Jump to content

దుమ్మురేపే ఖమ్మం!


koushik_k

Recommended Posts

  • ఆర్థిక దిగ్గజాల హోరాహోరీ
  • కారులో అజయ్‌.. సైకిల్‌పై నామా..
  • తొలిసారి జెండా ఎగరేయాలని టీఆర్‌ఎస్‌
  • పోయిన పార్టీ పట్టు కొనసాగించాలని టీడీపీ..
  • ఖమ్మం అసెంబ్లీలో బిగ్‌ఫైట్‌
 
ఖమ్మం (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఖమ్మం సెగ్మెంట్లో తొలిసారిగా జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతుంటే.. జిల్లాలో మసకబారిన పార్టీ ప్రాబల్యాన్ని పునరుజ్జీవింపజేయాలని టీడీపీ ఎత్తులు వేస్తోంది. రెండేళ్ల కిందట జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల వరకూ ఇక్కడ కాంగ్రెదే పట్టు. ఆ ఎన్నికల్లో మంత్రి తుమ్మల చక్రం తిప్పడంతో మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ వశమైంది. అప్పటి వరకూ కాంగ్రె్‌సలో ఉన్న ఎమ్మెల్యే అజయ్‌ కూడా కారెక్కేశారు. ప్రభుత్వ పథకాలతోపాటు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నది అజయ్‌ అంచనా! బలమైన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ ఓటు బ్యాంకుకు తోడు ప్రభుత్వ వ్యతిరేకత విజయ తీరాలకు చేరుస్తుందన్నది కూటమి అభ్యర్థి నామా ధీమా! ఇద్దరూ ఆర్థిక హేమాహేమీలు కావడంతో ఈసారి ఎన్నికల్లో కాసుల వర్షం కురవబోతోందన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. ఎన్నికల్లో కారుకు బ్రేకులు వేసి సైకిలు జోరు కొనసాగిస్తుందా!? సైకిల్‌ను నిలవరించి కారు దూసుకుపోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
 
అనూహ్యంగా..
puvv3.pngతొలుత వైసీపీలో చేరి.. అక్కడ ఇమడలేక కాంగ్రె్‌సలో చేరిన అజయ్‌.. గత ఎన్నికల్లో అప్పటి టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. రెండేళ్లు కాంగ్రె్‌సలోనే కొనసాగి.. కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత తన మిత్రుడు మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎ్‌సలో చేరారు. మొదట్లో మంత్రి తుమ్మలతో కొంత విభేదించినా.. తర్వాతి పరిణామాల్లో ఆయనకు చేరువయ్యారు. ఈసారి తనకు సరైన పోటీ ఉండదని, ఎవరు పోటీ చేసినా గెలుపు తనదేనన్న విశ్వాసంతో ఉన్నారు. కానీ, ఊహించని విధంగా నామా నాగేశ్వరరావు ప్రత్యర్థిగా నిలిచారు. లోక్‌సభకే పోటీ చేయాలని నామా భావించినా.. చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీటైన అభ్యర్థి నామాను ఎదుర్కోవడం ఇప్పుడు అజయ్‌కు సవాలే. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే శ్రీరామరక్ష అని ఆయన భావిస్తున్నా.. అక్కడక్కడా ఉన్న అసంతృప్తి సెగలు, టీఆర్‌ఎ్‌సలోని అంతర్గత గ్రూపులు కొంత ఇబ్బందులు తెచ్చే పరిస్థితి లేకపోలేదు. తండ్రి వారసత్వం కారణంగా కూటమిలో ఉన్న సీపీఐ పరోక్ష సహకారం ఇస్తుందన్న ఆశతో అజయ్‌ ఉన్నారు. మాజీ ఎంపీగా ఇప్పటికే తనకు పట్టుందని, దీనికితోడు కాంగ్రెస్‌, సీపీఐ సహకారంతో తిరుగుండదని నామా భావిస్తున్నారు.
 
ఇద్దరూ వ్యూహకర్తలే
puvva-2.pngఅజయ్‌, నామా ఇద్దరూ వ్యూహకర్తలే. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్‌లో మైనారిటీ ఓటర్లు 38 వేల వరకు ఉండటంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఇక్కడ కమ్మ ఓట్లు 45 వేలు ఉండటం, ఇద్దరూ అదే సామాజిక వర్గం కావడంతో ఆ ఓట్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.
 
