Jump to content

AIIMS

sonykongara

Recommended Posts

  • 3 weeks later...
  • Replies 203
  • Created
  • Last Reply
ఎయిమ్స్ నిర్మణానికి ఆహ్వానం
 
636202351407260160.jpg
  • రూ.1620 కోట్లతో గ్లోబల్‌ టెండర్లు
  • వెబ్‌సైట్లలో టెండరు ముసాయిదా
  • హెచ్‌ఎస్‌సీసీఎల్‌ పర్యవేక్షణలో పనులు
 
అమరావతి/మంగళగిరి: మంగళగిరి ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)కు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రూ.1620 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు గ్లోబల్‌ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ది టెండర్స్‌ డాట్‌కామ్‌, ప్రాజెక్ట్స్‌ టుడే వెబ్‌సైట్లలో టెండరు ముసాయిదాను ఉంచింది. ప్రాజెక్టు ఐడీ నెంబరును 14092గా పేర్కొన్నారు. సాధారణ టెండర్ల మాదిరిగా పూర్తి వివరాలను మాత్రం అందులో పొందుపరచలేదు. ఆసక్తి కలిగిన, అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ గ్లోబల్‌ టెండర్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. హాస్పిటల్‌ సర్వీసెస్‌ కన్సల్టెన్సీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పర్యవేక్షణలో ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగనున్నాయి. ఈ విధానంలో ఆసక్తి కలిగిన కాంట్రాక్టర్లు తమ అర్హతలు, పూర్వానుభవంతో కూడిన వివరాలను సంబంధిత వెబ్‌సైటులో పొందుపరిచి సబ్‌స్ర్కైబ్‌ అయినప్పుడే టెండరుకు సంబంధించిన పూర్తి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఇప్పటికే రూ.8 కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌కు కేటాయించిన 193 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులు ఇంచుమించు 85 శాతం పూర్తయ్యాయి. ఎయిమ్స్‌ ప్రాంగణానికి ఉత్తర, దక్షిణ దిశల్లో ప్రహరీ నిర్మాణ పనులు పూర్తికాగా తూర్పు పడమర దిశల్లో పనులు జరగాల్సి ఉంది.
 
బాబు పట్టు .. వెంకయ్య చొరవ
ఎయిమ్స్‌ ప్రాజెక్టు కార్యాచరణను కేంద్రం వేగవంతం చేసినట్టే భావించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అవసరమైన గ్రౌండింగ్‌ వర్క్‌ను పూర్తిచేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లు, మాస్టర్‌ప్లానులకు సంబంధించి కన్సల్టెన్సీ ఏజెన్సీని ఖరారు చేసే ప్రక్రియ పూర్తికావడంతో అసలు సిసలైన భవన నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఆసుపత్రి భవన ఆకృతుల కోసం చేపట్టిన బిడ్డింగ్‌ ప్రక్రియ గత సెప్టెంబరు తొమ్మిదో తేదీతో పూర్తయింది. ఈ క్రమంలో రూ 8.86 కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌ ప్రాంగణం 193 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. 2018లోగా నూరుశాతం పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుబట్టడంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. మంగళగిరిలో నిర్మించనున్న ఎయిమ్స్‌ కోసం మొత్తం రూ.1620 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ 1090 కోట్లను నిర్మాణ పనులకుగాను, రూ 530 కోట్లను ఆసుపత్రి నిర్వహాణ సామాగ్రి కోసం ఖర్చు చేస్తారు.
 
నిపుణుల బృందం సూచనల మేరకు..
మంగళగిరి ఎయిమ్స్‌ ప్రాంగణాన్ని గత సెప్టెంబరులో సందర్శించిన కేంద్ర నిపుణుల బృందం సూచించిన అంశాల మేరకు క్షేత్రస్థాయిలో చకచకా సంబంధిత చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా జాతీయ రహదారి నుంచి 1.1 కిలోమీటర్ల నిడివిలో కొత్త రహదారిని యుద్ధప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎనిమిదిన్నర ఎకరాలు అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ, పోలీసు, అటవీ, రెవెన్యూ వర్గాలు ఉమ్మడిగా సర్వే చేశాయి. ఎయిమ్స్‌ ప్రాంగణం మధ్యగా వెడుతున్న విద్యుత్‌ హైటెన్షన్‌ లైన్లను ప్రహరీ అంచులకు తరలించాలన్న నిపుణుల సూచన మేరకు విద్యుత్‌శాఖాధికారులు సంబంధిత పనులను పూర్తిచేశారు.
 
