Jump to content

Amaravati


Recommended Posts

రాజధానికి రాదారి కళ!
 
636296557287840169.jpg
  • మరో 11 రోడ్ల నిర్మాణానికి కసరత్తు
అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రోడ్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేయడానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అత్యంత కీలకమైన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుతోసహా ఏడు రోడ్ల పనులు ఇప్పటికే చురుగ్గా సాగుతుండగా మరో 11 ప్రధాన రహదారుల నిర్మాణం త్వరలో ప్రారంభంకానుంది. ఈ 11 రహదారులను ఫేజ్‌-2 రోడ్లుగా వ్యవహరిస్తారు. ఈ మొత్తం రోడ్లలో రాజధానిలో తూర్పు- పడమర ప్రాంతాలను కలిపేవి 5 ఉండగా, ఉత్తర- దక్షిణ ప్రాంతాలను అనుసంధానించేవి 6 ఉన్నాయి. ఈ రహదారుల వెడల్పు 50 మీటర్లుగా ఉండనుంది. 11 రహదారుల మొత్తం పొడవు 71 కిలోమీటర్లు. ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతి లభించగానే వీటి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సమాయత్తమవుతోంది. ఈ రహదారుల నిర్మాణానికి 820 ఎకరాలు అవసరమని, రూ.1700 నుంచి రూ.1800 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
 
4, 6 వరుసలుగా ఫేజ్‌- 2 రోడ్లు
రాజధాని నగర పరిధిలోని అన్ని గ్రామాలు, ఎల్పీఎస్‌ లేఔట్లు సహా అన్ని ప్రదేశాలను పరస్పరం అనుసంధానించి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల వ్యవధిలో సులభంగా చేరుకొనేందుకు ‘రాజధాని రోడ్‌గ్రిడ్‌’ను ప్రభుత్వం సిద్ధం చేసింది. రోడ్‌ గ్రిడ్‌లో అత్యంత కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రహదారి (ఉండవల్లి- దొండపాడు) నిర్మాణం కొన్ని నెలల క్రితం ప్రారంభమై చురుగ్గా సాగుతోంది. దీంతోపాటు మరో ఏడు రోడ్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. తాజాగా ఫేజ్‌-2 రోడ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫేజ్‌-2 రోడ్లను 50 మీటర్ల (164 అడుగులు) వెడల్పుతో నిర్మించాలని ప్రతిపాదించారు. అంటే వీటిని 8 వరుసలతో నిర్మించే అవకాశముంది. ప్రస్తుతానికి మాత్రం కొన్నిటిని 4, మరి కొన్నిటిని 6 వరుసలతో నిర్మించాలని ఏడీసీ భావిస్తోంది. ఈ రోడ్లకు ఇరువైపులా విద్యుత్తు, నీరు, స్టార్మ్‌ వాటర్‌, సీవేజ్‌ వాటర్‌, వంట గ్యాస్‌, కేబుల్‌ ఇత్యాది వ్యవస్థలకు సంబంధించిన పైపులైన్లను భూగర్భంలో వేసేందుకు వీలుగా డక్ట్‌లను నిర్మిస్తారు. డక్ట్‌ల నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్నీ తారు రోడ్లుగా మారుస్తారు.
 
ఈ 11 రహదారుల నిర్మాణానికి మొత్తం 820 ఎకరాలు అవసరమని, వీటి నిర్మాణ వ్యయం రూ.1700 నుంచి రూ.1800 కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. పరిపాలనాపరమైన అనుమతి లభించిన వెంటనే టెండర్లను ఆహ్వానించి, పనులను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు 2-3 నెలలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే కాలహరణాన్ని నివారించే ఉద్దేశంతో ఇప్పటికే ఆగ్రోస్‌ సంస్థ ద్వారా ఈ రహదారుల కోసం గుర్తించిన ప్రదేశాలను అభివృద్ధి పరచి, రోడ్ల నిర్మాణానికి అనువుగా మలిచే కార్యక్రమాన్ని ఏడీసీ చేపట్టింది. ఫేజ్‌- 2 లోని 11 రహదారులు రాజధానిలోని అన్ని గ్రామాలనూ అనుసంధానించబోతున్నాయి. వీటిలో 5 తూర్పు నుంచి పడమరకు (వీటిని ఆంగ్ల అక్షరం ‘ఈ’తో సంబోధిస్తారు) మిగిలిన 6 ఉత్తరం నుంచి దక్షిణానికి (వీటిని ‘ఎన్’తో సంబోధిస్తారు) వెళ్తాయి.
Link to comment
Share on other sites

