Jump to content
sonykongara

East Godavari Politics

Recommended Posts

Posted (edited)
ముందస్తు కసరత్తు
26-04-2018 13:18:13
 
636603454929981087.jpg
  • ఆరు స్థానాల్లో కొత్తవారి కోసం టీడీపీ అన్వేషణ
  • సామాజిక సమీకరణాలపై వైసీపీ దృష్టి
  • ఇద్దరేసి ఇన్‌చార్జిలు ఉన్నచోట వడపోత
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా ప్రధాన రాజకీయ పక్షాలు ముందస్తు కసరత్తు మొదలుపెడుతున్నాయి. అధికార టీడీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో కొత్తవారి కోసం అన్వేషిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తలనొప్పిగా తయారైన సామాజిక అంశాలను చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమైంది. ఇద్దరేసి కో-ఆర్డినేటర్లు ఉన్న నియోజకవర్గాల్లో వడపోతకు ఆ పార్టీ నేతలు కసత్తు ప్రారంభిస్తున్నారు. అధికార టీడీపీలో ఆరు అసెంబ్లీ స్థానాలకు కొత్తవారిని తీసుకోవడంపై ఇప్పటికే దృష్టి సారించింది.
 
కోనసీమలో రెండుచోట్ల, రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో ఒక ఎమ్మెల్యేని, కాకినాడ లోక్‌సభ పరిధిలో ముగ్గురిని మార్చాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. మెరుగైన అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచీ ఆరా తీసే పనిలో ఆ పార్టీ నిమగ్నమైంది. పార్టీ కేడర్‌లోను, ప్రజల్లోను క్రేజ్‌ తగ్గుతున్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను గుర్తించే తొలి దశ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. కోనసీమలో మార్పు చేసే స్థానాల్లో ఒక అసెంబ్లీకి లోక్‌సభ దివంగత స్పీకర్‌ బాలయోగి కుమారుడి పేరును ఇప్పటికే పరిశీలనలో ఉంచారు. రాజమహేంద్రవరం పరిధిలో మార్పు చేయాలనుకుంటున్న స్థానం నుంచి ప్రముఖ విద్యా సంస్థల అధినేతతో ఇప్పటికే టీడీపీ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. కాకినాడ లోక్‌సభ పరిధిలో మూడుచోట్ల మార్చాలని భావిస్తుండగా.. ఒక స్థానంలో ఇప్పటికే అభ్యర్థిని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మిగిలిన రెండు స్థానాలపై మే నెలాఖరుకు క్లారిటీ రావచ్చు.
 
 
వైసీపీలో సామాజిక సమీకరణలు
బలమైన సామాజికవర్గం కుల సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం గందరగోళంలోపడింది. అయితే పైకి మాత్రం ఆ పార్టీ కీలక నాయకులు గంభీరంగా ఉన్నారు. ఈ సామాజిక గందరగోళాలను చక్కబెట్టుకునేందుకు ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌ బాబాయ్  వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. వైసీపీకి మరో తలనొప్పి ఇద్దరేసి కో-ఆర్డినేటర్లు ఉన్న అసెంబ్లీ పరిధిలో వడపోత కార్యక్రమం. ఎన్నికలు దగ్గరకు వచ్చే వరకు ఆగకుండా ఇపుడే ఈ ప్రక్రియ చేపట్టాలని వైసీపీ సలహాదారు ప్రశాంత్‌కిషోర్‌ బృందం జగన్‌కి సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కాకినాడ సిటీలో స్పష్టత ఇచ్చారు. ముమ్మిడివరం కూడా ఓ కొలిక్కి వచ్చింది. మండపేటను పెండింగులో ఉంచారు.
 
 
నమ్మకమైన కేడర్‌ అవసరం
టీడీపీకి జిల్లాలో నమ్మకమైన కేడర్‌ అవసరం ఎక్కువగా కన్పిస్తోంది. వైసీపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన వారికి అగ్రపీఠం వేస్తూ తమను నిరక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం సీనియర్‌ కార్యకర్తల్లో గూడుకట్టుకుని ఉంది. సమర్ధతను పట్టించుకోకుండా పదవులు ఇవ్వడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. చాలాకాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్నా పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు కనీసం ఆ విషయాన్ని కీలక నాయకులెవరూ చెప్పి సర్దుబాటు చేయడంలోనూ టీడీపీ నేతలు దృష్టిసారించట్లేదు.
 
