Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply

విజయవాడలో భారీ వినోద కేంద్రాలు 
రాష్ట్ర పర్యాటక అత్యున్నత కమిటీ ఆమోదం
ఈనాడు, అమరావతి: విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో మూడు భారీ కుటుంబ వినోద కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర పర్యాటక అత్యున్నత కమిటీ ఆమోదం తెలిపింది. చెన్నైకి చెందిన ఎస్‌పీఐ సినిమా అనే సంస్థ వీటి ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర పర్యాటక అత్యున్నత కమిటీ బుధవారం వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. కమిటీ అధ్యక్షుడు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులైన మంత్రులు భూమా అఖిలప్రియ, కె.అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, పలు శాఖల అధికారులు ముకేష్‌కుమార్‌ మీనా, హిమాన్షుశుక్లా, కరికాల వలవన్‌, సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, కాంతిలాల్‌ దండే పాల్గొన్నారు.
* విశాఖ, విజయవాడ కేంద్రాల్లో సుమారు 2వేల మంది సామర్థ్యంతో సమావేశ మందిరం(కన్వెన్షన్‌ సెంటర్‌), 8 తెరల మల్టీప్లెక్స్‌, 50వేల అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య కేంద్రం, 3 నక్షత్రాల హోటళ్లు ఏర్పాటుచేయాలని.. తిరుపతిలోని కేంద్రంలో 6 తెరల మల్టీప్లెక్స్‌, 80వేల అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య కేంద్రం, 3 నక్షత్రాల హోటల్‌ వంటివి ఏర్పాటుచేయాలని.. రూ.150కోట్ల మేర వీటికి పెట్టుబడి అవసరమని అధికారులు కమిటీకి నివేదించారు. 
* తిరుపతి, విశాఖ, విజయవాడలో కుటుంబ వినోద కేంద్రాల ఏర్పాటు విషయాన్ని మంత్రిమండలికి నివేదించి తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. 
* రంపచోడవరం, అరకు, శ్రీకాకుళంలోని ప్రాంతాల్లో రూ.40కోట్ల ప్రాజెక్టుల పనులను మంజూరుచేసినట్లు పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ కమిటీకి వివరించారు. మారేడుమిల్లిలో రూ.9కోట్లతో రిసార్టు, లంబసింగిలో రూ.5కోట్లతో అభివృద్ధి పనులు, అరకులో గిరిజన రిసార్టుకు రూ.7.5కోట్లు, శ్రీకాకుళంలోని జగతిపల్లిలో రిసార్టు ఏర్పాటుకు రూ.7కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

బాపు మ్యూజియం ఏర్పాటులో అంతర్జాతీయ ప్రమాణాలు
02-02-2018 06:55:58
విజయవాడ: నగరంలోని బాపు మ్యూజియంను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా అక్కన్న మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు, కొండపల్లి ఖిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్కియాలజీ మ్యూజియం డిపార్ట్‌మెంట్‌ పరిధిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని చారిత్రక ప్రదేశాలలో వచ్చే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ. 16.70 కోట్లను కేటాయించారు. కిందటేడాది డిసెంబరు 28 వతేదీన జరిగిన ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా బాపు మ్యూజియంను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా గ్యాలరీలు, వస్తు ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి, చారిత్రక ఘట్టాల చిత్రమాలికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడే ఏపీ హిస్టరీ, కల్చర్‌ను తెలియచేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

Link to comment
Share on other sites

On ‎1‎/‎26‎/‎2018 at 2:15 AM, sonykongara said:
విజయవాడలో మరో మినీ ఇన్నర్‌ రింగ్‌
26-01-2018 10:55:50
 
636525609550968475.jpg
  • తాడిగడప-ఎనికేపాడు 100 ఫీట్‌ రోడ్డు కృష్ణా కరకట్టతో అనుసంధానం
  • బందరు కాల్వ, కరవు కాల్వల మీదుగా వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు
  • కరకట్ట బలోపేతం
  • సీఆర్డీయే ప్రణాళిక
  • ఎనికేపాడు టూ వారథి వయా తాడిగడప
  • కృష్ణానది కరకట్టను కలిపేలా సీఆర్డీయే ప్రణాళిక 
 
విజయవాడ నగరాన్ని ట్రాఫిక్‌ సమస్య నుంచి వీలైనంత త్వరలో గట్టెక్కించేందుకు సీఆర్డీయే కొత్తగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఎనికేపాడు - తాడిగడప వంద అడుగుల రోడ్డును బందరు రోడ్డు వద్ద కరకట్టతో అనుసంధానం చేసి వారధి దాటిన తర్వాత జాతీయ రహదారి 16తో కలపాలని భావిస్తోంది. ఇందుకు మార్గమధ్యంలో బందరు కాల్వ, కరవు కాల్వలపై రెండు వంతెనల నిర్మాణానికి ప్లాన్‌ చేసింది.
 
 (ఆంధ్రజ్యోతి, అమరావతి): రోజు రోజుకూ రద్దీతో సతమతమౌతున్న విజయవాడ నగరానికి ఆ బెడదను తగ్గించే కార్యాచరణ ప్రణాళికను సీఆర్డీయే రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరం మీదుగా సాగే రెండు జాతీయ రహదారులు (మచిలీపట్నం-హైదరాబాద్‌, చెన్నై- కోల్‌కతా)ను కలిపే తాడిగడప-ఎనికేపాడు వంద అడుగుల రోడ్డును ఇందుకు ఆలంబనగా చేసుకుంటున్నట్లు సమాచారం.
కొన్ని నెలల క్రితమే మధ్యలో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌తో, నాలుగు వరుసల భారీ రహదారిగా సీఆర్డీయే ద్వారా అభివృద్ధి చెందిన ఈ రహదారి కొద్దికాలంలోనే ఏలూరు, బందరు రోడ్లను కలిపే ప్రధాన రహదారిగా (విజయవాడ రింగ్‌ రోడ్డు తర్వాత) రూపాంతరం చెందింది. న్యూ ఆటోనగర్‌, కామినేని ఆస్పత్రి, శ్రీ చైతన్య మెయిన్‌ క్యాంపస్‌, కేఎంవీ ప్రాజెక్ట్స్‌ భారీ వెంచర్‌ వివాన్‌లతోపాటు ఈ రోడ్డుకు ఇరువైపులా వివిధ కాలనీలు, భారీ భవంతులు నిర్మితమవుతుండడంతో ఇది అంతకంతకూ ప్రాధాన్యాన్ని పెంచుకుంటోంది.
 
