Jump to content

Acharya NG Ranga Agricultural University


Recommended Posts

 • 2 weeks later...
 • Replies 96
 • Created
 • Last Reply

Top Posters In This Topic

 • 1 month later...
ఒంగోలు జాతికి రక్ష
 
 
636425098319578077.jpg
 • పిండమార్పిడితో జాతి వృద్ధికి కొత్త విధానం
 • రాష్ట్రంలో పరిశోధనలకు కేంద్రం అనుమతి
 • నేడు లాంలో శ్రీకారం
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి పశు సంతతిని వృద్ధి చేసేందుకు శ్రీవెంకటేశ్వర పశువైద్య విద్యాలయం నూతన ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. పశుసంతతిని వృద్ధి చేసి, ఒంగోలు జాతిని సంరక్షించేందుకు గుంటూరు సమీపంలోని లాం పశుపరిశోధన స్థానంలో పిండ మార్పిడి విధానాన్ని(ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నిక్‌(ఈటీటీ) సోమవారం ప్రారంభిస్తున్నారు. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ బొవైన్‌ ప్రొడక్టవిటీ పథకంలో పిండోత్పత్తి, జీవ సాంకేతిక ప్రయోగాలను గుర్తించి, దేశవాళీ ఆవులలో పిండమార్పిడి ద్వారా అధిక పాలసార కలిగిన గో జాతులను వృద్ధి చేయనున్నారు.
 
టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ తరహాలో హార్మోన్‌ ట్రీట్‌మెంట్‌ పేరుతో ఒంగోలు జాతి ఆబోతుల వీర్యాన్ని, మేలు జాతి ఆవుల అండాలను సేకరించి, వాటిని ప్రయోగశాలలో ఫలదీకరింపజేసి, తిరిగి వాటిని నాటు ఆవులలో ప్రవేశపెట్టి, మేలు జాతి లక్షణాలు కలిగిన పశు జాతిని వృద్ధి చేయాలని ఈ కార్యాచరణ ప్రణాళికలో నిర్దేశించారు. లాం పశుపరిశోధన స్థానంలోనే 2000-06లోనే పిండ మార్పిడి పరిశోధనలు నిర్వహించారు. ఈ పద్ధతిలో అప్పట్లో 70 ఆవులు జన్మించాయి.
 
ఇప్పుడీ ఈ విధానాన్ని విస్తృతం చేసి, పశుపోషకులకు మేలైన పశువులను అందించడంతో పాటు జాతిని వృద్ధి చేసేందుకు శ్రీవెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పిండమార్పిడి ప్రక్రియ అమలుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రయోగశాలను నిర్మించారు. ఒంగోలు జాతి ఆబోతుల వీర్యం, ఆవుల అండాల ఫలదీకరణతో తయారైన పిండాలను దేశవాళీ ఆవుల ఆండాశయంలో ప్రవేశపెట్టి, మేలైన పశువులను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ఈ ప్రక్రియకు రాష్ట్రంలో తొలిసారి లాం పశుపరిశోధన స్థానంలో అనుమతించింది.
 
300 ఆవులపై ప్రయోగం
ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్ ), పిండమార్పిడి సాంకేతికత(ఈటీటీ) విధానంలో మేలైన ఒంగోలు జాతి పిండాలను రాష్ట్రంలో 300 నాటు ఆవులలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ద్వారా ఏటా ఒక మేలు జాతి ఆవు నుంచి 150 పిండాలను తీయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా ఆవు ఎదకు వచ్చినప్పుడు ఒక అండమే విడుదలవుతుంది. అలా ఆవు జీవిత కాలంలో 8-10 దూడలకు జన్మనిస్తుంది. హార్మోన్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా 10-15 అండాలు విడుదల అవుతాయి. ఆ అండాలను సేకరించి, ద్రవ నత్రజనిలో భద్రపరుస్తారు. మేలు జాతి ఆబోతుల వీర్యకణాలతో అండాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణ జరుపుతారు. వారం రోజుల్లో 10-15 పిండాలు తయారవుతాయి.
 
