Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
 
పర్యాటక ఆదాయం ఘనం
14-08-2018 06:33:37
 
636698252181193311.jpg
  • ఏపీటీడీసీ.. పంట పండింది..
  • 10 - 15 శాతం పెరిగిన ఆదాయం
  • భవానీ ద్వీపానికి రూ. 94 లక్షల ఆదాయం
  • హరిత బెర్మ్‌పార్క్‌కు రూ. 1.05 కోట్లు
  • సూర్యలంకకు రూ.98 లక్షలు..
 
విజయవాడ: పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడ డివిజన్‌ పంట పండింది. నూతన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గణనీయంగా వృద్ధి చెందింది. డివిజన్‌ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యాటక కాటేజీలు, బోటింగ్‌ యూనిట్ల ద్వారా ఈ ఏడాది ఆరంభంలోనే మంచి ఫలితాలు సాధించింది. సాధారణంగా తొలి త్రైమాసికం అన్‌ సీజన్‌ అయినప్పటికీ కిందటేడాదితో పోల్చుకుంటే 10 శాతం అదనంగా వృద్ధి చెందటం గమనార్హం. భవానీ ద్వీపం అదనంగా 10 శాతం వృద్ధితో రూ. 94 లక్షల ఆదాయాన్ని సాధించింది. కిందటేడాది ఇదే కాలానికి రూ.84 లక్షల ఆదాయంతో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రూ.94 లక్షల ఆదాయాన్ని సాధించింది. హరిత బెర్మ్‌ పార్కు కిందటేడాది ఏప్రిల్‌ - జూలై వరకు రూ.90 లక్షల ఆదాయం సాధించగా.. ఈ ఏడాది రూ.1.05 కోట్ల ఆదాయాన్ని సాధించటం గమనార్హం. సూర్యలంక బీచ్‌ ఈ ఏడాది రూ.98 లక్షల ఆదాయాన్ని సాధించింది.
 
ఈ మూడు ప్రాంతాలలో బోటింగ్‌ యూనిట్‌ ద్వారా 10 శాతం వృద్ధితో రూ.62.60 లక్షల ఆదాయాన్ని సాధించటం జరిగింది. డివిజన్‌ పరిధిలో కృష్ణాలో ప్రధానంగా విజయవాడలో భవానీ ఐల్యాండ్‌తో పాటు, హరిత బెర్మ్‌పార్క్‌ ఉంది. గుంటూరు జిల్లాలో అమరావతి, బాపట్లలో పర్యాటకాభివృద్ధి సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. విజయవాడలో చూస్తే.. ప్రధానంగా భవానీ ఐల్యాండ్‌లో జీ ప్లస్‌ 1 కాటేజీలు, ట్రీ టాప్‌ కాటేజీలు, ఏసీ రెస్టారెంట్స్‌ , అడ్వెంచర్‌ గేమ్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌ ద్వారా ఆదాయం సమకూరుతుంది. హరిత బెర్మ్‌పార్క్‌లో అయితే ఏసీ కాటేజీలు, ఏసీ రెస్టారెంట్‌, ఏసీ బార్‌ , కాన్ఫరెన్స్‌ హాల్‌ వంటివి ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌ నుంచి రెండింటిలోనూ కాటేజీలు, రెస్టారెంట్స్‌ ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లో అదనంగా బార్‌ కూడా ఉంది. బోటింగ్‌ యూనిట్‌ ప్రత్యేకంగా హరిత బెర్మ్‌పార్క్‌ నుంచి ఉంది. బోటింగ్‌ యూనిట్‌ నుంచి ప్రధానంగా బోధిసిరి డబుల్‌ డెక్కర్‌ క్రూయిజర్‌తో పాటు భవానీ, ఆమరపాలి , కృష్ణవేణి మెకనైజ్డ్‌ బోటులతో పాటు స్పీడ్‌ బోట్లు, లగ్జరీ క్రూయిజ్‌ , పాంటూన్‌ బోట్లు, జెట్‌ స్కీయింగ్‌ ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగింది.
Link to comment
Share on other sites

పెట్టుబడులకు ఆంధ్ర స్వర్గధామం
15-08-2018 03:36:29
 
  • జపాన్‌ ఆసక్తి
అమరావతి (ఆంధ్రజ్యోతి): పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామంగా ఉందని, పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహణ సంచాలకులు హిమాన్షు శుక్లా అన్నారు. మంగళవారం నాడక్కిడ పర్యాటక శాఖ కార్యాలయంలో జపాన్‌కు చెందిన పారిశ్రామికవేత్తల బృందంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎపి పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఆయన వివరించారు. జపాన్‌ అతిథ్య రంగంలో అతిపెద్ద వ్యవస్థగా ఉన్న హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ (హెచ్‌ఎంఐ) ఎండి ర్యుకో హిరా, సీనియర్‌ డైరెక్టర్‌ పిఆర్‌ ఖేమ్‌చంద్‌, చీఫ్‌ ఆర్కిటెక్‌ అలెస్‌ జేమ్స్‌ మిల్లర్‌, డైరెక్టర్‌ యుజి.. ఎండిని కలిసిన వారిలో ఉన్నారు. హెచ్‌ఎంఐ గ్రూప్‌నకు జపాన్‌లో 100కు పైగా హోటళ్లు ఉండగా, ప్రస్తుతం ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపధ్యంలో శుక్లా ఇక్కడి అవకాశాలను వివరిస్తూ దేశీయంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలకు ఆహ్వానం పలికారు. ఎపిలో పర్యాటక రంగం ప్రధానంగా ఐదు హాబ్‌లుగా ఉండగా విశాఖఫట్నంలోని మధురవాడ భారీ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని శుక్లా వారికి వివరించారు. ఇప్పటికే తాము డిపిఆర్‌ పూర్తి చేసి ముఖ్యమంత్రి ఆమోదం కూడా పొంది ఉన్నామని శుక్లా వివరించారు. భారీ పెట్టుబడులకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణిస్తుందని, వారికి అనుమతులు నేరుగా అందచేస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నంలో కొలువు తీరనున్న ఐఎన్‌ఎస్‌ విరాట్‌ సైతం అద్భుతమైన పెట్టుబడి కేంద్రమన్నారు. రాజమండ్రిలోని పురాతన హ్యప్‌లాక్‌ బ్రిడ్జిను ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ భవానీ ద్వీపంలోని ఏడు ద్వీపాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆర్థికంగా ఉపయోగకరమైన ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్‌ఎంఐ జపాన్‌ ఎండి ర్యుకో హిరా అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...