ఈ నేపథ్యంలో ఈ రహదారే నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ వెతలను కొంతవరకు తగ్గించగలిగే మార్గంగా సీఆర్డీయే, వివిధ ప్రభుత్వ శాఖలు భావిస్తున్నాయి.
ఎనికేపాడు వద్ద వంద అడుగుల రోడ్డులోకి ప్రవేశించిన వాహనాలు విజయవాడను తాకకుండానే కృష్ణానది కరకట్ట రోడ్డును స్వల్ప వ్యవధిలోనే చేరుకోగలుగుతాయి. అక్కడి నుంచి కుడివైపునకు తిరిగితే అమరావతి, గుంటూరు, చెన్నై తదితర ప్రాంతాలకు, ఎడమ వైపునకు తిరిగితే అవనిగడ్డ, రేపల్లె ప్రదేశాలకు సులభంగా వెళ్లిపోతాయి. అదేవిధంగా అవనిగడ్డ తదితర ప్రదేశాల నుంచి ఏలూరు, నూజివీడు, హైదరాబాద్‌ ప్రాంతాల వైపు వెళ్లే వాహనాలు కూడా నగరాన్ని తాకకుండానే ఎనికేపాడు సెంటర్‌కు చేరి, అక్కడి నుంచి తమ ప్రస్థానాన్ని కొనసాగించే వీలుంటుంది.
 
విస్తరణ ఇలా...
ఇందులో భాగంగా తాడిగడప-ఎనికేపాడు వంద అడుగుల రహదారి బందరు రోడ్డు వద్ద ప్రారంభమయ్యే ప్రదేశానికి పక్కనే ఉన్న బందరు కాల్వపై వంతెన నిర్మించనున్నారు. తర్వాత అక్కడి నుంచి దక్షిణం దిశగా తాడిగడప, పెదపులిపాక పంచాయతీల పరిధుల్లో ఇప్పటికే గుర్తించి న భూముల ద్వారా రహదారి వేస్తారు. ఈ రెండు గ్రామాల పక్కగా వెళ్లే ఈ రోడ్డు పెదపులిపాక వద్ద కృష్ణానది కరకట్ట (అవనిగడ్డ రోడ్డు)ను కలిసేందుకు వీలుగా మధ్యలో ఉన్న కరువు కాల్వపై వంతెన నిర్మించాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
 
పలు ప్రాంతాల వెతలకు పరిష్కారంగా... 
సాధారణంగా పెరిగే వాహనాల సంఖ్యకు తోడు రాజధానిగా అమరావతి ప్రకటన తర్వాత వచ్చిన జనాభా, వారి వాహనాలతో విజయవాడలోని పలు ప్రదేశాలు దాదాపు రోజూ ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుని, విలవిల్లాడుతుండడం తెలిసిందే. రామవరప్పాడు రింగ్‌ నుంచి గొల్లపూడి బైపాస్‌ రహదారిని కలిపే విజయవాడ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు పూర్తవడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ కనకదుర్గమ్మ ఫ్లైవోవర్‌, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైవోవర్‌ నిర్మాణం కొనసాగుతుండడంతో తరచుగా స్తంభించే ట్రాఫిక్‌ నగరవాసులతోపాటు నగరం మీదుగా రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల వారికీ చుక్కలు చూపుతోంది.
 
వాటిల్లో దుర్గగుడి ఫ్లైవోవర్‌ సంగతి అలా ఉంచితే... బెంజ్‌సర్కిల్‌ మీదుగా జ్యోతిమహల్‌ నుంచి రమేష్‌ ఆస్పత్రి కూడలి దాటేవరకూ చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైవోవర్‌ కారణంగా మరిన్ని ట్రాఫిక్‌ చిక్కులు ఎదురౌతున్నాయి. ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి పరచినప్పటికీ ఈ మార్గంలోని పలు జంక్షన్ల వద్ద వాహనాలు చాలాసేపు ఆగిపోతుండడం పరిపాటైంది. మరొక పక్క ఏలూరు వైపు నుంచి నగరం మీదుగా చెన్నై, అమరావతి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు మార్గమధ్యంలోని ప్రసాదంపాడు, రామవరప్పాడు, రింగ్‌సెంటర్‌, మహానాడు, రమేష్‌ ఆస్పత్రి, నిర్మలా కాన్వెంట్‌, బెంజ్‌సర్కిల్‌ జంక్షన్ల వద్ద తరచూ స్తంభిస్తూ... ట్రాఫిక్‌లో చిక్కుకోవడమూ నిత్యకృత్యమైంది. బెంజ్‌సర్కిల్‌పై నిర్మించే ఫ్లైవోవర్‌ పూర్తయ్యేందుకు ఎంత లేదన్నా కనీసం మరో ఏడాదికిపైగానే పట్టే అవకాశముంది. అది పూర్తయిన తర్వాత కూడా అంతకంతకూ విస్తరిస్తున్న నగరం, పరిసరాల దృష్ట్యా ప్రస్తుతమున్న విజయవాడ రింగ్‌రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మరో రహదారిని నిర్మిస్తే మేలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తాడిగడప-ఎనికేపాడు వంద అడుగుల రహదారిని విస్తరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

aa area antha super expensive ga, asalu kuduruthunda?

Link to comment
Share on other sites

సుందర నగరంగా విజయవాడ
10-02-2018 09:06:16

కృష్ణలంక : మహానగరంగా రూపుదిద్దుకొంటున్న విజయవాడను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా పనులు చేపడుతున్నట్టు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం కలెక్టర్‌, డీసీపీ జె.బ్రహ్మారెడ్డి, నగరపాలక సంస్థ, సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, జాతీయ రహదారులు, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, ఏపీ ట్రాన్స్‌కో, ఆర్టీసీ, పబ్లిక్‌ హెల్త్‌, అటవీశాఖ అధికారులతో బస్సుయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని శబ్ద, వాయు, దుమ్ము, ధూళి లేని నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయా శాఖలతో డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం (డీపీఆర్‌) పనులు చేపడుతున్నామన్నారు.
 
