Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
బెజవాడలో పెలికాన్‌ సిగ్నల్స్‌..!
22-03-2018 08:06:59
 
636573028183209268.jpg
  • పాదచారులకూ ఓ నిమిషం
  • నగర పోలీసుల కసరత్తు
  • ప్రైవేటు సంస్థకు సర్వే బాధ్యతలు
  • కొలిక్కిరాగానే కార్యరూపం
 
 
విజయవాడ: బైక్‌లపై వెళ్లే వారికి ఆటోలు, బస్సులు అంటే కోపం. ఆటోవాలాకు ద్విచక్రవాహనదారులంటే కోపం. వీళ్లందరి ఆత్రుత ఒక్కటే... ఎక్కడా స్టాప్‌ లేకుండా వెళ్లిపోయాలి. వీళ్ల మధ్య నుంచి రహదారి దాటాలంటే మాత్రం పాదచారులు నరకం చూడాల్సిందే. అడుగుముందుకు వేయాలంటే ఆలోచించాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే పాదచారుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఇదీ ప్రస్తుత పరిస్థితి. దీని మార్పులు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది నగర పోలీసు విభాగం. నగర రహదారులను పాదచారులు సునాయాసంగా దాటేందుకు పెలికాన్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఓ ప్రైవేటు సంస్థతో సర్వే చేయిస్తున్నారు.
 
   ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఐఆర్టీఈ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్డు ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌) సదస్సులో ప్రధానంగా పాదచారుల ఇబ్బందులపై చర్చ సాగింది. విజయవాడలో సుమారు 15 ప్రదేశాల్లో ఐఆర్టీఈ సభ్యులు సర్వే చేశారు. ఆయా కూడళ్లలో ఉన్న లోపాలను గుర్తించారు. పాద చారులకు వాహనదారులు రోడ్డును దాటే అవకాశం ఇవ్వడం లేదని గుర్తించారు.
 
మొదలైన సర్వే
విజయవాడకు ప్రధాన రహదారులు మహాత్మాగాంధీ రోడ్డు, కారల్‌మార్క్స్‌ రోడ్డు. ఈ రెండు రహదారుల్లోనూ పది నుంచి పదిహేను వరకు కూడళ్లున్నాయి. ఇక్కడా పాదచారులు రహదారులను దాటి ఒకవైపు నుంచి మరో వైపునకు వెళ్లలేని పరిస్థితి. కూడళ్లు లేని ప్రదేశాల్లో మరీ దారుణం. యువకులు ఎలాగో వాహనాలను మధ్య నుంచి దాటేస్తున్నా... వృద్ధులు మాత్రం వెనక్కి జంకుతున్నారు. ఈ రెండు రహదారుల్లోనూ పాదచారుల కోసం ఉన్న జాగా ఫుట్‌పాత్‌లు. వాటినీ వాణిజ్య సముదాయాలు ఆక్ర మించాయి. ఈ తరుణంలో పాదచారుల కోసం ప్రత్యేకంగా జంక్షన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది పోలీసుశాఖ. ఒక ప్రైవేటు సంస్థతో కలిసి నగరంలో సర్వేచేస్తున్నారు. ఎక్కడెక్కడ పాదచారులకు జోన్లు ఇవ్వాలన్న దానిపై పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఫుత్‌పాత్‌లపై వారి కోసం పెలికాన్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ విధానం విజయవాడలో ఎంత వరకు ఫలితాలను ఇస్తుందన్న అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎంజీరోడ్డులో పాదచారులు రహదారిని దాటడానికి బృందావన్‌ కాలనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద డివైడర్‌కు మధ్యన కొంత ప్రదేశాన్ని ఖాళీగా ఉంచారు. ఇవి కాకుండా ఆరేడు ప్రదేశాల్లో యూ టర్న్‌లున్నాయి.
 