ఆకృతుల పరిశీలనకు లండన్‌కు మంత్రి నారాయణ

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో పరిపాలనా నగర ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల రూపకల్పన పనుల పరిశీలనకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్రణాళికా విభాగం డైరెక్టర్‌ ఆర్‌.రామకృష్ణారావు ఈ నెల 8 నుంచి 10 వరకు లండన్‌లో పర్యటించనున్నారు. వీరి పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ ఆకృతులు రూపొందిస్తోంది. మంత్రి నేతృత్వంలోని బృందం పరిపాలనా నగర ప్రణాళికను ఖరారు చేస్తుంది. సంస్థ ప్రతినిధులకు అవసరమైన సూచనలు కూడా ఇస్తుంది.

Link to comment
Share on other sites

అమరావతి.. ‘విద్యా’వతి!
 
636297246241847097.jpg
  • త్వరలో ఎన్‌ఐడీకి శంకుస్థాపన
  • చురుగ్గా విట్‌, ఎస్‌ఆర్‌ఎం నిర్మాణ పనులు
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): అమరావతి సిగలో త్వరలో ఇంకొన్ని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు చేరనున్నాయి. నవ్యాంధ్ర రాజధానిని అంతర్జాతీయ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష కార్యరూపం దాల్చడంలో ఇతోధిక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే రాజధానిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు తమ క్యాంప్‌సల నిర్మాణ పనులను చురుగ్గా సాగిస్తూ.. వచ్చే విద్యాసంవత్సరం (2017- 18)లోనే తరగతులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. వాటి బాటలోనే.. 2018-19 విద్యాసంవత్సరం నాటికి అమరావతిలో తమ క్యాంప్‌సలను నెలకొల్పేందుకు అమృత విశ్వవిద్యాలయంతో పాటు నేషనల్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన (ఎనఐడీ), ఇండో-యూకే, బీఎస్‌ శెట్టి ఇనస్టిట్యూట్లు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మరికొన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ స్కూళ్లు కూడా ఇక్కడకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.
 
అతి త్వరలో ‘అమృత’ నిర్మాణం ప్రారంభం..
మాతా అమృతానందమయి ట్రస్టు ద్వారా కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ, విలువలతో కూడిన విద్యాభ్యాసానికి పేరొందిన అమృత యూనివర్సిటీకి దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్యాంప్‌సలున్నాయి. అమరావతిలోనూ క్యాంపస్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దానికి 200 ఎకరాలను కేటాయించింది. ఎకరాకు రూ.50 లక్షల చొప్పున ఇప్పటికే సదరు భూమి కోసం సీఆర్‌డీఏకు నగదును కూడా చెల్లించింది. ప్రస్తుతం ఆ భూమిలో నిర్మించాల్సిన క్యాంపస్‌ డిజైన, మౌలిక వసతులపై కసరత్తు చేస్తోంది. కొద్ది వారాల్లోనే వాటిపై తుది నిర్ణయం తీసుకుని, ఆగస్టులోపు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2018- 19 విద్యాసంవత్సరం ప్రారంభానికల్లా పనులను పూర్తిచేసి, అడ్మిషన్లు జరిపి, తరగతులు మొదలుపెట్టాలన్నది ‘అమృత’ లక్ష్యం.
 
