Jump to content

DVSK Karna and Sudyodhana Dialogues Script


Vvnspsnrntr

Recommended Posts

Thanks Orion brother for your like.

 

Here it is the telugu script of DVSK dialogues

 

 

దాన వీర శూర కర్ణ - కుంతి కర్ణుడి డైలాగ్స్

 

కర్ణుడు : పాండవమాత.. రాధాసుతుని నమఃస్సుమాంజలి.

 

కుంతి : పేరుతోనన్ను పిలవకు కర్ణా ! ఎంతోమక్కువతో నిన్ను కన్నానురా !

 

కర్ణుడు : అని ఈనాడు చెప్పటానికి... మాతృప్రేమ కుమ్మరించటానికి వచ్చావా ?

 

కన్నప్పుడు అమ్మగా కాకపోయినా... కనీసంఒక ఆడుదానిగా అక్కున జేర్చి గుక్కెడు పాలీయనిదానివి,

 

నేడు నీ పాపపరిహారానికి రణరంగంలో నరబలిగా నన్నిచ్చి కులదేవతకు హారతి పట్టాలని వచ్చావా ?

 

ఇంతకాలం నీ బిడ్డ సూతుడని, సూతుడని లోకం కోడైకూసిన వర్తనం నీ కల్లబొల్లి కన్నీటితో మాపుచేయాలని వచ్చావా ?

 

నాడు నీ మధురస్వప్నాలు పండించుకోటానికి కర్మసాక్షితో నన్ను కన్నావు,

 

నీ భావిజీవితస్వప్నాలు పండించుకోటానికి కాళకరాళ రాత్రిలో కన్నుతెరవని పసికందును నన్ను దూరంగా గంగలో విసిరి పారవేశావు.

 

నాడే నాకీర్తి నశించింది. నీ హత్యాచారంవల్ల రాజగురు సంస్కారాలు, సుక్షత్రియ నామము యశస్సు నాకు దూరమయ్యాయి.

 

ఇంతకంటే కన్నతల్లివిగా నీవు చేయగలిగిన అపకారమింకేమున్నది !

 

ఈనాడు నీ పుత్ర స్వప్నాలు పండించుకోటానికి నీ అభిజాత్యమహావృక్షం నుండి ఎన్నడో ఎక్కడో రాలిన ఈఫలాన్ని ఏదో ప్రతిఫలం అపేక్షించే ఆశ్రయించటానికి వచ్చావు అంతేగా ?

 

 

కుంతి : అంత మాట అనకు బాబు.. కన్న బిడ్డలందరూ ఒక్కటై ఉండగా చూచే అదృష్టం భగవంతుడు నాకు లేకుండా చేసాడు

 

కర్ణుడు :కాదు నీకు నీవే చేసుకున్నావు.. నీవేకాదనుకున్నది తానౌననుకొని తిరిగి నీ దరికి ఎలా వస్తుంది ?

 

అయినా నీకెందుకింతబాధ ? నాకేం బలపరాక్రమాలు లేవనా , రాజ్యం లేదనా , అండదండలు లేవనా ... నాకు లేనిది ఏదిఆశించి నీ బిడ్డలా పక్షానికి రమ్మంటావ్ ?

 

ఆనాడు నీ రక్తమాంసాలముద్దగా పుట్టిన నన్ను నిర్దాక్షిన్యంతో నీవు నీల్లకప్పగిస్తేపుత్రప్రేమతో స్వీకరించి మక్కువతో చనుబాలిచ్చి పెంచిందినా తల్లి రాధ.

 

బిడ్డలుండి గొడ్రాల్లైన వాళ్ళు కొందరుంటే, బిద్దలుడిగిన సంతానవతి మా అమ్మ రాధ.

 

 

కుంతి : అవునయ్యా, నాడు నువ్వు నా బిడ్డవని ఎలా చెప్ప లేకపోయానో, నేడు నువ్వు అలాగే కుంతి నాతల్లని చెప్పకపోవటంలో తప్పులేదు.

