Jump to content

ఇళ్ల బాకీ మాఫీ

Recommended Posts

ఇళ్ల బాకీ మాఫీ
01-04-2019 03:07:53
 
636896848730204593.jpg
  • ఇక వాయిదాలు కట్టక్కర్లేదు.. మీ అప్పంతా నేనే తీరుస్తా: బాబు
  • ఎన్టీఆర్‌ గృహ రుణాల సంపూర్ణ రద్దు
  • మీ ఆశీస్సులు ఉన్నంత కాలం సంక్షేమానికే అంకితం
  • కొందరి వాడిని కాదు.. అందరివాడిగా ఉంటా
  • తూర్పు, విశాఖ సభల్లో చంద్రబాబు హామీల వర్షం
కాకినాడ/తుని/పాయకరావుపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులు హౌసింగ్‌ రుణాలు చెల్లించక్కర్లేదు. ఇళ్ల బకాయిలు మొత్తం రద్దు చేస్తున్నాను. వాయిదాలు కట్టే బాధే లేదు. మీ అప్పంతా నేనే తీరుస్తా. పేదలకు రుణ భారం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. పేదల ఆనందం శాశ్వతం కావడానికే ఇళ్ల బకాయిలు రద్దు చేస్తున్నా’ అని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని బహిరంగ సభ, విశాఖ జిల్లా పాయకరావుపేట రోడ్‌షో, రాత్రికి విశాఖలో పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలసి ఆయన విశాఖపట్నం సభలో ప్రసంగించారు.
5s4frr.jpg
ఎన్టీఆర్‌ హౌసింగ్‌ రుణాల రద్దు ద్వారా రాష్ట్రంలో 43 లక్షల కుటుంబాలకు రూ.9,300 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. కోటి మంది చెల్లెమ్మల కోసం పసుపు-కుంకుమ పెట్టామని, ఏప్రిల్లో ఎన్నికలకు ముందే ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఇస్తున్నామని గుర్తుచేశారు. చెక్కులు ఏప్రిల్‌ 4న బ్యాంకుల్లో వేసుకోవాలని సూచించారు. అన్నదాతా-సుఖీభవ పథకం లబ్ధిదారులకూ అదే సమయంలో సొమ్ము ఖాతాల్లోకి వస్తుందన్నారు. రైతులకు 4-5 విడతల కింద రుణ మాఫీ డబ్బు కూడా ఏప్రిల్లోనే అందుతుందని తెలిపారు. ‘ఎన్టీఆర్‌ భరోసా, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్‌ హౌసింగ్‌.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత టీడీపీదే. దేశంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేసిన వారెవరూ లేరు. రైతుకు పెద్దన్నగా శాశ్వతంగా ఉంటా... రైతు ప్రతినిధిగా నేను పెట్టిన అభ్యర్థులను గెలిపించాలి’ అని కోరారు. రూ.10వేల కోట్లతో బీసీల కోసం బ్యాంకు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘టీడీపీ పేదలు, బీసీలు, ఎస్సీల పార్టీ’ అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. ‘దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రాష్ట్రంలో రైతులకు మేలు చేశాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.24,500 కోట్ల రుణాలు మాఫీ చేశాం. 4,5 విడతల రుణమాఫీ మొత్తాన్ని ఏప్రిల్‌లో విడుదలచేస్తాం.
 
ఆధునిక వ్యవసాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. రైతులకు వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించాం. ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టాం. రైతులకోసం భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేసి పెద్దన్నగా తోడుంటా. రాష్ట్రంలో 15లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించి అందరికీ పెద్ద డ్రైవర్‌గా ఉంటా. కల్యాణలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.35వేల నుంచి రూ.50వేలు వరకు ఇస్తున్నాం. దీన్ని ఇకముందు రూ. లక్ష వంతున అందిస్తా. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు వంద యూనిట్లు కరెంట్‌ ఉచితంగా ఇస్తున్నాం. దీన్ని 150 యూనిట్లకు పెంచుతాం. పేదలకు సొంత ఇళ్లు సమకూర్చేందుకు ఇప్పటికే 30లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. భవిష్యత్‌లో మరో 20లక్షల ఇళ్లను నిర్మిస్తాం. ఎన్టీఆర్‌ వైద్యసేవల కింద ప్రస్తుతం రూ.5లక్షలు ఇస్తున్నాం. గర్భిణులు ఆస్పత్రిలో ప్రసవమైతే వైద్య ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. పేదలు మందులు కొనుగోలు చేసుకొనేందుకు డబ్బులు చెల్లిస్తాం. భగవంతుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు ఉన్నంత కాలం అభివృద్ధి, సంక్షేమాల కోసమే పనిచేస్తాను.’
 