 
 
మంత్రి తుమ్మల వ్యూహాలు
puvva4.pngఖమ్మంలో గెలుపు బాధ్యతను కేసీఆర్‌ మంత్రి తుమ్మలకు అప్పగించారు. దాంతో, ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన ఇప్పటికే కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన నాయకులు చేజారిపోకుండా పావులు కదుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌, సీపీఐ నేతలను తనవైపు తిప్పుకొనేందుకు అజయ్‌కుమార్‌ కూడా వ్యూహలు రచిస్తున్నారు. ఖమ్మం సెగ్మెంట్‌లో మొత్తం 2.58 లక్షల ఓటర్లు ఉంటే.. వారిలో పట్టణంలోనే 2,15,000 మంది ఉన్నారు. కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే.. ఎన్నికల్లో 34 డివిజన్లను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో తొమ్మిదిమంది టీఆర్‌ఎ్‌సలో చేరారు. దాంతో, ఏకంగా 43 మంది కార్పొరేటర్లు అధికార పార్టీవారే. దాంతో, ఇరు పార్టీల నేతలూ కార్పొరేషన్‌పైనే కన్నేశారు. నామా తరపున చంద్రబాబు, బాలకృష్ణతోపాటు పలువురు నేతలు ప్రచారపర్వంలోకి దిగే అవకాశం ఉంది.
 
పువ్వాడ నాగేశ్వర్ రావు 
 
అనుకూలతలు
  • గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం
  • వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం
  • అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండటం
  • కిందిస్థాయిలో కేడర్‌ బలంగా ఉండటం
  • ఖమ్మం నగరంలో 43 మంది కార్పొరేటర్ల అండ
ప్రతికూలతలు
  • కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి మారాడన్న పేరు
  • ఎమ్మెల్యేగా ఆయన తీరుపై కొందరిలో అసంతృప్తి
  • ఉద్యోగ సంఘాల నేతల్లోనూ అసహనం
  • ఆయన ఓటమికి కొన్ని శక్తులు తెరవెనక ప్రయత్నించడం
 
నామా నాగేశ్వర్ రావు 
అనుకూలతలు
  • ఖమ్మం నుంచి గతంలో ఎంపీగా పనిచేసి ఉండటం
  • కూటమి ఓట్ల బలం.. నియోజకవర్గంలో పరిచయాలు
  • టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు
  • టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్లు
  • ఎంపీగా స్వల్ప ఓట్లతో ఓడిపోయారన్న సానుభూతి
ప్రతికూలతలు
  • గత ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్ధుగా..
  • స్థానిక రాజకీయాలకు దూరంగా ఉండటం
  • కేడర్‌ కొంత ఉన్నా సంస్థాగత కమిటీలు లేకపోవడం
  • కాంగ్రెస్‌ గ్రూపు రాజకీయాలు, సీపీఐలో కొందరి నేతల
  • సహకారం ప్రత్యర్థికి ఉంటుందన్న ప్రచారం.
Link to comment
Share on other sites

  • Replies 78
  • Created
  • Last Reply
6 hours ago, Siddhugwotham said:

Town lo baaga anti vundi Ajay meeda.. In particular, small & middle business section not happy with Ajay...

Ajay worked well. No corruption. Muslims support techukunadu. Own cadre from CPI undi, anduke tummala meeda gelichadu 2014 lo. Plus 2014 lo Ajay money jalladu, tummala teeyaledu.

 

ee sari Nama money teeste, tight fight. Otherwise Ajay. Kammas TDP ki vestaremo majority, but not all will do. Konchem margin tho aina Ajay gattekutadu ani talk. Interesting fact is 2014 lo tummala ni odinchadaniki Nama tana votlu Ajay ki veyinchadu. Nama got 26k majority in Town, Ajay won by 6k. 

Link to comment
Share on other sites

1 hour ago, Pruthvi@NBK said:

Ajay worked well. No corruption. Muslims support techukunadu. Own cadre from CPI undi, anduke tummala meeda gelichadu 2014 lo. Plus 2014 lo Ajay money jalladu, tummala teeyaledu.

 

ee sari Nama money teeste, tight fight. Otherwise Ajay. Kammas TDP ki vestaremo majority, but not all will do. Konchem margin tho aina Ajay gattekutadu ani talk. Interesting fact is 2014 lo tummala ni odinchadaniki Nama tana votlu Ajay ki veyinchadu. Nama got 26k majority in Town, Ajay won by 6k. 

Meedi khammam ah??

Link to comment
Share on other sites

ఓటమి భయం తో ఖమ్మం లో బెదిరింపులకు దిగుతున్న పువ్వాడ అజయ్(తెరాస)..

ఖమ్మం మిత్రుడు పంపిన వాట్సప్ మెసేజ్..

వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లూరి .చంద్రయ్య గారిని ఏసీపీ ఆఫీస్ కి పిలిచి హెచ్చరించింది నిజం కాదా ..?
మొన్న శ్యామల అనే మీ పార్టీ దళిత మహిళను వాళ్ళ కాలనీలో ఓట్లడగటానికి వచ్చిన మీ అర్ధాంగిని ఏం అభివృద్ధి చేసారని సపోర్ట్ చెయ్యాలి అని ప్రశ్నించినందుకు రాత్రి 10 :30 గంటల వరకు పోలీసుస్టేషన్ లో ఉంచి బెదిరించి పంపింది నిజం కాదా..
మీరు ఓడిపోతారనే మాట వాకింగ్ లో చర్చించినందుకు మమత హోటల్ నరేందర్ గారిని పోలీస్ స్టేషన్ కి పిలిచి బెదిరించింది నిజం కాదా ..?
మా నల్లమల్ల రంజిత్ ని కమ్మమహాజన సంఘం ఏర్పాటు చేసిన గడిచిన సంవత్సర వనభోజనాలలో ఇది తెరాస మీటింగా లేక వనభోజనాల అని ప్రశ్నించినందుకు మూడురోజులు ఏసీపీ ఆఫీస్ లో ఉంచింది నిజం కాదా..?
మీ ప్రభుత్వం కట్టించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లోపాలను చూపిన మా తెలుగుయువత నాయకుడిని మీరు ఇబ్బందులకు గురిచేసింది నిజం కాదా..?
అంతెందుకు facebook,వాట్సాప్ లలో మీపై వచ్చే ఆరోపణలను పోస్ట్ చేసిన వారిని పోలీసుస్టేషన్ లకు పిలిపించి బెదిరించింది నిజం కాదా..?
మళ్ళీ గెలిస్తే వాళ్ళకి చుక్కలు చూపిస్తా అని మీరన్నది నిజం కాదా..?
మీ వాళ్ళు ఫోన్లు చేసి కొంచెం జాగ్రత్త జరగబోయే నామినేషన్ తర్వాత యుద్ధ వాతావరణం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండమని మా వాళ్ళని హెచ్చరించింది నిజం కాదా..?
ఇన్నిరోజులు మీకు తెలిసి జరిగిన అరాచకాన్ని నా ప్రమేయం లేకుండా జరిగింది అనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటో మీకే తెలియాలి .
ఓటమిభయముతో మీరు మీ తప్పులను కప్పిపుచ్చుకొని ప్రచారం కొనసాగించాలనుకోవడం మీ అవివేకం ?

Link to comment
Share on other sites

కేసీఆర్ ఆ రెండూ ఎందుకు తేలేకపోయారు: నామా
20-11-2018 13:54:02
 
636783188437536537.jpg
 
ఖమ్మం: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై టీడీపీ నేత నామా నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ లేదన్న కేసీఆర్.. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకే చంద్రబాబును కేసీఆర్‌ టార్గెట్ చేశారన్నారు. అధికారంలో ఉన్న కేసీఆర్‌ తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్‌వర్సిటీ ఎందుకు తేలేకపోయారని నామా ప్రశ్నించారు.
 
కేసీఆర్‌ పాలనలో 8 వేల పరిశ్రమలు మూతపడ్డాయని నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట అంచనా వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణ ఇవ్వమని లేఖ రాశారని.. ప్రాజెక్టులు అడ్డుకోమని కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే.. తొలి ఓటు వేసింది తానేనని నామా తెలిపారు. ఖమ్మంలో అంతా నామా జపం చేస్తున్నారని, కేసీఆర్ కూడా నిన్న నామా జపమే చేశారని నామా నాగేశ్వరరావు అన్నారు.
Link to comment
Share on other sites

17 hours ago, Pruthvi@NBK said:

Ajay worked well. No corruption. Muslims support techukunadu. Own cadre from CPI undi, anduke tummala meeda gelichadu 2014 lo. Plus 2014 lo Ajay money jalladu, tummala teeyaledu.

 

ee sari Nama money teeste, tight fight. Otherwise Ajay. Kammas TDP ki vestaremo majority, but not all will do. Konchem margin tho aina Ajay gattekutadu ani talk. Interesting fact is 2014 lo tummala ni odinchadaniki Nama tana votlu Ajay ki veyinchadu. Nama got 26k majority in Town, Ajay won by 6k. 

Nama majority could be due to vote split between YCP, Congress, CPI and TRS in the town. I don't think Nama has that much cadre which could bring 26K votes additional. 

