We fly from London twice an year. From past 3 years we have been flying only to and from Vijaywada. Vijaywada-Delhi-London. Sooper connectivity.
Chakkaga intlo T taagi flight ekkochu, so much convenient and good service 👍
దేబుడు-ఆత్మకథ
------------------------
మా తాత ఇది.....మా నాన్న ఇది ...నేను ఇది అవుదాం అనుకున్నాను ....కానీ అది అయ్యే సరికే ఎదో అయ్యింది ....ఇంకా అదే అవ్వకపోతే ఇది ఏమి అవుతుంది అని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా
ఈ లోగా మా అమ్మ చెంబు ఇచ్చి విజయా డైరీ లో పాలు తెమ్మంది, విజయడైరీ నే దేనికి అంటే ఇంకో పదేళ్లలో చంద్రబాబు డైరీ పెట్టి విజయ డైరీ మూసి వేస్తారు అని చెప్పింది
సరే అని పాలు తీసుకుని రావటానికి వెళ్తే అక్కడ పాల మీద వాలే ఈగలను ఒకతను మానవత్వం లేకుండా విసురుతున్నాడు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
అయినా తమాయించుకుని అక్కడ నుంచి వస్తుంటే గేదె తోక ఎత్తి పేడ వేసింది వెనుకాలే ఒకతను వచ్చి గంపకి ఎత్తుకుంటున్నాడు.....గేదె పేడని కూడా దోచుకునే వారిని చూసి మల్లి ఆవేశం వచ్చింది..మళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా
ఇంటికి వచ్చా.....అమ్మ ఖాళీ చెంబు తెచ్చాను అని తిట్టింది.....అప్పుడు అర్ధం అయ్యింది నేను పోయించుకున్న పాలు ఆవేశంగా ఊగిపోతున్నప్పుడు పోయాయని. ....మళ్ళి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
.ఈ లోగ ఆర్ట్స్ కాలేజీ లో లా చదువుతున్న నా రెండో అన్నయ్య విరాట్ కోహ్లీ బయోగ్రఫీ తెచ్చి ఇచ్చాడు....ఎవరు అన్నయ్య అన్నాను....వీడు ఇంకో పాతికేళ్లలో ఇండియా కి క్రికెట్ ఆడతాడు.....ఇండియాన్ క్రికెట్ ఐకాన్ అవుతాడు....అన్నాడు అతని బయోగ్రఫీ చదివాను..
ఆ పుస్తకం చదివి బయటకి వచ్చే సరికి రైతులు ఉన్నారు....ఏంటి అన్నాను.....మా పొలాలు లాక్కుని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ఇచ్చారు అన్నారు ....ఇది జరిగింది ఎప్పుడు అంటే 30 సంవత్సరాల తర్వాత 2014 లో చంద్రబాబు మూడో సారి సీఎం అయ్యాక అన్నారు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
కానీ నా మూడవ భార్య కి పుట్టిన నా నాలుగవ సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను..... షిరిడి సాయి బాబా గారికి ఆశీస్సులు ఇచ్చినట్టే పుట్టపర్తి సత్య సాయి బాబా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాను....అంతే కాదు వ్యవస్థీకృత సరళీకృత ఆర్ధిక విధానాలకు కారణమ్ అయినా టైగర్ ష్రాఫ్ ని, కరణ్ జోహార్ ని, బోనీ కపూర్ తమ్ముడు షాహిద్ కపూర్ ని తల్చుకుని సరికి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
కానీ నా నాలుగవ భార్య వల్ల కలగబోయే నా ఐదో సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను...స్నానం కి బాత్రూమ్ లోకి వెళ్తే పసుపు పచ్చగా నీళ్లు వచ్చాయి....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను.....ఈ సారి ఎవరు గుర్తుకు వచ్చేలా లేరు....