ఇండో- యూకే, శెట్టి ప్రతినిధులు వస్తున్నారు..
ఇంగ్లండ్‌కు చెందిన ఇండో-యూకే హెల్త్‌ ఇనస్టిట్యూట్‌, గల్ఫ్‌కు చెందిన బీఎస్‌ శెట్టి విద్యాసంస్థలు కూడా 2018-19 విద్యాసంవత్సరంలో తమ అమరావతి క్యాంప్‌సలను నిర్మించి.. తరగతులను ప్రారంభించాలనుకుంటున్నాయి. ఈ రెండింటికీ 150 ఎకరాల చొప్పున ప్రభుత్వం కేటాయించింది.
 
ప్రముఖుల సమక్షంలో ఎనఐడీకి శంకుస్థాపన..
పై సంస్థలతో పాటు అమరావతికి ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యాసంస్థ కూడా వస్తోంది. అదే ఎనఊడీ. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ శాఖమూరుకు సమీపంలో, ప్రతిపాదిత జస్టిస్‌ సిటీకి కూతవేటు దూరంలోని 50 ఎకరాల్లో ఏర్పాటవనుంది. రెండేళ్ల క్రితమే రాష్ట్రానికి వచ్చిన ఈ సంస్థ నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తాత్కాలికంగా నడుస్తోంది. సాధ్యమైనంత త్వరగా రాజధానిలో తన క్యాంప్‌సను నిర్మించుకుని.. అందులోకి మారాలని భావిస్తోంది.
 
అందుకు 2018-19 విద్యాసంవత్సరాన్ని గడువుగా నిర్దేశించుకుంది. నిర్మాణ పనులు చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్నా.. శంకుస్థాపనలో జాప్యం జరుగుతోంది. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక కార్యక్రమాలు, పర్యటనల్లో తీరిక లేకుండా ఉండడమే దీనికి కారణమని సమాచారం. కొద్దిరోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి.. వెంటనే నిర్మాణం ప్రారంభించి.. వర్షాలు మొదలయ్యేలోగా ఫౌండేషన పనులు పూర్తిచేయాలని ఎనఐడీ అధికారులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

నెక్కల్లు, శాఖమూరు లేఅవుట్లకు.. మహర్దశ
 
636298366391510628.jpg
  • ఈపీసీ పద్ధతిన బిడ్‌లు ఆహ్వానించిన సీఆర్‌డీఏ
  • రూ.688 కోట్లు ఐబీఎం విలువగా అంచనా
గుంటూరు: అమరావతి రాజధాని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూసమీకరణ గ్రామాల్లో అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టబోతోంది. రాజధాని నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన భూములకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద ప్లాట్లను కేటాయించిన సంస్థ వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ప్లాట్ల కేటాయింపుని కొన్ని నెలల క్రితమే పూర్తి చేసిన అమరావతి రాజధాని నగరంలోని జోన-1 ఏరియాలో ఉన్న నెక్కల్లు, శాఖమూరు(పార్టు)లో రూ.688 కోట్ల అంచనా విలువైన పనులను ఇంజనీరింగ్‌ పొక్యూర్‌మెంట్‌ కనస్ట్రక్షన(ఈపీసీ) పద్ధతిన చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థల నుంచి ఈపీసీ పద్ధతిలో బిడ్లను ఆహ్వానించింది. వచ్చే నెల ఐదో తేదీతో బిడ్డింగ్‌ని పూర్తి చేసి ఏజెన్సీని ఖరారు చేసేందుకు సీఆర్‌డీఏ యోచిస్తోంది.
లేఅవుట్‌ నిబంధనల ప్రకారం రోడ్లు, కాలువలు, కల్వర్టులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత స్తంభాలు, కేబుల్స్‌, మొక్కలు నాటడం వంటివి ముందుగానే నిర్మించాలి. రాజధాని గ్రామాల్లో లేఅవుట్‌లు వేస్తున్న సీఆర్‌డీఏ ఆయా సౌకర్యాల కల్పన బాధ్యతను నిబంధనల మేరకు తీసుకుంది. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. నెక్కల్లులో మూడు, శాకమూరులో మూడు లేఅవుట్లను వేసింది. ఆయా ప్లాట్లను రియల్టర్లకు రాజధాని రైతులు డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలన్నా, వారే సొంతంగా ఇల్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించుకోవాలన్నా లేఅవుట్‌ల అభివృద్ధి తప్పనిసరి. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఇళ్లు, వాణిజ్య భవంతులు నిర్మించినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
Link to comment
Share on other sites

