Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
నేడు కాకినాడలో బీచ్‌ పార్కు ప్రారంభం
27-09-2018 03:45:11
 
636736170955592273.jpg
కాకినాడ సిటీ, సెప్టెంబరు 26: అధునాతన సదుపాయాలతో సుందరంగా తీర్చిదిద్దిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఎన్టీఆర్‌ బీచ్‌ పార్కును బుధవారం ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్వదేశ్‌ దర్శన్‌ పథకంలో బీచ్‌ను అభివృద్ధి చేశారు. సుమారు రూ.46 కోట్లతో 50 ఎకరాల్లో బీచ్‌ పార్కును అందంగా తీర్చిదిద్దారు. లేజర్‌ షో ప్రత్యేకత సంతరించుకోనుంది. సింగపూర్‌, మలేసియా తరహాలో ఫౌంటైన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

రండి.. రండి.. దయచేయండి
జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలెన్నో
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
eag-sty1a.jpg
గోదావరి సోయగాలు, కేరళను తలపించేలా కోనసీమ అందాలు, జాలువారే జలపాతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.. ఇలా ప్రకృతి అందాలకు నిలయం మన జిల్లా. ఇప్పటికే వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర పర్యాటక శాఖ చేపడుతోంది. వాటన్నింటినీ త్వరతిగతిన పూర్తిచేసి, సందర్శకులను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను అవలంబిస్తే తూర్పుతీరం పర్యాటక స్వర్గధామంగా మారుతుంది. ‘నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా జిల్లాలోని వివిధ సందర్శాత్మక ప్రాంతాలపై న్యూస్‌టుడే బృందం కథనం.

పచ్చదనానికి ముచ్చటైన చిరునామా
మామిడికుదురు, న్యూస్‌టుడే: కోనసీమ పేరు చెప్పగానే గోదావరి నదీ పాయలు, వాటిని ఆనుకుని ఉన్న పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు అందరి మనసుల్ని మైమరపిస్తాయి. వశిష్ఠ నదీ తీరంలోని ఎడమ గట్టును ఆనుకుని మలికిపురం మండ‌లం దిండిలో ఉన్న హరిత కోకోనట్‌ కంట్రీ రిసార్ట్స్‌కి వెళ్తే అక్కడి గృహ పడవల్లో విహరించి మరపురాని అందాలను మదిలో నిక్షిప్తం చేసుకోవచ్చు. పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలు,
ఆన్‌లైన్‌ ద్వారా వాటిని బుక్‌ చేసుకునే అవకాశాలున్నాయి. వైనతేయ నదీ తీరంలోని కుడి వైపు గట్టును ఆనుకుని పాశర్లపూడి, ఆదుర్రు గ్రామాల్లో రూ.77 కోట్ల వ్యయంతో పడవ విహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని ఇంకా ప్రారంభించకున్నా  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రకృతి ప్రేమికులు అనేకమంది వైనతేయ వారధి చెంత జాలువారుతున్న అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆదుర్రు ఆది బౌద్ధ స్థూపం సమీపంలోని కట్టడం వద్ద పడవ నుంచి విహార కేంద్రంలోకి వచ్చేందుకు నిర్మించిన చక్కని చెక్కల వంతెన అందర్నీ ఆకట్టుకుంటోంది. అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర సన్నిధిలో ఆలయ పర్యాటకం భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటుంది. అప్పనపల్లి బాలబాలాజీస్వామి, అయినవిల్లి సిద్ధివినాయకుడు, కడలి కపోతేశ్వరస్వామి, మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరుడు, వాడపల్లి వేెంకటేశ్వరుడు, ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి, మందపల్లి మందేశ్వరస్వామి, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరస్వామి వారి ఆలయాల్లో ఆధ్యాత్మిక అందాలు వీక్షకుల మదిలో చక్కని సుగంధాల్ని వెదజల్లుతాయి.