రెవెన్యూ , అటవీ శాఖల కసరత్తు
ప్రత్యేక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఈశాన్యంలో హెచ్చుతగ్గులను వాస్తుపరంగా సరిచేసుకునేందుకు, హైవే నుంచి నూతనంగా నిర్మించాల్సిన రహదారి కోసం మూడు వేర్వేరు ప్రాంతాలలో రెండున్నర ఎకరాల వంతున మొత్తం ఏడున్నర ఎకరాలను అటవీశాఖ నుంచి బదలాయించాలన్న ప్రతిపాదనలపై రెవెన్యూ, అటవీశాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనులు మాత్రం గత మూడున్నర మాసాలుగా ముందడుగు వేయలేదు. భవన నిర్మాణ పనులు ఆరంభమయ్యేలోపు పర్యావరణ అనుమతులను సాధించాల్సి ఉంటుంది. ఎయిమ్స్‌ ఆవరణ నుంచి ఆరేడు కిలోమీటర్ల నిడివిలో కాలుష్యకారకమైన పరిశ్రమలేవీ ఉండరాదని ఎయిమ్స్‌ నిపుణుల బృందం చాలా స్పష్టంగా పేర్కొంది. అధికారులు ఇంకా ఆ దిశగా కార్యాచరణను ఆరంభించలేదు. వీటితోపాటు ప్రధానంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ను గన్నవరం సమీపంలోని కొండపావులూరుకు తరలించాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి. టీబీ శానిటోరియం శిథిల భవనాలను తొలగించడంతోపాటు కొన్ని వృక్షాలను కూడా తొలగించాల్సి ఉంది.
 
ప్రాంగణం విభజన ఇలా ..
193 ఎకరాల విస్తీర్ణం ఎయిమ్స్‌ ప్రాంగణాన్ని నైసర్గికంగా సర్వే చేసి స్థల విభజన చేశారు. ఆసుపత్రి, అనుబంధ సేవా విభాగాలకు కలిపి లక్షా 31 వేల చదరపు మీటర్లు, సంస్థలు, బోధన విభాగాలకు కలిపి 41 వేల చదరపు మీటర్లు, నివాసిత భవన సముదాయాలకు 53 వేల చదరపు మీటర్లు వంతున కేటాయించారు. ఎయిమ్స్‌ ప్రాంగణంలో భవన నిర్మాణాలన్నింటికి కలిపి కేవలం 56 ఎకరాలను మాత్రమే వినియోగించనున్నారు. మిగతా స్థలమంతా రహదారులు, ఉద్యానవనాలు ఉంటాయి.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
మంగళగిరి ఎయిమ్స్‌కు రహదారి ఏది?
14-02-2017 06:14:39
636226496802817957.jpg
ఎయిమ్స్‌కి అనుసంధాన రోడ్డు అవసరమని తేల్చిన కేంద్ర బృందం
చిన్న సమస్య పరిష్కారంలో నెలల తరబడి అధికారులు మల్లగుల్లాలు 
ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాలు జారీ చేసినా ముందడుగు పడని వైనం
 
