sonykongara Posted January 30, 2019 Author Posted January 30, 2019 కియాతో ప్రగతికి నాంది సీమను రతనాల సీమగా చేస్తానన్నా.. చేసి చూపిస్తున్నా మున్ముందు రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు అన్నింటికీ ఇక్కడ అనువైన వాతావరణం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి కియాలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభం రాష్ట్ర ప్రభుత్వం కియాతో 2017 ఏప్రిల్ 27న ఒప్పందం చేసుకుంది. అదే ఏడాది నవంబరు 15న పరిశ్రమ పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరి 22న ఫ్రేమ్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమానికి నేను హాజరయ్యా. ఆ తర్వాత వేగంగా పనులు చేసి ఇపుడు ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభించే శుభఘడియ వచ్చింది. సెప్టెంబరు, అక్టోబరులో కియా వాణిజ్య ఉత్పత్తి మొదలవుతుంది. దానికీ నేను హాజరవుతా. - ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు, అనంతపురం: ‘రాయలసీమ కరవు సీమగా, రాళ్ల సీమగా మారిపోతుందన్నారు. రతనాల సీమ చేస్తానని చెప్పా. అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటే దీనికి నాంది. కియాతో ఏపీ బ్రాండ్ మార్మోగనుంది. వాహన రంగంలో మరిన్ని పరిశ్రమలు అనంతపురం, రాయలసీమతోపాటు ఏపీలో ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద పరిశ్రమల ఏర్పాటంటే ఒప్పందం తర్వాత పది, పన్నెండేళ్లు పడతాయి. కేవలం 11 నెలల్లో రికార్డు స్థాయిలో కియా పరిశ్రమ సిద్ధమై ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభించింది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమలోని ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారి షిన్‌బాంకిల్, కియా అధ్యక్షుడు, సీఈవో పార్క్, కియా ఎండీ షిమ్‌తో కలిసి ఈ ప్రయోగాత్మక ఉత్పత్తిని ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తొలుత కియా పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, నీళ్లు ఎక్కడని సందేహం వ్యక్తం చేశారని చెప్పారు. ఆరు నెలలు గడువిస్తే.. నీటిని తెస్తామని మాట ఇచ్చామని, హంద్రీనీవాలో పెండింగ్ పనులు వేగంగా పూర్తిచేసి గొల్లపల్లి జలాశయానికి నీటిని తీసుకొచ్చామని వివరించారు. దీనిని చూసి కియా ప్రతినిధులకు నమ్మకం వచ్చిందని తెలిపారు. వరుస కట్టనున్న పరిశ్రమలు వాహన రంగంలో మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నాయని, ఇందులో నూతన సాంకేతికతను ఆహ్వానించి ఇంకా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. కియామోటార్స్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అంతా కియా కార్లనే వాడాలని, రాష్ట్ర బ్రాండ్‌ను ప్రోత్సహించాలని సీఎం కోరారు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఏపీ ప్రభుత్వానికి కియా బహూకరించిందని, అందులో ప్రయాణిస్తే విమానంలో వెళ్లినంత అనుభూతి కలిగిందని గుర్తు చేసుకున్నారు. మళ్లీ పూర్తి స్థాయి కార్ల ఉత్పత్తి ప్రారంభానికి తానే వస్తానని చెప్పారు. కియాతోపాటు ఇసుజీ, హీరో, అపోలో టైర్స్, అమర్‌రాజా బ్యాటరీస్, పలు వాహన కంపెనీలను రాష్ట్రానికి రప్పించామని వివరించారు. కియాలో ఏటా మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, దాన్ని 4 లక్షలకు పెంచాలని సూచించారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో పలు పరిశ్రమలు, సంస్థలతో ఒప్పందాల ద్వారా వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చి 14 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా పార్క్... ఏపీలో అనువైన వాతావరణం కల్పిస్తామని, కొరియన్లు ఏపీని రెండో ఇల్లుగా భావించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక్కడికి మరిన్ని కొరియా పరిశ్రమలు వచ్చేలా చూడాలని, ఇందుకు దక్షిణకొరియాలో ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ఏపీ అంబాసిడర్‌గా కియా అధ్యక్షుడు పార్క్‌ను నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కియా కోసం అనంతపురం జిల్లావాసులు కూడా విశేషంగా సహకరించారని పేర్కొన్నారు. కియాలో 