పూర్తయితే.. రమణీయమే
అంతర్వేది క్షేత్రం వద్ద ఆలయ పర్యాటకంలో భాగంగా రూ.3.60 కోట్ల వ్యయంతో పర్యాటకుల కోసం నిర్మించిన భవనం రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఆలయానికి సమీపంలో సముద్ర తీరంలోనూ, సాగర సంగమ స్థలి వద్ద రూ.కోటితో పర్యాటక విడిది కేంద్రాలను నిర్మించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. పాశర్లపూడి, ఆదుర్రు వద్ద చేపట్టిన పడవ విహార కేంద్రాల పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంకా కార్యాచరణలోకి రాలేదు. అప్పనపల్లిలో బోటింగ్‌ కేంద్రం ఏర్పాటు, ఆదుర్రులోని చారిత్రక బౌద్ధ స్థూపం విశేషాలను వివరించే విధంగా నిర్మాణాలను పర్యాటక శాఖ చేపడితే సందర్శకులను చక్కగా ఆకట్టుకుంటాయి.

చారిత్రక నగరిలో...
రాజమహేంద్రవరం సాంస్కృతికం: అఖండ గోదావరిగా భాసిల్లుతున్న గోదావరి అందాలు నిత్యనూతనం. అంతటి ఖ్యాతి చెందిన ఈ నదీ తీరంలో వెలసిన రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన ప్రాంతాలు సందర్శనీయ స్థలాలుగా తీర్చిదిద్దాలని చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చడంలో ఆదిలోనే ఆగిపోయాయి. పుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యార్థం కోటిలింగాలఘాట్‌ను కిలోమీటర్‌కు పైగా అత్యంత సుందరంగా నిర్మించారు. పుష్కరాల 12 రోజుల తర్వాత ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారి ఘాట్‌ మాత్రం మిగిలింది. ఈట్‌ స్ట్రీట్‌ ఏర్పాటు చేసి సాయంత్రం సమయంలో ఇక్కడకు వచ్చేవారికి వినోదం అందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని అప్పట్లో పర్యాటకశాఖ ప్రతిపాదనలు చేసింది. తర్వాత వాటిని నగరపాలకసంస్థ కొనసాగిస్తుందని ప్రకటించినప్పటికీ ఇంతవరకు వీటికి సంబంధించి పనులు ప్రారంభం కాలేదు. వందేళ్లు దాటిన హేవలాక్‌ వంతెనపై రైలు మార్గం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిని కాలిబాటగా మార్చి పర్యాటకులు గోదావరిని తిలకించేందుకు వీలుగా చేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తయారయ్యే సంప్రదాయ వంటలు, చేతివృత్తుల వారి కళాకృతులతో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు కనువిందు చేస్తాయని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. సంఘసంస్కర్తల్లో ఒకరైన కందుకూరి వీరేశలింగం జన్మగృహం, గోదావరిగట్టున ఉన్న రాళ్లబండి సుబ్బారావు పురావస్తు శాల, నగరానికి సమీపంలోని ధవళేశ్వరంలో గల కాటన్‌ మ్యూజియం, బ్యారేజీ తదితర ప్రాంతాలను పర్యాటకులు చూడవచ్చు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో గోదారి అందాలు తిలకించేందుకు నగరంలోని పద్మావతి ఘాట్‌ నుంచి బోటుషికారు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలన్నింటినీ మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది.

మెట్ట.. మైమరపే
అన్నవరం: కొండలు, బండలు మెరక ప్రదేశాల మాటున కన్ను పట్టేసే ప్రకృతి సోయగాలు మెట్టనిండా ఉన్నాయి. మినీ టూరిజం కారిడార్‌గా మెట్ట, ఉపప్రణాళిక, మన్యం వరకు అభివృద్ధి చేయగలిగితే మరింత మంది పర్యాటకులను ఆకట్టుకోవచ్చు.సత్యదేవుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అన్నవరం పుణ్యక్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి గతంలో హెలీ టూరిజం ఏర్పాటు, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే రత్నగిరి, సత్యగిరి కొండలను అనుసంధానం చేస్తూ పంపా రిజర్వాయర్‌ మీదుగా రోప్‌వే ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేసి ఏళ్లు గడిచినా దీనిపై ప్రభుత్వాలు దృష్టిసారించలేదు.

జల విహారానికి జై..
ఈనాడు, కాకినాడ: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లాలోని తడ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాగర తీరం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సాగర మాల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని కాకినాడతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జట్టీల నిర్మాణానికి రూ.430 కోట్లతో ప్రతిపాదనలున్నాయి. కాకినాడలో రూ.58 కోట్లతో పాసింజర్‌ జెట్టీ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇప్పటికే కాకినాడ బీచ్‌ అభివృద్ధి చెందడంతో పర్యాటకంగా ఈ చర్యలు ప్రోత్సాహకంగా ఉంటాయని భావిస్తున్నారు.

