Jump to content

Acharya NG Ranga Agricultural University


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 96
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 3 weeks later...
  • 1 month later...
అగ్రి వర్సిటీకి రూ.800కోట్లతో ప్రతిపాదనలు
 
636260194570174048.jpg
  • సాంకేతిక పరిజ్ఞానంతో నూతన వంగడాలు
  • వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
  • అగ్రి వర్సిటీలో పరిపాలన భవనం ప్రారంభం
తాడికొండ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.800 కోట్ల అంచనాతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వ్వవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గుంటూరు సమీపంలోని లాంలో అగ్రి వర్సిటీ పరిపాలన భవనాన్ని శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ లాంలో త్వరలో అగ్రి వర్సిటీని నిర్మిస్తామన్నారు. ఇక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన వంగడాలను తయారు చేసి, రైతులకు అందిస్తామన్నారు.
 
   తొలుత భవనం ముందు ఆచార్య ఎన్జీ రంగా కాంస్య విగ్రహాన్ని మంత్రి పుల్లారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ, అగ్రి వర్సిటీ ఇనచార్జ్‌ వీసీ బి.రాజశేఖర్‌, మాజీ వీసీ డాక్టర్‌ పద్మరాజు, పాలకవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు గీత, కేఎస్‌ జవహర్‌, మేకల లక్ష్మీనారాయణ, గణపతిరావు, కోటేశ్వరరావు, భవానీదేవి, మురళీనాథరెడ్డి, గుంటూరు యార్డు చైర్మన మన్నవ సుబ్బారావు, వర్సిటీ రిజిస్ర్టార్‌ సత్యనారాయణ, ఉన్నతాదికారులు రమేష్‌బాబు, ఎనవీనాయుడు, రాజారెడ్డి, వీరరాఘవయ్య, నారాయణ, లక్ష్మీపతిరాజు, భాస్కరరావు, శివశంకర్‌, సునీల్‌కుమార్‌, నీరజ, సాంబశివరావు, లాంఫాం ఏడీఆర్‌ రత్నప్రసాద్‌, ఇతర శాస్త్రవేత్తలు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

లాం నుంచే అగ్రి వర్సిటీ పాలన
 
636260017017467560.jpg
  •  తాత్కాలిక భవనంలో పరిపాలన విభాగం కొలువు 
  •  త్వరలో శాశ్వత భవన నిర్మాణాలు 
తాడికొండ, మార్చి 24: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన ఇక నుంచి గుంటూరు సమీపంలోని లాం నుంచే కొనసాగనున్నది. లాంఫాంలో రూ.5కోట్లతో నిర్మించిన ఫ్యాకల్టీ భవనంలో పరిపాలన విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనాన్ని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాకల్టీ భవనంలో వర్సిటీ పరిపాలన విభాగాన్ని తాత్కాలికంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని లాంలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో 2015 నవంబరులో గుంటూరులోని అద్దె భవనాల్లో విశ్వవిద్యాలయ పరిపాలన విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఫ్యాకల్టీ భవనాన్ని నిర్మించడంతో పరిపాలన విభాగాన్ని అందులోకి తరలిస్తున్నారు. మూడు భాగాలుగా నిర్మించిన ఫ్యాకల్టీ భవనంలో వర్సిటీలోని కీలకమైన 16 మందిఉన్నతాధికారుల కార్యాలయాలు కొలువు తీరనున్నాయి. బోధనేతర విభాగం మరికొంత కాలం గుంటూరులో కొనసాగనున్నది. వర్సిటీ పూర్తి స్థాయిలో రూపుదాల్చితే రాష్ట్ర రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ కానున్నది. అనేక కొత్త పరిశోధనలకు ఐసీఏఆర్‌ ఊతమివ్వనున్నది. చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్నతో పాటు నూనె గింజల పరిశోధనలు పెరగనున్నాయి. మేలు రకం వంగడాల రూపల్పనకు అవకాశాలున్నాయి. నీటి సమస్యను అధిగమించేందుకు సూక్ష్మ, తుంపర, బిందు సేధ్యంతో నీటి యాజమాన్య పద్ధతులు రైతులకు అందించనున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
వ్యవసాయ సంస్థల్లో వసతులకు రూ.72.74కోట్లు

ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ పరిధిలోని 14 ప్రాజెక్టుల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణానికి రూ.72.74కోట్లు మంజూరయ్యాయి. ఇందులో నాబార్డు వాటా రూ.61.23కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11.51కోట్లు కేటాయించాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల భవనాలకు రూ.17కోటు,్ల బాపట్లలో పరిశోధనా సంస్థ ఏర్పాటుకు రూ.13కోట్లు, నాణ్యమైన విత్తనాన్ని అభివృద్ధి చేసేందుకు కర్నూలు జిల్లా తంగెడంచకు రూ.10కోట్లు కేటాయించారు.

