Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

స్ర్కాప్‌ పార్క్‌కు సొబగులు!
 
 
636415814956420210.jpg
  • బెజవాడ కూడలిలో ఆహ్లాదాన్ని పంచేలా అభివృద్ధి
  • త్వరలోనే ఫ్లడ్‌- ఫోకస్‌ లైట్లు, భారీ ఫౌంటెయిన్‌, వీడియోవాల్‌..
  • రెండు నెలల్లో పూర్తిగా సిద్ధం
  • ఏడీసీ కృషితో అభివృద్ధి
అమరావతి: రాజధానికి ముఖద్వారమైన విజయవాడలోని అత్యంత ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన స్ర్కాప్‌ పార్క్‌ (ఇనుప వ్యర్థాలతో చేసిన వివిధ ఆకృతులతో కూడిన ఉద్యానవనం) ప్రజలను ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు రహదారులు, ఐకానిక్‌ బ్రిడ్జ్‌, శాఖమూరు పార్క్‌ ఇత్యాది ప్రాజెక్టులను ప్రశంసార్హమైన రీతిలో చేపడుతున్న ఏడీసీ (అమరావతి అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
 
        నిత్యం వేలాది మంది బాటసారులు, స్థానికులు రాకపోకలు సాగించే బెజవాడ రైల్వేస్టేషన్‌- పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ మధ్య, పోలీస్‌ కంట్రోల్‌ రూం ఎదుట సుమారు 1.25 ఎకరాల విస్తీర్ణంలో గతేడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ పార్క్‌ రూపుదిద్దుకుంది. మనం పనికి రానివిగా భావించే పాత ఇనుప డ్రమ్ములు, తదితర వస్తువులతో రాకాసిబల్లి, ఖడ్గమృగం, జిరాఫీ, జింక ఇత్యాది పలు ఆకృతులను తయారుచేసి, ఇందులో ఉంచారు. ఈ వినూత్న ఉద్యానవనం కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా, ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దలేదు. దీంతో నిత్యం అటుగా రాకపోకలు సాగించే వారిలో అధికులకు సైతం ఇలాంటి ఒక వెరైటీ పార్క్‌ ఉందన్న విషయం తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో.. స్ర్కాప్‌ పార్క్‌ అభివృద్ధి బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం ఏడీసీకి కొన్ని నెలల క్రితం అప్పగించగా, ఆ సంస్థ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేశారు. అప్పటి నుంచి ఏడీసీ అధికారులు, సిబ్బంది జరుపుతున్న కృషి ఫలించి, ప్రస్తుతం ఈ ఉద్యానవనం నూతన శోభను సంతరించుకుంది. రానున్న ఒకటిన్నర, రెండు నెలల్లో మరిన్ని సొబగులను జతపరచనున్నారు.
 
అన్ని ఆకృతులూ హైలైట్‌ అయ్యేలా..
ఈ పార్క్‌లోని అన్ని బొమ్మలూ ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో వాటన్నింటి చుట్టూ వేర్వేరుగా చిన్న చిన్న గట్లను నిర్మించారు. ప్రతి బొమ్మ స్పష్టంగా, సుందరంగా కనిపించేలా రకరకాల రంగులు మారే ఫోకస్‌ లైట్లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌కు నాలుగు వైపులా ఎత్తయిన స్తంభాలను వేసి, వాటికి ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటుచేయడం ద్వారా ఉద్యానవనం వెలుగులతో నిండేలా చూడనున్నారు. దీంతోపాటు ప్రాంగణమంతా చక్కటి పచ్చిక బయళ్లు, అంచుల్లో పూలమొక్కలను పెంచడంతోపాటు అధునాతన ఎస్‌.ఎస్‌.రెయిలింగ్‌లతో ఆకర్షణీయమైన ముఖద్వారాన్ని, చుట్టూ కంచెను ఏర్పాటుచేశారు. మధ్యభాగంలో టైల్స్‌తో చూడచక్కగా తీర్చిదిద్దారు. ముఖద్వారంపైన పాకించేందుకు రాధామాధవ్‌ రకం క్రీపర్లను నాటనున్నారు. సంవత్సరం పొడవునా రంగు రంగుల పూలతో ఇవి నేత్రపర్వం చేయనున్నాయి. పార్క్‌కు ఒకపక్కన ఉన్న రైవస్‌ కాలువ వైపు నుంచి ఎవరూ ఉద్యానవనంలోకి ప్రవేశించకుండా, అదే విధంగా ఇక్కడికి వచ్చే సందర్శకులు కాలువ వైపునకు వెళ్లకుండా చూసేందుకు గేట్‌ను ఏర్పాటుచేశారు. ఉద్యానవనానికి ఆనుకుని ఉన్న వంతెనపై నుంచి దూకి, లోనికి ప్రవేశించడాన్ని నిరోధించేందుకు ఇనుప మెష్‌ వేయనున్నారు. పార్క్‌ను పరిశుభ్రంగానూ, పచ్చగానూ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించడంతోపాటు పరిరక్షణకు వాచ్‌మన్‌ను ఉంచారు. కాపలాదారుడు ఉండేందుకు వీలుగా చిన్న క్వార్టర్‌నూ నిర్మించారు.
 