సాధ్యమయ్యేనా...
  • దేశంలో మెట్రోపాలిటన్‌ నగరాల్లో పాదచారులను ఇబ్బందులను గుర్తించిన అక్కడి పోలీసులు పెలికాన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను పట్టాలెక్కించారు. బెంగళూరు నగర వ్యాప్తంగా 60 చోట్ల ఈ సిగ్నల్స్‌ను ఏర్పాటుచేశారు.
  • దేశ రాజధానికి ఢిల్లీలో నూతనంగా 39ప్రదేశాల్లో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.
  • రాబోయే రోజుల్లో విజయవాడలో వాహనాలు పెరిగే అవకాశం ఉండడంతో రద్దీ అదేస్థాయిలో ఉంటుందని పోలీసు అంచనావేశారు.
  • ముందుగా పెలికాన్‌ సిగ్నల్స్‌ను బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు.
  • కంట్రోల్‌రూం నుంచి బెంజ్‌సర్కిల్‌ వరకు ఉన్నదూరం 4.8 కిలోమీటర్లు. ప్రతి కిలోమీటరు పెలికాన్‌ సిగ్నల్‌ను ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సర్వే చేస్తున్న సంస్థ వ్యక్తం చేసింది.
  • అదేవిధంగా కంట్రోల్‌ రూం నుంచి ఏలూరు రోడ్డు దూరం 4.30 కిలోమీటర్లు. ఈ మార్గంలోనూ అలాగే పెలికాన్‌ సిగ్నల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

విజయవాడలో పార్కింగ్‌ ప్లాన్‌!
28-03-2018 08:14:58
 
636578216988571510.jpg
  • రోడ్డుసేఫ్టీ కార్యాచరణలో భాగంగా .. కలెక్టర్‌కు నివేదిక
  • ట్రయల్‌గా ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశం
  • ఖర్చు తక్కువ.. స్థలం ఆదా
విజయవాడ నగరంలో మల్టీ కార్‌ పార్కింగ్‌కు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రోడ్డు సేఫ్టీ కార్యాచరణలో భాగంగా రవాణా శాఖ ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక అందించింది. పాతబస్తీ, పంజా సెంటర్‌, బీసెంట్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌ సర్వీసు రోడ్లు, పటమట ప్రాంతాల్లో తక్షణం వీటి ఏర్పాటుకు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదించింది.
 
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): రోడ్డు సేఫ్టీని మెరుగు పరచుకోవటానికి నగరంలో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్న వాహనాల పార్కింగ్‌లను నిలువరించటానికి జిల్లా యంత్రాంగానికి , రవాణా శాఖ మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌ లను ప్రతిపాదించింది. షాపింగ్‌ మాల్స్‌ , స్టార్‌ హోటల్స్‌, వాణిజ్య సముదాయాల ప్రాంతాలలో ప్రధాన రోడ్లు, జాతీయ రహదారుల వెంబడే వాహనాల పార్కింగ్‌ల వల్ల ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయి. ఎందరో మృత్యువాత పడి మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చటానికి రవాణా శాఖ నగరంలో ఐదు ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లకు ప్రతిపాదించింది. పాతబస్తీ, పంజా సెంటర్‌, బీసెంట్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌ సర్వీసు రోడ్లు, పటమట ప్రాంతాలలో తక్షణం వీటి ఏర్పాటుకు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదించింది. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో చూచాయిగా దీనిని ప్రస్తావించిన రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ (డీటీసీ) మీరా ప్రసాద్‌ ఆ తర్వాత కలెక్టర్‌కు నివేదిక పూర్వకంగా అందించటం జరిగింది. డీటీసీ నుంచి వచ్చిన ప్రతిపాదన పట్ల కలెక్టర్‌ కూడా ఆసక్తి చూపారు. మల్టీ కార్‌ పార్కింగ్‌ ఏరియాలను సృష్టించడం ఖర్చు , సమయాభావాలపై రవాణా శాఖ జిల్లా యంత్రాంగానికి తగిన ప్రతిపాదలు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలలో ఐరన్‌ కేస్‌తో తయారు చేసిన మల్టీ క్లార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లు ఉన్నాయని, మోటార్‌ ద్వారా వీటిని ఆపరేట్‌ చేస్తారని ఒక్క ఆపరేటర్‌ ద్వారా కార్ల పార్కింగ్‌ చేపట్టవచ్చని రవాణాశాఖ చెప్పింది. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు.
 
