Jump to content

Recommended Posts

Posted
అటవీభూముల డీనోటిఫికేషన్‌ ఫైలుకు మోక్షం
 
636036454958526215.jpg
 కేంద్ర అధికారుల ఆమోదంతోనే డీనోటిఫికేషన్
ఆంధ్రజ్యోతి, అమరావతి :  నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో సహా.. అమరావతిని అంతర్జాతీయ సౌకర్యాలతో తగిన విధంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ భూముల డీనోటిఫికేషన్‌ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ల నివేదికే కీలకంగా మారనుంది. నిజానికి ఆయా జిల్లాల్లోని అటవీ భూముల వ్యవహారాలపై అందాల్సిన నివేదికలను, సమాచారాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ జిల్లా కలెక్టర్ల ద్వారానే తీసుకుంటుంది. కావున ప్రస్తుతం రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సీఆర్డీఏ చట్టం-2014 రాష్ట్రం వరకే పరిమితం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా గుంటూరు, కృష్ణాజిల్లాల పరిధిలోని 50 వేలఎకరాల అటవీ భూములను డీనోటి ఫై చేసి రాజధానిలో అవసరమైన అభివృద్ధి చేపట్టడానికి తలచిన అంశం విదితమే. కానీ సీఆర్డీఏ పరిధిలో డీనోటిఫై చేయదలచిన 50వేల ఎకరాల లక్ష్యం పలు కారణాల కారణంగా కొంత మేర తగ్గినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో నిర్వహించే కార్యకలాపాలపై కేంద్ర పరిధిలో ఉన్న, అనుమతులు పొందాల్సిన ప్రతి అంశంలోనూ కలెక్టర్ల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణ విషయంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అటవీ భూముల డీనోటిఫికేషన్‌ ప్రక్రియలో కలెక్టర్లు నివేదికను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. నివేదిక రూపకల్పనలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డీనోటిఫికేషన్‌ చేయదలచిన భూములనే ఎందుకు ఎంచుకున్నారు.. అందుకు తగిన కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా డీనోటిఫికేషన్‌కు ఎంచుకున్న అటవీ భూముల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణ విషయంలో చెబుతున్న అభివృద్ధి సాధ్యమవుతుందా అనే ప్రశ్నకు సరిపడే జావాబు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తాము డీనోటిఫికేషన్‌ విషయమై ప్రతిపాదిస్తున్న అటవీ భూములతో పాటు మిగిలిన రెండు ప్రాంతాల్లోని భూములను కూడా పరిశీలించామని కానీ మూడింటిలో ప్రస్తుత ప్రతిపాదిత అటవీ భూములే అత్యుత్తమైనవనే విషయాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఇత్యాది విషయాల్లో నివేదికలతో సహా అవసరమైన సమాచార స్వీకరణ కోసం అధికారికంగా ఆయా జిల్లా కలెక్టర్లే కీలకం కానున్నారు. సమన్వ యంతోనే అనుమతులు..అటవీ భూముల డీనోటిఫికేషన్‌ ప్రక్రియ నుంచి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కేంద్రాన్ని సంతృప్తి పరిచే సమాధానం ఇవ్వాలంటే ఆయా అటవీ భూముల విషయమై సీఆర్డీఏతో పాటు రెండు జిల్లాల ఉన్నతాధికార యంత్రాంగం మరింత పటిష్టమైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ విడుదల చేసిన మాస్టర్‌ ప్లాన్‌లో డీనోటిఫైకి ఉద్దేశించిన అటవీ భూముల అభివృద్ధిని ఎలా ప్రతిపాదించారు, ఎన్నేళ్లలోపు ప్లాన్‌లో పేర్కొన్న అభివృద్ధి సాగనుందనే విషయాలపై సీఆర్డీఏ అధికారాల ద్వారా పూర్తి స్థాయి స్పష్టతతో ఉండాలి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికనుగుణంగా సీఆర్డీలోని అటవీ విభాగపు అధికారులు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళితే కేంద్రం నుంచి వచ్చే ప్రశ్నలకు వీలైనంత తక్కువ సమయంలో సమాధానలు ఇవ్వొచ్చు. సీఆర్డీఏ పరిధిలోని అటవీ భూముల డీనోటిఫికేషన అంశంపై ఇక్కడి అధికారులు కేంద్రం ముందుకు వెళుతుండం ఇది మూడోసారి.. కావున డీనోటిఫికేషనకు చెందిన అన్ని అంశాలను సంపూర్ణంగా వివరించేలా సన్నద్ధమవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని వల్ల నిర్దేశిత లక్ష్యంలోపు రాజధాని నిర్మాణ అవసరాల్లో ముఖ్యంగా భావిస్తున్న అటవీ భూముల డీనోటిఫికేషన్‌ పక్రియను పూర్తి చేయవచ్
  • 2 weeks later...
Posted

idi AP adhikarula paristhithi

Andulo nijam entha undo.. who knows bro??

CRDA clearly stated.. that we use those lands for Capital development and Industrial development.. Inka em kavali anta.. acre to acre investments release cheyala enti :atwitsend:

hmm.. concrete gaa cheppaledemo.. but I am not sure.