భారీ ఫౌంటెయిన్‌, వీడియో వాల్‌..
పార్క్‌కు తూర్పు వైపున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ గోడకు ఆనుకుని 60 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు ఉండే భారీ వాటర్‌ ఫౌంటెయిన్‌ను త్వరలో ఏర్పాటుచేయనున్నారు. ఇది మామూలు ఫౌంటెయిన్‌లా కాకుండా ‘వాటర్‌ క్యాస్కేడ్‌ (నీళ్లు పైనుంచి జలజలా కిందికి రాలుతున్నట్లుగా)’ ఉంటుంది. దీనికి సుమారు 5, 6 అడుగులపైన.. 25 అడుగుల వెడల్పు, 12.50 అడుగుల ఎత్తు ఉండే భారీ ‘వీడియో వాల్‌’ను ఏర్పాటు చేస్తారు. క్రికెట్‌ స్టేడియంలలో కనిపించే అతి పెద్ద టీవీ తెరల్లాంటిదైన దీనిపై అమరావతి నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను ప్రదర్శించాలని యోచిస్తున్నారు. జనసమ్మర్ధముండే ప్రాంతంలో ఉన్నందున దీనిపై వాణిజ్యపరమైన ప్రకటనలకూ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తంమీద వచ్చే రెండు నెలల్లోపు విజయవాడ స్ర్కాప్‌ పార్క్‌ పైన పేర్కొన్న హంగులన్నింటినీ సమకూర్చుకుని, సందర్శకులకు కనువిందు చేయనుంది.
Link to comment
Share on other sites

  • Replies 1k
  • Created
  • Last Reply
కొత్త రూపు
 
 
636432224054483412.jpg
బెజవాడ కొత్త రూపు సంతరించుకోనుంది. పెండింగ్‌లో ఉన్న జెఎన్‌ఎన్యూఆర్‌ఎం నివాసాలను పూర్తి చేయడంతో పాటు, సాయంత్రాలను ఆహ్లాద భరింతం చేసుకోలేకపోతున్నామని ఆవేదన చెందే నగర వాసులకు కావలసినంత ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నడిబొడ్డున సిటీ స్క్వేర్‌, బందరు కెనాల్‌ నుంచి స్కూౄ బ్రిడ్జి వరకు రివర్‌ ఫ్రంట్‌, పద్మావతి ఘాట్‌లో సరదా సాయంత్రాల కోసం ఫుడ్‌ కోర్టులు, కళా వేదికలు, కెనాల్‌లో బోటు షికారు.. కావలసినంత రిలాక్సేషన్‌ ఇక నగరవాసులు సొంతం చేసుకోవచ్చునని నగర కమిషనర్‌ నివాస్‌ వెల్లడించారు. సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన నగరంలో
కోట్లాది రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు.
 
