఇరిగేషన్‌ శాఖకు లేఖ రాశారు. అయితే ఆ తరువాత దీని గురించి పట్టించుకోలేదు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
 
 
ముందు భూమి ఇస్తే ఇలా చేస్తారా..
సీఎం చంద్రబాబు పిలుపు మేరకు అసైన్డ్‌ భూ యజమానుల్లో మొదట నేనే ముందుకు వచ్చి నాకు ఉన్న భూమి పత్రాలు అప్పగించా. ప్రభుత్వంపై ముఖ్యంగా చంద్రబాబుపై నమ్మకంతో నేను భూమి ఇచ్చాను. ఆ తరువాత అనేక మంది ముందుకు వచ్చి భూమి ఇచ్చారు. అలాంటి నాకు ఇప్పుడు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా సాకులు చెబుతున్నారు. వెంటనే మా ప్లాట్లు మాకు రిజిస్ట్రేషన్‌ చేయాలి.
- మేరిగ నాగేశ్వరావు, తుళ్లూరు
 
 
రిజిస్ట్రేషన్‌ చేస్తే ధైర్యంగా ఉంటుంది
ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇస్తే మా జీవితాలు బాగుంటాయని చంద్రబాబు అనడంతో మా భూములు ఇచ్చాం. ఇప్పుడు అధికారులు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. కార్యాలయం చుట్టూ తిరగలేక పోతున్నాం. వెంటనే మా ప్లాట్లు మాకు రిజిస్ట్రేషన్‌ చేస్తే అదో ధైర్యంగా ఉంటుంది. సీఆర్డీయే అధికారులు వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
- చెరుకూరి చిన గాలయ్య, తుళ్లూరు
Link to comment
Share on other sites

అమరావతి బాండ్ల’పై మదుపరులతో నేడు సమావేశం
24-05-2018 06:51:01
 
636627414630046444.jpg
అమరావతి: అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రజల నుంచి సేకరించేందుకు ఉద్దేశించిన ‘అమరావతి బాండ్ల’ గురించి మదుపరులకు తెలియజెప్పేందుకు సీఆర్డీఏ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌ దీనికి వేదిక కానుంది. రాజధాని రూపకల్పన నిమిత్తం దేశానికి చెందిన ఆర్థిక సంస్థలు, వ్యక్తిగత ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.2వేల కోట్లను ఈ బాండ్ల రూపేణా సమీకరిం చేందుకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.
 
సీఆర్డీఏ కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, సీఆర్డీఏ స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావుల సారథ్యంలో జరగనున్న ఈ భేటీకి దేశీయంగా ప్రసిద్ధి చెందిన ‘క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిడ్డర్లు’ పాల్గొననున్నారు. ఈ బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లోని ఎలకా్ట్రనిక్‌ బిడ్డర్స్‌ ప్లాట్‌ఫాంపై ఉంచడంతో సహా ఇంకా చేపట్టాల్సిన ఇతర లాంఛనాలన్నింటినీ త్వరలోనే పూర్తిచేసి ఈ నెలాఖర్లో లేదా వచ్చేనెల తొలి వారంలో అమరావతి బాండ్ల జారీకి సన్నద్ధమవుతున్నారు. అమరావతి బాండ్ల ప్రక్రియ ముగిశాక అంతర్జాతీయ ఇన్వెస్టర్లకూ ఆ అవకాశాన్నిచ్చేందుకు ‘మసాలా బాండ్ల’ విడుదలకు సీఆర్డీఏ చర్యలు తీసుకోనుంది.
Link to comment
Share on other sites

అమరావతిలో ‘కార్పొరేట్‌ స్ట్రీట్‌’..!
ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన సీఆర్‌డీఏ