 

గతిమాలి నా ఐదుగురు బిడ్డల క్షేమం ఒక కంట చూచుకొంటూ మంచిరోజులెంచుకుంటూ బ్రతుకుతున్నాను . పరిమారేవయసులో పుత్రహీనగా నేను జీవించలేను.

 

అందుకే అపాండవం చేయవద్దని కన్నకొడుకు ముందు కొంగుపట్టియాచించటానికి వచ్చాను,

 

పుత్ర భిక్ష పెట్టు!

 

 

కర్ణుడు : పుత్ర భిక్ష! అడగటానికి నీకు నోరెలావచ్చింది ?

 

కుంతి : తండ్రీ !

 

కర్ణుడు : స్వామీ ఉప్పుపులుసులతో నేనింతకాలంబ్రతికానో , స్వామి సమతవీక్షనాలతో నేనొక వీరాధివీరునిగా నిలిచిమహారాజునయ్యనో... స్వామీ వెలలేని తులలేని ఋణ మమనేకం తీర్చుకొనే సమయం వచ్చింది. రాజరాజు ఔదార్యంతో జీవించే నాకిది పరీక్షా సమయం.

 

దుర్లక్ష్య మహాసమరసాగారాన్ని నా మీద నమ్మకముంచే నా రాజు రాసానికి సాహసించాడు , ప్రత్యుపకారంతో స్వామీ ఋణం తీర్చి రాధేయుడు శీలవంతుడు, నీతివంతుడు, ధర్మవర్ధనుడనిశాశ్వత యశఃక్కాముడను కమ్మంటావా ? లేక, మానవసహజములైన ప్రలోభాలకు, ఆశలకు, ఆకర్షలకు లోనైకౌంతేయుడు స్వామిద్రోహి, మిత్రద్రోహి నీచుడుఅన్న శాశ్వత లోకనిందకు బలి కమ్మంటావా ?

 

యశోవంతమైన చంద్రవంశపు మహారాజ్ఞిగా , పాండురాజు దేవేరివిగా , కడుపు పండించుకొనికన్న తల్లివిగా నీ తుది నిర్ణయం చెప్పు ? తనయున్ని దూరంజేసుకోవటానికితెగించినదానివి, నేను నీ బిడ్డలతో కలవకపోయినా భరించగలవు , కాని కర్మసాక్షి కొడుకు దుష్కామకర్ముడన్నఅపఖ్యాతితో నేను జీవించలేను.

 

 

 

మచ్చుకు వెరసి నీవు నన్ను దూరంచేసుకోన్నవో తిరిగి మచ్చ నావల్ల నీకు రావాలనినేను కోరను, రానివ్వను . ధార్తరాష్ట్రుల కోసం నా సర్వం ధారవోస్తాను. నీ కొడుకులతో యుద్ధంచేసి తీరుతాను .

 

కుంతి : బాబూ!

 

కర్ణుడు : ఆనులే నీవేనాడో వదలివేసిన బిడ్డనునేను. నేనేమైన నీకు బాధలేదు. ఇప్పుడు కూడా పాండవులను చంపవద్దని కోరడానికి వచ్చావేకాని,నీ తొలి బిడ్డ కర్ణుడు బ్రతకాలని కోరి నీవు రాలేదు.

 

నీవుమాతృ స్థానానికి మాత్రం అర్హురాలివి కావు, కాకపోతే నా జన్మకు కారణమైన ఒకానొక ఆడుదానివి. నా పుట్టుకవల్లనీకు సుఖం లేదు, అమ్మా అని పిలుచుకొనే అదృష్టం నాకు లేదు, క్షణాన నీ గర్భావాసాన ప్రవేశించానో,నీకు దుర్భర క్లేశాలు కలుగాజేసాను. లజ్జా జనకున్నయ్యాను, స్వజనానికి దూరమయ్యాను, పరాన్నంభక్షించాను, పరాదీనున్నై పొట్టనింపుకుంటున్నాను, నీచునిగా సంఘంలో నిలబడ్డాను.నీతికిధర్మానికి కట్టుబడి తమ్ముళ్ళతో తారసిల్లుతాను.