  • నగరాభివృద్ధికి కోట్లాది రూపాయలతో ప్రణాళికలు
  •  రూ.వంద కోట్లతో పెండింగ్‌లో ఉన్న పక్కా నిర్మాణాల పూర్తి
  •  వినాయకుడి గుడి వద్ద నుంచి త్వరలో బోటింగ్‌
  •  పద్మావతి ఘాట్‌ వద్ద ఫుడ్‌ కోర్టులు
  •  గెస్ట్‌హౌస్‌లో వీఎంసీ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు?
  • వెల్లడించిన నగర
  • కమిషనర్‌ నివాస్‌
  •  ఏళ్ల తరబడి తరగని సమస్యకు బయో
  • మైనింగ్‌తో పరిష్కారం
  •  అనుభవమున్న సంస్థకు బాధ్యతలు
  •  రూ.వంద కోట్లతో పెండింగ్‌లో ఉన్న పక్కా నిర్మాణాల పూర్తి
  •  వినాయకుడి గుడి వద్ద
  • నుంచి త్వరలో బోటింగ్‌
  •  పద్మావతి ఘాట్‌ వద్ద ఫుడ్‌ కోర్టులు
  •  108 నూతన డంపరు
  • బిన్లు, 8 చోట్ల స్మార్ట్‌ బిన్లు
  •  వీఎంసీ గెస్ట్‌హౌస్‌లో కార్యాలయానికి ప్రతిపాదనలు?
రాజధాని నగరం కొత్త రూపు సంతరించుకోనుంది. నగరపాలక సంస్థ వందల కోట్ల రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. రూ.వంద కోట్లతో పెండింగ్‌లో ఉన్న నాలుగు వేల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు కార్యరంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో హడ్కో నుంచి రూ.వంద కోట్లను తీసుకుని నిర్మాణాలు చేపట్టనున్నట్లు నగర కమిషనర్‌ సోమవారం విలేకరులకు వివరించారు. నగరంలో చేపట్టనున్న పలు కార్యక్రమాలపై ఈ సందర్భంగా ఆయన స్పష్టత నిచ్చారు. రూ.రెండు కోట్లతో బందరు కెనాల్‌ నుంచి స్కూౄ బ్రిడ్జి వరకు రివర్‌ ఫ్రంట్‌ను సుందరీకరించనున్నట్టు, పద్మావతి ఘాట్లో ఫుడ్‌ జంక్షన్లు ఏర్పాటు చేసి ప్రతి వారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఓ వేదికను నిర్మించనున్నట్టు కమిషనర్‌ నివాస్‌ తెలిపారు.
 
 నయా నిర్మాణాలు
సిటీస్క్వేర్‌ నిర్మాణంలో భాగంగా 26 ఎకరాల స్థలాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పచ్చదనాన్ని పాడుచేస్తున్నారని కొందరు అపోహల్లో ఉన్నారని, అలాంటి ప్రమాదాలేమీ జరగకుండా బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టామన్నారు. కౌన్సిల్‌ కూడా సిటీస్క్వేర్‌పై ప్రతిపాదనను అంగీకరించిందని, అమలు చేయడమే తరువాయని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఎంసీ కార్యాలయాన్ని ఖాళీ చేయనున్నట్టు చెప్పారు. అయితే ఎపుడు ఖాళీ చేస్తాం? ఎక్కడికి తరలిస్తాం అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. 3,800 చదరపు గజాలున్న మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌లో వీఎంసీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చని అప్పట్లో ఆదేశాలు వచ్చాయని, అయితే అందుకు గెస్ట్‌హౌస్‌లో సమూల మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ లోపు మరేదైనా స్థలం దొరికితే అక్కడకు తరలించే అవకాశం కూడా ఉండొచ్చని చెప్పారు.
 
 అంతటా సీసీ కెమెరాలు
 వెహికల్‌ డిపోలో జరుగుతున్న అవకతవకలు, డంపింగ్‌ యార్డు, కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో కూడా భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నట్టు కమిషనర్‌ నివాస్‌ చెప్పారు. టౌన్‌ప్లానింగ్‌తో పాటు మరికొన్ని విభాగాల్లో ‘దళారుల దందా’ అంటూ వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇకనుంచి సాయంత్రం వేళల్లో కార్యాలయంలో ఏ దళారీ కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
 