తర్వాత పిండాలను జన్యు పరంగా జాతి లక్షణాలు తక్కువగా ఉన్న ఆవుల్లో ప్రవేశ పెట్టడం వల్ల మంచి లక్షణాలున్న దూడలు పుడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా ఒక్కో ఆవు నుంచి 150 వరకు పిండాలను ఉత్పత్తి చేస్తే, వాటితో 50-60 దూడలకు జన్మనివ్వడం జరుగుతుంది. దేశవాళీ పశుసంతతి వృద్ధికి ఎక్కువ కాలం పడుతుంది. జాతి లక్షణాలు తక్కువగా ఉంటాయి. పైగా దూడల మరణాల వల్ల మంచి జాతులు అంతరించిపోతున్నాయి. అందువల్ల ఒంగోలు, పుంగనూరు వంటి జాతిపశువుల వృద్ధికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా సాధారణ రైతులకు చెందిన పశువులకు కూడా పిండమార్పిడి నిర్వహించనున్నట్లు లాం పశు పరిశోధనస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మూరకొండ ముత్తారావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
Link to comment
Share on other sites

 • 3 months later...

వర్సిటీ భవన నిర్మాణ బాధ్యత
ఈనాడు, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో దీన్ని చేపట్టనున్నారు. నిర్మాణానికి సంబంధించి గతంలోనే ఆకృతులు ఖరారైనా ఏపీఐఐసీకి పనుల అప్పగింతపై సందిగ్ధత నెలకొంది. 15శాతం చొప్పున రుసుములు చెల్లించాలని సంస్థ పట్టుబట్టింది. అంత ఇవ్వలేమని విశ్వవిద్యాలయం భీష్మించింది. చివరకు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఆయన 3శాతం చొప్పున రుసుములు ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో వచ్చేవారం ఏపీఐఐసీతో ఒప్పందం జరగనుందని ఉపకులపతి దామోదర్‌నాయుడు తెలిపారు. విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ.135కోట్లు ఇచ్చింది. ఇందులో రూ.90 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తారు. రూ.10 కోట్లతో రహదారులు, మౌలిక వసతులు కల్పిస్తారు. వస్తుసేవల పన్ను 18 శాతం ఉండటంతో భవన విస్తీర్ణాన్ని కుదించనున్నా

Link to comment
Share on other sites

 • 2 weeks later...
55 minutes ago, sonykongara said:

agri2.jpg

ఏం పరిశోధనలు లే. ఉపయోగపడేవి ఒక్కటైనా ఉన్నాయా? నేను బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధిని. 

Link to comment
Share on other sites

 • 2 weeks later...
 • 3 weeks later...

ఆవిష్కరణల కేంద్రం 
మంత్రి సోమిరెడ్డికి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ హామీ
ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటుకు ఇరి(అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ) సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి దీన్ని నిర్వహిస్తారు. వరిలో ఉత్పాదకత పెంపు, పంటకోత అనంతర నష్టాల నివారణ, చౌడు, ఉప్పును తట్టుకునే రకాలను వృద్ధి చేయడం, గ్రీన్‌ సూపర్‌ రైస్‌ వృద్ధి తదితర అంశాలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. మనీలా పర్యటనలో ఉన్న వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వద్ద ఇరి డైరెక్టర్‌ జనరల్‌(పరిశోధన) డాక్టరు మాథ్యు మోరెల్‌, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టరు జాన్విలైన్‌ ఈ విషయాలను వెల్లడించారు. మంత్రి ఆధ్వర్యంలోని బృందం ఇరి సంస్థను సందర్శించింది. ఈ సందర్భంగా రూ.33లక్షలతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉపగ్రహ ఆధారిత వరి పర్యవేక్షణ వ్యవస్థ, శాస్త్రవేత్తలు, ఆర్థిక, గణాంక విభాగ అధికారులకు శిక్షణపై చర్చించారు. కర్నూలు జిల్లా తంగెడంచలో ఏర్పాటు చేయనున్న మెగాసీడ్‌ పార్కులో కూడా ఇరి సంస్థ కలిసి పనిచేసేందుకు సంసిద్ధత తెలిపింది.