 

అయిన, అడిగినదానిని లేదనక ఇచ్చే రాధేయుడు కొంగుచాచియాచించిన ఒకానొక దీన మాతృమూర్తిని కాదనే ధర్మహీనుడు దయాహీనుడు కాదు. ఇదే నీకు నా వాక్ధానం, చిక్కినా దక్కినా ధర్మజభీమనకులసహదేవులకు ప్రాణహాని కలిగించను. సవ్యసాచికి సమజోదుగాసర్వకాల సర్వావస్థలయందును నామీదే నమ్మకముంచుకున్న నారాజుకు ద్రోహంచేసి నీను నికృష్టుడనుకాలేను.నీ కొడుకు పార్థుడు ఎదురైనప్పుడు అతన్నిఅంతం చేయగలిగానా నాస్వామి ఋణం తీర్చిన వాన్నౌతాను లేదా శూరవరేన్యులు చేరే సురలోకంలో సుస్థిరమైన యశోలక్ష్మిని చేపట్టినవాన్నౌతాను. నీ పంచపాండవులను నీకే విడచి నీకోర్కె నెరవేర్చిన వాన్నౌతాను.ఏది ఏమైనా నీకు లోకానికి చివరకు పంచపాండవులే మిగులుతారు అనామకుడిగాజన్మించి, అనామకుడిగా లభించి,అనామకుడిగా పెరిగిన రాధేయుడు అనామకుడిగానే… అహ్ ! పాండవమాతా ,వెళ్ళు ...కోర్కె నెరవేరిందిగా, ఇక వెళ్ళు

 

 

దాన వీర శూర కర్ణ సుయోధనుడి డైలాగ్స్

 

1.సుయోధనుడు ద్రోణుడి జాత్యాహంకారాన్నివ్యతిరేకించుట.

 

ఆగాగు!

ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి ?

 

జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా !

 

ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ?

 

కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా !

 

నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?

మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము?

 

ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ! ఈయన దే కులము ?

 

నాతోనే చెప్పింతువేమయా , మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా ?

ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా?

 

సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు?

 

 

2.కర్ణుడి పట్టాభిషేకం

 

ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది.

 

అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదవిరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.

 

సోదరా.. దుశ్శాసన ! అనఘ్రనవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము,

 

మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము,

 

పరిజనులారా ! పుణ్య భాగీరథీనదీతోయములనందుకొనుడు,

 

కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,

 

వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు,

 

పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది

బహుజన్మసుకృతప్రదీపాదిసౌలబ్ద సహజకవచకచవైడూర్యప్రభాదిత్యోలికి వాంచ్చలుచెలరేగ వీరగంధమువిదరాల్పుడు.

 

నేడీ సకలమహాజనసమక్షమున, పండితపరిషన్మధ్యమున సర్వదా సర్వదా, శతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను .

 

హితుడా ! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమేకాదు.. నా అర్థ సింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను.

 

 

3.సుయోధనుడికి పాండవుల రాజసూయాగం ఆహ్వానం వచ్చినప్పుడు

 

ఊం.. ఉ.. హహహహ

 

విరాగియై పాండురాజుకు సరాగినియై కులప్రవర్తనాసక్తయైన కుంతికి జనియించిన పాండవులు !

 

ఆబాల్యమున ఆటపాటలలో మమ్ము అలమటపెట్టిన పాండవులు !

 

 

లాక్కాగృహములో నిశీధిని నిట్టనిలువునా ధహించివేసారన్న నీలాపనిందను మామీద వేసిన పాండవులు !

 

ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుకు వళ్ళుమెక్కిన పాండవులు !

 

అంతకుతగ్గగంతగా అతుకులబొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు !

 

స్నాయువతా సంకలిత శల్యము సంప్రాప్తించిన సుంకంమ్మన్నటుల

మా పిత్రుదేవదయాలభ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడీ యాగకార్యదుర్వహుగులగుటయా !

 

నరకలోకముననున్న తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు

జేర్చుట దీని ఆంతర్యమట ! ఏమి కల్పనాచాతుర్యము ? ఏమి కల్పనాచాతుర్యము ?