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మొదలవుతుందని తెలిపారు. దీని వల్ల ఉద్యోగాలే కాకుండా అనుబంధంగా 18 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, 6,682 మందికి ఉద్యోగాలు దక్కనున్నట్లు చెప్పారు. ఆర్థిక బంధానికి ముందడుగు కొరియా- భారత్ ఆర్థిక బంధానికి ఇదొక ముందడుగని భారత్‌లో కొరియా రాయబారి షిన్ బాంకిల్ పేర్కొన్నారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో చొరవ చూపారని తెలిపారు. కియా అధ్యక్షుడు, సీఈవో పార్క్ మాట్లాడుతూ.. ఇక్కడ 536 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ప్లాంట్ ద్వారా ఏటా మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నామన్నారు. ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. భారత్‌లో వాహనరంగంలో విప్లవానికి ఈ పరిశ్రమ దోహదపడుతుందని పేర్కొన్నారు. కియా ఎండీ షిమ్ మాట్లాడుతూ.. సాంకేతికంగా అత్యాధునికమైనది, పర్యావరణపరంగా అనుకూలమైన ప్లాంట్‌ను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. భారతీయులను ఆకట్టుకునేలా మోడళ్లు తీసుకురానున్నామని వివరించారు. తొలికారులో షికారు కియా పరిశ్రమలోని ప్రెస్‌షాప్‌లో ప్రయోగాత్మక ఉత్పత్తిని ప్రారంభించాక ఇక్కడ తయారుచేసిన ఎస్పీ2ఐ మోడల్ కారును టెస్ట్ ట్రాక్‌పై నడిపారు. ఎండీ షిమ్ కారు నడపగా అందులో ముఖ్యమంత్రి ప్రయాణించారు. ఈ సందర్భంగా కియా తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ఎలక్ట్రిక్ కారును బహూకరించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు ఎలక్ట్రిక్ వాహనంలో కియా లోపల పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, అమర్‌నాథ్‌రెడ్డి, కేఎస్ జవహర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
sonykongara Posted January 30, 2019 Author Posted January 30, 2019 కియాపై భాజపా అసత్య ప్రచారంరాయలసీమలో కియా కార్లు పరుగెత్తడం, కృష్ణా జలాల పరవళ్లు రెండు శుభవార్తలుగా సీఎం పేర్కొన్నారు. ఒకే రోజు రెండు శుభకార్యాల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. ప్రధాని మోదీ వల్ల రాష్ట్రానికి కియా కార్ల పరిశ్రమ వచ్చిందని భాజపా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు తొలుత గుజరాత్‌ను, తర్వాత తమిళనాడును వాళ్లు సిఫార్సు చేశారు. కానీ అవినీతి రహిత రాష్ట్రం కాబట్టే ఆ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. సమర్థ నాయకత్వం, పారదర్శకత ఉండటం వల్లే ఇక్కడ ఏర్పాటైంది’ అని పేర్కొన్నారు. కియా పరిశ్రమ వల్ల రూ.13,500 కోట్లు, అనుబంధ పరిశ్రమలతో మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలో 11 వేల మందికి, అనుబంధ పరిశ్రమల్లో మరో నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సగటున ఏడాదికి మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేయడం చారిత్రాత్మకమని అన్నారు. ‘రాష్ట్రాన్ని మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌గా చేశాం. ఇప్పుడు కార్ల తయారీ పరిశ్రమనూ తెచ్చాం. అప్పట్లో వైఎస్, బొత్స వోక్స్‌వ్యాగన్ కార్ల పరిశ్రమను పోగొట్టారు. ముడుపుల కోసం అధికారులను జైలుపాలు చేశారు. మనం కియా పరిశ్రమను తెచ్చి తొలి కారు విడుదల చేస్తున్నాం. అదే తెదేపాకు, వైకాపాకు తేడా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
sonykongara Posted January 31, 2019 Author Posted January 31, 2019 కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరికపై జేసీ స్పందించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు ఇప్పుడు ఏమీ లేవని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కియ పరిశ్రమను గుజరాత్‌కు తరలించాలని నాలుగు సార్లు ప్రయత్నం చేశారని జేసీ ఆరోపించా
APDevFreak Posted January 31, 2019 Posted January 31, 2019 Babu garu dragging KIA CEO as ambassador is a good move.. These CEO's mostly end up in common places like golf and some resorts. I used to hear rumours how Gates used to use Golf for marketing Vista. Hope this guy bring some investors to AP.
