Jump to content

Tammineni


raaz

Recommended Posts

దాడి బాటలో తమ్మినేని?
వైసీపీతో బేరసారాలు..
డిమాండ్లపై లభించని హామీ
తర్జనభర్జనలో టీడీపీ నేత..
పార్టీ కార్యాక్రమాలకు దూరం

శ్రీకాకుళం, మే 11 : టీడీపీలో ఒకప్పుడు కీలక నేతగా వ్యవహరించిన మాజీమంత్రి తమ్మినేని సీతారామ్ వైసీపీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం లోక్‌సభ టిక్కెట్‌తో పాటు, ఆమదాలవలస అసెంబ్లీ టిక్కెట్, మున్సిపల్ చైర్మన్ పదవులు తాను సూచించిన వారికి కేటాయిస్తే వైసీపీలో చేరతానని ఆయన షరతులు విధించారని, దీనిపై పార్టీ నాయకత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తే తర్వాత ఆలోచిద్దామని వైసీపీ అధిష్ఠానం తమ్మినేనికి సూచించినట్టు తెలిసింది.

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ద్వారా జరిపిన ఈ చర్చలపై నిర్ణయం వెలువడకపోవడంతో తమ్మినేని కొద్దికాలంగా స్తబ్దుగా ఉంటున్నారంటున్నారు. ఆయన టీడీపీని వీడటం ఖాయమని, అదెప్పుడు జరుగుతుందో వేచి చూడాలని ఆయన అనుచరుల్లో కొంతమంది చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు పీఆర్పీలోకి వెళ్లిన తమ్మినేని.. తర్వాత స్వగృహ ప్రవేశం చేశారు. ఆ సమయంలో తనకు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఇస్తామని చెప్పి అధిష్ఠానం మాట తప్పిందన్నది టీడీపీపై ఆయన ప్రధాన ఆరోపణ. అందుకే ఖమ్మంలో జరిగిన సమావేశానికి చంద్రబాబు ఆహ్వానించినా తమ్మినేని హాజరుకాలేదని సమాచారం.

పార్టీ కార్యక్రమాలకు దూరం
ప్రస్తుతం తమ్మినేని టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు. జిల్లాలో పార్టీ చేపడుతున్న ఏ కార్యక్రమాల్లోనూ ఆయన వాణి వినిపించడం లేదు. గతనెల 27న విశాఖలో పాదయాత్ర ముగింపు సభకూ తమ్మినేని హాజరుకాలేదు. ఈ సభకు జిల్లా నుంచి జనాన్ని తరలించే కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. తమ్మినేని 2009లో పీఆర్పీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఆమదాలవలస నుంచి అసెంబ్లీకి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తమ్మినేని మేనల్లుడు కూన రవికుమార్‌కు టిక్కెట్ ఇచ్చి పోటీకి దింపింది. ఆ ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత తమ్మినేని మళ్లీ టీడీపీలో కలిసిపోయారు. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి విషయంలో తమ్మినేనికి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇవికూడా కొలిక్కి రాకపోవడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టు తెలుస్తోంది

Link to comment
Share on other sites

chachipoyinaa Pasupu jenda kallapi ani adigina eeyana, PRP lo ki jump.. congress lo place leka TDP lo ki vachadu.. ippudu kotha party vundi gaa.. inka akkadiki jump.. asalu party ante abhimanam vunna nayakulu yentha mandhi vunnaru rajakeeya nayakullo?

Link to comment
Share on other sites

Tammineni malli back to party ayyinappati nunchi asalu active gane ledu. First intilo menalludu tho manchiga undhi taruvatha bayata vishayalu chusthe better. Monna 2009 lo 31k vachayyi, TDP candidate ki 30k vachayyi anukunta last ki aa lady ni gelipincharu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...