Link to comment
Share on other sites

నడుం బిగించింది రా నామా సైన్యం… కదం తొక్కుతోందిరా… ఖమ్మం జనం’ అంటూ ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నికల ప్రచార గీతంతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు సోమవారం భారీ ర్యాలీతో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రజా కూటమికి చెందిన వేలాది మంది కార్యకర్తలు తమ తమ పార్టీల జెండాలను చేబూని నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

32-nama-5325-1024x682.jpg

సోమవారం ఉదయం ఏడు గంటలకే నెహ్రూనగర్‌లోని నామా నాగేశ్వరరావు నివాసం వద్ద నామినేషన్ సందడి నెలకొంది. కార్యకర్తల కోలాటం, డబ్బు వాయిద్యాల నృత్యాలతో ప్రజాకూటమి కార్యకర్తలు అత్యంత ఆనందంతో నామా ర్యాలీలో నృత్యాలు చేయడం విశేషం. నగరంలో అనేక గంటలపాటు సాగిన ర్యాలీ అనంతరం ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నామా నాగేశ్వరరావు తన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తన మాతృమూర్తి వరలక్ష్మి పాదాలకు నామా నాగేశ్వరరావు పాదాభి వందనం చేసి, ఆశీస్సులు తీసుకుని నామినేషన్ దాఖలు కార్యక్రమానికి బయలుదేరారు. జిల్లా పరిషత్ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నామా నాగేశ్వరరావుతో పాటు ప్రజాకూటమి పార్టీలకు చెందిన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలోని నెహ్రూనగర్‌లో గల తన నివాసం నుంచి ప్రారంభమైన నామా నామినేషన్ ర్యాలీ అత్యంత కోలాహలంగా సాగింది. పలు చోట్ల మహిళలు, వృద్ధులు నామా నాగేశ్వరరావుతో కరచాలనం చేశారు.

 

32-nama-32523-1024x682.jpg

నామా నాగేశ్వరరావు నామినేషన్ ధరావత్తు సొమ్మును ఖమ్మం అటో డ్రైవర్లు సమకూర్చి ఆయనకు మద్దతు తెలపడం విశేషం. తన నామినేషన్ పత్రాలతో పాటు తనపై అభిమానంతో ఆటో డ్రైవర్లు ఇచ్చిన ధరావత్తు నగదును నామా రిటర్నింగ్ అధికారులకు చెల్లించారు. ప్రజాకూటమి పార్టీల అనుబంధ అటో కార్మిక సంఘాల నాయకులు నామాకు ఈ ధరావత్తు సొమ్మును అందించారు. కూటమి గెలుపును ఖమ్మంలో తన కళ్లతో చూసేందుకు, తెరాస ఓటమి చూడటం కోసం ప్రజా కూటమి అభ్యర్థి నామాను గెలిపించేందుకు కూటమిలోకి మాజీ ఎమ్మెల్యే వచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యేగా 1999, 2004లో రెండు సార్లు నెగ్గిన కాంగ్రెస్‌ నేత,  పారిశ్రామికవేత్త, విద్యాసంస్థల అధినేత యూనిస్‌ సుల్తాన్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరి నామా గెలుపుకు కృషి చేస్తున్నారు. ఆయన రాకతో 30 శాతం జనాభా ఉన్న ముస్లిం ఓట్లు ఖాయంగా నామాకే పడతాయని తెరాస భయపడుతోంది.

Link to comment
Share on other sites

ఖమ్మంలో తెరాసకు ఎదురుదెబ్బ

1226352611BRK-TRS-KMM.JPG

ఖమ్మం: ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బుడాన్‌ బేగ్‌ పార్టీని వీడనున్నారు. ఖమ్మంలో ఈ నెల 28న నిర్వహించే ప్రజాకూటమి బహిరంగ సభావేదికగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014లో తెరాస తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బుడాన్‌ బేగ్‌.. తెరాస ఆవిర్భావం నుంచి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.

Link to comment
Share on other sites

ఈనెల 28న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ .టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు బుడాన్ బేగ్.టిఆర్ఎస్ కు చెందిన నాయకులు ఆర్.జె.సి కృష్ణ ,కొండబాల కోటేశ్వరరావు, జెడ్.పి. చైర్ పర్సన్ గరిడేపల్లి కవిత, ఆరుగురు కార్పొరేటర్లు టిడిపిలో చేరనున్నారు. I 

Link to comment
Share on other sites

5 minutes ago, Saichandra said:

ఈనెల 28న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ .టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు బుడాన్ బేగ్.టిఆర్ఎస్ కు చెందిన నాయకులు ఆర్.జె.సి కృష్ణ ,కొండబాల కోటేశ్వరరావు, జెడ్.పి. చైర్ పర్సన్ గరిడేపల్లి కవిత, ఆరుగురు కార్పొరేటర్లు టిడిపిలో చేరనున్నారు. I 

ee candidate tdp nunchi trs ki velladanukunta ga tummala tho patu?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...