పశ్చిమగోదావరిలో కరెన్సీ పేపరు పరిశ్రమ

ఎంపీ మురళీమోహన్‌ వెల్లడి

దేవరపల్లి, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో కరెన్సీనోట్ల ముద్రణకు వినియోగించే పేపరు పరిశ్రమను నెలకొల్పుతామని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ తెలిపారు. ఆదివారం దేవరపల్లి మండలం యాదవోలులో మాట్లాడుతూ కరెన్సీ నోట్ల ముద్రణకు వినియోగించే పేపరును ప్రస్తుతం ఇతర దేశాల నుంచి తీసుకువస్తున్నారన్నారు. గోపాలపురం మండలంలో 130 ఎకరాల భూమిని ఆర్‌బీఐకి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఒడిశా నుంచి పోటీ ఉందని..అయితే 99 శాతం మనకే వస్తుందన్నారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రిని నియమించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని నియమించారన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలను ఒక్కోసారి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహిస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

స్టార్టప్‌ ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌ కన్సార్టియం

ఈనాడు, అమరావతి: అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో 6.84 చ.కి.మీల స్టార్టప్‌ ప్రాంతానికి ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు తెలిపింది. ప్రాజెక్టు మొదటి దశలో వచ్చే మొత్తం ఆదాయంలో 5శాతం, రెండోదశలో ఆదాయంలో 7.5 శాతం, మూడో దశలో ఆదాయంలో 12శాతం వాటా సీఆర్‌డీఏకి ఇస్తామంటూ సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనకు ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలియజేసినట్టు తెలిపింది.

Link to comment
Share on other sites

లండన్‌లో నారాయణ బృందం
 
  • ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ
  • నేడూ కొనసాగనున్న చర్చలు
అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ప్లాన్‌, శాసనసభ, హైకోర్టుల డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ బృందం మలివిడత చర్చలు లండన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు భేటీలో నార్మన్‌ ఫోస్టర్‌ అందజేసిన ప్రాథమిక డిజైన్లపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ వర్గాలు, నిపుణుల అభిప్రాయాలు, సలహాలు సూచనల మేరకు.. వాటిలో మార్పులుచేర్పులపై ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ చర్చలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి.
Link to comment
Share on other sites

స్టార్టప్‌ ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌ కన్సార్టియం

ఈనాడు, అమరావతి: అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో 6.84 చ.కి.మీల స్టార్టప్‌ ప్రాంతానికి ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు తెలిపింది. ప్రాజెక్టు మొదటి దశలో వచ్చే మొత్తం ఆదాయంలో 5శాతం, రెండోదశలో ఆదాయంలో 7.5 శాతం, మూడో దశలో ఆదాయంలో 12శాతం వాటా సీఆర్‌డీఏకి ఇస్తామంటూ సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనకు ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలియజేసినట్టు తెలిపింది.

Crda ki 42% annaru. Entadi?

Link to comment
Share on other sites

Crda ki 42% annaru. Entadi?

 

42% partnership in joint venture that builds the seed capital. 

 

simple example:

this JV company takes 1 acre land from CRDA and builds an apartment complex at a cost of 100 lacs and sells it for 200 lacs in the first phase. out of that CRDA gets 15 lacs for land (7.5% of 200 lacs)

 

profit for JV: 200 - 100 - 15 = 85 lacs.

CRDA gets 42% of that profit == 35.7 lacs.

 

in total CRDA gets 50.7 lacs. singapore consortium gets 49.3 lacs.

 

in second and third phases CRDA gets lot more than singapore consortium.