దీనిపై స్పందించిన కలెక్టర్‌ యుద్ధ ప్రాతిపదికన ట్రయల్‌గా రెండైనా నగరంలో ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించటం జరిగింది. ఈ మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లను ఏర్పాటు చేయటానికి స్థానిక సంస్థలుగా ఉన్న కార్పొరేషన్‌ , సీఆర్‌డీఏ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సంబంధిత శాఖలు ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే అంత త్వరగా ఇవి సాకారమౌతాయి. మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లు రెండు రకాలుగా ఉంటాయి. భారీ బహుళ అంతస్థుల భవనాలలో నిర్వహించేవి కొన్ని ఉంటే.. ఐరన్‌ కేస్‌ ద్వారా నిర్వహించే మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లు మరికొన్ని ఉన్నాయి. బహుళ అంతస్థుల భవనాలతో నిర్మించే మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లను ఏర్పాటు చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇలాంటి వాటికి స్థలం చాలా అవసరమౌతుంది. ఖర్చు కూడా రూ. కోట్లలో ఉంటుంది. పైగా వీటిని నిర్మించటానికి కనీసంగా 6 నెలల నుంచి గరిష్టంగా ఏడాది సమయం పడుతుంది.
 
అదే ఐరన్‌ కేస్‌ మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లు అయితే చాలా తేలిగ్గా ఏర్పాటు చేయటానికి అవకాశం ఉంటుంది. ఇవి ఆక్రమించే స్పేస్‌ కూడా తక్కువుగా ఉంటుంది. స్పేస్‌ను బట్టి వీటిని విస్తరించుకోవచ్చు. కేవలం నెల రోల్లోనే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. రోడ్ల పక్కన , ఖాళీ ప్రదేశాలలోను, కాంప్లెక్స్‌ల దగ్గర ఆయా పరిసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. శక్తివంతమైన మోటార్‌ వ్యవస్థ ఉంటుంది. దీనికి ఒక ఆపరేటర్‌ సరిపోతాడు. శక్తివంతమైన మోటార్‌ సాయంతో కార్‌ పార్కింగ్‌ బేలు పైకి, కిందకు, పక్కలకు కదులుతాయి. ఖాళీగా ఉన్న బేను కిందకు తీసుకు వచ్చి ఉంచుతారు. దాని మీద కారును ఎక్కించగానే దానిని మోటార్‌ సాయంతో పైకి మోసుకు వెళ్ళి ఒక క్రమ పద్దతిలో ఉంచుతాయి. తిరిగి ఈ కార్లను కిందకు వేగంగా సురక్షితంగా దించటానికి కూడా డిజిటల్‌ సాంతికేక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. తక్కువ విస్తీర్ణంలో వందల వాహనాలను పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది
 