పర్యాటకంలో నంబర్‌వన్‌గా విశాఖ
‘విశాఖను పర్యాటకంలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా చేస్తాం. ఇక్కడ భూగర్భ కేబుల్‌కు రూ.700 కోట్లు వెచ్చిస్తున్నాం. పార్కులు, పర్యాటకం, నాలెడ్జ్‌ ఎకానమీ అభివృద్ధి చేశాం. 1,21,152 మందికి ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇచ్చాం. ముదపాక, ట్రైజంక్షన్లలో 200 ఎకరాలు సేకరించి 55 వేల గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. దీనికి రూ.4 వేల కోట్లు వ్యయమవుతుంది. ఇవి కాకుండా మరో 90వేల ఇళ్లను మంజూరు చేశాం. దీనికి రూ.9 వేల కోట్లు అవసరం. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బీచ్‌ పక్కన 1000కి.మీ. రోడ్డు నిర్మిస్తాం. మీ భవిష్యత్‌.. నా బాధ్యత నినాదంతో ప్రజల వద్దకు వస్తున్నాం. నేను కొన్ని కులాలకు, మతాలకు పరిమితం కాను.. అందరివాడిగా మిగిలిపోవాలి. కొందరివాడిగా ఉండడం నాకిష్టం ఉండదు.’
 
యనమల సలహాలతో..
రాష్ట్ర అభివృద్ధిలో, సమస్యల పరిష్కారంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తనకు అండగా ఉంటున్నారని చంద్రబాబు తునిలో కితాబిచ్చారు. అటువంటి నాయకుడిని అందించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 37 ఏళ్లుగా రామకృష్ణుడు తనకు స్నేహితుడిగా ఉన్నారన్నారు. తుని సభలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుమార్తె విజయలక్ష్మి టీడీపీలో చేరారు.
 
చంద్రన్న బీమా 10 లక్షలు..
రెండు కోట్ల మందికి చంద్ర న్న బీమా చేశాం. ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తున్నాం. త్వరలో రూ.10 లక్షలు చేస్తాం. కోటి మందికి పసుపు కుంకుమ కింద రూ.20 వేలు రెండు విడతలుగా ఇస్తున్నాం. దీనిని త్వరలో రూ.30 వేలు చేస్తాం. ఆడబిడ్డలకు పెద్దన్నగా ఈ సాయం చేయాలని నిర్ణయించాను. వృద్ధులకు పెద్దకొడుకుగా నిలవాలని.. 55 లక్షల మందికి పింఛన్లు రూ.200 నుంచి రూ.2 వేలు చేశాం. త్వరలో రూ.3 వేలు చేస్తాం. వారంతా పెద్ద కొడుకు గెలవాలని కోరుకుంటున్నారు. 1.5 కోట్ల మందికి రేషన్‌ సరుకులు ఇస్తున్నాం. ఐదేళ్ల క్రితం కరెంటు లోటు 22.5 మిలియన్‌ యూనిట్లు ఉండేది. ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం.
 
భవిష్యత్‌లో చార్జీలు కూడా పెంచబోం. రాష్ట్రం 10.2 శాతం వృద్ధి రేటు సాధించింది. వ్యవసాయంలో 11 శాతం వృద్ధి నమోదైంది. రైతుల ఆదాయం 122 శాతం పెంచాం. అదే జాతీయ అభివృద్ధి చూస్తే కేవలం 2.7 శాతమే. అది మోదీ పనితనానికి నిదర్శనం. గత ఎన్నికల్లో ‘జాబు కావాలంటే...బాబు రావాలి’ అని ప్రచారం చేశాం. విశాఖలో మూడుసార్లు పెట్టుబడిదారుల సదస్సులు పెట్టాం. రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఆ పరిశ్రమలు పూర్తయితే 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖలో ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. డేటా సెంటర్‌ ఏర్పాటు చేశాం. నాలెడ్జ్‌ ఎకానమీకి రాజధానిగా చేస్తాం. జాబ్‌ రావాలంటే.. మళ్లీ బాబు రావాలని ప్రచారం చేయాలి.’
 
Advertisement

Link to comment
Share on other sites

Ee SC/STs assalu TDP ki vesthaara, enni chesina ?