నగరంలో ఉన్న కొండప్రాంతాల్లో పచ్చ దనం పెంచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఇంద్రకీలాద్రి, గుణదల కొండల్లో అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పచ్చదనం పెంపు పనులు చేపట్టిందన్నారు. నగరంలో ప్రవహి స్తున్న మూడు ప్రధాన బందరు, ఏలూరు, రైవస్‌ కాలువల సుందరీ కరణలో భాగంగా ఇప్పటికే ఒక కిలోమీటర్‌ పనులు పూర్తిచే యడం జరిగిందన్నారు. 18 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాలువలను రూ.61 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.
 
కాలుష్యరహిత నగరంగా...
కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా భారీ వాహనాలను నగరంలో అనుమతించకుండా చేరే మార్గాల ద్వారా మళ్లించే విధంగా కార్యక్రమాలు చేపట్టామ న్నారు. కాంక్రీటు, మట్టి, ఇసుక లారీలపై టార్పాలిన్‌ తప్పనిసరిగా కప్పి రవాణా చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.
 
అంతర్జాతీయ విమానాశ్రయంగా..
గన్నవరం విమానాశ్రయాన్ని త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్ద డానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరి గిందని ఆయన తెలిపారు. విమానాశ్రయంతో పాటు రహదారులను అందమైన మొక్కలతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
 
ఫ్లై ఓవర్ల నిర్మాణం
బెంజిసర్కిల్‌ నుంచి కానూరు వరకు నాలుగు కిలోమీటర్ల పొడవున ఫ్లై ఓవర్‌ నిర్మా ణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. బెంజిసర్కిల్‌ నుంచి గన్నవరం వరకు అదే తరహాలో బెంజిసర్కిల్‌ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఎండ్‌ టు ఎండ్‌ పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు.
 
అంతర్జాతీయస్థాయిగా ఇందిరాగాంధీ స్టేడియం
ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియాన్ని అంతర్జాతీయ స్టేడియంగా తీర్చిదిద్దడానికి ప్రైవేటు, పబ్లిక్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి పర్చడానికి సన్నాహాలు జరుగుతున్నా యన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరిచే దిశగా అమెరికా నుంచి బోటు బస్సును రప్పిస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద తరచుగా జరుగుతున్న ప్రమాదాల నివారణకు సేఫ్టీ, రెస్క్యూ బోటులు ఏర్పాటు చేయనున్నామన్నారు.
 
మార్చి 31 నుంచి దుర్గగుడి వద్ద రాకపోకలకు అనుమతి
దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ముఖ్య మంత్రి రూ.10 కోట్లు విడుదల చేయడం జరిగిందని, మార్చి 31 నాటికి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నా మన్నారు. ఇంకా ఆరు స్పాన్‌ పనులు జరగవలసి వున్నదని, వీటిని మార్చి 31 నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
 
40 వేల పట్టాలు రెగ్యులైజేషన్‌
నగరంలో 40 వేల మంది ప్రభుత్వ స్థలా లను ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకొన్న వారికి ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేయించి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడు తున్నామన్నారు. గోశాల నిర్మాణానికి కావా ల్సిన స్థలాన్ని సేకరించి పనులు ప్రారంభించే విధంగా పశుసంవర్థక శాఖ అధికారులు పని చేయాలన్నారు. రూ.6 కోట్లతో నిర్మిం చనున్న రామవరప్పాడు కాలిబాట వంతెనకు త్వరలో భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు.
 
స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ నిర్మాణం
నగరంలో 424 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పనులు వేగవంతం చేసేందుకు ఎల్‌ అండ్‌ టీ ఇంజినీర్లు పనిచే యాలన్నారు. నిజాం గేటు నుంచి జీరో బల్బు ప్రాంతం వరకు నిర్మించవలసిన డ్రెయిన్‌ పనులకు కావాల్సిన అనుమతులను రైల్వే డివిజనల్‌ మేనేజర్‌తో సంప్రదించి పరిష్కరిం చాలన్నారు. ఇరిగేషన్‌ ఇంజినీర్లు బుడమేరు ముంపునకు సంబంధించిన పనులతో పాటు డ్రెయిన్ల నిర్మాణానికి ఆటంకంగా వున్న ఎల క్ర్టికల్‌ స్థంభాలను తొలగించాలని సంబం ధిత అధికారులను ఆదేశించారు. సమావే శంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
బస్సు యాత్రతో అభివృద్ధి పనుల పరిశీలన
ముఖ్యమంత్రి హామీల్లో భాగంగా రామవరప్పాడు రింగ్‌ వద్ద చేసిన సుందరీకరణ పనులను పంచాయతీరాజ్‌ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ అధికారులతో కలిసి బస్సులో విజయవాడ నుంచి గన్నవరం, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం, దుర్గాఫ్లైఓవర్‌ చేరుకొని ముఖ్యమంత్రి హామీల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రామవరప్పాడు వద్ద చేసిన సుందరీకరణ పను లను పరిశీలించి లారీలు నిలిపి అపరిశుభ్రత వాతావరణం కలిగిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని పరిసరాల్లో ఉన్న పచ్చదనాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం రింగ్‌ రోడ్డు చేరుకొని అక్కడ జరుగుతున్న రింగ్‌ సుందరీకరణ పనులు పరిశీలించారు. రింగ్‌రోడ్డు అభివృద్ధితో పాటు మూలపాడు వద్ద ట్రెక్కింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

 

http://www.eenadu.net/district/inner.aspx?dsname=Amaravati&info=amr-sty1


అందాలను ఆస్వాదిద్దాం 
18న మూలపాడు కొండల్లో ట్రెక్కింగ్‌ 
కనువిందు చేయనున్న ప్రకృతి సోయగాలు 
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 
ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే 