ఇదీ... నగరంలోని వరస
నగరంలో ప్రధాన జాతీయ రహదారి (ఎన్‌ఎహెచ్‌ - 16 ) సర్వీసు రోడ్ల వెంబడి వందల సంఖ్యలో కార్లు పార్కింగ్‌ చేసి ఉంటాయి. మల్టీ ప్లెక్స్‌ మాల్స్‌ , థియేటర్లు, రెస్టారెంట్లు వంటివి అనేకం ఉండటం చేత ఈ ప్రాంతాలకు వచ్చే వారంతా పార్కింగ్‌ సమస్యల కారణంగా సర్వీసు రోడ్లమీదనే పార్కింగ్‌ చేస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు అయిన బందరు రోడ్డు, ఏలూరు రోడ్ల పరిస్థితి కూడా ఇలాగా ఉంటుంది. ఈ రెండు రోడ్లు దుస్తులు, నగలు, ఆటోమొబైల్‌, ఫ్యాన్సీ , వస్త్ర తదితర వ్యాపార దుకాణాలతో కూడుకుని ఉండటం , ఆయా కాంప్లెక్స్‌లలో సెల్లార్‌ పార్కింగ్‌ వ్యవస్థలు లేకపోవటం వల్ల రోడ్ల మీదనే పార్కింగ్‌ చేస్తున్నారు. నగరంలోని మల్టీప్లెక్స్‌ మాల్స్‌లో కూడా తక్కువ పరిణామంలోనే పార్కింగ్‌ సదుపాయం ఉంటోంది. బీసెంట్‌ రోడ్‌కు ప్రతి రోజూ వేలాది సంఖ్యలో వస్తుంటారు. ఈ రోడ్డులో కానీ, సమీప ప్రాంతాలలో కానీ పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉంది. అన్సారీ కార్‌ పార్కింగ్‌ ఏరియా ఉన్నా .. అక్కడ పరిమిత సంఖ్యలోనే కార్‌ పార్కింగ్‌ చేసుకోవటానికి అవకాశం ఉంది. ఎన్‌టీఆర్‌ కాంప్లెక్స్‌లో కొంత వరకు పార్కింగ్‌ ప్లేస్‌ ఉన్నా.. భవిష్యత్తు అవసరాలను తీర్చలేకపోతోంది. అరండల్‌ కాంప్లెక్స్‌కు వచ్చే వారంతా రోడ్డు మీదనే పార్కింగ్‌ చేస్తున్నారు.
 
ఇక పాతబస్తీ పరిస్థితి మరీ దారుణం మార్కెట్‌ ఏరియా, వర్తక - వాణిజ్య ప్రాంతం, పంజా సెంటర్‌ తదితర ప్రాంతాలలో విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. బెంజిసర్కిల్‌ , రామవరప్పాడు జంక్షన్‌ల దగ్గర పెద్ద ఎత్తున రోడ్ల మీద కార్లను నిలుపుదల చేస్తున్నారు. రామవరప్పాడు జంక్షన్‌లో ఇటీవల కాలంలో చాలా మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐరన్‌ కేస్‌ మల్టీ కార్‌ పార్కింగ్‌ ప్లేస్‌లకు రవాణా శాఖ ప్రతిపాదించింది. వీటిని కార్లకే కాకుండా ఆటోలు, మ్యాక్సీలు, ద్విచక్రవాహనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.
Link to comment
Share on other sites

పున్నమి ఘాట్‌కు నూతన సొబగులు
08-04-2018 11:18:59
 
అమరావతి: ఈ నెల 10, 11, 12 తేదీల్లో అమరావతి (మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌)లో జరగనున్న సంతోష నగరాల సదస్సును పురస్కరించుకుని సీఆర్డీయే ఇటీవల నిర్వహించిన హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు శనివారం నుంచి తమ సృజనాత్మకతతో విజయవాడలోని పున్నమిఘాట్‌కు నూతన సొబగులు దిద్దుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పాలుపంచుకుని, పున్నమిఘాట్‌ను సర్వాంగసుందరంగా, ఆకర్షణీయమైన ఆహ్లాదకరమైన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దోహదపడే వివిధ డిజైన్లు, థీమ్స్‌, క్రియేటివ్‌ కాన్సె్‌ప్టలను అందజేసిన సంగతి విదితమే. వాటికి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, ల్యాండ్‌స్కేపర్లు, ప్లానర్లు, ఇతరుల సహకారంతో విద్యార్థినీ విద్యార్థులు స్థానికంగా దొరికే చౌకైన, వ్యర్ధ పదార్ధాలతో వాస్తవ రూపం కల్పిస్తున్నారు. వాటన్నింటితో పున్నమిఘాట్‌ను శోభాయమానంగా తీర్చిదిద్దే పని ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అనంతరం ఆ ప్రాంతాన్ని ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులు తిలకించేందుకు అనుమతించనున్నారు. తద్వారా బహిరంగ స్థలాలను ప్రజల ప్రమేయంతో మరింత నేత్రపర్వంగా తీర్చిదిద్దాలన్న సీఆర్డీయే ప్రయత్నం ఏమేరకు సత్ఫలితాలనిచ్చిందో వారు తెలుసుకునేందుకు ఆస్కారం కలుగుతుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...