ramntr Posted February 1, 2019 Posted February 1, 2019 14 hours ago, Yaswanth526 said: ఇలాంటి look as ఐఏఎస్ ఐపిఎస్ mla buildings daggara ivvandi ra ayya, elections ki panikosthadi...
Yaswanth526 Posted February 5, 2019 Posted February 5, 2019 (edited) Kia ready for Indian production, aiming for top 5 share South Korean automaker will churn out SUVs and compacts AKIRA HAYAKAWA, Nikkei staff writer February 05, 2019 03:57 JST A Kia concept SUV displayed at a New Delhi motor show in February 2018. MUMBAI -- South Korean automaker Kia Motors has finished construction of a plant that is central to its entry into the Indian market, with full-blown production expected in the second half of 2019. Located in the southeastern state of Andhra Pradesh, the factory has an annual capacity of 300,000 autos and will produce sport utility vehicles and compact cars, a popular segment in India. Kia aims to reach the top five in India by sales volume in 2021. India's market for new passenger vehicles tops 3 million units annually. The factory sits on a 2.2 million sq.-meter lot housing both production and employee training facilities. Investments by Kia and related parts suppliers are estimated at $2 billion. The project is expected to create 10,000 jobs in the state. Kia has prepared for its foray into India since signing a memorandum of understanding for the plant with Andhra Pradesh in April 2017. The company showcased a concept SUV at a New Delhi motor show in February 2018. Maruti Suzuki India -- a subsidiary of Japan's Suzuki Motor -- held a dominant 51.7% market share in the April-December period. Hyundai Motor, which owns a stake in Kia, ranked second at 16.3%. Indian automakers Mahindra & Mahindra and Tata Motors followed with shares in the 6% range, while Japan's Honda Motor stood fifth in the 5% range. Edited February 5, 2019 by Yaswanth526
sonykongara Posted February 10, 2019 Author Posted February 10, 2019 https://www.youtube.com/watch?v=MF3ALHISeOk
AnnaGaru Posted February 15, 2019 Posted February 15, 2019 (edited) KIA opened 1st showroom in Noida yesterday mana state jaffas matram asalu plant e ledu,memu chudaledu ani pracharam chesukuntunaru Edited February 15, 2019 by AnnaGaru Flash 1
sonykongara Posted March 31, 2019 Author Posted March 31, 2019 వీరేం చెప్పారో వినండి!31-03-2019 03:33:04 మోదీ వల్లే అనంతపురానికి కియ వచ్చిందని విపక్ష నేత జగన్ చెబుతున్నారు. మరి... దీనిపై తమిళనాడుకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త గతంలో ఏం చెప్పారు? కియ కారు ట్రయల్ రన్ సందర్భంగా ఆ సంస్థప్రతినిధులు ఏం చెప్పారు? మీరే చూడండి! సూపర్ సీఎం.. తెలివైన యువత అందుకే ఏపీని ఎంచుకున్నాం! ‘‘మా ప్లాంటు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా సహకరించింది. సీఎం మొదలు.. మొత్తం అధికార యంత్రాంగం సహకారం వల్లే అనుకున్న సమయంకంటే ముందే నిర్మాణం పూర్తయింది. ఏపీలో విద్యావంతులైన, తెలివైన యువత ఉన్నారు. వారికి తోడుగా అద్భుతంగా పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే మేం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నాం!’’ - మనోహర్ భట్, కియ మార్కెటింగ్ హెడ్ (కియ కార్ ట్రయల్ ప్రారంభానికి ముందు రోజు బెంగళూరులో) బాబు చిత్తశుద్ధి అద్భుతం ‘‘అనంతపురం జిల్లాలో కియ కార్ల పరిశ్రమ పెట్టడం ఒక నమ్మలేని అద్భుత ప్రయాణంలా నడిచింది. ఈ ప్రాజెక్టుపై సంతకాలు చేసిన దగ్గరినుంచి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. నీరు, విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆయన మద్దతు, చిత్తశుద్ధి లేకుంటే ఈ ప్రాజెక్టు అయ్యేదికాదు. ఇంత తక్కువ సమయంలో కియ మోటార్స్ కారు లాంచ్ చేయడానికి సహకరించిన చంద్రబాబుకు, ఆయన బృందానికి మరోసారి కృతజ్ఞతలు. - హన్ వూ పార్క్, కియ మోటార్స్ సీఈవో, అధ్యక్షుడు (అనంతపురం ‘కియ’లో తయారైన తొలి కారు లాంచింగ్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో) మా నేతల అవినీతి వల్లే ఏపీకి కియ! ‘‘దక్షిణ కొరియాకు చెందిన కియ భారతదేశంలో తన ప్లాంటును నెలకొల్పాలని నిర్ణయించింది. లోతుగా సర్వే చేసి తమిళనాడును మొదటి చాయి్‌సగా, రెండో చాయి్‌సగా గుజరాత్‌ను, మూడో రాష్ట్రంగా ఏపీలోని శ్రీసిటీని ఎంచుకున్నారు. ఆ కంపెనీ తొలుత తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించింది. కావాల్సిన భూములు ఇచ్చేందుకు ఒప్పందం కూడా జరిగింది. భూమితో పాటు పలు రాయితీలు కియకు ఇచ్చారు. వీటితోపాటు 70 ఆన్సిలరీ యూనిట్లు కొరియా నుంచి తమిళనాడుకు తరలించేందుకు కూడా అంగీకరించారు. అయితే, తమిళనాడు రాజకీయ నాయకులు కంపెనీకి ఇచ్చే భూమి విలువ (ప్రభుత్వ ధర)కు 50 రెట్లు లంచంగా అడిగారు. దీంతో కియ ఏపీకి తరలిపోవాలని నిర్ణయించింది. శ్రీసిటీ కాకుండా వెనుకబడిన ప్రాంతం అనంతపురానికి వెళ్లింది. నీటి వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ కియ అనంతను ఎన్నుకోవడంలో చంద్రబాబు కృషి ఎంతో ఉంది. అనంతలో కియ ఏర్పాటుకు ఎన్నో రాయితీలు ఇచ్చారు. ప్లాంట్‌ను బెంగళూరు- ముంబై, బెంగళూరు- హైదరాబాద్ రహదారికి అనుసంధానించేందుకు 200 అడుగుల రహదారి నిర్మాణానికి అంగీకరించారు. ఇప్పుడు కియ ఏపీకి వెళ్లడంతో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులు తమిళనాడు నష్టపోయింది. అంతకుమించి విలువైన అనుబంధ పరిశ్రమలూ, ఉద్యోగాలూ పోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పారిశ్రామికంగా తమిళనాడు చివరి ర్యాంకు చేరుకునేందుకు ఎక్కువ కాలం పట్టదు. ఇందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా రాష్ట్రపతి పాలనను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన మాత్రమే తమిళనాడును గాడిలో పెట్టగలదు’’ - కన్నన్ రామస్వామి, తమిళనాడుకు చెందిన పారిశ్రామిక వేత్త. (రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్)
sonykongara Posted April 1, 2019 Author Posted April 1, 2019 కియా వచ్చింది కొత్త కళ తెచ్చింది రప్పించేందుకు చెయ్యని ప్రయత్నం లేదుసీఎం సహా పలుమార్లు కొరియా వెళ్లొచ్చిన అధికారులుచివరి వరకూ పోటీపడ్డ గుజరాత్, మధ్యప్రదేశ్అయినా ఒప్పించిన ఏపీశిరికి సూర్యనారాయణఈనాడు - అమరావతి ప్రపంచ ఆటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆగమనంతో అనంతపురం జిల్లా... పెనుకొండ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. కియా మోటార్స్ రాష్ట్రానికి రావటం వెనక.. భారత్‌లో తన మొట్టమొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవటం వెనక పెద్ద కథే నడిచింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ సహా పలు రాష్ట్రాలతో పోటీపడి.. కియా యాజమాన్యాన్ని ఒప్పించేందుకు ఒక తపస్సులా బృహత్ ప్రయత్నం చేసింది. అదెలా ఫలించింది.. దాన్ని సాధించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఎంత క్రియాశీలంగా వ్యవహరించిందన్నది ఆసక్తికరమైన అంశం. కియా మోటార్స్ భారత్‌కు రావాలనుకుంటోందని తెలుస్తూనే గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాన్ని తమ రాష్ట్రానికి తీసుకుపోవాలని ఆ సంస్థపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. కానీ చివరి వరకూ ఆ రాష్ట్రాలతో పోటీ పడుతూ ఆంధ్రప్రదేశ్ సర్కారు అందించిన సహకారం, ప్రోత్సాహం, ఇతర రాయితీలతో కియా మనకే దక్కింది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అన్ని సదుపాయాలూ కల్పించింది. కియా మోటార్స్ యాజమాన్యం కూడా గడువులోగానే ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి.. ఈ ఏడాది జనవరి 29న ‘ట్రయల్ ప్రొడక్షన్’ ప్రారంభించింది. కియా రాకతో కరవు సీమ కొత్త శోభను సంతరించుకుంది. బీజం ఇక్కడ * 2014 వ్యాపార విస్తరణలో భాగంగా కియా మోటార్స్ భారత్‌లో తొలిగా ఒక ప్లాంట్ ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నట్లు సమాచారం అందింది. వెంటనే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి.* దిల్లీలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి రావత్... దక్షిణ కొరియా వెళ్లి కియా మోటార్స్ ప్రతినిధులను కలిశారు. ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రం ఎంత అనుకూలమో వివరించారు.* సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంతో పాటు విద్యుత్తు, నీరు, భూములు అందుబాటులో ఉన్నాయని, ఎగుమతులు, దిగుమతులకు కృష్ణపట్నం పోర్టు ఉపయోగించుకోవచ్చని భరోసా ఇచ్చారు. సమగ్ర ప్రతిపాదనలు * సీఎం ఆదేశాలపై దక్షిణ కొరియాలోని భారత్ రాయబారి దొరైస్వామి సహకారంతో రాష్ట్రం.. కియా మోటార్స్‌కు సమగ్ర ప్రతిపాదన పంపింది. ప్లాంట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరఫున ఏయే సహకారాలు అందించటానికి సిద్ధంగా ఉందీ లిఖిత పూర్వకంగా వివరించింది.* అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి రమేశ్‌తో కలిసి కంభంపాటి, రావత్‌లు మరోసారి కొరియా వెళ్లారు. తర్వాత సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, సలహాదారు ప్రీతంరెడ్డిల బృందం కొరియా వెళ్లి కియా ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చింది. ప్రతిపాదనల పరిశీలన * 2016 కియాకి కన్సల్టెంట్‌గా దిల్లీకి చెందిన పంత్ అసోసియేట్స్ రంగంలో దిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల పరిశ్రమలశాఖ అధికారులతో చర్చలు జరిపింది. పంత్ అసోసియేట్స్ ప్రతినిధులు 2016 మేలో అమరావతి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు.* అదే ఏడాది.. అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దక్షిణ కొరియా వెళ్లారు. కియా మోటార్స్ ప్రెసిడెంట్, ఇతర ముఖ్యులతో సమావేశమై రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చెయ్యాలని, మిగతా రాష్ట్రాల కంటే అదనంగా 1% ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.