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాల కోసం ప్రత్యేకంగా ఒక ‘కార్పొరేట్‌ స్ట్రీట్‌’ ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) నిర్ణయించింది. అందుకు ఎన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయో తెలుసుకునేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన(ఈఓఐ) జారీచేసింది. రాజధానిలోని ప్రధాన అనుసంధాన రహదారి(సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) వెంబడి కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలన్నది ఆలోచన. ఒక్కో సంస్థకు వాటి సామర్థ్యం, అవసరాన్ని బట్టి అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం ఇవ్వాలన్నది ప్రతిపాదన. బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొని ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసిన వారికే స్థలం కేటాయిస్తారు. ఎకరానికి కనీస ధర ఎంత నిర్ణయించాలి? ‘కార్పొరేట్‌ స్ట్రీట్‌’కి ఎన్ని ఎకరాలు కేటాయించాలన్నది ఈఓఐకి వివిధ సంస్థల నుంచి వచ్చిన స్పందనపై ఆధారపడి ఉంటుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. కార్పొరేట్‌ స్ట్రీట్‌కి తొలి దశలో 20-30 ఎకరాలు కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ లక్ష్యం..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా కార్పొరేట్‌ సంస్థల రాష్ట్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ కార్యాలయాలన్నీ అక్కడే కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారూ రిజిస్టర్డ్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే కొనసాగిస్తున్నారు. కొన్ని జాతీయ, బహుళజాతి సంస్థల కార్యాలయాలూ హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలు ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యాలయాల్ని అమరావతిలో ఏర్పాటుచేసేలా ప్రోత్సహించే లక్ష్యంతోనే ‘కార్పొరేట్‌ స్ట్రీట్‌’ ప్రతిపాదనను సీఆర్‌డీఏ రూపొందించింది. ప్రముఖ సంస్థల కార్పొరేట్‌ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేస్తే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ లభిస్తాయి. ఆర్థిక కార్యకలాపాలూ ఊపందుకుంటాయి. 2050 నాటికి అమరావతిని ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలంటే కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు ఇక్కడికి తరలి రావడం ఎంతో అవసరమని సీఆర్‌డీఏ భావిస్తోంది.

కనీసం రూ.500కోట్ల వార్షిక లావాదేవీలు
కార్పొరేట్‌ స్ట్రీట్‌కి ఈఓఐలో భాగంగా దరఖాస్తు చేయాలనుకునే సంస్థలకు సీఆర్‌డీఏ కొన్ని అర్హతలు నిర్దేశించింది. 2014-15 నుంచి 2016-17 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లోను కనీస వార్షిక లావాదేవీలు(టర్నోవరు) రూ.500 కోట్లు ఉండాలని తెలిపింది. భారత కంపెనీల చట్టం కింద నమోదై ఉండాలన్నది మరో షరతు. ఈఓఐ దరఖాస్తు గడువు ముగిసే తేదీ నాటికి కనీసం పదేళ్ల ముందు కంపెనీ ఏర్పాటై ఉండాలన్నది మరో నిబంధన. దరఖాస్తుతో పాటు సంస్థ ఆవిర్భావానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం(ఇన్‌కార్పొరేషన్‌ సర్టిఫికెట్‌) జతచేయాలని సీఆర్‌డీఏ సూచించింది. దరఖాస్తుదారులు తాము ఏ అవసరం కోసం స్థలం తీసుకోవాలనుకుంటున్నామో కూడా చెప్పాలి. దీనికి ప్రత్యేకమైన ఫార్మాట్‌ ఉంది. అమరావతిలో ఏర్పాటుచేసే కార్పొరేట్‌ కార్యాలయం ఏ స్థాయిదో, ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందో స్పష్టంచేయాలి. ఎంత స్థలం కావాలనుకుంటున్నారో,  కారణాలేంటో వివరించాలి. ఆ స్థలంలో నిర్మించే కార్పొరేట్‌ భవనం నిర్మితప్రాంతం ఎంతుంటుందో, ఎందరికి ఉపాధి కల్పిస్తారో చెప్పాలి. ఆ సంస్థ కార్యాలయం ఇక్కడ ఏర్పాటుచేయడం ద్వారా అమరావతి, ఈ ప్రాంతం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో వివరించాలి.

మే 30 వరకు గడువు
ఈఓఐ దరఖాస్తుల స్వీకరణకు మే 30 వరకు సీఆర్‌డీఏ గడువిచ్చింది. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఈఓఐ దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అవసరమైతే దరఖాస్తుల స్వీకరణ గడువుని సీఆర్‌డీఏ మరింత పొడిగించే అవకాశమూ ఉంది.

