Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply

చంద్రన్న సంచార చికిత్స: మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సంచార వైద్య చికిత్సను ప్రారంభించారు. పిరమల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో 275 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ) వాహనాలను ఏర్పాటు చేశారు.

https://pbs.twimg.com/media/DeSecqeVwAEhAoM.jpg

https://pbs.twimg.com/media/DeSecrDUQAA3L7Y.jpg

Link to comment
Share on other sites

సంచార చికిత్సపై 98 శాతం సంతృప్తి
07-06-2018 01:00:38
 
  • ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం
అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): చంద్రన్న సంచార చికిత్స వాహనాల పనితీరుపై ప్రజలు 98 శాతం సంతృప్తితో ఉన్నారని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజల ముంగిటకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
 
షుగర్‌, బీపీ, ఎపిలెప్సీ, అంటువ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సకాలంలో వైద్య సేవలు అందక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిని అధిగమించే లక్ష్యంతో 289 చంద్రన్న సంచార చికిత్స వాహనాలను టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీసెస్‌ సౌజన్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. వీటి ద్వారా 12వేల గ్రామాల్లో మార్చి నెలలో 2 లక్షల 71 వేల 248 గ్రామీణ రోగులకు వివిధ వైద్య సేవలు అందించామన్నారు. దీనితో ప్రజలకు రూ.4.71 కోట్లు విలువైన వైద్య ఖర్చుల భారాన్ని ప్రజలకు తగ్గించామన్నారు.
 
 
 
 
Link to comment
Share on other sites

10 లక్షల మందికి రేడియాలజీ సేవలు
07-06-2018 01:00:05
 
  • 25 లక్షల మందికి అందించాలన్నది లక్ష్యం
అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సరిపడా వైద్యులు అందుబాటులో లేరు. స్పెషలిస్టుల కొరత గురించి చెప్పనవసరమే లేదు. నగరాలలో కూడా వీరి సంఖ్య పరిమితంగానే ఉంది. దీనితో గ్రామీణులకు మెరుగైన సేవలను అందించటానికి, వైద్య ఆర్థిక భారాన్ని ప్రజలకు తగ్గించటానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రేడియాలజీ సేవలు ఉపయుక్తంగా ఉన్నాయి. రాష్ట్రంలో 8 జిల్లా ఆసుపత్రులు, 31 ఏరియా ఆసుపత్రులు, 132 పీహెచ్‌సీల్లో ఎక్స్‌రే యూనిట్లను ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
 
పీపీపీ పద్ధతులలో అందిస్తున్న సేవలను సీఎం డ్యాష్‌ బోర్డుకు కూడా అనుసంధానం చేశారు. పీహెచ్‌సీల్లో తీసిన డిజిటల్‌ ఎక్స్‌రేలను జిల్లా కేంద్రాలకు నెట్‌లో పంపిస్తారు. అక్కడ రేడియాలజిస్టు, సంబంధిత ప్రత్యేక వైద్యులు పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. మందులను సంబంధిత వైద్యులకు సూచిస్తారు. ఈ సేవలు ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ 10లక్షల మంది ఉపయోగించుకున్నారు. ఒక్క మార్చి నెలలోనే 45,973 మంది రోగులు ప్రయోజనం పొందారు. ఈ ఏడాది సుమారు 25 లక్షల మందికి ఉచిత రేడియాలజీ సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశాఖ పనిచేస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...