 

ఐనను కుంతీ మూలమున స్వర్గనరకాధిపతులిరవురు పాండురాజునకు తమ్ములేగదా !

ఐన ఇందు జరుగనిదేమి ? లోపమేమి ?

 

అయ్యారే ! సకలరాజన్యులోకమూ సోహోనినాదములు సలుప భారతభారతీ శుభాస్సీసులతో పరిపాలనసాగించెడి మాకు మారాటుగా సార్వభౌమత్వము సాదింపగోరి పాండవుల దుష్ప్రయత్నమా ఇది !

 

సాటిరాజులలో రారాజు కావలెననియెడు ధర్మజుని దుష్టంతరమా ఇది !

ఐనచో కుతంత్రముతో కుచ్చితబుద్ధితో సేయనెంచిన ఈ రాజసూయము సాగరాదు, మేమేగరాదు.

 

 

4.మయసభ ఘట్టం

 

 

అహొ !

అమ్లానభావసంభావితమైన ఈ దివ్యప్రసూనమాలికారాజమును కురుసింహుని గళసీమనలనలంకరించిన వారెవ్వరు ? అ.. హహహ ..

 

అనిమిషయామినీ అతిధిసత్కార దివ్యసేవాప్రభావమౌనా ! ఔ,, ఔ,,

 

ఆ.. హహ్హహ,,

ఓ..

ఆ.. ఏమా సుమధుర సుస్వరము !

కాకలీకలకంటికంటి కూకూఉకారసుతిహిత దివ్యసురకామినీ కామినీయక సుస్వాగతమౌనా ! హాహ్హహ.. అహా .

సొబగు సొబగు.. సొబగు సొబగు..

 

ఔరా.. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా ! హాహ్హహ..

ఔ.. ఔ..

 

అయ్యారే !

భ్రమ.. ఇదినా భ్రమ ..

కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..

 

భళా !

సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణాభూషణములచే ఈ సభాభవనము ధన్యము..ధన్యము..

 

అకుంచితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని లేదు.. లేదు.. లేదు ..

 

ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుటమాత్రం మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.

 

విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..

 

అఖిల నదీనదసాగరవారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..

 

సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..

 

కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము.

 

చతుర్కృతాపచారములకంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.

 

ఏమీ ! నిరాఘాటపదట్టనకు నాకీ కవాటఘట్టనమా ! పరులేవ్వరు లేరుకదా ! మా భంగాపాటును పరికించలేదుకదా!

 

ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్ము అవమానిచుటకే.

 

ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన జలాశయమా ! ఆహ్

 

అంతయు మయామోహితముగా ఉన్నదే !

 

ఉ.. అహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ...

 

పాంచాలీ... పంచభర్త్రుక ...

 

వదరుపోతా.. వాయునందనా ...

 

పాంచాలి.. పంచభర్త్రుక.. ఏమే.. ఎమేమే.. నీ ఉన్మత్తవికటాట్టహాసము ? ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.

 

అహొ ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై ...

 

నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై ...

 

పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై..

 

మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరీవృతయై పగులబడి నవ్వుటయా ?

 

అహొ ! తన పతులతో తుల్యుడనగు నను భావగా సంభావింపక, సమ్మానింపక.. గృహిణిధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి పాంచాలి ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?

 

అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున మగలముందొక మగనిని వచ్చనపర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ?

 

ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా ! ఆ.. అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !

 

ఐనను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో !

 

నిజరత్నప్రభాసమపేతమై సర్వర్త్రు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలె.. అయినది పో !

 

అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో !

 

సజీవ జలచర సంతాలవితాలములకు ఆలవాలమగు ఆ జలాశాయములో మేమల కాలు మోపవలె .. మోపితిమి

పో !

 

సకల రాజన్యుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం చెందవలె.. ఏకత్సమయమునకే పరిచారికాపరీవృతయై ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?

 

ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..

 

ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబానలా జ్వాలలు ధగ్ధమోనర్చుచున్నవి మామా..

 

విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?

 

పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..

 

ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా...