మెరుగైన సంక్షేమం, అభివృద్ధి పథకాలు సాగుతున్నా.. కేడర్‌లో అసంతృప్తిని కట్టడిచేయడంలో మాత్రం టీడీపీ నిర్లక్ష్యం కన్పిస్తోందని ఆ పార్టీలో సీనియర్‌ నేత , ప్రజాప్రతినిధి బాహాటంగా చెప్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానంటున్నారు. సిన్సియర్‌, సీనియర్‌ కార్యకర్తలను చాలామంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారని సదరు ప్రజాప్రతినిధి ఆందోళన చెందుతున్నారు. అదే వైసీపీ విషయానికి వస్తే వైఎస్‌ హయాంలో లబ్ధి పొందిన వారంతా ఇపుడు కమిట్‌మెంట్‌తో పనిచేయడం వైసీపీకి పెద్ద ప్లస్‌ పాయింట్‌గా ఉందని కూడా పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.
Edited by sonykongara

Share this post


Link to post
Share on other sites
1 minute ago, rama123 said:

Gelavadaa

Too much competition for ticket aa place lo... Last time kuda last minute lo announce chesaaru ga... Eeyana work wise ok gaani, non local anna feeling ekkuva vundi janallo... 

Share this post


Link to post
Share on other sites
1 minute ago, Nandamuri Rulz said:

Too much competition for ticket aa place lo... Last time kuda last minute lo announce chesaaru ga... Eeyana work wise ok gaani, non local anna feeling ekkuva vundi janallo... 

Party ki loyal ado okkati chalu .prp appudu kuda party marala .best candidate

Share this post


Link to post
Share on other sites
Posted (edited)
1 minute ago, rama123 said:

Party ki loyal ado okkati chalu .prp appudu kuda party marala .best candidate

Yep.. like venkayya to bjp.. kattu banisa kattapa maa lemons small king appa

Edited by Nandamuri Rulz
Cheppanu... Em eekkuntaavo eekko

Share this post


Link to post
Share on other sites
3 minutes ago, Nandamuri Rulz said:

Yep.. like venkayya to bjp.. kattu banisa kattapa maa lemons small king appa

Mee local candidate evaro okaayana undaaligaa ... party lo ne unnaada? 

Share this post


Link to post
Share on other sites
Posted (edited)
3 minutes ago, nbk@myHeart said:

Mee local candidate evaro okaayana undaaligaa ... party lo ne unnaada? 

Boddu bhaskara rao.. he is back to TDP.. MLC ichinattunnaaru 

Edited by Narendra1

Share this post


Link to post
Share on other sites
21 minutes ago, Narendra1 said:

Boddu bhaskara rao.. he is back to TDP.. MLC ichinattunnaaru 

Inko peddaayana chinnabbaay or some name undaali.... rulz vaalla ooru anukunta

Share this post


Link to post
Share on other sites
28 minutes ago, Ntrforever said:

Market committee chairman

So boddu ki MLC and abbaay gaariki market committee chairman.. ika rulz okkadini oppisthe  Lemmon uncle ki line clear emo ga....

Share this post


Link to post
Share on other sites
4 hours ago, nbk@myHeart said:

Inko peddaayana chinnabbaay or some name undaali.... rulz vaalla ooru anukunta

Haa annai maa oore... Raajabbayi... Market committee chairman ichaaru long back

Share this post


Link to post
Share on other sites
3 hours ago, nbk@myHeart said:

So boddu ki MLC and abbaay gaariki market committee chairman.. ika rulz okkadini oppisthe  Lemmon uncle ki line clear emo ga....

Hmm... Mla seat ivvakapothe prp 2.0 ki jump memu.. basthi me sawal :sleep:

Share this post


Link to post
Share on other sites
4 hours ago, Nandamuri Rulz said:

Hmm... Mla seat ivvakapothe prp 2.0 ki jump memu.. basthi me sawal :sleep:

Mee ooriki home cum deputy CM post isthante inkaa mla kosam aduguthaara? Jai Lemmon uncle 

Share this post


Link to post
Share on other sites
ఊరంతా అనుకుంటున్నారు!
07-05-2018 13:38:09
 
636612970886677651.jpg
  • ముందుగానే తేల్చేశారు.. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
  • మండపేట, రంపచోడవరం మినహా.. 17 చోట్ల క్లియర్‌
  • లోక్‌సభ అభ్యర్థుల కోసం వేట
తూర్పుగోదావరి జిల్లా: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే..అభ్యర్థులకు ఒక సమాచారం అందిస్తే..వారు తమ నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే ప్రచారం చేసుకొని.. బూత్‌ లెవెల్‌ వరకు వెళ్లే అవకాశం ఉందని, తద్వార బలోపేతమయ్యేందుకు అవకాశం ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు భోగట్టా. ఈ నేపథ్యంలో 19 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రతి పక్ష వైసీపీ మెజార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. మండపేట, రంపచోడవరం మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు అభ్యర్ధుల జాబితా దాదాపు ఖరారైనట్లే. 15 నియోజకవర్గాలలో కోఆర్డినేటర్లకు లైన్‌ క్లియర్‌ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం.
 
