Adi comparing kosam kaadu...how good a movie had long run ani...ala anukunte Day1 devara ki vachina opening ki can hardly compare 4 to 5 movies in TFI that too mostly SSR and prabhas films...
Telugu Heroes - Who will be the Top Club next 3-4 Years?
ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్, మార్కెట్ వల్ల ఫుల్ రన్ షేర్ ఇతర హీరోస్ కన్నా చాలా ఎక్కువ కనిపిస్తుంది....ఆయనది ప్రస్తుతానికి Exclusive Club !
మిగిలిన వాళ్ళల్లో ఆంధ్ర రాయలసీమలలో ఇపుడు ఉన్న హీరోస్ లో "ఫ్యాన్ బేస్" లో NTR అగ్ర స్థాయిలో కనిపిస్తున్నాడు
ప్రీ రిలీజ్ హంగామాలో కానీ, విడుదల అయ్యాక ధియేటర్స్ లో ఫ్యాన్స్ ,మాస్ కలిసి ఒక పండుగలా ఎంజాయ్ చేస్తున్న తీరు కానీ చూస్తూ ఉంటే ... హిట్స్ ఫ్లాప్ లు & సినిమా రేంజ్ ... కంటెంట్ ని బట్టి మారుతాయి కానీ .. మాస్ నీ , ఫ్యాన్స్ నీ ఒక ఊపు ఊపే స్థానం నిస్సందేహంగా NTR దే !
నైజాం,ఓవర్సీస్ లో మహేష్ బాబు & పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉండేవారు... కానీ ఇపుడు ఒక్క నార్త్ అమెరికాలోనే 6 మిలియన్ డాలర్లు NTR సోలో గా దాటినాక .... నైజాంలో 50 కోట్లు షేర్ వచ్చినాక .. ఈ రెండు ఏరియాస్ లో కూడా NTR ని తీసేయలేము.. ఇక కర్ణాటక NTR కి ఎప్పుడు బాగానే మార్కెట్ .. ఇప్పుడు కొత్తగా హిందీ మార్కెట్ కూడా వచ్చింది.. దేవర హిందీ వెర్షన్ బేసిక్ పబ్లిసిటీ కూడా చేయకుండా 70 కోట్లు నెట్ కలెక్షన్ అంటే మాటలు కాదు !
ఇక అల్లు అర్జున్ కి పుష్ప-2 హిట్ అయితే అన్ని ఏరియాలలో రికార్డ్ కలెక్షన్ వస్తాయి కానీ Exclusive Fans / Fans Base అంత గొప్పగా ఏర్పడి దేవర లాంటి సినిమాని సోలోగా ఈ స్థాయి లో ఆదించగల సత్తా ప్రూవ్ అవ్వాల్సి ఉంది ! పుష్ప -1 ధియేటర్ రన్ పెద్దగా లేదు కోవిడ్ వల్ల.
మహేష్ బాబు తర్వాతి సినిమా రాజమౌళి ది కాబట్టి ఆ ఖాతాలోకి క్రెడిట్ వెళ్ళిపోతుంది RRR లాగా ! అయితే ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ మార్కెట్ లో ఒక సెన్సేషన్ అవ్వడం గ్యారంటీ .. ఆ తర్వాత సినిమా హాలీవుడ్ లో ఆఫర్ ( సోలో కాకపోయినా మల్టీ హీరోస్ లో ఒకరుగా ) వచ్చినా అశ్చర్యం లేదు
రాంచరణ్ ‘ గేమ్ చేంజర్ ‘కి అంత పెద్ద రేంజ్ వస్తుందో లేదో చూడాలి. ఈయన అర్జెంట్ గా ఈవెంట్ సినిమా తీసే కాంబినేషన్ సెట్ చేసుకోవాలి !
అన్నీ చూస్తే.. solid films‘ Lineup తో ప్రభాస్, NTR నెక్స్ట్ మూడు నాలుగు ఏళ్లు టాప్ క్లబ్ ! పుష్ప-2 బ్లాక్ బస్టర్ అయితే అల్లు అర్జున్ కూడా ! రాజమౌళి 2027 లో వదిలితే మహేష్ బాబు కూడా స్పెషల్ లీగ్ లో ఉంటారు.
- Telugu360.