I know few SC people, vaalla intiki 100 units ankunta free current at present also they got huge welfare benefits by TDP in last 4 1/2 years. Still, aaa jagan photo pettukoni campaign chesthunnaru maa oorilo.

Its my personal opinion as I have seen them very closely. 

Link to comment
Share on other sites

3 minutes ago, chellam said:

Few things cannot be changed over night.

Link to comment
Share on other sites

5 minutes ago, chellam said:

Ee SC/STs assalu TDP ki vesthaara, enni chesina ?

I know few SC people, vaalla intiki 100 units ankunta free current at present also they got huge welfare benefits by TDP in last 4 1/2 years. Still, aaa jagan photo pettukoni campaign chesthunnaru maa oorilo.

Its my personal opinion as I have seen them very closely. 

Try to change them.

Link to comment
Share on other sites

కొత్తవి..పాతవీ..పేదల ఇళ్లన్నీ ఉచితం! 

గృహ లబ్ధిదారులకు భారీ ఊరట 
బ్యాంకు రుణాల బాధ్యతా ప్రభుత్వానిదే 
ఇప్పటి వరకు ఉన్న అన్ని పేదల ఇళ్ల బకాయిలూ రద్దు 
నిర్మాణంలో ఉన్న వాటికీ వర్తింపు 
తెదేపా ఎన్నికల హామీ 
బకాయిల విలువ రూ.30,264 కోట్లు

31ap-main2a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో పేదల కోసం ఇకముందు కట్టబోయే ఇళ్లు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లు పూర్తి ఉచితంగానే అందనున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే పేదల ఇంటి రుణాలను బ్యాంకులకు చెల్లించే బాధ్యత కూడా తమదేనని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పేదలకు కొత్తగా కట్టించే ఇళ్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్న అన్ని రకాల ఇళ్ల బకాయిలూ రద్దు చేస్తామంది. గృహ లబ్ధిదారులకు ఇది పెద్ద ఊరటే. రద్దు చేయనున్న ఈ బకాయిల విలువ రూ.30,264 కోట్లు. ఈ హామీ గ్రామీణ, పట్టణ పరిధిలో లబ్ధిదారులు అందరికీ వర్తిస్తుందని పార్టీ స్పష్టం చేసింది. 
పట్టణ పరిధిలో రూ.21,044 కోట్లు మాఫీ 
గత ఐదేళ్ల కాలంలో పట్టణ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల బకాయిలను పూర్తిగా రద్దు చేయనుంది.  104 పురపాలికల్లో 7,01,481 ఇళ్లు మంజూరు కాగా రాయితీ పోను (కేంద్ర రాయితీ రూ.1.50లక్షలు, రాష్ట్ర రాయితీ రూ.2.5లక్షలు) ఒక్కో ఇంటికి లబ్ధిదారుడు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రూ.21,044 కోట్ల బకాయిలు మాఫీ కానున్నాయి. దీంతోపాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లు.. ఇకపై కట్టబోయే ఇళ్లను ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇవ్వనుంది. 
గ్రామీణంలో 43.5 లక్షల కుటుంబాలకు లబ్ధి 
తెదేపా తాజా హామీతో గ్రామీణంలో 43.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిపై ఉన్న రూ.9,220 కోట్ల ఇళ్ల బకాయిలు రద్దు కానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో యూనిట్‌ వ్యయంలో 50% మాత్రమే రాయితీ ఉండగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుని లబ్ధిదారులకు ఇచ్చింది. ఈ రుణాన్ని నెలవారీగా చెల్లించాల్సి ఉండేది. ఈ రుణం తీరిన తర్వాతే ఇంటి పత్రాలు లబ్ధిదారులకు చేరేవి. అయితే నెలవారీ చెల్లింపు పేదలకు తలకు మించిన భారంగా మారింది. చాలామంది బకాయిలు కట్టలేక ఇం టి పత్రాలు విడిపించుకోలేక ఏళ్ల తరబడి వేదనకు గురవుతున్నారు. ప్రస్తుత తెదేపా హామీ బడుగుల్లో అవధుల్లేని ఆనందాన్ని నింపుతోంది.

Link to comment
Share on other sites

6 minutes ago, chellam said:

Ee SC/STs assalu TDP ki vesthaara, enni chesina ?

I know few SC people, vaalla intiki 100 units ankunta free current at present also they got huge welfare benefits by TDP in last 4 1/2 years. Still, aaa jagan photo pettukoni campaign chesthunnaru maa oorilo.

