Jump to content

Baboi Tdp


navalluri

Recommended Posts

రెండుకళ్ల సిద్దాంతంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎటూకాకుండా పోయింది అని తెగ వాదనలు, సర్వేలు గోల చేస్తున్న వేళ ఓ నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది. తెలగుదేశం పార్టీనే తెలంగాణ, సీమాంద్రలో మిగిలిన వాటికంటే బెటర్ పొజిషన్ లో ఉందని, అందరు కొట్టుకుంటుంటే టిడిపికే విజయం దాదాపు ఖాయం అన్న స్టేజిలో చంద్రబలం ఉందని అంటున్నారు. ఈ మాట టిడిపి నాయకులు, లేక చంద్రబాబు సొంతంగా చేసుకున్న సర్వే పలితమో, అదీ కాక చంద్రబాబు కొమ్ము కాచే మీడియాలో చెబితే ఎవరు నమ్మేది కాదు. కాని టిడిపితో పొత్తు వద్దు అని వాదిస్తున్న ఏపి బిజేపి నేతల్లోని ముఖ్యుడు ఒకరు పార్టీ అధిష్టానానికి పంపిన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అంతే కాదు టిడిపితో పొత్తు పెట్టుకోకుంటే ఏపిలో బిజేపి నష్టపోతుంది అని కూడా తన నివేదికలో పేర్కొనడం విశేషం. కారణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ప్రాంతాలలో పట్టున్న పార్టీ కేవలం తెలుగుదేశం మాత్రమేనని, దానితో పొత్తు పెట్టుకుంటేనే బిజేపికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ది చేకూరుతుంది అని పేర్కొన్నారు. పైగా ఈ మాటలు ఎలాంటి ఆధారాలు లేకుండా రాయలేదు. తన వాదనకు బలమైన సాక్ష్యాలు, అవి నిజం అని నమ్మడానికి తగిన ఉదహరణలు కూడా నివేదికలో పేర్కొనడం విశేషం. తెలంగాణ సెంటిమెట్ చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా టిడిపి తెలంగాణలో గణనీయంగా సీట్లు సాధించిన తీరు వివరించారు. అంతే కాదు పరకాల ఉప ఎన్నికలో ఏకంగా 30 వేల ఓట్లు సాదించి తన పట్టు చూపించింది టిడిపి అని కూడా పేర్కొన్నారు. ఇక సీమాంద్రులు రాష్ట్రం అంతటా ఉన్నారు, ప్రత్యేకించి హైదరాబాద్ లో సగానికి పైగా సీట్లు గెలవాలంటే సీమాంద్రుల ఓట్లే కీలకం. తెలంగాణలో ఉన్న సీమాంద్రులంతా దాదాపుగా టిడిపికి ఫేవర్ లో ఉన్నారని చెప్పారు. కారణం ఇప్పుడు తెలంగాణలో ఉన్న సీమాంద్రనేతకు చెందిన ఏకైక పార్టీ టిడిపినే. అంతే కాదు హైదరాబాద్ శివార్లలో 35 సీట్లలో టిడిపి అవుట్ రైట్ గా విజయం సాధించే అవకాశాలున్నాయని నివేదించారు. అంతే కాదు అభివృద్ది మంత్రంతో పాటు, బిసిల్లో మంచి పట్టు టిడిపికి ఉందన్నారు. ఇప్పటికి తెలంగాణలో గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ టిడిపిదే అని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికలకు ముందో, లేక ఎన్నికలయ్యాకనో టిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న నమ్మకం చాలా మందిలో ఉందని, కాంగ్రెస్ కు ఓటేసినా, టిఆర్ఎస్ కు ఓటేసినా ఒకటేనన్న భావం తెలంగాణలో ఎక్కువగా ఉందని, సేమ్ టు సేమ్ జగన్ కు ఓటేసినా, కాంగ్రెస్ కు ఓటేసినా ఒక్కటేనన్న భావం సీమాంద్రలోను ఉందన్నది ఆ నేత అభిప్రాయం. ఇదొక్కటే కాదు, కేంద్రంలో ఎలాగూ కాంగ్రెస్ రాదు, రాష్ట్రంలో ఎప్పటికైనా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీనే అన్న భావం రాష్ట్రంలోని రెండు ప్రాంతాలలో ఉందని, టిడిపి అందరి అంచనాలను తారుమారు చేయడం ఖాయమన్న విషయం తన నివేదికలో పేర్కొనడం, ఆయన వాదనలు కాదనలేని పరిస్తితులు ఉండడంతో బాబోయ్ చంద్రబాబు అంటూ ప్రత్యర్థులంతా వణినే పరిస్తితులు నెలకొన్నాయంటున్నారు పరిశీలకులు కూడా.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...