 నయా ఆలోచనలు
2.jpgనగర వ్యాప్తంగా గ్రాఫిటీతో కూడిన పెయింటింగ్స్‌ను వేయించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో ఎంజీ రోడ్డు, కారల్‌మార్క్స్‌ రోడ్లపై వేసినట్టుగానే మొగల్రాజపురం, రైల్వేస్టేషన్‌, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో కూడా వేయించనున్నట్టు చెప్పారు. రాజీవ్‌గాంధీ పార్కును పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఇకనుంచి ఇక్కడకు కుటుంబసభ్యులు కూడా వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
 
 బోటింగ్‌కు సిద్ధం
వినాయకుడి గుడి నుంచి బోటింగ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేయనున్నామన్నారు. గతంలోనే బోటింగ్‌ ఏర్పాటు చేసినప్పటికీ మధ్యలో పలు కారణాల వల్ల సామాన్యు లకు దూరమయిందని, ఈసారి మాత్రం ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించామని
నివాస్‌ చెప్పారు.
 
 పారిశుధ్యంపై సీసీఆర్‌ పర్యవేక్షణ
నగరంలో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు ప్రస్తుతం ఉన్న 378 డంపరు బిన్లు కాకుండా మరో 108 నూతన డంపరు బిన్లను కొనుగోలు చేయనున్నట్టు కమిషనర్‌ తెలిపారు. గుర్తించిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. అలాగే స్మార్ట్‌ బిన్లను కూడా ఎనిమిది ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వీటిని సీసీ కెమెరాల ద్వారా వీఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసి, చెత్త తరలింపు ప్రక్రియను, పర్యవేక్షించనున్నట్టు చెప్పారు.
 
 వంద కోట్లతో నిర్మాణాలు
ఆగిపోయిన నాలుగు వేల జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్‌ పక్కా నిర్మాణాలను రూ.వంద కోట్లతో తిరిగి చేపట్టనున్నట్టు కమిషనర్‌ తెలిపారు. ఈ నిర్మాణాలకు రూ.వంద కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఆమోదం తెలిపిందని చెప్పారు. మరో పది రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశముం దన్నారు. లబ్ధిదారుల నుంచి వీఎంసీకి రావాల్సిన రూ.9 కోట్లు, పుష్కరాల సమయంలో గట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కల్పనకు సంబంధించి రావలసిన రూ.17.69 కోట్లు కలిపి పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేయనున్నట్టు చెప్పారు.
 
 ఘాట్లో హాయ్‌.. హాయ్‌
పద్మావతి ఘాట్లో ఫుడ్‌ జంక్షన్లు ఏర్పాటుచేసి నగరవాసులకు సాయంత్రాలు ఆహ్లాదంగా గడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కమిషనర్‌ చెప్పారు. ఘాట్‌ వద్ద అందుకవసరమైన ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు. అలాగే కళావేదికను ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు. రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్టు చెప్పారు. వీటితోపాటు ఘాట్‌ వద్ద వాకింగ్‌ ట్రాక్‌ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
hai.jpg 
 
 
Link to comment
Share on other sites

ఉదయం ఆకస్మిక తనిఖీలు... సాయంత్రానికి ప్రణాళిక రెడీ...

 

 
cbn-14102017-1.jpg
share.png

విజయవాడ చుట్టుపక్కన ఉన్న 45 గ్రామాలను విజయవాడ నగరపాలక సంస్థ (వి.ఎం.సి)లో దశలవారీగా కార్యాచరణ ప్రణాళికతో విలీనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఉదయం విజయవాడ నగరం, గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామాల సర్పంచులను ఆహ్వానించి ఒక సమావేశం నిర్వహించాలని అధికారులను కోరారు. ఆరునెలలలోగా ఈ పనిని పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొండలమీద, కాల్వల పక్కన నివసిస్తున్న 50 వేల కుటుంబాలకు వాంబే కాలనీలో పట్టాలివ్వాలని, 16 వేల మంది లబ్దిదారులకు వాంబే కాలనీలో గృహాలు కేటాయించాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ టిడ్కో హౌసింగ్ అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. నిర్మాణాలను పూర్తిచేయడానికి 9 నెలల వ్యవధినిస్తున్నట్లు సీఎం చెప్పారు.