Link to comment
Share on other sites

 • 2 weeks later...

అగ్రి వర్సిటీ భవన నిర్మాణానికి ‘ఫింగర్‌6’తో ఒప్పందం
20-02-2018 06:36:57

అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత పరిపాలన భవన నిర్మాణానికి సంబంధించి ఫింగర్‌ 6 అమరావతి అనే కన్సల్టెన్నీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు లాంలోని విశ్వవిద్యాలయంలో ఉపకులపతి డాక్టర్‌ దామోదరనాయుడు సమక్షంలో రిజిస్ర్టార్‌ డాక్టర్‌ టీవీ సత్యనారాయణ, ఫింగర్‌ 6 ప్రతినిధి ఎన్‌వీ సుబ్బారావు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సీఎం చంద్రబాబు ఆమోదించిన భవన ఆకృతుల నమూనా ప్రకారం భవన నిర్మాణ వ్యయం రూ.75కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు అవుతుందని అంచనా వేశారు.

Link to comment
Share on other sites

వర్శిటీ పాలన భవన నిర్మాణానికి ఒప్పందం
ఈనాడు, అమరావతి: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత పరిపాలన భవనం నిర్మాణానికి ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్శిటీ భవనాల నిర్మాణాల ఆకృతులను ఆమోదించటంతో పాటు నోడల్‌ ఏజెన్సీగా ఏపీఐఐసీని ఎంపిక చేయటంతో వర్శిటీ అధికారులు నిర్మాణ పనులపై దృష్టి సారించారు. గుంటూరు-లాంలో వర్శిటీ పరిపాలన భవన్‌లో నిర్మాణ, నిర్మాణాత్మక కన్సల్టెన్సీ సేవలను అందజేయటంపై ఫింగర్‌6 (ఎఫ్‌6) అమరావతి సంస్థ ప్రతినిధులతో ఉప కులపతి డాక్టరు వి.దామోదరనాయుడు, రిజిస్ట్రార్‌ సత్యనారాయణ సోమవారం చర్చలు జరిపారు. అనంతరం పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సమీకృత పరిపాలన భవన నిర్మాణానికి రూ.75కోట్ల నుంచి రూ.90కోట్ల వరకు ఖర్చు అవుతుందని వీసీ తెలిపారు. సమావేశంలో వర్శిటీ అధికారులు, ఫింగర్‌6 ప్రతినిధి ఎన్‌.వి.సుబ్బారావు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

 • 2 weeks later...

ఏపీలో రైస్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌
03-03-2018 04:29:07

అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రైస్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేయాలని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇర్రి) బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఇక్కడి వాతావరణం, వర్షపాతం, పంట ఉత్పత్తి, ఉత్తమ సాగు పద్ధతులు, యాంత్రీకరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల సాధన, ధరల ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలన్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇర్రి బృందం శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన్ను కలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా రంగాల్లో ప్రపంచంలోనే బెస్ట్‌ హబ్‌గా ఏపీని రూపొందించాలనేది తమ లక్ష్యమని చెప్పా రు. ఇర్రి డైరెక్టర్‌ జనరల్‌ మాధ్యూ మోరెల్‌ మాట్లాడుతూ ఏపీలో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ స్థాపనకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఇర్రి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

రాష్ట్రంలో అంతర్జాతీయ వరి ఆవిష్కరణల కేంద్రం 
సీఎం చంద్రబాబుతో ఇరి డైరెక్టర్‌ జనరల్‌ మాథ్యూమోరెల్‌ 
2ap-state5a.jpg