Link to comment
Share on other sites

అనంతవరం పార్కు...
రాజధాని ప్రాంతానికి తలమానికంగా సుమారు 300 ఎకరాల్లో శాఖమూరు వద్ద ఏడీసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటవుతున్న అమరావతి సెంట్రల్‌ పార్కుకు అదనంగా వివిధ రాజధాని గ్రామాల్లోనూ అంతకంటే చిన్న ఉద్యానవనాలను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. వీటిల్లో భాగంగా అనంతవరం వద్ద సుమారు 20నుంచి 25 ఎకరాల్లో పార్కు ఏరాపటు కానుంది. ఇందులో అధునాతన యాంఫీ థియేటర్‌, బాంక్వెట్‌ హాళ్లు, ఫుడ్‌ కోర్టు, స్కేటింగ్‌ రింక్‌, గజిబో (ఆకర్షణీయమైన మొక్కలతో పొదరిల్లు మాదిరి నిర్మాణాలు), నడక మార్గాలు, పార్కింగ్‌, టాయిలెట్లను నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

ఆవేదన
సీఆర్‌డీఏకు భూములు ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్‌
ప్రభుత్వం వాటాగా ఇచ్చిన ప్లాట్లు
వారసుల పేరిట రిజిస్ట్రేషన్‌కు అభ్యంతరాలు
పలు సమస్యలతో రాజధాని రైతులు సతమతం
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg
రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అడిగిందే తడవుగా భూములు ఇచ్చి రైతులు తమ ఉదారతను చాటుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే పలు సభలు, సమావేశాల్లో రైతులు చూపిన చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి భూమి సమకూరిందని, వారి విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని చెప్పారు. అయినా అధికార యంత్రాంగం నుంచి తమకు ఆ దిశగా భరోసా లభించటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలోనే చూస్తే ఇప్పటికీ వారసులకు సంబంధించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయటానికి ససేమిరా అంటున్నారు.. దీనిపై రాజధాని ప్రాంతంలోని కొందరు రైతులు అధికారుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలని ముఖ్యమంత్రి చెబుతుంటే కొందరు అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని విషయాల్లో సీఆర్‌డీఏ- రిజిస్ట్రేషన్లశాఖ మధ్య సమన్వయలోపం ఉందని, తమ సమస్యలను ఎవరికి విన్నవించుకోవాలో తెలియని పరిస్ధితి నెలకొందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో నాలుగు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు మరో ఆరు తాత్కాలిక కార్యాలయాల (ఐటెన్‌రేటెడ్‌ సెంటర్స్‌) ద్వారా తొలుత సీఆర్‌డీఏకు భూములు ఇచ్చినటు,్ల తిరిగి వాటిని ప్లాట్లుగా ప్రభుత్వం రైతులకు ఇస్తున్నట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తన వాటాగా రైతులకు ఇస్తున్న ప్లాట్లను వారి వారసులకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచిస్తోంది. అయితే రిజిస్ట్రేషన్‌ అధికారులు మాత్రం వారసులకు రిజిస్ట్రేషన్లు చేయటానికి అభ్యంతరం చెబుతున్నారని అనంతవరానికి చెందిన రైతు ఒకరు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.

ప్లాట్ల కేటాయింపుపై స్పష్టత ఏదీ?: ఒక్క రిజిస్ట్రేషన్ల విషయంలోనే కాదు.. రైతులకు ప్రభుత్వ వాటాగా ఇచ్చే ప్లాట్ల కేటాయింపులోనూ అధికారులు కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక గ్రామ రైతులకు వేరే ఊళ్లల్లో నచ్చినచోట ప్లాట్లు కేటాయించటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పష్టత లేక ఆందోళన చెందాల్సి వస్తోందని మరికొందరు రైతులు అంటున్నారు. గతంలో ప్రభుత్వం రైతుల నుంచి భూములు సమీకరించినప్పుడు ఏ గ్రామ రైతులకు ఆ గ్రామ పరిధిలోనే ప్లాట్లను కేటాయిస్తామని చెప్పింది. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఒక ఊరు రైతులకు వేరే గ్రామంలోనూ ప్లాట్లు ఇవ్వటానికి కసరత్తు జరుగుతోందనే దానిపై సీఆర్‌డీఏ స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనంతవరం గ్రామానికి చెందిన ఓ రైతుకు వెలగపూడిలో ప్లాటు కేటాయించినట్లుగా చెబుతున్నారు. ఆ విషయంపై అధికారులను కలిస్తే స్పష్టత ఇవ్వటం లేదని సదరు రైతు వాపోయారు. గ్రామ కంఠాలకు సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై స్పష్టతను ఇచ్చి రైతుల్లో అయోమయం లేకుండా చూడాల్సిన బాధ్యత సీఆర్‌డీఏ, రిజిస్ట్రేషన్‌ అధికారులపై ఉంది. ప్రస్తుతం రైతుల్లో నెలకొన్న అనమానాలు, వారి సమస్యలను తక్షణ ప్రాధాన్యంగా పరిష్కరిస్తేనే రైతుల్లో అలజడి లేకుండా ఉంటుందని, అలాకాకుండా ఈ సమస్యలను పరిష్కరించటంలో జాప్యం చేసే కొద్దీ రైతుల్లో మరింత ఆందోళన నెలకొంటుందని చెబుతున్నారు.

ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి
సీఆర్‌డీఏకు రైతులు భూములు ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఇలా రిజిస్ట్రేషన్‌ పూర్తయిన రైతులు తమ పేరుతో కేటాయించిన ప్లాట్లను వారి వారసులకు ఇస్తామంటే వాటినీ రిజిస్ట్రేషన్‌ చేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందుకు సంబంధించి స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే రిజిస్ట్రేషన్‌శాఖ పరంగా వారసులకు రిజిస్ట్రేషన్లు చేయటానికి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో మా శాఖపరంగా కావాలని ఇబ్బంది పెట్టడం లేదు. ఎక్కడైనా రైతులకు రిజిస్ట్రేషన్ల పరంగా ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. రైతులు ఎవరూ రిజిస్ట్రేషన్ల పరంగా అసౌకర్యానికి గురికావాల్సిన అవసరం లేదు.

- రామకృష్ణ, రిజిస్ట్రార్‌, గుంటూరు జిల్లా
 
 

 

Link to comment
Share on other sites

రాజధాని బాండ్లలో పెట్టుబడికి మదుపరుల ఆసక్తి

ఈనాడు అమరావతి: రాజధాని నిర్మాణానికి సంస్థాగత మదుపరుల నుంచి రూ.రెండు వేల కోట్లు సమీకరించేందుకు బాండ్లు విడుదల చేసే ప్రక్రియలో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) గురువారం ముంబయిలో మదుపరుల అవగాహన సమావేశం నిర్వహించింది. 30 సంస్థలకు చెందిన సుమారు 80 మంది ప్రతినిధులు, క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బిడ్డర్లు దీనిలో పాల్గొన్నారు. నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌), ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఐడీఎఫ్‌సీ, ఇండియన్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, హడ్కో, నాబార్డ్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వంటి సంస్థలు, ఆదిత్యబిర్లా కేపిటల్‌ వంటి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పాల్గొన్నాయి. అమరావతి ప్రణాళిక, వివిధ ప్రాజెక్టుల పురోగతి, భూసమీకరణవంటి అంశాలను సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. సీఆర్‌డీఏ విడుదల చేసే బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీనిస్తున్న విషయాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తెలిపారు. బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపారు. జూన్‌ మొదటివారంలో ఆర్బీఐ ద్రవ్యవిధానాన్ని ప్రకటించనున్నందున బాండ్ల గడువు పొడిగించాలని విన్నవించినట్లు సీఆర్‌డీఏ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం.. సంస్థాగత బాండ్ల విడుదలకు ‘అరేంజర్ల’ ఎంపిక కోసం సీఆర్‌డీఏ ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించింది.

Link to comment
Share on other sites

అమరావతి బాండ్ల’ సదస్సుకు స్పందన
25-05-2018 07:46:42
 
636628312044108683.jpg
అమరావతి: రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.2,000 కోట్లను అమరావతి బాండ్ల ద్వారా సమీకరించాలని భావిస్తున్న ఏపీసీఆర్డీయే అందుకు సన్నాహకంగా ముంబయిలో గురువారం నిర్వహించిన ఇన్వెస్టర్ల సమావేశానికి లభించిన స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. 30కిపైగా సంస్థాగత ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిడ్డర్లకు చెందిన 80 మంది ప్రతినిధులు పాల్గొని, అమరావతి విశేషాలను తెలుసుకున్నారు. నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌), ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఐడీఎఫ్‌సీ, ఎస్‌ బ్యాంక్‌ వంటి వాణిజ్య బ్యాంకులు, హడ్కో, నాబార్డ్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వంటి ఆర్థిక సంస్థలు, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తదితర మ్యూచువల్‌ ఫండ్లకు చెందిన వారు హాజరైన వారిలో ఉన్నారు.
 
అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను మల్టీలేటరల్‌ ఫండింగ్‌ రూపంలో ప్రపంచ బ్యాంకు నుంచి, టర్మ్‌ లోన్ల రూపంలో ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు, వాణిజ్య బ్యాంకుల నుంచి పొందేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్న ఏపీసీఆర్డీయే వాటికి తోడు ఇన్వెస్టర్ల నుంచి అమరావతి బాండ్ల రూపంలో రూ.2,000 కోట్లను సేకరించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇన్వెస్టర్ల సమావేశాన్ని నిర్వహించింది. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అమరావతికి సంబంధించిన సమగ్ర ఆర్ధిక ప్రణాళికను వివరించారు.
Link to comment
Share on other sites

రాజధానిలో బహుళ అంతస్థుల నిర్మాణం
25-05-2018 07:37:53
 
636628306758174048.jpg
  • ఐఏఎస్‌, ఎమ్మెల్యేలు, ఎన్‌జీవోల ఇళ్ల నిర్మాణాలకు అమలు
  • మలేషియన్‌ టెక్నాలజీతో శరవేగంగా...
గుంటూరు: అమరావతి రాజధాని నగరంలో అఖిల భారత సర్వీసు అధికారులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మిస్తున్న బహుళ అంతస్థుల ఇళ్ల నిర్మాణాలకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలం బిస్తోంది. మలేషియన్‌ (షియర్‌ వాల్‌) టెక్నాలజీతో ఒక్క ఇటుక అవసరం లేకుండానే మొత్తం సిమెంట్‌ కాంక్రీట్‌తో ఆకాశహార్మ్యాలను నిర్మిస్తోంది. ఈ కారణం గా నిర్మాణాలు వేగవంతంగా జరుగుతు న్నాయి. రాయపూడి, నేలపాడు గ్రామాల్లో పెద్దఎత్తున జరుగుతున్న భవన సముదాయాల నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నూతన టెక్నాలజీ కారణంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నం దున పరిమిత మానవవనరులతోనే లక్ష్యసాధన దిశగా నిర్మాణాలు కొనసాగు తున్నాయి.
 
ప్రపంచంలోనే అత్యున్నత జీవనప్రమా ణాలు కలిగిన నగరంగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించబోతున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధానిలో పనిచేసే అఖిల భారత సర్వీసు అధికారు లంతా ఒక బ్లాక్‌లో నివాసం ఉండేలా బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తు న్నారు. అలానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా మరోబ్లాక్‌ నిర్మాణం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీడ్‌ కేపిటల్‌కు దూరంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నెలాఖరు కు సీడ్‌ కేపిటల్‌ పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది.
 
సహజంగా ఇంటి నిర్మాణం అనగానే ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకరతో పాటు ప్రధానంగా గోడల నిర్మాణానికి ఇటుకలు అవసరమవుతాయి. అయితే ఇది ఖర్చుతో కూడిన వ్యవ హారం. అలానే కొన్ని లక్షల ఇటుకలు నిర్మాణ ప్రదేశానికి తరలించాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం షియర్‌ వాల్‌ టెక్నాల జీని వినియోగిస్తోంది. లెజిస్లేటివ్‌, ఏఐఎస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్‌కి రూ. 635.91 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎన్‌జీవోలకు నిర్మిస్తున్న జీవో టైప్‌-1కి రూ.866.1 కోట్లు, క్లాస్‌-4 ఉద్యోగులకు నిర్మించే టవర్స్‌కి రూ. 707.44 కోట్లు కలిపి మొత్తం రూ. 2,209.45 కోట్లతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 65.4 ఎకరాల భూమిని వినియోగిస్తున్నారు. మొత్తం 61 టవర్స్‌లో 3,840 ఫ్లాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
 
