***********************
*నువ్వలా నేనిలా* 💙🩷
************************
నువ్వలా నేనిలా
దూరమైతే ఎలా
ఇద్దరం ప్రశ్నగా
మారిపోతే ఎలా !!
"అడుగడుగు అడుగడుగు
నీ గుండెనే అడుగు
దాగి ఉందా దాక్కుందా
నీలోని ప్రేమ మెరుపు "
"గమనించు గాలించు
ఎటు పోతుంది మనసు
అలిగిందా అలిసిందా
నీలోని తేనె పలుకు"
"మనిషికి మనిషికి వైరం
తొలిగే రోజే రాదా
అందరమూ అందరితో
జత కట్టే సమయం రాదా "
"నీ స్వరము నా స్వరము
కలిస్తే సరిగమ కాదా
నీ బలము నా బలము
తోడైతే కంచెలే తెగవ "
సాధ్యమా సాధ్యమా
మనకు ఇది సాధ్యమా
కలిసిమెలసి ఉండడం
మనకు సాధ్యమా !!
2-
నువ్వలా నేనిలా
దూరమైతే ఎలా
పగతో రగులుతూ
గాయం అయితే ఎలా
" ఆ రోజు ఆ చోట
దూషించిన వాడొకడు
ఈరోజు ఈ పూట
నిను పొగిడిన వాడొకడు"
"నీ పతనం తన జీవితం
అనుకున్న శత్రువు ఒకడు
నీ మంచే కోరుతున్న
నీ ప్రాణమిత్రుడు ఒకడు "
"ఊహించని త్యాగం చేసిన
శత్రువే లేడా
నిన్నే వెన్నుపోటు
పొడిచిన మిత్రుడు లేడా"
"చేసిన తప్పు తెలిసి
తల దించిన తల ఏ లేదా
మన్నించే క్షమా గుణం
మనకంటూ ఒకటి లేదా "
సాధ్యమా సాధ్యమా
మనకు ఇది సాధ్యమా
ద్వేషం లేని హృదయాన్ని
స్వాగతించడం సాధ్యమా !!
3 -
నువ్వలా నేనిలా
దూరమైతే ఎలా
నిందలే మోపుతూ
భారం అయితే ఎలా
"చూడు చూడు.. చూడు చూడు
నీలోన తొంగి చూడు ...
పొరపాటే జరిగిందా
ఓసారి తిరిగి చూడు"
" ఎదుటోడి ఉద్దేశం
ఏం ఉండవచ్చు అంటూ
సందేహం కలిగించు
నీ మనసు కరిగే వరకు"
" ఒక ఆలోచన కి బీజం
మరో ఆలోచనే కాద
ఒక సంఘటన కు మూలం
మరో సంఘటనే కాద "
" తొందరపాటు ఆవేశం తో
తీర్పు చెప్పడం న్యాయమా
ఏ ఊబిలో ఎవరున్నారో
తెలుసుకోవడం సాధ్యమా "
సాధ్యమా సాధ్యమా
మనకు ఇది సాధ్యమా
దోషి లో నిర్దోషి నీ
వెతకడం సాధ్యమా !!
4)
నువ్వలా నేనిలా
దూరమైతే ఎలా
అంతట గెలిచిన
ఒంటరైతే ఎలా
"నీ మార్గం నా మార్గం
వేరై ఉండచ్చు
నీ పరుగు నా నడక
సరితూగక పోవచ్చు "
"మనకంటూ బాధ్యతలు
ఎన్నెన్నో ఉండచ్చు
ఒక నిమిషం తీరిక
దొరకక పోవచ్చు "
సాయం చేసే చేతులు కనబడక ఎన్నిఉన్నాయో
కన్నీరు కార్చే కన్నులు మనకోసం ఎన్నిఉన్నాయో
తెరిచిఉన్న తలుపులు మన చుట్టూ ఎన్నిఉన్నాయో
ఉదయించే కిరణాలు మనముందు ఎన్నిఉన్నాయో
సాధ్యమా సాధ్యమా
మనకు ఇది సాధ్యమా
మన వెంట ఉన్న అండను
గుర్తించడం సాధ్యమా
" నువ్వు లేని నేనెలా
నేను లేని నువ్వెలా
తోడుగా నీడలా
ఒకరికొకరం ప్రేమ లా"
సాధ్యమే సాధ్యమే
మనకు ఇది సాధ్యమే
ఇద్దరం ఒక్కటై
జీవించడం సాధ్యమే !!
💜💜💜
ఒక్కటై ఉండాలి అనుకునే ప్రతి ఇద్దరి కి
ఒకరికోసం ఒకరు గా జీవించిన మా అమ్మానాన్నలకి
( సింహాచలం - సుమతి దేవి)
ఈ పాట అంకితం
-- గుడిపూడి నవీన్ 🙏
***************************
Nuvvu Ala Nenu ILa 🩷 💙
***************************
You and me the way we are
Are we getting distant from each other
Are we becoming a question to each other
At each and every step let's ask our hearts
why is the lightning love in us dormant ?
is it hidden or is it hiding
let's observe and keep track of our wandering mind
what happened to the sweetness in our words ?
getting annoyed and tired did we give up on us to sound so dry
will the day come when the feud between the people ends
will that time come when all of us hold hands together
Your voice and mine together can make great music
Your strength and mine together can remove the barriers
" Is it possible for us to live in harmony with each other "
You and me the way we are
Are we getting distant from each other
burning with the attitude of revenge are we not hurting ourselves ?
on that day at that place someone might have scolded (berated) us
today at this moment someone might praise us
bringing us down was the aim of our enemy
wishing us good was the nature of our friend
hasn't our enemy surprised us with a kind gesture
hasn't our friend backstabbed us at some point
isn't there a person who accepted the mistake with humility
isn't the quality of forgiveness one of our virtues
" Is it possible to reignite and welcome the HateLess heart in us "
You and me the way we are
Are we getting distant from each other
Accusing each other are we burdening ourselves
Did we make any mistakes ?
Let us look again within ourselves
What could be the intention of the other ?
Let us ponder till our heart melts
isn't the seed of a thought also a thought
isn't the basis of an incident also an incident
judging a person in haste or rage, is it justice ?
can we know in what quicksand of problems someone is stuck on
" Is it possible to see the innocent in a culprit too "
You and me the way we are
Are we getting distant from each other
Winning everywhere but are we becoming lonely too
your path and my path may differ
your pace and my pace may not be equal
we may be having many responsibilities
we may have scarcity of time
Do we know how many invisible helping hands are working behind us
Do we know how many empathetic eyes are shedding tears for us
Do we know how many open doors are surrounding us
Do we know how many "rays of the rising sun" lie in store of us
" Is it possible to recognise the unconditional and unwavering support beside us "
What I am without you
What you are without me
together like a shadow to each other
let's become love for one another
yes it is possible for us
to live life being one 💜
To every two of us who want to be one
To my lovable parents
( Simhachalam and Sumathi Devi )
this song is dedicated