sonykongara Posted September 17, 2018 Author Posted September 17, 2018 (edited) Edited September 17, 2018 by sonykongara
sonykongara Posted November 10, 2018 Author Posted November 10, 2018 కొండవీటి ఎత్తిపోతల.. సంసిద్ధం10-11-2018 08:15:43 నెలాఖరుకు జలనవరుల శాఖకు అప్పగింత రూ.237 కోట్లతో పూర్తయిన పథకం రెండు నెలల కిందట ప్రారంభించిన సీఎం మిగిలిన పనులు దాదాపు పూర్తి రాజధానిలో భారీ నిర్మాణం మంగళగిరి: రాజధాని అమరావతికి వరద ముంపు నుంచి పూర్తి స్థాయి రక్షణ కల్పించేందుకు వుద్దేశించి చేపట్టిన కొండవీటివాగు ఎత్తిపోతల పథకం సిద్ధమైంది. 2016 మార్చి 30వ తేదీన రూ.237 కోట్ల వ్యయంతో శంకుస్థాపన జరుపుకున్న ఈ పథకాన్ని కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అన్నీ హంగులతో పూర్తిచేసింది. పథకంలో వరదనీటి కలెక్షన్ పాయింట్ సంపు పనులు మిగిలివుండగా సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పథకాన్ని ప్రారంభింపజేశారు. ఎత్తిపోతలకు సంబంధించి సాంకేతికంగా అన్నీ ప్రధాన నిర్మాణాలు పూర్తికాగా.. కొద్దిశాతం మేర సంపు నిర్మాణ పనులు....మరికొన్ని గ్రీనరీ పనులు మాత్రమే మిగిలివున్నాయి. ఈ పనులను కూడ ఈ నెలాఖరులోగా పూర్తిచేసి జలనవరుల శాఖకు పథకాన్ని అప్పగిస్తామని మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పకడ్బందీగా డెలివరీ పాయింట్ కొండవీటివాగునుంచి వచ్చే వరదనీటిని కృష్ణా ఎగువ కరకట్ట వద్ద అది కృష్ణానదిలో కలిసేచోట వరదనీటి కలెక్షన్ పాయింట్‌గా ఓ చెరువు వంటి సంపును ఏర్పాటు చేశారు. దీనినుంచి ఉత్తరంగా నదిలోకి అయిదువేల క్యూసెక్కుల నీటిని మోటార్ల సాయంతో ఎత్తిపోసేందుకు మోటారు హౌస్, డెలివరీ సిస్టమ్‌ను పకడ్బందీగా ఏర్పాటుచేశారు. అలాగే సంపుకు తూర్పుముఖంగా ఎస్కేప్ రెగ్యులేటర్ అనే లాకులతో కూడిన వంతెనను ఏర్పాటుచేసి దీని ద్వారా మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లిస్తారు. రాజధాని నీటి అవసరాల కోసం కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలో అంటే నీరుకొండ, కృష్ణాయపాలెంలలో ఏర్పాటయ్యే జలాశయాలు వరదనీటితో నిండి.. ఇంకా వరదనీరు వచ్చే అవకాశాలు వున్నపుడే ఈ ఎత్తిపోతలకు పనిచేసే అవకాశం కలుగుతుంది. పంప్‌హౌస్ నిర్మాణం.. రూ.160.5 కోట్లు ఈ పథకంలో అత్యంత ప్రధానమైంది మోటారు కమ్ పంప్‌హౌస్. దీనిని ఎగువ కృష్ణా కరకట్టకు దక్షిణంగా ఎకరం వీస్తీర్ణంలో రూ.34 కోట్ల వ్యయంతో చేపట్టి సుమారు రూ.90 కోట్ల వ్యయంకాగల మెషినరీని ఇందులో ఏర్పాటు చేశారు. ఈ పంపుహౌస్ కోసం మొత్తం 14 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను గావించారు. మొత్తంగా ఈ పంప్‌హౌస్‌లో ఒక్కోటి 1,600 కిలోవాట్‌ల సామర్ధ్యం కల 16 పంపులను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి స్టాండ్‌బైగా వుంటుంది. 15 పంపుల సాయంతో 5,297 క్యూసెక్కుల నీటిని సంపు నుంచి తీసుకుని కరకట్ట ఆవలవున్న కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. ఈ పంప్‌హౌస్‌లోనే ప్రెజర్ మెయిన్స్ పేరిట మరో రూ.36.5 కోట్ల వ్యయం కాగల మెషినరీని అమర్చారు. అంటే పంప్‌హౌస్ నిర్మాణం.. అందులోని మెషినరీతో కలుపుకుని మొత్తం రూ.160.5 కోట్లను వెచ్చించారు. పథకంలో మరో ప్రధాన నిర్మాణం డెలివరీ సిస్టమ్. కరకట్ల ఆవలివైపు.. అంటే నదీముఖం వెంబడి రూ.21 కోట్ల వ్యయంతో 1.20 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. పంప్‌హౌస్ నుంచి కరకట్టకు నాలుగుమీటర్ల దిగువ నుంచి ఏర్పాటుచేసిన 16 పైపుల ద్వారా డెలివరీ సిస్టమ్‌ను అనుసంధానం చేశారు. సంపు నుంచి పంపుహౌస్ ద్వారా 5,297 క్యూసెక్కుల నీటిని తీసుకుని ఈ డెలివరీ సిస్టమ్ సాయంతో నదిలోకి ఎత్తిపోస్తారు. పథకంలో ఇంకో ముఖ్య నిర్మాణం ఎస్కేప్ రెగ్యులేటర్. దీనిని రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ కొత్త హెడ్ రెగ్యులేటర్ నుంచి దక్షిణంగా రెండొందల మీటర్ల దూరంలో కాలువకు పశ్చిమంగా పీడబ్ల్యూడీ వర్కుషాపు రోడ్డుమీద 12 మీటర్ల లోతులో దీనిని నిర్మించారు. మొత్తం ఐదు గేట్లు... ఏడువేల క్యూబిక్‌మీటర్లతో కూడిన కాంక్రీట్ నిర్మాణమిది. వరదనీటి కలెక్షన్ పాయింట్‌గా వుండే సంపుకు తూర్పువైపు దీనిని ఏర్పాటుచేశారు. సంపు నుంచి సహజ ప్రవాహంతో రెగ్యులేటర్ గేట్ల సాయంతో ఐదువేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణా పశ్చిమ ప్రధానకాలువలోకి మళ్లించేందుకు ఇది తోడ్పడుతుంది. కొండవీటివాగు కృష్ణానదిలో కలిసేచోట కరకట్ట నుంచి 250 మీటర్ల దూరంలో 110/110 మీటర్ల విస్తీర్ణంలో సంపు నిర్మాణం చేపట్టారు. ఇది ఆరున్నర మీటర్ల లోతులో వుండి కొండవీటివాగు వరద నీటికి కలెక్షన్ పాయింట్‌గా వినియోగపడుతుంది. ఇందులో సుమారు 0.1 టీఎంసీ నీటిని నిల్వ చేయొచ్చు.ఈ సంపును అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సంపుకు నాలుగు చెరగులా చూడచక్కనైనరీతిలో గ్రీనరీని ఏర్పాటు చేస్తారు. మొత్తం పథకాన్ని నడిపించేందుకు 132/11 కేవీ విద్యుత్ సబ్ స్షేషన్‌ను రూ.25 కోట్లకు పైగా వ్యయంతో ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. వీటికితోడు రూ.4.5 కోట్ల వ్యయంతో అదనంగా మరో నాలుగు జనరేటర్లను కూడ నిరంతరం అందుబాటులో వుండేలా చర్యలు చేపట్టారు.
sonykongara Posted March 28, 2019 Author Posted March 28, 2019 https://www.youtube.com/watch?v=P1N4rNi53Ns
sonykongara Posted January 10 Author Posted January 10 రాజధాని అమరావతిలో రూ.2,791 కోట్లతో అభివృద్ధి పనులు రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించి.. ఆ తర్వాత వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో నిలిచిన పనులను పూర్తి చేసేందుకు బిడ్లు ఆహ్వానించింది. By Andhra Pradesh News DeskPublished : 10 Jan 2025 06:20 IST టెండర్లు పిలిచిన అమరావతి అభివృద్ధి సంస్థ ఈనాడు, అమరావతి: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించి.. ఆ తర్వాత వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో నిలిచిన పనులను పూర్తి చేసేందుకు బిడ్లు ఆహ్వానించింది. అందులో రూ.2,791.31 కోట్ల విలువ గల ఎనిమిది పనులున్నాయి. బిడ్ల దాఖలుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు అధికారులు గడువును నిర్దేశించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు. వాటిలో రెండు పాలవాగు, గ్రావిటీ కాలువల పనులు కాగా.. మిగిలిన ఆరూ రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించినవి. శ్రీ అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కొండవీటి వాగును, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పాలవాగును వెడల్పు, లోతు చేయనున్నారు. శాఖమూరులో రూ.462.26 కోట్లతో 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.303.73 కోట్లతో 7.83 కి.మీ. నిడివి గల కాలువ నిర్మాణం, 0.1 టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులు చేయనున్నారు.
Mobile GOM Posted April 15 Posted April 15 16 minutes ago, Nfan from 1982 said: May end ki max ayipovaali canals digging and widening Nuvvu ela ante alage N bro 🙏🙏 Eswar09 1
Nfan from 1982 Posted April 16 Posted April 16 10 hours ago, Mobile GOM said: Nuvvu ela ante alage N bro 🙏🙏 Talking about Only matti panulu brother 😅
Mobile GOM Posted April 16 Posted April 16 9 hours ago, Nfan from 1982 said: Talking about Only matti panulu brother 😅 Just joking Bro 😃
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now