 
శాసన సభ, మండలి హౌసింగ్‌
శాసనసభ్యులు, మండలి సభ్యుల కోసం రాయపూడి గ్రామ పరిధిలోనే మరో బ్లాక్‌లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇక్కడ 12 టవర్స్‌లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా యి. స్టిల్ట్‌ఫ్లోర్‌+12 అంతస్తులుగా ఒక్కో టవర్‌ నిర్మిస్తున్నారు. మొత్తం 288 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఇక్కడ నివాస సౌకర్యం కల్పిస్తారు. ఒక్కో అంతస్థుకు రెండు ఫ్లాట్‌లు నిర్మిస్తున్నారు. త్రీబెడ్‌ రూం ఫ్లాట్‌గా డిజైన్‌ చేశారు. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణా న్ని ఒక్కో ఫ్లాట్‌ కలిగి ఉంటుంది. 14 లక్షల 45 వేల 095 చదరపు అడు గుల బిల్టప్‌ ఏరియాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి కూడా 2019 ఫిబ్రవరి 12వ తేదీకి పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొన్నారు. చుట్టూత 15 మీటర్లు, 17 మీటర్ల రోడ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడే కమర్షియల్‌ బ్లాక్‌ కూడా నిర్మిస్తున్నం దున అన్ని రకాల వాణిజ్య సేవలు అందుబాటులో ఉంటాయి.
 
 
ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయం
కృష్ణానదికి సమీపంలో రాయపూడి వద్ద అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ ఆరు బ్లాకుల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. స్టిల్ట్‌ ఫ్లోర్‌ కలిపి మొత్తం 13 అంతస్థులుగా డిజైన్‌ చేశారు. ఒక్కో ఫ్లోర్‌కు రెండు ఫ్లాట్లు వంతున మొత్తం 144 నిర్మాణం చేస్తున్నా రు. ఒక ఫ్లాట్‌ విస్తీర్ణం 3,500 చదరపు అడుగులుగా నిర్ణయిం చారు. ఇక్కడ మొత్తగా 7లక్షల 25 వేల 349 చదరపు అడుగుల కట్టుబడి జరు గుతోంది. గత నవంబర్‌ 13న ప్రారం భమైన నిర్మాణాలను వచ్చే ఫిబ్రవరి 12వ తేదీకి (15 నెలలు) పూర్తి చేయాలనేది లక్ష్యం. ఆ దిశగా నిర్మాణాలు కొనసాగుతున్న ట్లు సైట్‌ ఇంజనీర్లు తెలిపారు.
 
 
ఎన్‌జీవో హౌసింగ్‌
ప్రభుత్వ ఉద్యోగుల కోసం నేలపాడు గ్రామంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 27.47 ఎకరాల విస్తీ ర్ణంలో 22 టవర్లను ఇక్కడ నిర్మిస్తున్నారు. 1,968 ఫ్లాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 1,200 చదరపు అడుగులుగా ఉంటుంది. ఇవి టూబెడ్‌ రూం ఫ్లాట్‌ మోడల్‌లో ఉంటాయి. ఇక్కడ కూడా స్టిల్ట్‌+12 అంతస్థులలో టవర్స్‌ ఉంటాయి. ఇందుకోసం రూ. 866.1 కోట్లను వెచ్చిస్తున్నారు. దీనిని కూడా 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నారు.
Link to comment
Share on other sites

Andhra Pradesh plans Rs51,000 crore capex in 1st phase of Amaravati project

Andhra Pradesh has already raised Rs27,000 crore from World Bank, HUDCO

Last Published: Fri, May 25 2018. 10 14 AM IST
 
With SBI Capital as advisors, the APCRDA also plans to raise Rs5,000 crore through masala bonds.
With SBI Capital as advisors, the APCRDA also plans to raise Rs5,000 crore through masala bonds.

Mumbai: The Andhra Pradesh government plans to incur a capital expenditure of Rs51,208 crore on the first phase of development of its capital city Amaravati, senior state government officials said on Thursday.

The officials, including Andhra Pradesh Planning Board vice-chairman C. Kutumba Rao, were in the country’s financial capital to invite participation from top financial institutions in its Rs2,000 crore unsecured bond issue, backed by the state government.

The issue is proposed with a tenor of 10 years and is rated AA- by Brickworks Ratings India Pvt. Ltd and Smera Ratings Ltd.

