Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply
కూచిపూడిలో రూ. 50 కోట్లతో వైద్యశాల
03-09-2018 08:20:25
 
636715596238925814.jpg
  • దాతలు, ఎన్‌ఆర్‌ఐల విరాళాలతో నిర్మాణం
  • 200 పడకలు ఏర్పాటు
  • విజయదశమికి సీఎంతో ప్రారంభోత్సవానికి సన్నాహాలు
  • సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌
 
కూచిపూడి, కృష్ణా: డబ్బుల్లేక వైద్యం అందక పేదవాడు మరణించకూడదన్న సదాశయంతో సిలికానాంధ్ర సంస్థ, దాతలు, ప్రవాసభారతీయుల సహకారంతో రూ. 50 కోట్ల వ్యయ అంచనాతో కూచిపూడిలో 200 పడకల సంజీవని వైద్యశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయదశమికి సీఎం చంద్రబాబు వైద్యశాలను ప్రారంభించి ప్రజలకు అంకితమివ్వటానికి సంస్థ పని చేస్తోంది. .సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు లక్షా 50 వేల చదరపు అడుగుల్లో ఆరు అంతస్థుల్లో నిర్మాణ పనులు జరుగు తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యసేవలు, టెలీమెడిసిన్‌ విధానం ద్వారా అమెరికాకు చెందిన నిష్ణాతులైన వైద్యులతో కూచిపూడి సంజీవనిలో వైద్యసేవలు అందించనున్నారు.
 
156 గ్రామాల ప్రజలకు వైద్య సౌకర్యం
కూచిపూడి పరిసర గ్రామాల్లోని 156 గ్రామ ప్రజలు ఇక్కడ వైద్యసేవలు పొందడానికి ఆస్కారం ఉంది. అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడే అంబులెన్స్‌ సౌకర్యం కల్పించారు. ఆపద సమయంలో ఫోన్‌ చేసిన వెంటనే హాస్పిటల్‌ నుంచి అంబులెన్స్‌ వెళ్లటం ఆలస్యమవుతుందన్న ఉద్దేశ్యంతో ఇలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, బెడ్‌లు వైద్యశాలకు చేరాయి. కొన్ని గదులు సిద్ధం కాగా, మరికొన్ని రూపుదిద్దుకుంటున్నాయి.
 
గుండె, ఊపిరి తిత్తులు, కిడ్నీ, గైనకాలజీ, పెరాలసిస్‌, శస్త్ర చికిత్సలు, నరాల సంబంధిత, కంటి, పంటి, యాక్సిడెంట్‌, అత్యవసర కేసులన్నింటికీ వైద్యసేవలు 24 గంటలూ అందించనున్నారు. ఎం.ఆర్‌.ఐ, సిటీస్కాన్‌ యంత్రాలు అందుబాటులో ఉంటాయి. భవనం మొత్తం సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉంటుంది. ఐదు ఆపరేషన్‌ థియేటర్లు, రెండు ఐసీయూ గదులు, పది కార్డియాన్‌ ఎముల్డైస్సీ సౌకర్యం కల్పించారు.
 
దాతల సహకారంతోనే నిర్మాణం
సంజీవని వైద్యశాల నిర్మాణ వ్యయం మొత్తం దాతల సహకారంతోనే సాధ్యమైంది. ప్రవాస భారతీయులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన దాతలు ఇతోధికంగా ఆర్థిక సహకారం అందించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. రోజుకు 200 నుంచి 300 సంపాదించే కూచిపూడికి చెందిన రిక్షా కార్మికుడు రూ.3500 ఆర్థిక సహాయం అందించటంతో పాటు ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే వారు సైతం తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని ఈ వైద్యశాల నిర్మాణానికి అందజేయటం అభినందనీయం.
 
 
పేదవాడికి ఖరీదైన వైద్యం
సంజీవని వైద్యశాల నిర్మాణ ప్రధాన ఉద్దేశ్యం పేదవాడికి ఖరీదైన వైద్య అందిం చటం, డబ్బు లేక పేదవాడు మరణించకూడదు. పేదవాడి ఒంట్లో జబ్బు చూస్తాం.... అతని జే బులో డబ్బు చూడం. దాతలు మరింత సహాయసహకారాలు అందించి వైద్యశాల అభివృద్ధికి సహకరించాలి.
- నిర్మాణ సారథి, సిలికానాంద్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...