 

ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?

 

 

 

5.మాయాజూదంలో సుయోధనుడు గెలిచినపుడు

 

 

మాయురే మామా.. మాయురే హహహః

చరిత మరువదు నీ చతురత.. మాట చెల్లించిన నీకే దక్కును యెనలేని ఘనత

మా ఎద సదా మెదలును మామ యెడ కృతజ్ఞత .

 

ప్రాతిగామి ! ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ..

 

ఓహో

వయోవృ ద్దులు , గురువృ ద్దులు ధర్మబుద్ధులమనుకొను ప్రబుద్ధుల బుద్ధి ఇంత దనుక నిదురబోవుచున్నదా ఏమి ? హహ్హ.. హహ్హ.. ఇప్పుడే లేచి అధర్మము అధర్మమని ఆవులించుచున్నది.

 

జూతం ధర్మవిరుద్ధము సప్త మహా వ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు ఇంతదనుకా మీరేల వీక్షించితిరి?

 

ఐనను జూతక్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోదునుచేసి ఆడించితినే కాని చతుషష్టి కళా విశారదుడనగు నేనాడలేదే ! ఆట తెలియకనా ? హహహ.. ధర్మమూ తెలియును గనుక.

 

కాని ధర్మాధర్మములు విచారింపక తన తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే ఐనటుల ఈ పాండు సుతుడు ఒడ్డినపుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదపిరా ?

 

తమనొడ్డినపుడైన తమ్ములు నోరు మెదపిరా ?

 

ఆలిని ఓలిగా పెట్టినప్పుడైన ఆ మగువను మగటిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకొన్న వాడను నేను పాంచాలిపై మీకేమి అధికారమున్నదని అర్జునుడైన అన్న నడిగెన ?

 

చతుర్విధ పురుషార్ధములలో సహధర్మచారిణి ఐన ధారను దయారహితముగా పందెము వైచునప్పుడైనను, అవ్వ ! ఇది అమానుషమన్నవారులేరే ?

 

అ.. ఆ..

నేను గెలచుటచే మయా తిరోతరమైనది , ధర్మజుడే గెలచిన ధర్మమే జయించినదని మీరు జేజేలు కొట్టిఉండెడి వారు కాదా !

 

మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మ దేవతను ఖండించి అధర్మ దేవతను ప్రళయ తాండవ మాడింపకుడు ..

 

తాతా! అలనాడు స్వయంవర సమయమున నా కూర్మి మిత్రుడగు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి వర బహిష్కారము చేసిన ద్రుపదునకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నం.

 

నాడు నను అతిధిగా ఆహ్వానించి పరిహసించిన పంచ భర్త్రుక పాంచాలి పై పగ సాధించుటే దీని ఆంతర్యం.

 

అంతియేకాని మా పితృ దేవ దయాలబ్ధమైన ఎంగిలి కూటికాశపడు అల్పుడను కాను, అందునా జూతార్జితమగు విత్తము పై చిత్తము నుసిగొల్పు అధముడను కాను.

 

నా హృదయాగ్నిజ్వాలా ప్రతిరూపమే ఈ జూతము తాతా, ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మ ధర్మములతో, పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాట్లాడ అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి.

 

 

 

6.కృష్ణ రాయభారానికి సుయోధనుడి ప్రత్యుత్తరం

 

 

రాయభారీ... చాలించు నీ దుష్ప్రసంగం..

 

పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా.. సభ్యమహాజనులారా.. నా క్షేమము కోరి పలికిన మీ హిత వాక్యములకు కృతజ్ఞుడను.

 

రాయభారీ.. గోకులవిహారి .. హహహ్హ..

నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరార్ధమును తెలియని అజ్ఞానిని కాదు..

 

మా గురుదేవునకు సోదరుడవని, కుంతీ దేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో , సమస్త సత్కారాలతో అతిధిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించు కొంటివి. పగతుర కూడు కుడువనున్నదని నిన్ననే మమ్ము పగవానినిగా భావించితివి .

 

ఐనను, రాయభారి వచ్చునపుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని.