Link to comment
Share on other sites

సవరణలు అవసరం

శాసనసభ ఆకృతులపై నార్మన్‌ సంస్థకు నారాయణ బృందం సూచన

ఈనాడు, అమరావతి: పురపాలక మంత్రి పి.నారాయణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం రెండో రోజు మంగళవారం లండన్‌లో నార్మన్‌ఫోస్టర్‌ బృందంతో రాజధాని బృహత్తర ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించింది. శాసనసభ భవనం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలపై పలు సూచనలు చేసింది. శాసనసభ భవనానికి ఇచ్చిన టవర్‌డిజైన్‌లో స్వల్ప మార్పులు చేయాలని పేర్కొంది. పోడియం డిజైన్‌లో రూపొందించిన శాసనసభకు మరో రెండు ప్రత్యామ్నాయ ఆకృతులు ఇవ్వాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. సవరించిన ఆకృతులు ముఖ్యమంత్రికి చూపించేందుకు ఈ నెల 16న నార్మన్‌ఫోస్టర్‌ బృందం అమరావతికి వస్తున్నట్లు ఆయన వివరించారు. బ్రిటీష్‌ పార్లమెంట్‌ను కూడా ఈ బృందం సందర్శించి అక్కడి నిర్మాణాలు, పరిపాలన వ్యవస్థ, బ్రిటీష్‌ పార్లమెంట్‌ పనిచేసే విధానం, భద్రత, సందర్శకుల తాకిడి తదితర అంశాలను అధ్యయనం చేసింది. మొదటి రోజు పర్యటనలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ టౌన్‌ను మంత్రి నేతృత్వంలోని బృందం సందర్శించింది. అమరావతిలో ఇప్పటికే ‘కెనాల్‌ వే’ నిర్మించనున్నందున కేంబ్రిడ్జి యూనివర్శిటీ మోడల్‌ను సందర్శించడం ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆయనతోపాటు సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్రణాళిక విభాగ సంచాలకులు రామకృష్ణ ఉన్నారు.

Link to comment
Share on other sites

సౌర విద్యుత్‌ నిల్వ!

టెస్లా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

సీఎం కార్యాలయానికి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌!

ఈనాడు, అమరావతి: సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రం.. త్వరలో ఈ విద్యుత్‌ను నిల్వ చేసి వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. సూర్య కాంతి ఆధారంగా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ వెంటనే లైన్‌కు సరఫరా అవుతుంది. ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి తర్వాత వినియోగించుకునే అవకాశం ఉన్నా.. వ్యయం ఎక్కువ అవుతుండడంతో ఇన్నాళ్లు సాకారం కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన టెస్లా సంస్థతో ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పగటి సమయంలో సూర్యశక్తితో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి.. నూతన సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టును రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చేపట్టనుంది.

మెగావాట్‌కు రూ.14 కోట్లు!

కడప సౌర పార్కులో 100 మెగావాట్ల బ్యాటరీ ఆధారిత సౌర విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ విధానంలో మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి-నిల్వకు రూ.14 కోట్ల వ్యయమవుతుందని టెస్లా సంస్థ ప్రతిపాదన ఇచ్చింది. ఈ బ్యాటరీల్లో సౌర విద్యుత్‌ను 4 గంటలు నిల్వ చేసుకుని.. తరువాత వాడుకోవచ్చు. ఈ ధర ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో టెస్లా ప్రతిపాదనపై ఇప్పటి వరకూ ముందడుగు పడలేదు. తాజాగా సీఎం అమెరికా పర్యటనతో కదలిక వచ్చింది. టెస్లాతో అవగాహన ఒప్పందం కుదిరినా.. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తారని, పోటీ విధానంలో ధర తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Link to comment
Share on other sites

రాజధాని మాస్టర్ ప్లాన్ డిజైన్లు, నిర్మాణాల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ
 
అమరావతి: రాజధాని భవనాల మాస్టర్ ప్లాన్ డిజైన్లు, నిర్మాణాల పర్యవేక్షణకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా యనమల, నారాయణ, లోకేష్‌, ఆనంద్‌బాబు అన్నారు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...