* పంత్ అసోసియేట్స్ ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి వచ్చి పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులను కలిశారు. నెల్లూరు, అనంతపురం, చిత్తూరులోని శ్రీసిటీ తదితర ప్రాంతాలను పరిశీలించారు. పలుమార్లు రాష్ట్రంలో పర్యటించాక చివరకు కియా మోటార్స్ అనంతపురం జిల్లా పెనుకొండలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అవగాహన ఒప్పందం * 2017 ఏప్రిల్ 27న ముఖ్యమంత్రి సమక్షంలో కియా మోటార్స్ ప్రెసిడెంట్ హన్ వూ పార్క్... పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌తో ప్లాంట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. గడువులోగా అన్ని సదుపాయాలూ కల్పిస్తామని కియాకు ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇచ్చింది.* ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పెనుకొండలో 600 ఎకరాల భూమిని సమీకరించి చదును చేసి కియా మోటార్స్‌కి అందించడం, గొల్లపల్లి జలాశయానికి నీరు తీసుకురావడం.. అన్నీ యుద్ధప్రాతిపదికన జరిగిపోయాయి. 2017 జూన్‌లో ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి.* 2019 జనవరి 29న ‘ట్రయల్ ప్రొడక్షన్’ ప్రారంభించింది. కియా మోటార్స్ రాక ముందు.. ఇలా * కరవుకు చిరునామా అయిన పెనుకొండ, కొత్త చెరువు, సీకే పల్లె మండలాల్లోని అనేక గ్రామాల్లో ప్రజలు ఉపాధి కోసం బెంగళూరుకు వలస పోయేవారు. ప్రత్యేకించి పెనుకొండ మండలంలోని పలు గ్రామాల్లో వేసవిలో అందరూ భవన నిర్మాణ పనుల కోసం వలస వెళితే ఇళ్లలో వృద్ధులే కనిపించేవారు.* ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉన్నా నీరులేక సాగుచేసే పరిస్థితే ఉండేది కాదు. పిల్లల పెళ్లిళ్లు, విద్య, వైద్యం వంటి అవసరాలకు అమ్ముకుందామన్నా కొనేనాథుడు ఉండేవాడు కాదు. ఎవరైనా ముందుకొచ్చినా ఎకరాకి ఇచ్చే రూ.5 లక్షలు కూడా ఐదారు విడతల్లో కడతామనేవాళ్లు. కియా రాకతో... * కియా ప్లాంట్ ప్రారంభంతో అత్యధిక గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రస్తుతం వలసల మాటే లేదు. రోజూ 4 వేల మందికి ప్లాంట్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మహిళలూ పెద్దసంఖ్యలో పనులకు హాజరవుతున్నారు.* ప్రభుత్వం సేకరించిన భూమికి ఎకరాకు రూ.10.50 లక్షల పరిహారం చెల్లించారు. ప్లాంట్ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతం ఎకరా రూ.కోటికిపైనే పలుకుతోంది. గ్రామాల్లో కొత్తగా అనేక భవనాలు, రెస్టారెంట్లు, హోటళ్లు వెలుస్తున్నాయి. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇతర వాహనాలను కొనుగోలు చేసి వాటిని కియా అవసరాలకు అద్దెకిస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభించడంతో రూ.13,000కోట్ల పెట్టుబడితో ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ పనులను కియా మోటార్స్ ఏడాదిలో దాదాపు పూర్తి చేసింది. ఉపాధికి భరోసా వర్షాల్లేక.. పంటల్లేక అల్లాడిపోయేవాళ్లం. కియా ప్లాంట్ మాకు వరంలా వచ్చింది. ప్రభుత్వం భూములు తీసుకుని ఎకరాకు రూ.10.50 లక్షలు పరిహారం ఇచ్చింది. దాంతో టిప్పరు కొని కియా ప్లాంట్‌లోనే వ్యర్థాలు తరలించే పని చేస్తున్నా. కియాతో మా ప్రాంతమే మారిపోయింది. - వై.సోమశేఖర్, రైతు, కురుబువాండ్లపల్లె, పెనుకొండ మండలం, సొంతూళ్లో ఉంటూ... కియా మోటార్స్ ప్లాంట్ ఇక్కడకు వస్తుందని, మాకు ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరుకుతుందని ఊహించలేదు. వేసవికాలం వస్తే పనుల కోసం అందరం వేరే ఊళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ప్లాంట్ వల్ల ఆడామగా అని లేకుండా అందరికీ పని దొరికింది. నేను తోటపని చేస్తా. నెలకు రూ.7,500 వస్తోంది. సొంతూళ్లో ఇంతకంటే ఏం కావాలి..? - పి.మంజుల, దిద్దేబండ, పెనుకొండ మండలం
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now