TG ayyi vunte ee paatiki voopukuntu Niti Ayog kudaa recommend chesedi (asalu Niti ayog ki role vunna lekapoyinaa :))

Posted

idi AP adhikarula paristhithi

no bro,  crda commissioner ippati ki naku telisi e pani pani meda 10 times delhi velladu, ippude akkda emi vasthundi survey number la vari ga ani cheppa mante,  ela chebutaru.

  • 2 weeks later...
Posted

Brother, could please change the title to "denotification" or some thing like that? I keep getting sucked in to this thread because of "denotified" :peepwall:

ok bro.

Posted

Brother, could please change the title to "denotification" or some thing like that? I keep getting sucked in to this thread because of "denotified" :peepwall:

haha andaru ade anukuntaru

Posted

Vellu e permissions ivvaru chavaru ivi addam pettukune 2 years nunchi games aduthunnaru thupuk gallu

indulo mana tappu kuda vundi. minimum background work cheyyakunda proposals pamparu. antha forest land ela "restore" chestaro detailed report lekunda pamparu. chance dorikindi kada ani pushpigallu anta land ela "use" cheyyalanukuntunnaro kuda cheppalani process ni prolong chestunnaru.

Posted

asalu vunnadhe konchem land with trees anavasaram ee denotification. you cant build a city with huge land unless habituated

denotify cheyyaka poina, forest land won't be there 20 years from now. huge swaths of forest land is already grabbed in the name of weaker section farming around nuzivedu  (when land prices were lot lower). imagine the demand/fight from big heads from now on for those lands. better make sincere effort to grow greenery some where else.

Posted

denotify cheyyaka poina, forest land won't be there 20 years from now. huge swaths of forest land is already grabbed in the name weaker section farming around nuzivedu  (when land prices were lot lower). imagine the demand/fight from big heads from now on for those lands. better make sincere effort to grow greenery some other place.

Posted
అమరావతి, పోలవరం అనుమతులపై ఢిల్లీలో కలుద్దాం: జవడేకర్‌
 
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణానికి కీలకమైన పర్యావరణ-అటవీ అనుమతులపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుమతుల అంశంపై 20వ తేదీ తర్వాత ఢిల్లీలో కలుద్దామని టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్‌, కేశినేని నానికి కేంద్రమంత్రి జవడేకర్‌ సూచించారు. పుష్కర స్నానం కోసం విజయవాడ వచ్చిన ఆయన సీఎం చంద్రబాబు, ఇతర ఎంపీలతో భేటీ అయ్యారు. ఇటీవలి వరకు కేంద్ర పర్యావరణ-అటవీ శాఖ మంత్రిగా జవడేకర్‌ పనిచేసిన విషయం తెలిసిందే! రాజధానికి సంబంధించి అటవీ భూమిని డీనోటిఫై చేసే ప్రక్రియలో పీటముడి పడిన నేపథ్యంలో.. జవడేకర్‌తో భేటీలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. పోలవరం నిర్మాణానికి అవసరమైన అనుమతులపైనా దృష్టి సారించాలని సీఎం కోరారు. ఈ విషయమై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రితో మాట్లాడతానని జవడేకర్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుత ఆ శాఖల మంత్రి, మరో కేంద్రమంత్రి వెంకయ్యను భేటీకోసం ఆహ్వానిస్తానన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు హాజరు కావాలని సూచించారు. కాగా, గన్నవరం విమానాశ్రయం నుంచి జవడేకర్‌ను హెలికాప్టర్‌లో నగరానికి తీసుకొచ్చి వీవీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం అనంతరం సీఎంవోకి తీసుకొచ్చారు. జవడేకర్‌ను సీఎం సత్కరించారు.
  • 2 weeks later...
Posted

డీనోటిఫై’ ఎప్పటికి అయ్యేనో!

  • అటవీ భూముల బదలాయింపుపై కేంద్రం కొర్రీలు
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణానికి అవసరమైన అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టే మెలిక ఏపీ సర్కార్‌కు చెమటలు పట్టిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా.. అటవీ భూముల వ్యవహారంపై అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్రం ముచ్చటగా మూడో సారి ఫైలును వెనక్కి పంపినట్లు సమాచారం. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో నిర్మాణం కానున్న ఏపీ రాజధానికి 33 వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. ఆ భూమితో పాటు అక్కడి చుట్టుపక్కల ఉన్న 13,253 హెక్టార్ల అటవీ భూమిని కూడా రాజధాని కోసం డీనోటిఫై చేయాలని సీఆర్‌డీఏ అధికారులు కేంద్రానికి పలుమార్లు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అటవీ భూ వినియోగ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందని, కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని అటవీ సలహా కమిటీ(ఎఫ్‌ఏసీ) పేర్కొంటోంది. కేంద్ర కమిటీ కోరిన విధంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అనేక సవరణలతో పాటు వివరణాత్మకంగా 3 సార్లు ఫైలును పంపింది. అయితే, ప్రతిసారీ మరింత సమాచారంతో తిరిగి ఫైలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తిప్పిపంపుతోంది. కేంద్రం తీరుతో విసిగిపోయిన రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటేనే కేంద్రం డీనోటిఫైకి అనుమతి ఇస్తుందని అని అటవీ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Pushpams gaaa :kick:

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...