Link to comment
Share on other sites

LAM Agri university designs....

 

 

ye pani chesina, 100% effort pedataru ga eeyana. Table meeda pettina photos angle baaga ledani, vaatini nilapettinchi, venakki jarigi mari visualize chesukoni suggestions istunnaru.  :super:

 

on a lighter note, these buildings are more intriguing than capital buildings.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Final design of agri university at LAM campus...Water front ki Kondaveedu flood water tesukuntaru univeristy pakkane vagu pond nunchi

 

Blue,Green concept  meda ekkada taggatledu babu garu

 

 

 

:super:  :terrific:  :jackson:  :yourock:

 

C-1H6Q7VYAEhXmm.jpg

 

C-1H5utUwAElEFK.jpg

 

 

Babu gari office background bagundi...UK consul general kuda this secretariat is a wonder from What I saw 6 months back here annadu...

 

C-0iVqPUAAEnanf.jpg

Link to comment
Share on other sites

Final design of agri university at LAM campus...Water front ki Kondaveedu flood water tesukuntaru univeristy pakkane vagu pond nunchi

 

Blue,Green concept  meda ekkada taggatledu babu garu

 

 

 

:super:  :terrific:  :jackson:  :yourock:

 

C-1H6Q7VYAEhXmm.jpg

 

C-1H5utUwAElEFK.jpg

 

 

Babu gari office background bagundi...UK consul general kuda this secretariat is a wonder from What I saw 6 months back here annadu...

 

C-0iVqPUAAEnanf.jpg

:super:  Univ  Design  :terrific:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పరిపాలన భవనంలోకి మారేదెన్నడో!

ఈనాడు, అమరావతి: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పనులు సక్రమంగా సాగడం లేదు. భూమి బదిలీతో పాటు ఇతర భవనాల ఆకృతుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి లేదు. రూ.5 కోట్లతో నిర్మించిన పరిపాలన భవనాన్ని ప్రారంభించి 50 రోజులవుతున్నా అధికారులు, సిబ్బంది ప్రైవేటు భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం ఫాంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా విశ్వవిద్యాలయ విభాగాల అధికారులు, సిబ్బంది ఓ ప్రైవేటు బహుళ అంతస్థుల భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి నెలకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. మరో పక్క నూతన భవన నిర్మాణం పూర్తయింది. దానిలోకి మారాల్సి ఉంది. దీనిపై రిజిస్ట్రార్‌ సత్యనారాయణ ‘ఈనాడు’తో మాట్లాడుతూ విద్యుత్‌ కనెక్షన్లు, ఇతరత్రా పనులు పూర్తి కావాల్సి ఉందని, ఈ నెలలోనే నూతన భవనంలోకి మారుతారని వివరించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రంగా వర్సిటీ ప్లాన్‌కు సీఎం ఆమోదం..?
28-05-2017 05:09:11
 
గుంటూరు, మే 27 : గుంటూరు-అమరావతి రోడ్డులోని లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల రైతులకు సేవలందించాల్సిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లాన్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 2న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో భవనాల నమూనాకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
రంగా వర్సిటీ వీసీగా వల్లభనేని నియామకం
 
 
అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా డాక్టర్‌ వల్లభనేని దామోదర్‌ నాయుడును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉత్తర్వులు రాగానే దామోదర్‌ నాయుడు సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన వల్లభనేని దామోదర్‌ నాయుడు వరి పరిశోధనల్లో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. రెండేళ్ల నుంచి ఆయన రంగా వర్సిటీ పాలక వర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మెరుగు పరిచి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేస్తామని వల్లభనేని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...