ట్రెక్కింగ్‌ చేయాలని ఉందా?... స్నేహితులతో కలిసి ఆ కొండ కోనల్లో తిరిగి ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అందు కోసం ఎక్కడికో వెళ్లనవసం లేదు. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని కొండలు అందుకు వేదిక కానున్నాయి. ఆ కొండల్లో ఈ నెల 18న ట్రెక్కింగ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతలో మానసిన ఉల్లాసాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు వంద మంది పాల్గొంటారని అంచనా. అందుకు అవసరమైన బేస్‌ క్యాంప్‌తో పాటు దుస్తులు, బూట్లు, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించాలని ఇటీవల నిర్వహించిన అధికారుల సమీక్షలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మానసిక ఉల్లాసానికి.. 
అమరావతి ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలను  చేపడుతున్న ప్రభుత్వం తాజాగా ట్రెక్కింగ్‌ని కూడా ప్రోత్సహిస్తోంది. అందుకు రాజధానికి సమీపంలో ఉన్న అందమైన కొండలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు కొందరికే పరిమితమైన ట్రెక్కింగ్‌ను యువత, ఉద్యోగులకు పరిచయం చేసి మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మూలపాడు, కేతనకొండ, కొండపల్లి, చెరువు మాధవరం తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ చేయాలనుకునే వారికి వసతులు కూడా కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నా.. శిక్షణ లేని వారికి శిక్షణ ఇచ్చి ట్రెక్కింగ్‌కు వెళ్లేలా చేయనున్నారు. అందుకు కావాల్సిన వసతులను మూలపాడు అటవీ ప్రాంత ప్రారంభంలో ఏర్పాటు చేయనున్నారు.

ఇక్కడే ఎందుకంటే 
విజయవాడ నగరానికి 20 కి.మీ. దూరంలోనే మూలపాడు అడవులు ఉండటంతో పాటు గ్రామం నుంచి నడక మార్గంలో దాదాపు 15 కి.మీ. సునాయాసంగా ప్రయాణం చేయడంలోనే ట్రెక్కింగ్‌ అనుభూతి లభిస్తుంది. అడవిలోకి ప్రవేశించగానే అడవి ఆంజనేయ స్వామి, దొంగమర్ల బావి, కిరసనాయల బావి, కుక్కల లోయ వంటివి ఆకర్షిస్తాయి. వివిధ రకాలైన ఔషధ మొక్కలు లభిస్తాయి. అడవి ఆంజనేయ స్వామి ఆలయం అనంతరం నాలుగు కిలో మీటర్లు దాటితే ఎతైన కొండలతో పాటు జలపాతాలు దర్శనమిస్తాయి. ఇన్ని అనుభూతులు ఒక్కచోటే లభించే అవకాశం ఉండటంతో ట్రెక్కింగ్‌కు మూలపాడు అనుకూలమైన ప్రాంతంగా జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

అద్భుత ప్రదేశం 
- రఘు, బెజవాడ అడ్వంచర్‌ క్లబ్‌ వ్యవస్థాపక సభ్యుడు 
ట్రెక్కింగ్‌కు కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని ప్రాంతాలు ఎంతో అనుకూలం. ప్రకృతి ప్రసాదించిన మంచి ప్రాంతమని పేర్కొనవచ్చు. అడవిలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా సురక్షితంగా రాకపోకలను సాగించే అవకాశం ఉంది. సరైన మార్గదర్శనం ద్వారా అడవిలో అనువణువూ తెలుసుకోవచ్చు. 
 

అనువైన ప్రాంతం 
- సురేష్‌, విజయవాడ అడ్వంచర్‌ క్లబ్‌ సభ్యుడు 
కొండపల్లి రిజర్వు ఫారెస్టు ట్రెక్కింగ్‌కు అనుకూలం. ఎతైన కొండలు, జలపాతాలు ఈ ప్రాంత ప్రత్యేకతలు. విజయవాడ నగరానికి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం నుంచి అడవి చుట్టుపక్కల ఎక్కడికైనా చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపు 500లకు పైగా ట్రెక్కింగ్‌ స్పాట్‌లను నిర్వహించాం.

Link to comment
Share on other sites

వలయమా? వంతెనలా? 
తెరపైకి భిన్న ప్రతిపాదనలు 
ట్రాఫిక్‌ కష్టాలకు ప్రత్యామ్నాయాలు
దేనికైనా కేంద్రం నిధులే కావాలి 
ఈనాడు, విజయవాడ 

‘విజయవాడ బైపాస్‌ (బాహ్య వలయ రహదారి) నిర్మాణం జరిగితే నగరంపై ట్రాఫిక్‌ ప్రభావం ఉండదు. దీనికి అంచనాలు వేస్తున్నాం. ఈపీసీ టెండర్లను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గామన్‌ ఇండియా సంస్థ ఒప్పందం రద్దయింది’!
- జాతీయ రహదారులు ప్రాథికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు చెబుతున్న వాదన ఇది!
‘నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు పైవంతెనలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాం. కనకదుర్గ పైవంతెన, బెంజి సర్కిల్‌ పైవంతెనలతో పాటు రెండు సుదీర్ఘ పైవంతెనలను (లాంగ్‌ ఫ్లైఓవర్‌, ఎక్స్‌ప్రెస్‌వే) ప్రతిపాదిస్తున్నాం. ఇవి సాకారం అయితే ట్రాఫిక్‌ సమస్య ఉండదు’!

- జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు !
విజయవాడ నగరానికి రెండు భారీ ప్రాజెక్టులపై భిన్నవాదనలు వినపిస్తున్నాయి. బైపాస్‌ రహదారి నిర్మాణమా..? లేక సుదీర్ఘ పైవంతెనల నిర్మాణామా..? అనేది తేలడం లేదు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, జాతీయ రహదారుల సంస్థ అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు జిల్లా యంత్రాంగం సుదీర్ఘ పైవంతెనలకు ప్రతిపాదనలు చేస్తుండగా.. మరోవైపు బైపాస్‌ రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సమకూర్చాల్సి ఉందనేదే సారూప్యం. బైపాస్‌ నిర్మాణం ఇక లేనట్లేనని జిల్లా అధికారులు పేర్కొంటుంటే.. జాతీయ రహదారులపై సుదర్ఘీ పైవంతెనలు సాధ్యం కాదని ఎన్‌హెచ్‌ఏఐ అంటోంది. ఈ రెండింటి విషయంలో ఏది సాకారమైనా ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. త్వరగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
విజయవాడ బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) పేరుతో చేపట్టిన బైపాస్‌ కథ కంచికి చేరింది. బీఓటీ కింద నిర్మించాల్సిన దీన్ని గుత్త సంస్థ వదిలివేసింది. తాము చేయలేమని చేతులు ఎత్తివేయడంతో ఆసంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని జాతీయ రహదారుల సంస్థ రద్దు చేసుకుంది. దీని స్థానంలో ఈపీసీ టెండర్లను పిలవాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర ఉపరితల, రవాణా మంత్రిత్వ శాఖ నుంచి పరిపాలన అనుమతి రావాల్సి ఉంది. ప్రస్తుతం బీవోటీ కింద సంస్థలు ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం నిధులతో ఈపీసీ కింద నిర్మించాల్సి ఉంది. ఇది సాధ్యం కాదన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. గామన్‌ ఇండియా 2012లోనే బీఓటీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. కాజా టోల్‌గేట్‌ నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు విస్తరణ పనులు చేపట్టాలనేది ప్రాజెక్టు లక్ష్యం. మొత్తం నిర్మాణ వ్యయం రూ.1680 కోట్లు. విజయవాడ బాహ్య వలయ రహదారిగా గొల్లపూడి నుంచి పెద్ద ఆవుటపల్లి వరకు నిర్ణయించారు. దీని దూరం 18 కిలోమీటర్లు. గొల్లపూడి, నున్న మీదుగా పెద్దఆవుటపల్లి వద్ద జాతీయ రహదారి కలుస్తుంది. గుంటూరు జిల్లా కాజా జంక్షన్‌ నుంచి తాడేపల్లి, వెంకటపాలెం మీదుగా గొల్లపూడికి వస్తుంది. మధ్యలో 3.2 కిలోమీటర్ల కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. కాజా నుంచి గుండుగొలను వరకు మొత్తం 103 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించాలి. వేలేరు నుంచి బొమ్మలూరు వరకు 6.72 కిలోమీటర్ల బైపాస్‌ నిర్మించాలి. విజయవాడ బాహ్యవలయ రహదారి వద్ద ఒక టోల్‌ ప్లాజా ఏర్పాటు చేయాలనేది ఆలోచన. మొత్తం ప్రాజెక్టుకు 1100 ఎకరాల భూసేకరణ అవసరంగా గుర్తించారు. పనులు చేయకపోవడంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు జులైలో కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈపీసీ కింద అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఒక అంతర్‌వలయ రహదారి, ఒక బాహ్యవలయ రహదారి నిర్మాణం చేయనున్నారు. ఇది పూర్తయితే విజయవాడ బైపాస్‌లో పెద్ద అవసరం ఉండదు. దీన్ని నిర్మాణం చేసే ఆలోచన ఉండదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బైపాస్‌ రహదారి నిర్మాణం కంచికి చేరినట్లేనని భావిస్తున్నారు.

సుదీర్ఘ వంతెనల సంగతేంటి? 
విజయవాడ ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రెందు సుదీర్ఘ పైవంతెనలు నిర్మించాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం కనకదుర్గ పైవంతెన, బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణంలో ఉన్నాయి. బెంజి సర్కిల్‌ పైవంతెన రామవరప్పాడు వరకు పొడింగించాలని గతం నుంచి ప్రతిపాదన  ఉంది. దీనికి కేంద్రం తిరస్కరించింది. ఎట్టకేలకు రమేష్‌ అసుపత్రి వరకు పొడింగించారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు.

* బందరు రహదారిలోనూ, ఏలూరు రహదారిలోనూ రెండు పైవంతెనలను నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. ఇటీవల కాలంలో ఈ ప్రతిపాదనలు మొగ్గతొడిగాయి. రహదారి విస్తరణ చేయడం కంటే.. పైవంతెనలే ఖర్చు తక్కువగా భావించడంతో ఈనిర్ణయానికి వస్తున్నారు.

* ఏలూరు రోడ్డులో నిడమానూరు నుంచి బెంజి సర్కిల్‌ వరకు ఉండాలని భావిస్తున్నారు. దాదాపు 6కిలోమీటర్లు ప్రతిపాదించారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న పైవంతెనను అదేవిధంగా నిడమానూరు వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. దీనికి సుమారు రూ.600 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈనిధులు కేంద్రం నుంచి రాబట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి భూసేకరణ లేకుండా నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా పైవంతెనలను నిర్మాణం చేయవచ్చని భావిస్తున్నారు. రహదారి విస్తరణ చేపట్టితే దాదాపు రూ.1200 కోట్లు వరకు కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. .

* మరో పైవంతెన బెంజి సర్కిల్‌ నుంచి కానూరు వరకు (తాడిగడప 100 అడుగుల రోడ్డు) నిర్మించాలనేది ప్రతిపాదన. ప్రస్తుతం బందరు రోడ్డు విస్తరణ చేస్తున్నారు. దీంతో నగరం పరిధిలో కానూరు వరకు పైవంతెన నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. దీనికి దాదాపు 4 కిలోమీటర్లకుగాను రూ.400 కోట్లు అంచనా వేస్తున్నారు.

* ఈ రెండు పైవంతెనలను జాతీయ రహదారులపై నిర్మాణం చేయనున్నారు. కాబట్టి తప్పనిసరిగా కేంద్రం అనుమతి కావాల్సి ఉంది.

ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం..! 
బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో రెండు పైవంతెనలను నిర్మించాలని ప్రతిపాదనలు సమర్పించాం. విజయవాడ బైపాస్‌ రహదారిపై ఇంకా స్పష్టత లేదు. నగరంలో రహదారి ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్‌ నియంత్రణకు పైవంతెనల  ప్రాధాన్యం ఉందని గుర్తించాం.

