Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply
9 జిల్లాల్లో క్యాన్సర్‌ ఆసుపత్రులు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
6ap-main8a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్యాన్సర్‌ ఆసుపత్రులు నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట్ల ప్రైవేటు భవనాలను తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.  ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో క్యాన్సర్‌ ఆసుపత్రులు ఉన్నాయి. తాజా నిర్ణయంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ క్యాన్సర్‌ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు దృశ్యశ్రవణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల్లోనూ టెలీమెడిసిన్‌ విధానాన్ని అమలు చేసి పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. గతేడాదితో పోలిస్తే మలేరియా తీవ్రత తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డెంగీ పెరుగుతోందన్నారు. ప్రధానంగా విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం పట్టణాల్లో తీవ్రత ఉందన్నారు. వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న బ్యాంకు రుణ ఆధారిత పథకాల అమలు విషయంలో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీలు సంబంధిత శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. చంద్రన్న పెళ్లి కానుకకు సంబంధించి కొంతమంది లబ్ధిదారుల ఆధార్‌ కార్డులు బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాకపోవడంతో ‘పెళ్లి కానుక’ అందడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు.

కొంతమంది అధికారులు రోజూ టెలీకాన్ఫెరెన్సులు పెడుతుండటంతో తమ పనితాము చేసుకోలేకపోతున్నామని కింది స్థాయి అధికారులు, సిబ్బంది చెబుతున్నారని ఇది సరికాదన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మరికొన్ని ప్రధానంశాలు
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ శాఖల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సేవల విషయంలో ప్రజాసంతృప్తి మెరుగ్గా ఉండాలి.
* చౌకధరల దుకాణాలు అన్ని చోట్ల వేలిముద్రల యంత్రాలు, ఐరీస్‌తో పాటు ఫేషియల్‌ రికగ్నేషన్‌ యంత్రాన్ని ఉంచాలి.
* ట్రాన్స్‌జెండర్లు అందరికీ మెడికల్‌ సర్టిఫికేట్లు జారీ చేయాలి. వారందరికీ వచ్చే నెలలోగా పింఛన్లు ఇవ్వాలి.
* అంగన్‌వాడీ కేంద్రాలన్నింటిలో 45 రోజుల్లోగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సదుపాయం కల్పించాలి.
* జిల్లాల్లో ఆవుల కొనుగోలుకు కేటాయించిన యూనిట్లను అదే వ్యయంతో గొర్రెలు, మేకలు కొనుగోలుకు సిద్ధపడేవారికి వీలుకల్పించాలి.

రియల్‌టైమ్‌ సేవల కోసం యాప్‌
రైతులకు ఏయే సేవలు రియల్‌టైమ్‌లో అందిస్తున్నామో వారికి తెలిపేందుకు యాప్‌ను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వ్యవసాయంపై ఇకపై ప్రతి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.

అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌
అంతకు ముందు ప్రారంభోపన్యాసం చేసిన ఇన్‌ఛార్జీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా మాట్లాడుతూ..‘‘సింగపూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏసియన్‌ భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాల్లో పలు అంశాలపై అధ్యయనం నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ రాష్ట్రంగా ప్రకటించింది’’ అని తెలిపారు.

2019-24 దార్శనిక పత్రం విడుదల చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఈ నెల 16వ తేదీ నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. అక్కడి నుంచి ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామ వికాసం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీని కార్యాచరణ త్వరలోనే ఇస్తాం. అధికారులు గ్రామాల్లోనే ఉండాలి. గుర్తించిన సమస్యలన్నింటినీ జనవరిలో సమీక్షించుకుందాం. ఆ తర్వాత అప్పటివరకూ మనం ఏమేం పనులు చేశామో ప్రజలకు వివరిస్తాం. ఆ తర్వాత 2019-24 మధ్య తాము ఏమేం చేయబోతున్నామనేదానిపై గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా దార్శనిక పత్రాన్ని (విజన్‌ డాక్యుమెంటు)ను విడుదల చేస్తాం.

ఏపీలోనూ రేటింగ్‌లు ఇవ్వాలి
వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌తో రేటింగ్‌లు ఇప్పిస్తోంది. మన దగ్గర ఆ తరహా కసరత్తు ప్రణాళిక శాఖ చేయాలి. అత్యుత్తమంగా నిలిచిన వారికి ఆగస్టు 15న అవార్డులు అందిస్తాం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...