 

పోలీసు కంట్రోల్ రూమ్ ఎదురుగా పనికిరాని పరికరాలతో గత పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన పార్కు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బందరు కాల్వ ఇరువైపులా ఒడ్డును సుందరీకరించాలని , రెండు నెలల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఐలెండ్లు, కూడళ్ల అభివృద్ధిని నెలరోజుల్లో చేసి చూపాలని సీఆర్ డీఏ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. జలవనరుల శాఖ ఎస్.ఇ కి గవర్నర్‌పేట బస్ డిపోలోకి వెళ్లి పరిశీలించారు. ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రాంతాలలో పర్యటించారు. నగరంలో 4 కాల్వలను అనుసంధానం చేయాలని సీఎం జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్ చీఫ్‌ను ఆదేశించారు. కాల్వలలో వాటర్ స్కూటర్లు లాంటి జలక్రీడలతో నగర పౌరులకు ఆహ్లాదం పంచవచ్చని చెప్పారు. ఆరునెలల్లోగా పూర్తిచేయాలని కోరారు.

తర్వాత క్యాంప్ కార్యాలయంలో మంత్రులు,సీఆర్ డీఏ, విజయవాడ నగరపాలక సంస్థ, అమరావతి నగరాభివృద్ధి సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. త్వరలో ఉత్తర్వులు జారీచేస్తామని, వాంబే కాలనీ వాసులకు పట్టాల అందజేత ప్రక్రియ నవంబర్ 30 నాటికి పూర్తిచేయాలని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాత బస్టాండు దగ్గర ఉన్న సీఎన్జీ డిపోను 45రోజుల్లోగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు తరలించాలని కోరారు. ఇందుకోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్ ) ఎండీ ఏపీ దాస్‌తో మాట్లాడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్యాస్ పైప్ లైన్ వేయడం 30 రోజుల్లో పూర్తికావాలన్నారు. సమీప భవిష్యత్తులో ఇప్పుడున్న సీఎన్జీబస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని, 45 రోజుల్లో డ్రైవర్ రహిత బస్సులు వస్తాయని అన్నారు. బస్టాండు నుంచి రైల్వేస్టేషన్ దాకా ముందుగా సుందరీకరించాలని కోరారు.

విజయవాడ నగరంలో భాగమై నగర సౌందర్యాన్ని ఇనుమడించే కొండలు మరింత ఆకర్షణీయంగా కనపడాలంటే పర్వత ప్రాంతాలను సుందరీకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

కనకదుర్గమ్మవారికి పూజలు చేయడానికి ఉపయోగించే ఎరుపు, పసుపురంగు పుష్ప వనాలను ఇంద్రకీలాద్రిపై పెంచాలని సూచించారు. ఇందుకు నలభై రోజుల వ్యవధినిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరీ ప్రాజెక్టు ఎం.డి చంద్రమోహనరెడ్డికి చెప్పారు. గన్నవరం దాకా రహదారి వెడల్పు పనులను 2 నెలల వ్యవధిలో పూర్తిచేయాలని, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, విజయవాడ పోలీసుకమిషనర్, విజయవాడ, నూజివీడు ఆర్డీఓ, జిల్లా పంచాయతీ ఆఫీసరు ఈ పనులను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. నగరంలో ఎక్కడా చెత్త కనపడకూడదని, కాల్వల పక్క సుందరీకరణ చేయడమే కాకుండా నిర్వహణ కూడా చేపట్టాలని సూచించారు. సింగపూర్ నగరం తరహాలో మన రహదారులు కన్పించాలని, తాను మళ్లీ ఆకస్మిక తనిఖీ చేపడతానని, ఎక్కడా గుంతలు ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జపనీస్ పగోడా రకం చెట్లను (గోపురాన్ని పోలివుండే చెట్లు) పెంచాలన్నారు.

దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయడం కోసం ట్రాఫిక్ ను నిలిపివేశామని, ఇందువల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా నిర్మాణ సంస్థ పరిగణనలోకి తీసుకోవాలన ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నిర్మాణానికి అవసరమైన పనివారు, యంత్ర సామాగ్రిని పూర్తిస్థాయిలో వినియోగించడంలేదని ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయానికి పనులు వేగవంతం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ దుర్గగుడి పనులను ప్రతిరోజూ సమీక్షించాలని, సోమవారం నాడు నిర్మాణ సంస్థ యజమానులు తనను కలవాలని ఆదేశించారు.