పెద్దాపురం, పిఠాపురం అభ్యర్థుల విషయంలో ప్రస్తుతానికి కోఆర్డినేటర్లకే ఇస్తా మన్న భరోసా ఇచ్చినా.. బలమైన అభ్యర్థులు దొరికితే పునరాలోచిస్తారన్న ప్రచారం సాగుతోంది. తుని, కొత్తపేట నియోజకవర్గాలలో పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డిలకు అధినేత జగన్‌ మళ్లీ పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ముమ్మిడివరం నుంచి మత్స్యకార నాయకుడు పొన్నాడ సతీష్‌, రామచంద్రపురం, జెడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలకు టికెట్‌ ఇచ్చినట్లు సంకేతాలొచ్చాయి.
 
 
మండపేటపైనా సర్వే..
మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి ఇద్దరు కోఆర్డినేటర్లు ఉన్నారు. వేగుళ్ల లీలాకృష్ణ, వేగుళ్ల పట్టాభి రామారావు. వీరిద్దరిలో ఎవరైతే బలమైన అభ్యర్ధి అనే దానిపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. వైసీపీ సలహాదారుడు ప్రశాంత్‌ కిషోర్‌ బృందం 6 దఫాలు మండపేటలో సర్వే నిర్వహించినట్లు సమాచారం. అభ్యర్ధి ఎంపిక విషయంలో పీకే.. జగన్‌కి ఇచ్చిన నివేదికలో ఆర్ధిక పరమైన అంశం పరిగణలోకి తీసుకోకపోతే యువనేతకే అవకాశాలు ఎక్కువని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్‌ త్వరలో నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. రంపచోడవరం నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన వంతల రాజేశ్వరి టీడీపీలోకి మారడంతో ఇక్కడ వైసీపీ కొత్త అభ్యర్ధిని తెరపైకి తేవాలి. ఏజెన్సీలో ఒక వ్యక్తి చెప్పే అంశాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్‌ ఇస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది.
 
 
లోక్‌సభ అభ్యర్థుల కోసం.. వేట
వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో స్పష్టత వచ్చినా, లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులపై ఇంకా క్లారిటీ లేదు. రాజమహేంద్రవరం నుంచి సినీ డైరెక్టర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అమలాపురం నుంచి పోటీకి ఇన్‌కమ్‌టాక్స్‌ సర్వీసులో ఉన్న ఒక అధికారి టికెట్‌ ఖరారైన తర్వాత రిజైన్‌ చేసి వస్తారని చెబుతున్నారు. కాకినాడ లోక్‌సభ అభ్యర్ధిత్వం పెండింగ్‌లో పడింది. ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
 
 
అదిరింపులకు బెదర లేదు..
సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందంటూ ఒక సామాజిక వర్గం వ్యతిరేకగళం విప్పింది.. వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదని చెబుతున్నారు. జగన్‌ ముందు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఎట్టకేలకు సమావేశాలు ఏర్పాటుచేసి.. హడావుడి చేసిన నేతలు తర్వాత పరిణామాలతో మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

Share this post


Link to post
Share on other sites
18 minutes ago, niceguy said:

MM ayithe Rajamundry gone case ani talk from friends..

Bose ni laagandi..BC votes solid gaa padathai..

bose ki eh seat istaru :thinking: jagan hami ichadu bose ki govt form chesthe ministry istha ani

Share this post


Link to post
Share on other sites
2 minutes ago, Godavari said:

bose ki eh seat istaru :thinking: jagan hami ichadu bose ki govt form chesthe ministry istha ani

Bose vasthe BC vote bank anndi point..YSR ki bose valle ekkuva BC votes vachai ani chepthaaru gaa papers lo..

Share this post


Link to post
Share on other sites
1 hour ago, niceguy said:

Bose vasthe BC vote bank anndi point..YSR ki bose valle ekkuva BC votes vachai ani chepthaaru gaa papers lo..

ipudu bose weak aypoyadu ramachandrapuram constitency lone own caste lo division came few supporting thota bec of development and their personal works 

Share this post


Link to post
Share on other sites
8 minutes ago, Godavari said:

ipudu bose weak aypoyadu ramachandrapuram constitency lone own caste lo division came few supporting thota bec of development and their personal works 

Trimurtulu rural ki maralanukuntunnadu anta ga 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×