ఈనాడు-అమరావతి: అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) రాష్ట్రంలో ఆవిష్కరణ కేంద్రం (ఇన్నోవేషన్‌ సెంటర్‌) ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే వారణాసిలో ఒక కేంద్రం అందుబాటులో ఉండగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమైన ఇరి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టరు మాథ్యూ మోరెల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి దామోదర్‌నాయుడు ఆధ్వర్యంలోని బృందం ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన వివరాలను సీఎంకు తెలిపారు. పోషకలోపాల నివారణ, తెగుళ్లను తట్టుకునే వరి రకాల అభివృద్ధి, వర్షాభావ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలు, జాస్మిన్‌ రైస్‌, వివిధ కార్యక్రమాలపై అధ్యయనం, సామర్థ్య పెంపు, యాంత్రీకరణ తదితర అంశాలపై సహకరించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్‌ను కోరారు.

భూమి కోసం పరిశీలన: కేంద్రం ఏర్పాటుకు 50 ఎకరాలు అవసరమని డైరెక్టర్‌ జనరల్‌ డాక్టరు మాథ్యూ మోరెల్‌ సీఎంకు తెలిపారు. అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని సీఎం ఆదేశించడంతో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు డైరెక్టర్‌తో కలిసి శుక్రవారం బాపట్ల వరి పరిశోధన సంస్థకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను వివరించారు. శనివారం నెల్లూరులో పర్యటించనున్నట్లు ఉపకులపతి దామోదర్‌నాయుడు తెలిపారు.

Link to comment
Share on other sites

 • 1 month later...
అగ్రి వర్సిటీలో రెండు సర్టిఫికెట్‌ కోర్సులు
14-04-2018 03:48:08
 
అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా రెండు కొత్త సర్టిఫికెట్‌ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడుతోంది. ‘సేంద్రియ వ్యవసాయం’, ’మిద్దెలపై తోటల పెంపకం’ అనే కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు వీసీ వల్లభనేని దామోదరనాయుడు చెప్పారు.
Link to comment
Share on other sites

 • 4 weeks later...
వరి కేంద్రంలో ఇరీ!
ఏర్పాటైతే అంతర్జాతీయస్థాయి పరిశోధనలు
చీడపీడలు తట్టుకునే వంగడాల ఆవిష్కరణ
gnt-top2a.jpg

బాపట్ల వరి పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం (ఐఆర్‌ఆర్‌ఐ (ఇరీ) ప్రాంతీయ శాఖ ఏర్పాటుపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. వారణాసిలో మాత్రమే ఇరీ ప్రాంతీయ కేంద్రం  ఉండగా ఇక్కడ కూడా ఇది ఏర్పాటైతే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కలిసి స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే, చీడపీడలు, ముంపును బాగా తట్టుకునే స్వల్పకాలిక వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందజేసే అవకాశం దక్కుతుంది.

న్యూస్‌టుడే, బాపట్ల

కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో రైతులకు కొత్త వంగడాలు అందించి ధాన్యం దిగుబడులు పెంచాలన్న ధ్యేయంతో 1963లో తెనాలిలో వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1976లో బాపట్లకు మార్చారు. ఇప్పటి వరకు దీని నుంచి ఏడు వంగడాలు మార్కెట్లోకి విడుదలకాగా ఎనిమిది రాష్ట్రాల్లో వాటినే సాగు చేస్తున్నారు. బీపీటీ-3291 సోనా మసూరి, బీపీటీ-5204 సాంబా మసూరి సన్న బియ్యం వంగడాలుగా బాగా ప్రాచుర్యం పొందాయి. డెల్టాలో ఇప్పటికీ 70 శాతం సాంబా మసూరి వంగడాన్నే పండిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేయటానికి రెండు నూతన వంగడాలు సిద్ధంగా ఉండగా మరో ఐదు ప్రయోగాత్మక సాగు దశలో ఉన్నాయి.