మంగళగిరి: మంగళగిరి ఎయిమ్స్‌ ప్రాజెక్టుకు క్షేత్రస్థాయిలో అత్యావశ్యమైన జాతీయ రహదారితో అనుసంధానమైన రహదారి మార్గం ఇంకా ఖరారు కాలేదు. పాత, కొత్త జాతీయ రహదారుల మధ్య...మరో రెండు రైల్వే మార్గాల (విజయవాడ-గుంటూరు రైల్వేమార్గం, విజయవాడ-తెనాలి రైల్వేమార్గం) నడుమ... ఎయిమ్స్‌ ప్రాజెక్టు కొలువుతీరనుంది. ఎన్నో అనుకూలతలతో కూడిన ఎయిమ్స్‌ ప్రతిపాదిత స్థలానికున్న కొద్దిపాటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ శాఖలు నెలల తరబడి తల్లకిందులవుతున్నాయి. ఎయిమ్స్‌ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర నిపుణుల బృందం దేశంలో మరెక్కడా ఇంత అద్భుతమైన ప్రాంతంలో ఎయిమ్స్‌ లేవని, నిజంగా మంగళగిరి ఎయిమ్స్‌ దేశంలోనే అత్యద్భుతమైన ఎయిమ్స్‌గా పేరు గడిస్తుందని చెప్పారు. అయితే అందరినీ మెప్పించిన మంగళగిరి ఎయిమ్స్‌ ప్రతిపాదిత స్థలానికి ఉన్న ఒకేఒక్క సమస్య...తూర్పు వైపున్న కొత్త జాతీయ రహదారి నుంచి సరియైున అనుసంధాన మార్గం లేకపోవడమే. సరిగ్గా 700 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారిని చేరుకునేందుకు ఓ రహదారిని కొత్తగా నిర్మిస్తే... నిర్మాణ పనుల తాలూకు సామగ్రి తరలింపునకు కూడ బాగా వెసులుబాటుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకే సూచించారు. ముఖ్యమంత్రి కూడా ఈ అంశమై వెంటనే స్పందిస్తూ సంబంధిత చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ను ఆదేశించారు. దీంతో మంత్రి వడివడిగా మంగళగిరి చేరుకుని ఏపీఎస్పీ క్యాంపులో అటవీ, వైద్య, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పోలీసుశాఖలతో ఉమ్మడి సమావేశం నిర్వహించి వెంటనే హైవేను అనుసంధానిస్తూ కొత్త రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఆయా శాఖలకు చెందిన బాధ్యులు సర్వే నిర్వహించి కొత్త రహదారికి సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు. దీని ప్రకారం ప్రతిపాదిత ఎయిమ్స్‌ ప్రాంగణం నుంచి పోలీసు బెటాలియన్‌ను ఆనుకుని బెటాలియన్‌ ఉత్తర ఈశాన్య గేటు వరకు 700 మీటర్ల నిడివిలో అరవై అడుగుల రహదారి నిర్మాణం కోసం సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. ఈ సర్వేను అనుసరించి అరవై అడుగుల రహదారిని ఏర్పాటుచేసేందుకు అటవీశాఖ నుంచి 2.47 ఎకరాలు, బెటాలియన్‌కు చెందిన స్థలం నుంచి మరో మూడెకరాల వరకు సమీకరించాలంటూ నివేదికను సిద్ధం చేశారు. బెటాలియన్‌ ఈశాన్య గేటు వద్ద నుంచి హైవే 300 మీటర్ల దూరంలో ఉండగా...అక్కడి నుంచి ఇప్పటికే కచ్చారోడ్డు ఉంది. సర్వే ప్రకారం నూతన రహదారి కోసం బెటాలియన్‌, అటవీశాఖల నుంచి ఐదున్నర ఎకరాలను ఎయిమ్స్‌కు అప్పగించాలి. కానీ....సర్వే అనంతరం జరగాల్సిన విధాన ప్రక్రియలో స్తబ్ధత నెలకొంది. పైగా ఈ కొత్త రహదారి ఏర్పాటుపై పోలీసుశాఖ ఉన్నతాధికారులు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినట్టు పుకార్లు ఉన్నాయి. డీజీపీ కార్యాలయంతో పాటు రాష్ట్రస్థాయి పోలీసు ఆయుధగారం ఈ రహదారి వెంటే నిర్మితమవుతున్న దృష్ట్యా సదరు రహదారిలో వచ్చేపోయే వాహనాలను నిరంతరం తనిఖీలు చేయాల్సి వస్తుందని... ఇదేమంత సబబుగా ఉండదేమోనన్న అనుమానాలను పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇదిలావుండగా ప్రతిపాదిత ఎయిమ్స్‌ స్థలానికి పశ్చిమంగా ఉన్న పాత జాతీయ రహదారి నుంచి అను సంధాన మార్గం ఇప్పటికే ఉంది. అయితే ఇది పూర్తి నైరుతీ దిశ నుంచి ఎయిమ్స్‌లోకి ప్రవేశిస్తుండడంతో దానికి ప్రత్యామ్నాయంగా వాయివ్యం నుంచి కొత్త రహదారిమార్గాన్ని ఏర్పాటు చేయాలని వైద్యశాఖ భావిస్తున్నట్టు సమాచారం. దీనిని మంచాల హోటల్‌ సమీపంగా రైల్వే ట్రాక్‌, పాత హైవే ను దాటుతూ అమరావతిలోకి ప్రవేశించే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రహదారిని అనుసంధానించేలా నిర్మించాలని వైద్యశాఖ ప్రతిపాదించినట్టు సమాచారం.

  • 2 weeks later...
ఎయిమ్స్ నిర్మాణంపై కేంద్రానికి ఏపీ లేఖ
 
636239084282731880.jpg
విజయవాడ: ఎయిమ్స్ నిర్మాణంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాయనుంది. అమరావతిలో ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులను 10 రోజుల్లోగా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్ నిర్మాణ పురోగతిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేనితో సీఎం సమీక్ష నిర్వహించారు. వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని ఎయిమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి అందించినా నిర్మాణంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.1.93 కోట్లను తక్షణం విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

