Jump to content

Acharya NG Ranga Agricultural University


Recommended Posts

రూ.102 కోట్లతో భవన నిర్మాణాలు
05-10-2018 07:48:48
 
636743225280429306.jpg
అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో రూ.102.53 కోట్లతో జీప్లస్‌ 8 బహుళ అంతస్థుల జంట భవన నిర్మాణాలు చేపట్ట నున్నట్లు వీసీ వల్లభనేని దామోద రనాయుడు అన్నారు. గురువారం ఉదయం విశ్వవిద్యాలయంలో భవన నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాన్ని వీసీ దంప తులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2015 నవంబర్‌ 17న లాంఫాంలో విశ్వవిద్యాలయం భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని తెలి పారు. విశ్వవిద్యాలయం పరిధిలో 300 ఎకరాల స్థలం ఉన్నదన్నారు. అందుకు అనుగుణంగా మొత్తం రూ.135 కోట్లతో భవన నిర్మాణాలకు ప్రణాళికలు రూపొం దించటం జరిగిందన్నారు. అందులో రూ.4.73 కోట్లతో ఫ్యాకల్టీ భవనాన్ని ఇప్ప టికే నిర్మించామన్నారు. కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.3.5 కోట్లు ప్రతిపాదించగా, అందులో రూ.93 లక్షలు ఇప్పటికే మంజూరు చేయటం జరిగిందన్నారు.
 
రూ.8 కోట్లతో విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలు చేపట్టా మన్నారు. రూ.8.5 కోట్లతో 80 అడుగుల రోడ్డును పరిపాలన భవనం వరకు నిర్మించనున్నట్లు తెలిపారు. రక్షిత మంచినీటి సరఫరాకి రూ.2.6 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశా మన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో టెండర్లు పిలవటం జరిగిందని, టెండర్లను ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ దక్కించుకున్నదన్నారు. దానికి అనుగుణంగా వారితో ఒప్పం దాన్ని కుదుర్చుకోవటం జరిగిందని తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్ల నిధులను బదిలీ చేశామన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యుడు మేకల లక్ష్మీనారాయణ, వ్యవసా య పీఠాధిపతి డాక్టర్‌ జె.కృష్ణప్రసాద్‌, పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎన్‌వీ నాయుడు, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ పి.రాంబాబు, ఉన్నత విద్యా పీఠాధిపతి డాక్టర్‌ డి.బాలగురవయ్య, వ్యయ నియం త్రణాధికారి డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్‌ ఏ శివశంకర్‌, డాక్టర్‌ కోటేశ్వరరావు, డాక్టర్‌ ఉమాదేవి, ఏస్టేట్‌ ఆఫీసర్‌ పీవీ నరసింహరావు తదితర యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 96
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 4 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...