- బి.లక్ష్మీకాంతం, కలెక్టర్‌

Link to comment
Share on other sites

బెజవాడకు టోక్యో మోడల్‌
22-02-2018 11:57:44

రహదారులు ఇరుకు.. అయినా ట్రాఫిక్‌ ఫ్రీ
రోడ్లపై నో పార్కింగ్‌
ప్రమాదాలు నిల్‌
ట్రాఫిక్‌ నియంత్రణకు అత్యాధునిక వ్యవస్థ
చెత్త సేకరణలోనూ ఆదర్శం
జైకా నిధుల సాధనపై జపాన్‌ మంత్రులతో చర్చలు
జపాన్‌ పర్యటనపై ఆంధ్రజ్యోతితో నగర కమిషనర్‌ నివాస్‌
అక్కడ ట్రాఫిక్‌ స్తంభించదు. ప్రమాదమన్న మాటే వినిపించదు. అలా అని అది సువిశాలమైన రహదారుల నగరమేమీ కాదు.. జపాన్‌ రాజధాని టోక్యో.. ప్రపంచంలోనే అత్యంత జన సాంద్రత కలిగిన ఈ రాజధాని నగరంలో రహదారులపై ఎక్కడా పార్కింగ్‌ కనిపించదు. అక్కడ సెట్‌ బ్యాక్‌ కూడా లేదు. అగ్నిప్రమాద నివారణకు తగిన యంత్రసామగ్రి, పార్కింగ్‌కు తగిన స్థలం ఉంటేనే భవననిర్మాణానికి అనుమతి ఇస్తారు.’ విజయవాడ నగర కమిషనర్‌ జె.నివాస్‌, పలువురు ఉన్నతాధికారులు ఇటీవలే జపాన్‌లో పర్యటించి వచ్చారు. టోక్యో విధానాలను విజయవాడ నగరంలో అమలు చేయాలన్నది ఈ బృందం ఉద్దేశం. టోక్యో ప్రత్యేకతలను నివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆ విశేషాలు...
 
విజయవాడ: ట్రాఫిక్‌ నియంత్రణ, చెత్త సేకరణ ఈ రెండింటిలో జపాన్‌ రాజధాని టోక్యో నగరం ఆదర్శంగా నిలుస్తుంది. ఆ నగరంలో అనుసరిస్తున్న విధానాలను విజయవాడ నగరంలో అమలు చేయాలన్నది నివాస్‌ బృందం జపాన్‌ పర్యటన ప్రధాన ఉద్దేశం. జపాన్‌ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, మౌలిక వసతులు, రవాణా, పర్యాటక శాఖ మంత్రితో నివాస్‌, ఇతర ఉన్నతా ధికారుల బృందం భేటీ అయింది. విజయవాడ నగరాభివృద్ధికి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ(జైకా) నుంచి నిధులను రాబట్టడంపై ఈ బృందం వారితో చర్చించింది.
 
టోక్యో నగరంలోని ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థను, చెత్త సేకరణ విధానాన్ని సమగ్రంగా ఈ బృందం సభ్యులు అధ్యయనం చేశారు. అక్కడ అమలవుతున్న విధానాల స్ఫూర్తితో విజయవాడ నగర వాసులకు మెరుగైన ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థను అందించడంతోపాటు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను అమలు చేసేందుకు నివాస్‌ సిద్ధమవుతున్నారు. టోక్యో నగరంలో అమల వుతున్న ఇంటిలిజెంట్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను నగరంలో అమలు చేయాలన్నది తమ పర్యటన ప్రధాన ఉద్దేశమని నివాస్‌ తెలిపారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లోనూ త్వరలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని ఆయన చెప్పారు. టోక్యో నగర పర్యటనకు సంబంధించిన విశేషాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇవీ..
 
నలుగురితో ట్రాఫిక్‌ నియంత్రణ
విజయవాడ నగర ట్రాఫిక్‌ నియంత్రకు సుమారు 7వేల మంది సిబ్బంది పనిచేస్తుం టారు. నగర జనాభా 11 లక్షలకు మించదు. కానీ 1.3 కోట్ల జనాభా ఉన్న టోక్యో నగర ట్రాఫిక్‌ను నలుగురు వ్యక్తులతో సాఫీగా నియంత్రిస్తుండటం గమనార్హం. ట్రాఫిక్‌ నియంత్రణకు సీసీ కెమెరాలతో పాటు ఇన్‌ఫ్రారెడ్‌, అలా్ట్రసోనిక్‌ సెన్సర్లు వినియో గిస్తారు. ఏదైనా కూడలిలో వాహనాలు నిలిచిపోయినా, వాహన వేగం గంటకు 10 కిలోమీటర్ల కన్నా తగ్గినా వెంటనే సెన్సర్ల ద్వారా ఆ సమాచారం ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరిపోతుంది. వెంటనే సిగ్నల్‌ టైం వాహనాల రద్దీని నియంత్రించడానికి అనుగుణంగా మారి పోతుంది.
 
ఉదాహరణకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే గ్రీన్‌ సిగ్నల్‌ టైం పెరుగుతుంది. వాహనాల రద్దీ యథాస్థితికి రాగానే గ్రీన్‌సిగ్నల్‌ టైం తిరిగి సాధారణంగా పనిచేస్తుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రధానంగా ఇన్ఫర్మేషన్‌ డెస్క్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌ కంట్రోల్‌ డెస్క్‌, కమాండర్స్‌ కంట్రోల్‌ డెస్క్‌, కంట్రోల్‌ ఆపరేటర్స్‌ డెస్క్‌ ఉంటాయి. వీటి వద్ద షిఫ్టులు వారీగా నలుగురు వ్యక్తులు పనిచేస్తుంటారు.
 
పౌర రవాణా వ్యవస్థకు పెద్దపీట
టోక్యో నగరంలో పౌర రవాణా వ్యవస్థకు పెద్దపీట వేశారు. ఈ నగరంలో ఉన్న అర్బన్‌ రైల్వే నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుంది. బుల్లెట్‌ ట్రైన్ల వినియోగం కూడా ఎక్కువ. ప్రస్తుతం గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానానికి చేరుకునే బుల్లెట్‌ ట్రైన్లు టోక్యోలో అందుబాటులో ఉన్నాయి. 2027 నాటికి గంటకు 581 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బుల్లెట్‌ ట్రైన్‌ను అందు బాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తు న్నారు. సొంత వాహనాల వినియోగం చాలా తక్కువ. టోక్యో నగరంలో ఏ ప్రాంతానికి అయినా శరవేగంగా చేరుకునేందుకు ఎక్‌ ప్రెస్‌ వేలు నిర్మించుకున్నారు.
 