వచ్చే ఏడాది జూన్ మాసానికి జక్కంపూడి గృహనిర్మాణాలు పూర్తి:

జక్కంపూడిలో 234 ఎకరాల పరిధిలో నిర్మిస్తున్న 10వేల గృహాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని, అసంపూర్తిగా నిలిచిన 4 వేల జే.ఎన్.యూ.ఆర్.ఎం గృహనిర్మాణాలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నగర సుందరీకరణలో కాల్వల పక్కన ఉన్న గృహాలకు ప్రాధాన్యతనిస్తామని, నాలుగు కాల్వలను, నిర్మాణాలను, ఏటవాలుగా ఉన్న ప్రాంతాలకు అమరావతి అభివృద్ధి సంస్థ శుద్ధి ప్రక్రియ చేపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.

కాల్వ ఒడ్డున పెద్ద స్థలాల్లో సీమ్ లెస్ కనెక్టివిటీ ఇవ్వాలని, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుంటూరు వైపు విజయవాడకు ముఖద్వారం దగ్గర సుందరీకరణ చేపట్టాలని కోరారు. ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి (point to point &end to end) రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యాన్నివాలని, అపసవ్యంగా వున్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ మ్యాన్ హోల్స్‌ను సరిచేయాలని నగరపాలక సంస్థ ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం 15 రోజుల సమయం ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కు స్పష్టం చేశారు. నగరమంతా అందమైన, ఆహ్లాదమైన వాతావరణం నెలకొల్పాలని, ఇందుకు తక్షణ ప్రాధాన్యంతో వెంటనే పనులకు ఉపక్రమించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బిందుసేద్యం తరహాలో రహదారుల పక్కన హరిత వాతావరణం సృష్టించాలన్నారు. నెలరోజులలో ఈ పనులు పూర్తిచేయాలని అన్నారు.

నగరంలో, పిచ్చికుక్కల బెడదపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తేగా, కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ను ముఖ్యమంత్రి కోరారు. కోతుల బెడద నివారించే బాధ్యతను గుంటూరు జిల్లా అగతవరప్పాడు ఫారెస్టు చీఫ్ కన్సర్వేటర్ కు అప్పగించారు. నెలరోజుల్లో పని పూర్తికావాలన్నారు. విజయవాడలో గోశాల (క్యాటిల్ హాస్టల్) పనులను వెంటనే చేపట్టి నెలరోజులలో పూర్తి చేయాలన్నారు. గుణదల ఆర్వోబీ, బ్రడ్జిలు, టన్నెల్స్ పూర్తిచేయాలని కోరారు. ఏడాదిలోగా పూర్తిచేయాలని ఎల్ అండ్ టీ కి ఆదేశాలిస్తామన్నారు. రామవరప్పాడు ట్రాఫిక్ ఐలెండ్ నిర్వహణ బాధ్యత పురపాలక శాఖ, పోలీసు శాఖ, ఆర్ అండ్ బి తీసుకోవాలని ఆదేశించారు. పది, పదిహేను కిలోమీటర్ల మేర బుడమేరు కట్ట నిర్మాణం చేపట్టడానికి పక్కనే ఉన్న 18000 గృహాల వారికి నూతన గృహాలు నిర్మించి తరలించాల్సి ఉందన్నారు. ఇందుకు భూమి సమీకరిస్తామన్నారు.

9 నెలల్లో రామవరప్పాడు బ్రిడ్జి

నిడమానూరు బ్రిడ్రి, రామవరప్పాడు కాల్వ అవతల పక్క బ్రిడ్జి నిర్మాణాలు చేప్టటాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, వల్లభనేని వంశీల సూచనలకు స్పందిస్తూ అన్నారు. రామవరప్పాడు బ్రిడ్జి నిర్మాణం పూర్తికి 9 నెలల వ్యవధిని నిర్దేశించారు

మంచి నీటి చెరువులను శుద్ధిచేసి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి తేవాలని వంశీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లా పరిషత్ రహదార్లను కూడా అభివృద్ధి చేయాలని సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...