 

The state government, through the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), has already received funding of close to Rs27,000 crore from the World Bank and the Housing and Urban Development Corporation Ltd (HUDCO), with 48% of capex planned in phase 1 already under execution.

With SBI Capital as advisors, the APCRDA also plans to raise Rs5,000 crore through masala bonds.

In the first phase, which is scheduled to be completed by 2020, the largest chunk of Rs14,554 crore is to be spent on road construction with about less than half the distance of 1,604km under tender or construction.

 

The ambitious Amaravati project, based on the concept of “tactical urbanism”, has raised concerns on fiscal prudence and ecology, since over 38,000 acres of agricultural land has been pooled by the state government to build its capital city.

Further, the government aims to monetise close to 25% of the pooled land (around 10,000 acres) over a 20-30 year period to raise over Rs50,000 crore to cover its interest and debt payments.

Founded in 2015 after the creation of Telangana, Amaravati aims to house 3.5 million people and is scheduled to be completed by 2029.

 

First Published: Thu, May 24 2018. 10 41 PM IST
Link to comment
Share on other sites

అమరావతి బాండ్ల’ సదస్సుకు స్పందన
25-05-2018 07:46:42
 
636628312044108683.jpg
అమరావతి: రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.2,000 కోట్లను అమరావతి బాండ్ల ద్వారా సమీకరించాలని భావిస్తున్న ఏపీసీఆర్డీయే అందుకు సన్నాహకంగా ముంబయిలో గురువారం నిర్వహించిన ఇన్వెస్టర్ల సమావేశానికి లభించిన స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. 30కిపైగా సంస్థాగత ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిడ్డర్లకు చెందిన 80 మంది ప్రతినిధులు పాల్గొని, అమరావతి విశేషాలను తెలుసుకున్నారు. నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌), ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఐడీఎఫ్‌సీ, ఎస్‌ బ్యాంక్‌ వంటి వాణిజ్య బ్యాంకులు, హడ్కో, నాబార్డ్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ వంటి ఆర్థిక సంస్థలు, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తదితర మ్యూచువల్‌ ఫండ్లకు చెందిన వారు హాజరైన వారిలో ఉన్నారు.
 
అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను మల్టీలేటరల్‌ ఫండింగ్‌ రూపంలో ప్రపంచ బ్యాంకు నుంచి, టర్మ్‌ లోన్ల రూపంలో ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు, వాణిజ్య బ్యాంకుల నుంచి పొందేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్న ఏపీసీఆర్డీయే వాటికి తోడు ఇన్వెస్టర్ల నుంచి అమరావతి బాండ్ల రూపంలో రూ.2,000 కోట్లను సేకరించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇన్వెస్టర్ల సమావేశాన్ని నిర్వహించింది. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అమరావతికి సంబంధించిన సమగ్ర ఆర్ధిక ప్రణాళికను వివరించారు.
Link to comment
Share on other sites

సీడ్‌ యాక్సెస్‌‌ రహదారి పనులను అడ్డుకున్న రైతులు

10483525BRK64A.JPG

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించే సీడ్ యాక్సెస్ రహదారి సర్వే పనులను అడ్డగించిన రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అమరావతిలో నిర్మించే సీడ్ యాక్సిస్ రహదారిని తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారితో అనుసంధానించేందుకు దాదాపు 28 ఎకరాలు అవసరమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. తాడేపల్లి పట్టణంలోని మహానాడు నుంచి సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానించే ప్రాంతం వరకు 27.74 ఎకరాల భూమిని సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి స్థానికులు రైతులు అభ్యంతరం తెలిపారు. తమ భూములను ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో అధికారులు భూసేకరణ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. భూమిని తీసుకునేందుకు భూసేకరణ చట్టం ప్రకారంలో భాగంగా సర్వే చేసి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. శుక్రవారం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు, స్థానికులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సర్వేకు అడ్డుతగులుతున్న రైతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముందుగా పరిహారం వెల్లడించిన తర్వాతే భూములిస్తామని స్థానికులు చెబుతున్నారు. ఎవరికెంత భూమి ఉందో తెలియకుండా పరిహారం నిర్ణయించలేమని అది గుర్తించేందుకే సర్వే చేస్తున్నామని తహసీల్దార్ పద్మనాభుడు చెప్పారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...