అన్నింటికంటే ఆశ్యర్యకరమైన అంశం మరొకటి ఉంది. అత్యంత వేగంగా పరుగులు తీసే బుల్లెట్‌ రైళ్లకన్నా వేగంగా అక్కడి పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. సుమారు ఏడు నిమిషాల పాటు ఒక స్టేషన్లో రైలు ఆగితే కేవలం మూడే నిమిషాల్లో అక్కడి పారిశుధ్య సిబ్బంది బోగీని అత్యంత శుభ్రంగా తయారుచేస్తారు. ఆ మూడు నిమిషాల్లో పనిచేసేది కేవలం మూడు నుంచి నలుగురు సిబ్బంది మాత్రమే. బుల్లెట్‌ ట్రెయిన్లో ప్రయాణించిన ఏపీ ఉన్నతాధికారుల బృందం దాదాపు గంట 41 నిమిషాల పాటు రైల్లో ప్రయాణం చేసింది. గంటకు రూ.2400ల ఖరీదు (ఇండియా రూపాయితో పోల్చితే) చేసే ఆ ప్రయాణం అక్కడి సామాన్యులకు కూడా అందుబాటు ధరలో ఉంది.
 
టోక్యో నగరంలోని అతిపెద్ద పారిశ్రామికవాడలైన కవసాకి, కిసారుజు నడుమ 20 ఏళ్ల క్రితం ఎక్స్‌ప్రేను నిర్మించారు. మొత్తం 23.7 కిలోమీటర్ల పొడవుండే ఈ మార్గంలో 9.6 కిలోమీటర్లు సముద్రగర్భంలో నిర్మించిన టన్నెల్‌ ద్వారా సాగుతుంది. టోక్యో నగర అధికారులు పర్యాటకానికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నగర అందాలను వీక్షించేందుకు 634 మీటర్ల ఎత్తైన స్కైట్రీ టవర్‌ను నిర్మించుకున్నారు. ఇక్కడి నుంచి చూస్తే టోక్యో నగరం మొత్తం కనువిందు చేస్తుంది. భూకంపాలను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మించారు.
 
సెట్‌ బ్యాక్‌లతో సంబంధం లేదు
అక్కడ భవనాల మధ్య సెట్‌ బ్యాక్‌ల వదలాలన్న సమస్య లేదు. ప్రతీ ఇల్లు పక్కింటికీ ఆనుకుని ఉన్నా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రధాన చర్యలన్నీ భద్రతకు వాహన పార్కింగ్‌పై మాత్రమే తీసు కుంటారు. టోక్యోలో అమలవుతున్న చెత్త సేకరణ విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తడి, పొడి, ప్లాస్టిక్‌ చెత్తను ఇంటి యజమానులే వేరు చేసి పెడుతుంటారు. వారంలో నాలుగు రోజులు చెత్త సేకరణకు అక్కడి సిబ్బంది పనిచేస్తారు. అందులోనూ ప్రతీ రోజుకు ఒక రకం చెత్తను మాత్రమే సేకరిస్తుంటారు. ఒకరోజు తడి చెత్తను, మరో రోజు పొడి చెత్తను, ఇంకో రోజు కేవలం ప్లాస్టిక్‌ వ్యర్థాలను మాత్రమే తీసుకెళ్తుంటారు.
 
రోడ్డుకిరువైపులా మ్యాన్‌హోల్స్‌
టోక్యో నగరం మొత్తం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. దీని నిర్వహణ కోసం రోడ్డుకు ఇరువైపులా మ్యాన్‌హోల్స్‌ ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయడం ద్వారా వర్షాకాలంలో రహదారులపై పడే నీరు శరవేగంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైన్‌లోకి చేరిపోతుంది. అక్కడి ప్రధాన ర హదారులు కూడా మన ఎంజీ రోడ్డు కంటే చిన్నవిగానే ఉన్నాయి. తక్కువ విస్తీర్ణం ఉన్న అక్కడి రహదారులు విజయవాడలోని యూజీడీ వ్యవస్థకు భిన్నంగా నిర్మింపజేశారు. రోడ్డుకు ఇరు వైపులా మ్యాన్‌హోల్స్‌ను నిర్మింపజేసుకున్న పనితీరు నిర్వహణ విషయంలో జపాన్‌ ప్రజలకు, యంత్రాంగానికి సులభంగా ఉంటుంది. దీనివల్ల మ్యాన్‌హోల్స్‌ మరమ్మతులు చేయాల్సిన సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు గానీ.. రోడ్ల తవ్వకాలు తదితర ఇబ్బందులు తలెత్తకుండా అక్కడి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది.
కాలంతో పరుగులు
జపాన్‌వాసులు సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రతీ పనిని టైంతో కాలిక్యులేట్‌ చేస్తుంటారు. వాణిజ్య సముదాయాల్లో, కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లపై సైతం పరుగులు పెడుతూ కనిపిస్తుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఎస్కలేటర్లపై ఎలాంటి హడావిడి లేకుండా వెళ్లాలనుకునేవారు ఎడమ వైపు నిలుచోవడం కనిపిస్తుంది. ఎస్కలేటర్లపై సైతం పరుగులు పెడుతూ గమ్యానికి చేరుకోవాలనుకునే వారి కోసం కుడి వైపు ఖాళీగా ఉంచుతారు.
పాదచారుల కోసమే సగం రహదారి
టోక్యోలోని ఏ ప్రధాన రహదారిని చూసినా ఇరువైపులా పాదచారుల కోసం కేటాయించిన సువిశాలమైన బాటలే కనిపిస్తాయి. మన వద్ద పాదచారుల కోసం కేటాయించిన బాటలు గరిష్ఠంగా ఒకటిన్నర మీటర్లు ఉంటాయి. టోక్యో నగరంలో కనీసం 3 నుంచి 4 మీటర్ల వెడల్పైన బాటలు ఏర్పాటు చేస్తారు. ఇది మొత్తం రోడ్డు వెడల్పులో సగం ఉంటుంది. పాదచారుల బాటలను ఆక్రమించడం, వాటి చెంత వాహనాలను పార్కింగ్‌ చేయడం నిషేధం.
భారతీయ వంటకాలకు యమ క్రేజ్‌
టోక్యోలో ఐదు వేల భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. అన్ని రెస్టారెంట్లను చూసి ఇక్కడ భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. సుమారు 20 వేల మంది భారతీయులు మాత్రమే ఈ నగరంలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ భారతీయ రెస్టారెంట్లు అధిక సంఖ్యలో ఉండటానికి కారణం వీరు భారతీయ వంటకాలను అత్యంత ఇష్టంగా స్వీకరించడమే.
 