 

ఊం..

రాయాభారిగా వచ్చినవాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక , ఆపైన మా అభిమతము గ్రహింపక ఇంతః ప్రల్లదనముగా ప్రవర్తించితివి.

 

ఇప్పుడు నేను సంధికొడంబడినచో హహ్హ.. హహ్హ.. సౌజన్యముతో డాయాదులకు పాలుపంచి ఇచ్చినట్లా ? లేక, నీవు వంధిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు లకు బెదరి ఇచ్చినట్లా ?

 

దూతగా వచ్చినవాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి, మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి

 

హ..హహ.. ఐదూల్లైనా ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనెంచితివి

కృష్ణా ! నీ కోరిన కోర్కె సరియే ఐనచో, నిజమే ఐనచో నేనీయుటకీ సువిశాల సామ్రాజ్యములో ఐదూళ్ళు లేకపోవునా !

 

ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావికానివి, నేను ఇతరులకు దానమిచ్చిన ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్ట గలను? ఆ .. ఇది సాధ్యమా ? సంధి పొసగు మార్గమా ? హ..హహ..

 

ఇది గాక ...

మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ?

 

పాండురాజా ? యమధర్మరాజా ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమొందుటకు హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ?

 

ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను ..

 

మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ?

 

అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును.

 

అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా ?

 

భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ?

 

ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా? కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా?

 

అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని, మతిమాలి కాదు.

 

అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు ..

మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ?

 

ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్ళ కొరకు ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !

 

కృష్ణా ! ఇంతయేల , ఆ కౌంతేయులకు వాడిసూది మొనమోపినంత భూమికూడా ఈయను . ఇదియే నా తుది నిర్ణయము .

 

 

 

దాన వీర శూర కర్ణ - భగవత్గీత (తెలుగు)

 

భగవత్గీత (తెలుగు)

ఏల సంతాపమ్ము ! మరి నీకేల సందేహమ్ము పార్థా !

మృతులకై జీవితులకై పండితులు దుఖ్ఖితులగుదురా

కర్మమ్ముల యందె నీకు కలదదికారము లేదు కర్మ ఫలములందు

కాన కర్మమ్ములు విడువరాదు

పుట్టినందుకు చావు తప్పదు గిట్టినప్పుడు పుటక తప్పదు

పరిహరింప లేనిదానికి పరితపించకు ఓ పరంతపా

ఆత్మ నిత్యము ఆత్మ సత్యము అది చింత్యము అది అగమ్యము

చీల్చలేనిది కాల్చలేనిది సర్వగతమది

చంపెడివాడవు నీవా చంపబడెడివారలు వీరా

చేసెడివాడను నేనే చేయించెడివాడను నేనే

ఎన్నడు ధర్మము తరుగునో ఎప్పుడు అధర్మము పెరుగునో

అప్పుడు సృ ష్టించుకొందు అర్జునా నను నేనే

దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై సద్ధర్మస్థాపనకై

సంభవింతు యుగయుగముల

అన్నిధర్మములు త్యజించి నన్నే శరణము గొందుము

సర్వపాప విమోచనము జరిపి మోక్షమోసంగెదను

Link to comment
Share on other sites

Annaay NTR oka artistic passion thO DuryOdhanudu, Karnudu etc vEshaalu vEsaaru........He wanted to show in length some angles of those roles, where he could extract lot of skill work from his arsenal....

 

Annaay NTR acting ki mechukontaa.....dont get in to an impression of adulating those negative roles.......Villains vaallu......Acting ni chuusthaa kuuda Discriminative gaa chuudaali........Annaay aa roles chEsaadu ani , vaatini Hero la gaa bhaavinchaadu ani misunderstand chEsukOvadhu.......

Link to comment
Share on other sites

anna ekkadnundi techhav idi..?? vammo superb work anna .....

ee script antha nenu movie cd and audio casstes nundi vini ready chesanu. Anna gaari movieslo naaku baaga nachinavi seetharama kalyanam and dvsk. yenduko cheppalenu aa negative roles ni choosinakoddi choodalanipisthundi enni saarlu choosano lekkaledu and fanally i thank each one you for your appreciation
Link to comment
Share on other sites

Annaay NTR oka artistic passion thO DuryOdhanudu, Karnudu etc vEshaalu vEsaaru........He wanted to show in length some angles of those roles, where he could extract lot of skill work from his arsenal....