ఎక్కడి నుంచో వచ్చి మరీ...
వరి పరిశోధన కేంద్రానికి ప్రస్తుతం 10 ఎకరాలు ఉండగా విత్తనోత్పత్తికి మరో 15 ఎకరాలు తాత్కాలికంగా ఇచ్చారు. ఏటా 400-500 క్వింటాళ్ల బ్రీడర్‌ విత్తనాలను ఉత్పత్తి చేస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశించిన విధంగా కంపెనీలకు అందజేస్తుండగా అవి వాటి నుంచి ఫౌండేషన్‌, సర్టిఫైడ్‌వి తయారు చేసి విక్రయిస్తుంటాయి. వాటి కోసం కోస్తా జిల్లాలతోపాటు ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు ఈ కేంద్రానికి వస్తుంటారు. ఇందుకు కారణం వాటిని సాగు చేయడంవల్ల దిగుబడులు పెరిగి నాణ్యమైన బియ్యం తయారీలో ప్రముఖ పాత్ర పోషించడమే.

సేవల విస్తరణకు నిర్ణయం
దోమపోటు, అగ్గితెగులు, ఇతర చీడపీడలు తట్టుకునే వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కొత్త వంగడాలను రూపొందించి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో  కేంద్రం సేవలు విస్తరించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.దామోదరనాయుడు, ఉన్నతాధికారులు, పాలకవర్గం నిర్ణయించింది. దాంతో వరితోపాటు మొక్కజొన్న, జొన్న, అపరాలు, వేరుశనగ పంటలపైనా పరిశోధనలు సాగుతుండగా అందుకు క్షేత్రస్థాయిలో కొత్తగా 40 ఎకరాల భూమిని కేటాయించారు.

డీజీ సానుకూల స్పందన
వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆంగ్రూ వీసీ దామోదరనాయుడు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రాన్ని ఇటీవల సందర్శించారు. ఇరీ డైరెక్టర్‌ జనరల్‌ మాథ్యూ మోరెస్‌తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీజీ మార్చి 2న అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో ఇరీ ఏర్పాటుకు అంగీకరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారుల సూచన మేరకు బాపట్ల వరి పరిశోధన స్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన వంగడాల వివరాలను కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రాధాకృష్ణమూర్తి వివరించారు. కృష్ణా డెల్టా, ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో మూడు జిల్లాల రైతులకు అందిస్తున్న సేవల గురించి తెలిపారు. ఇరీ ఆవిష్కరణ కేంద్రం(ఇన్నోవేషన్‌ సెంటర్‌) ఏర్పాటుకు ఉన్న అనుకూల పరిస్థితులపై డీజీ పరిశీలన చేశారు. తర్వాత నెల్లూరు వెళ్లి అక్కడి వరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ఇరీ ఏర్పాటుకు 25 ఎకరాల భూమి కావాల్సివుండగా బాపట్లలో ఇందుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని గుర్తించారు.

ఎంతో మేలు
ఇరీ కేంద్రం ఇక్కడే ఏర్పాటైతే డెల్టాతోపాటు ఎన్నెస్పీ రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా అనుకూల వంగడాలు ఆవిష్కరించి అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ధాన్యం దిగుబడులు పెంచటానికి ఇరీ కృషి చేస్తోంది. తుపానులు, వాయుగుండాల ముప్పు ఎక్కువగా ఉండే తీర ప్రాంతంలో ముంపు సమస్య ఎక్కువ. దీనిని తట్టుకుని, నీటిలో వారం రోజులు కంకులు మునిగినా మొలకలు రాని, దోమపోటు, అగ్గి, మెడవిరుపు, కాండం తెగుళ్లను బాగా తట్టుకునే, తక్కువ నీటితో బెట్ట పరిస్థితులను తట్టుకునే, స్వల్పకాలిక పంట కాలం 135 రోజులు ఉండే వంగడాలను అభివృద్ధి చేస్తుంది. ఇవి ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల ఆ ప్రాంత రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. వరి సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడులు వృద్ధి చెంది భవిష్యత్తులో ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇరీ కేంద్రం ఏర్పాటుపై డీజీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Link to comment
Share on other sites

 • 2 weeks later...
 • 3 weeks later...
 • 4 weeks later...
 • 1 month later...
 • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.

×
×
 • Create New...