ఎయిమ్స్‌ను త్వరగా పూర్తి చేయండి: సీఎం 

28-04-2017 04:11:56
636289495235952938.jpg
అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): అమరావతిలో అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం (ఎయిమ్స్‌) నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా గురువారం రాషా్ట్రనికి వచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పీహెచఎ్‌స, సీహెచఎ్‌సలను ఆయన పరిశీలించారు. ఈ ఔషది, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. ఈ ఔషధి ద్వారా రోగికి మందులు అందించి ఏవిధంగా నమోదు చేస్తున్నారు? సీఎం డ్యాష్‌ బోర్డుతో ఎలా అనుసంధానం చేశారని ఆరా తీశారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెలగపూడిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ పురోగతి గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ఎయిమ్స్‌ నిర్మాణంలో వేగం పెంచాలని కోరారు. జిల్లా ఆసుపత్రుల్లో ట్రామా కేర్‌ సెంటర్లు, ఐసీయూ సెంటర్లు ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరారు. పూర్తి తోడ్పాటును అందిస్తామని మిశ్రా సీఎంకు హామీ ఇచ్చారు. ఏపీలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈ పథకాలను జాతీయస్థాయిలో అమలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

జూన్‌లోగా ఎయిమ్స్‌ నిర్మాణ పనులు 

2018-19 నుంచి వైద్య విద్యలో ప్రవేశాలు 
ఏపీలో పీపీపీ విధానం బాగు 
‘ఈనాడు’తో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా 
28ap-main12a.jpg

ఈనాడు, అమరావతి: అమరావతిలో అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం(ఎయిమ్స్‌) భవనాల నిర్మాణ పనులు జూన్‌లోగా ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరంలో వైద్య విద్య తరగతులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.వెయ్యి కోట్లతో చేపట్టే నిర్మాణాలను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యమని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పథకాల అమలు తీరును అమరావతి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పరిశీలించిన మిశ్రా ‘ఈనాడు’తో మాట్లాడారు. 
* ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతూనే అవసరమైన సేవలను త్వరితంగా అందించేందుకు పీపీపీ విధానం అనుసరించాల్సి వస్తోంది. ఈ విధానాన్ని ఏదోఒక రాష్ట్రంలో అమలుచేస్తే వచ్చే ఫలితాలను అనుసరించి ఇతర రాష్ట్రాల్లో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పీపీపీ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఇక్కడ ప్రవేశపెట్టిన ఉచితరక్త పరీక్షలు, తల్లీబిడ్డల సంరక్షణ, ఇతరపథకాలఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులకు రోగులు క్రమేణా పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. 
* జెనరిక్‌ మందులను మాత్రమే రాయాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్పత్రులు ఈ విషయంలో ముందున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే విధానాన్ని అనుసరించాలని కేంద్రం, భారత వైద్య విద్యమండలి సూచిస్తూనే ఉన్నాయి. పరిస్థితుల్లో మార్పు రాకుంటేన్యాయపరంగానూ తప్పనిసరిచేసే చర్యలను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాం. 
* యూజీ (ఎంబీబీఎస్‌), పీజీ వైద్య సీట్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం యూజీలో 65వేలు, పీజీలో 25వేల సీట్లున్నాయి. యూజీ పూర్తి చేసిన వారిలో అత్యధికులు పీజీనీ చదవాలని భావిస్తున్నారు. పీజీ వైద్యుల అవసరాలూ మనకు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదు వేల సీట్లను ఒకేసారి పీజీలో పెంచాం. అలా అని పీజీ విద్య నాణ్యత విషయంలో రాజీ లేదు. ఐటీ రంగం విస్తృతమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, బోధకులకు సదుపాయాలను కల్పించడం పెద్ద సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 300 వరకు పీజీ సీట్లను కోరగా నిర్దుష్ట విధివిధానాల ప్రకారం సగం వరకు కేటాయించాల్సి వచ్చింది. కొత్తగా వైద్య కళాశాలలు కూడా రానున్నాయి. 
* వైద్య కళాశాలల ఆస్పత్రుల స్థాయికి తగ్గట్టు దేశంలోని 58 జిల్లా ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. దీనివల్ల జిల్లా ఆస్పత్రుల్లో కొత్త విభాగాలతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 
* శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో మూత్రపిండ వ్యాధులపై అధ్యయనం సాగుతోంది. రోగులు నిత్యం డయాలసిస్‌ చేయించుకోవడం కష్టసాధ్యం. డయాలసిస్‌ సౌకర్యాన్ని దేశంలోని 300 జిల్లాల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్‌ కోరిక మేరకు ఒకటికంటే ఎక్కువ డయాలసిస్‌ కేంద్రాలను జిల్లాల్లో కేంద్రం తరఫున ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

Link to comment
Share on other sites

ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం: కలెక్టర్‌
 
గుంటూరు: ఎయిమ్స్‌కు నీటి సరఫరా కోసం గుంటూరు కెనాల్‌ నుంచి తీసుకునే ప్రణాళిక రూపొందిస్తున్నామని కలెక్టర్‌ కోన శశిధర్ తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఎయిమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఎయిమ్స్‌ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి చేస్తామని, ఎయిమ్స్‌కు అంతర్గత రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...