 

Annaay NTR acting ki mechukontaa.....dont get in to an impression of adulating those negative roles.......Villains vaallu......Acting ni chuusthaa kuuda Discriminative gaa chuudaali........Annaay aa roles chEsaadu ani , vaatini Hero la gaa bhaavinchaadu ani misunderstand chEsukOvadhu.......

 

Brother aa roles vesindi vere evaro ayithe inthaga pandevi kaavu. Anna gaari andam, vaachakam , aa tteevi, rajasam and finally the last but not the least annagari adbuthamaiana natana aa characters loni negatives ni possitive chasayi. akkada manam choosedi karnunni duryodhanunni kaadu brother viswa vikhyaatha natasarvabhowmunni.. that is anna garu.

Link to comment
Share on other sites

Brother aa roles vesindi vere evaro ayithe inthaga pandevi kaavu. Anna gaari andam, vaachakam , aa tteevi, rajasam and finally the last but not the least annagari adbuthamaiana natana aa characters loni negatives ni possitive chasayi. akkada manam choosedi karnunni duryodhanunni kaadu brother viswa vikhyaatha natasarvabhowmunni.. that is anna garu.

 

I know what you mean bro and with you in regards to Annaay Action.. :shakehands:.... negatives ni positives gaa cheyyaali anukOledhu bro.......Ofcourse konni angles lo friendly perspective thO chuupinchinaa, Overall gaa.......aa dialogues lopalaki chuudandi......kondaveeti venkatakavi thO dhaggarundi raayinchukunna dialogues.....

 

anniti lO kuuda.........lies(characters) chepthunnatlu vuntadhi clear gaa.....'.Lakka illu memu thagala pettamanta?' ' desa, samskruthi rakshNaku, raajyam malli ichEsthE, chinna mukkalu ayipOthaayi kadha...desa vibhajana manchidhi kaadhu' ( KrishnudithO DuryOdhanudu).....inka chaala chotla kuuda.........

 

Overall gaa .....andhukE ....Krishnudu role vesindhi....for clarity....

Link to comment
Share on other sites

I know what you mean bro and with you in regards to Annaay Action.. :shakehands:.... negatives ni positives gaa cheyyaali anukOledhu bro.......Ofcourse konni angles lo friendly perspective thO chuupinchinaa, Overall gaa.......aa dialogues lopalaki chuudandi......kondaveeti venkatakavi thO dhaggarundi raayinchukunna dialogues.....

 

anniti lO kuuda.........lies(characters) chepthunnatlu vuntadhi clear gaa.....'.Lakka illu memu thagala pettamanta?' ' desa, samskruthi rakshNaku, raajyam malli ichEsthE, chinna mukkalu ayipOthaayi kadha...desa vibhajana manchidhi kaadhu' ( KrishnudithO DuryOdhanudu).....inka chaala chotla kuuda.........

 

Overall gaa .....andhukE ....Krishnudu role vesindhi....for clarity....

 

Yes brother your correct. durmaargudu eppudu thanu chesina thappulanu samardhinchutuntaniki konni sanghatanalnu isolate chesi logical ga counter chesthadu. aa perspectivelo choosthe duryodhanudu kooda correcte anipisthundi. prekshakulu kooda poorthiga convince aipoyaru. I think that credit goes to Anna gariki and Kondaveeti Venkata Kavi gariki. choodandi ee duryodhanudi logical counters...

 

"ఓహో

వయోవృ ద్దులు , గురువృ ద్దులు ధర్మబుద్ధులమనుకొను ప్రబుద్ధుల బుద్ధి ఇంత దనుక నిదురబోవుచున్నదా ఏమి ? హహ్హ.. హహ్హ.. ఇప్పుడే లేచి అధర్మము అధర్మమని ఆవులించుచున్నది.