Its my personal opinion as I have seen them very closely. 

NTR house anni kulaki ichharu ga

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

NTR house anni kulaki ichharu ga

Ittcharu.....adhe chebuthunna. NTR houses naaku thelisina SCs ki vachhayi. Still, maa oorilo aa jagan photo pettukoni campaign chesthunnaru.

Andhuke vaalla meedha naaku nammkam raaledhu.

Link to comment
Share on other sites

6 minutes ago, chellam said:

Ittcharu.....adhe chebuthunna. NTR houses naaku thelisina SCs ki vachhayi. Still, maa oorilo aa jagan photo pettukoni campaign chesthunnaru.

Andhuke vaalla meedha naaku nammkam raaledhu.

vallaki evaru ippicharu TDP vallega vallu emi chesthunnaru adgavacchuga

Link to comment
Share on other sites

10 minutes ago, chellam said:

Ittcharu.....adhe chebuthunna. NTR houses naaku thelisina SCs ki vachhayi. Still, maa oorilo aa jagan photo pettukoni campaign chesthunnaru.

Andhuke vaalla meedha naaku nammkam raaledhu.

Depends on local leader.

Campaigning ki money isthe veltharu 

Link to comment
Share on other sites

sc ki entha chesinaa anthe vaallu maararu. vaari badhulu bc ki ivvadam manchidhi.

maa village lo eppudu election vachinaa tdp vaallu dabbulu isthaaru . ayinaa vote maathram jagan ke vesthaaru . ee election effect choosi next emi cheyyaalo decision teesukovaali . polling booth details  manaku easy gaa telisipothaayi .

Link to comment
Share on other sites

5 minutes ago, Gunner said:

Rediculous.... :sleep: 

ee appeasement & freebies aento...

tax payers money ni max extent ki abuse chestannaru... 

Ee mukka Modi ki chepthe better.

Jagan & YSR ilaanti free schemes thone TDP ni kottaru in 2004 & 2009. Ippude CBN ade follow avuthunnadu.

Link to comment
Share on other sites

Jobs create chese vaadiki ..icome penche vaadiki right undhi public ki ivvataniki..  

Income ela penchalo idea leni kcheer, Modisha, jaffa, pancha reddy, etcccc batch ki emi right undhi?

Okka own idea undadhu ee vedhavalu ki

Link to comment
Share on other sites

23 minutes ago, Gunner said:

Rediculous.... :sleep: 

ee appeasement & freebies aento...

tax payers money ni max extent ki abuse chestannaru... 

i agree..  2004 varaku CBN dead against to welfare.. Only development.. 2004 tarvaatha YS gaadu only welfare schemes tho demigod ayyaadu.. no development.. Ippudu CBN meeda koodaa aa worship vastundi janaallo.. naaku telisi india lo ippativaraku inni welfare schemes evadu cheyyaledu.. CBN rocks.. 

Link to comment
Share on other sites

Isthamochinattu freebees ivandi no problem at all.. Adhi Middle and Above middle class ki kuda touch ayyetattu chudandi.. 

Penchina revenue evadiko appacheppi valu meme develop chesamu ani todalu kottukune badhulu.. CBN ee aa Freebees ichi name techukovadam best.. Hardcore votebank ga marchukovali..

2024 ki kuda same strategy follow avvali..

Link to comment
Share on other sites

10 minutes ago, Raaz@NBK said:

True

Link to comment
Share on other sites

20 minutes ago, sonykongara said:

miru ekkda kadutunnaru bro

Adhe antundhi...AP lo income tax katte batch chala thakkuva.... and CBN has every right to distribute money because he has capable to increase income and jobs...

Thatswhat i am saying

Link to comment
Share on other sites

19 minutes ago, Raaz@NBK said:

i agree..  2004 varaku CBN dead against to welfare.. Only development.. 2004 tarvaatha YS gaadu only welfare schemes tho demigod ayyaadu.. no development.. Ippudu CBN meeda koodaa aa worship vastundi janaallo.. naaku telisi india lo ippativaraku inni welfare schemes evadu cheyyaledu.. CBN rocks.. 

1995 - 2004 varaku state ki entha chesina cbn bommaki dandam pettam nenu chudla , ippudu first time chusthunna.

Link to comment
Share on other sites

2 minutes ago, ask678 said:

Adhe antundhi...AP lo income tax katte batch chala thakkuva.... and CBN has every right to distribute money because he has capable to increase income and jobs...

Thatswhat i am saying

nenu edo  saradaga adiga anthe..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...