 

Link to comment
Share on other sites

సుందరంగా.. సప్త ద్వీపాలు
28-02-2018 07:45:26
 
636554007251976845.jpg
కృష్ణానదిలో సహజసిద్ధంగా ఏర్పడిన దీవులను పర్యాటక స్వర్గధామాలుగా తీర్చిదిద్దటానికి మాస్టర్‌ప్లాన్‌ రెడీ అయింది. అమరావతి రాజధాని చెంతనే ప్రవహించే కృష్ణానదిలో ఇటు విజయవాడ, అటు అమరావతికి పర్యాటక శోభను తీసుకువచ్చేలా ఈ దీవులను అద్భుత ద్వీపాలుగా అభివృద్ధి చేయటానికి ‘స్టూడియో పాడ్‌’ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. భవానీద్వీపంతో పాటు నదిలో సహజసిద్ధంగా ఉన్న మరో ఆరు దీవులు కలిపి మొత్తంగా ఏడు దీవులను అద్భుత ద్వీపాలుగా తీర్చిదిద్దే ప్రణాళికలు పర్యాటకశాఖ అధికారుల చేతికి వచ్చాయి. ఇక ఆచరణ రూపం దాల్చటమే తరువాయి!
 
 
  • భవానీ ఐల్యాండ్‌తో సహా ఏడు దీవుల అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌
  • పర్యాటక శాఖకు అందజేసిన ‘స్టూడియో పాడ్‌ ’
  • ఒక్కో దీవికి.. ఒక్కో ప్రత్యేకత
  • ఏడు దీవులకు ప్రత్యేకంగా అభివృద్ధి ప్రణాళికలు
 
విజయవాడ: కృష్ణానదిలో మొత్తం ఏడు సహజ ద్వీపాలు ఉన్నాయి. వీటిలో భవానీ ఐల్యాండ్‌ ఒక్కటే చాలా మందికి తెలుసు. పర్యాటక ఆదరణ లేకుండా పిచ్చిచెట్లతో నిరుపయోగంగా ఉంటున్న అనేక దీవులు ఉన్నాయి. చెంతనే అమరావతి రాజధాని ఏర్పాటు కావడంతో ప్రభుత్వం కూడా దీవులను పర్యాటకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించటంతో వీటికి మహర్దశ పట్టుకుంది. కృష్ణానదిలో ఇటు విజయవాడకు, అటు అమరావతిని పర్యాటకంగా అనుసంధానం చేసే ఈ ఏడు దీవులను అభివృద్ధి చేయటానికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు పిలిచారు. అమెరికన్‌ కొలాబరేషన్‌తో పనిచేసే స్టూడియో పాడ్‌ అనే సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ టెండర్లను దక్కించుకుంది. కొంతకాలంగా దీవులను అధ్యయనం చేసి అద్భుత మాస్టర్‌ప్లాన్‌ను అందచేసింది. ఈ మాస్టర్‌ ప్లాన్‌ను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు దీవుల ప్రణాళికలు ఇలా ఉన్నాయి...
 
   మొదటగా భవానీ ద్వీపాన్ని ఎకో టూరిజం, రిసార్ట్స్‌, వెట్‌ల్యాండ్‌, పార్కులు, ఫారెస్ట్‌ ట్రయల్స్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ఇచ్చారు. రెండవ దీవిని ఎకోపార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ దీవిలో అటవీ వాతావరణం కనిపించేలా అభివృద్ధి చేపట్టాల్సి ఉంది. ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తారు. మూడవ దీవిని సివిక్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తారు. ఈ దీవిలో కళలు, సాంస్కృతిక శోభ కనిపించేలా అభివృద్ధి ప్రణాళికలు జరుగుతాయి. నాల్గవ దీవిని పూర్తి కల్చరల్‌ ఐలాండ్‌గా అభివృద్ధి చేస్తారు. దీవులన్నింటికీ సెంట్రల్‌ యాక్సిస్‌ యాంకర్‌గా ఉండేలా దీనిని తీర్చిదిద్దుతారు. ఐదవ దీవిలో ఎంటర్‌టైన్‌మెంట్‌, థీమ్‌ పార్కులు, హోటల్స్‌ - రిసార్ట్స్‌ వంటివి అభివృద్ధి చేస్తారు. ఆరవ ద్వీపాన్ని పూర్తిగా హెరిటేజ్‌ ఐల్యాండ్‌గా తీర్చిదిద్దుతారు. ఏడవ ద్వీపాన్ని ఫారెస్ట్‌ పార్క్‌గా అభివృద్ధి చేస్తారు. ఫారెస్ట్‌ ట్రయల్స్‌, ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌ వంటివి నిర్వహించటానికి వీలుగా అభివృద్ధి చేస్తారు.
 
ప్రపంచంలోనే అతి పెద్ద విస్తీర్ణంలో దీవుల సమాహారం
కృష్ణానదిలోని ఏడు దీవుల అభివృద్ధితో ప్రపంచంలోని అత్యద్భుత పర్యాటక ధామాలన్నీ చిన్నబోనున్నాయి. ఉదాహరణకు న్యూయార్క్‌ నగరంలోని సెంట్రల్‌ పార్క్‌ ఏరియా 3.38 చద రపు కిలోమీటర్లు. ఏటా 140 మిలియన్‌ పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. సింగపూర్‌లోని సెంతోసా 5.50 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మొత్తం 19.1 మిలియన్ల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌ నగరంలో డీజర్‌ గార్డెన్స్‌ 3.1 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 10 మిలియన్ల పర్యాటకులు వస్తుంటారు. చైనాలోని జిన్హువాలో వ్యాంఘయ్‌ పార్క్‌ విస్తీర్ణం 0.265 చ.కిలోమీటర్లుగా ఉంది. ఏటా ఇక్కడికి 14.6 మిలియన్ల పర్యాటకులు వస్తుంటారు. అదే రాజధాని ప్రాంతంలోని దీవులన్నీ కలిపితే 20.44 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. ప్రపంచంలోని పర్యాటక ధామాలన్నింటికీ మన ద్వీపాలే అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిని దశల వారీగా అభివృద్ధి చేస్తే.. పై వాటిని తలదన్నేలా పర్యాటకులను ఆకర్షించవచ్చు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...