 

జూతం ధర్మవిరుద్ధము సప్త మహా వ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు ఇంతదనుకా మీరేల వీక్షించితిరి?

 

ఐనను జూతక్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోదునుచేసి ఆడించితినే కాని చతుషష్టి కళా విశారదుడనగు నేనాడలేదే ! ఆట తెలియకనా ? హహహ.. ధర్మమూ తెలియును గనుక.

 

కాని ధర్మాధర్మములు విచారింపక తన తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే ఐనటుల ఈ పాండు సుతుడు ఒడ్డినపుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదపిరా ?

 

తమనొడ్డినపుడైన తమ్ములు నోరు మెదపిరా ?

 

ఆలిని ఓలిగా పెట్టినప్పుడైన ఆ మగువను మగటిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకొన్న వాడను నేను పాంచాలిపై మీకేమి అధికారమున్నదని అర్జునుడైన అన్న నడిగెన ?

 

చతుర్విధ పురుషార్ధములలో సహధర్మచారిణి ఐన ధారను దయారహితముగా పందెము వైచునప్పుడైనను, అవ్వ ! ఇది అమానుషమన్నవారులేరే ?"

 

 

"ఇది గాక ...

మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ?

 

పాండురాజా ? యమధర్మరాజా ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమొందుటకు హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ?

 

ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను ..

 

మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ?

 

అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును."

 

 

 

 

"కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా?

అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని, మతిమాలి కాదు.

 

అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు ..

మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ?"

Link to comment
Share on other sites

...Annaay NTR inthaku mundhu kuuda vEsaadu Duryodhanudu( srikrishna pandaveeyam) ....... Infact chaala baaga vuntadhi NTR action, also much younger.....

 

inka .......DVSK Annaay oka artistic zeal thO, Competitive gaa theesaadu.....Critics(antis in movie field) kontha mandhiki.........short memory thO, Annaay villain roles acting ni marchipOthE gurthu cheyyadaaniki......

 

Overall gaa manchi pEru vachindhi.....No question about that.........Kaani kontha mandhi Critics( cinemaa acting param gaa kaadhu), saastram prakaaram, negativity ni koddigaa highlight chEsaadu ani vundhi....andhulO kontha justfication vunna, Oveall gaa Annaay Karnudu, DuryOdhanudu dharma kOvidhulu annatlu gaa yem chuupaledhu........

 

Moral Diksuchi...dharmaaniki.....Krishnudu maatramE anEdhi Annaay chuupinchaadu, negative roles vEsthaa kuuda.....

 

Samething happened for SitaRamaKalyanam......kontha mandhi Critics( cinemaa action param gaa kaadhu......saastram ...dharma chinthana thO nE....) thappu pattaaru.......Glorify chEsaadu ani.....For Annaay's defence, Raavanaasurudu full length vunna maata nijamE ayina, vaadu oka Rapist, durmaargudu ani kuuda chepthaadu.......

 

saastram prakaaram vellE vaallaki ....complete virudham gaa thiyyaledhu......kaani kalaakaarudiki konni 'Artistic Liberties' vuntaayi.......vaatini full gaa use chEsukonnaadu.......

 

VvnspnrsNtr bro... idhi chaala subtle point....... konni vishayaalu masses koddi mandhi marchipOthaaru.......( kaachi vadapOsthE.......Duryodhanudu, Karnudu, Raavanudu etc...... egoists, durmaargulu, dharmaaniki vyethirEkham gaa vellina vaallu)

 

saastram .....param gaa...( critics of outside Movie domain have to notice ) ......Annaay oka Artist, end of the day..... He wanted to SHOWCASE his Enormous Angles & Skillset portraying those villainy roles......kaani Oveall gaa dharmaaniki virudham gaa message yemi ivvaledhu......Krishnudu yE..... maargadarsi ani . dharmaaniki... katha lo pettaadu......

 

Very interesting points...... :shakehands:

Link to comment
Share on other sites

అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును.

 

అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా ?

 

భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ?

 

ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా? కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా?

 

 

 

:terrific:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...