అఖండ గోదావరి ఏమైంది..?
రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకం అభివృద్ధికి రూ.100 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపడతామని గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలి విడతగా ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేసింది. తొలి విడతగా రాజమహేంద్రవరం నుంచి కోటిలింగాల రేవు, బ్రిడ్జిలంక, పిచ్చుకలంక అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని లంకలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తికి ఏడాది గడువు నిర్దేశించుకున్నా ముందుకు కదల్లేదు.

పాపికొండల నడుమ ప్రకృతి వన్నెలు
సీతానగరం: గో‘దారి’లో పాపికొండలు విహారమంటే ప్రకృతి ఒడిలో పయనమే. జిల్లాలో పర్యాటక రంగానికి తలమానికంగా పాపికొండలు విహారయాత్ర పేరొందింది. దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి తదితర ప్రాంతాల నుంచి ఏటా 3 లక్షలకు పైగా పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చేవారికి ఆతిథ్యం ఇచ్చేలా ఏసీ, నాన్‌ఏసీ బోట్లతోపాటు కొరుటూరు వద్ద ఇసుక తిన్నెల్లో కాటేజీలు కూడా నిర్మించారు. స్థానిక గిరిజనులు పర్యాటకులకు వసతితోపాటు రుచికరమైన వంటలు వండి పెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏపీ టూరిజం, ప్రైవేటు యాజమాన్యాలు కలిపి మొత్తంగా 30 బోట్ల వరకు తిప్పుతున్నారు. అంతర్జాలం ద్వారా టిక్కెట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.

మన్యం అందాలు మరువలేం
ఏజెన్సీ ప్రాంతాల్లోని ఘాట్‌రోడ్డుపై ప్రయాణించేందుకు యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. రంపచోడవరం సమీపంలోని రంప జలాశయంతోపాటు, రెడ్డిరాజుల కాలం నాటి ప్రసిద్ధిగాంచిన శివాలయాన్ని సందర్శించేందుకు జనం పోటెత్తుతారు. దీంతోపాటు మారేడుమిల్లి సమీపంలోని రిసార్ట్స్‌, జలతరంగణి జలపాతం, పాములేరు తదితర వాగుల వద్ద ప్రకృతి రమణీయ దృశ్యాలకేం కొదువ లేదు. ఈ ప్రాంతాల్లో పర్యటించేందుకు ఏటా దాదాపు లక్షమందికి పైగా పర్యాటకులు వస్తున్నట్లు అంచనా.

Link to comment
Share on other sites

Soak in the sun, sand and surf at Andhra Pradesh

Listen to the rushing sounds of the wide seas. Slide through its constant waves. If you are looking forward for a weekend spent amidst sun, sand and surf - Andhra Pradesh is where you should be. Get beach ready and head to these swim-friendly destinations in the coastal state.

Beemli beech1.jpg

BHEEMILI BEACH

Bheemunipatnam or Bheemili is a sleepy village 24 kilometres near Vizag or Visakhapatnam. It is nestled amidst shallow waters, expanse of golden sand and tall swaying palm trees in the coast. So pack in your beach clothes and head out to this swimmer’s paradise.

Mypadu Beach1.jpg

MYPADU BEACH

This serene beach is located around 25 kilometres from the town of Nellore. Get greeted by colourful boats lining the beachfront, fishermen heading out to the sea with their nets, and gentle waves sweeping across the sea. Sounds perfect for a swim?

Vodarevu Beach2.jpg

PERUPALEM BEACH

A sight of the fascinating waters of the Bay of Bengal is just 20 kilometres from the town of Narasapur in the West Godavari District. Pristine shallow waters and scenic surroundings make this beach a great spot for a swim.

R K beech1.jpg

RAMAKRISHNA BEACH

It is easily one of the most popular beaches in Andhra Pradesh. Thronged by people from far and wide, this seaside spot gets its name from the Ramakrishna Mission Ashram nearby. Be it long hours spent sunbathing, surfing through the waves, or enjoying a refreshing swim - the Ramakrishna Beach has a bit of something, for everyone.

OTHER BEACHES YOU MUST VISIT

MYPADU BEACH- Near Nellore

VODAREVU- 6 Kilometres from Chirala

RUSHIKONDA – 8 Kilometres from Visakhapatnam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...