Jump to content

Amaravati


Recommended Posts

పటేల్ కంటే ఎత్తుగా.. ఏపీ అసెంబ్లీ నిర్మాణం
24-11-2018 16:16:52
 
MplFkmi.jpg 
హైదరాబాద్: అమరావతిలో కొలువుదీరనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే ఎత్తైన కట్టడంగా నిలవనుంది. పటేల్ స్మృత్యర్థం నర్మదా నదీ తీరంలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని మించి ఉండేలా ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు సమాచారం. కృష్ణమ్మ తీరంలో నిర్మిస్తున్న ఏపీ అసెంబ్లీ డిజైన్లను నార్మన్ ఫోస్టర్స్ తాజాగా విడుదల చేసింది. డిజైన్లను ఏపీ సీఎం ఆమోదం తెలిపారు. తాజా డిజైన్ల ప్రకారం పటేల్ విగ్రహం కంటే 68 మీటర్లు ఎత్తులో ఏపీ అసెంబ్లీ నిర్మాణం ఉండనుంది. మూడు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తుండగా.. దానిపైన ఉండే టవర్ చాలా ఎత్తులో ఉండనుంది. ఎత్తులో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ 182 మీటర్లు ఉండగా, ఏపీ అసెంబ్లీ 250 మీటర్లు. నవంబర్‌లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు.
Link to comment
Share on other sites

గూగుల్ మ్యాప్‌లో అమరావతి నిర్మాణ దృశ్యాలు
24-11-2018 17:44:12
 
636786783668999216.jpg
అమరావతి: గూగుల్ మ్యాప్‌లో ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణ దృశ్యాలను పొందుపర్చారు. ఈ దృశ్యాల్లో వెలగపూడిలోని సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలతో పాటు రాయపూడి, నేలపాడులో ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్‌, ఎన్జీవోల క్వార్టర్స్‌, గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవనాలు, రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, ఇతర రహదారుల నిర్మాణాలను పొందుపర్చారు. దీంతో రాజధాని నిర్మాణ దృశ్యాలను గూగుల్ మ్యాప్స్ కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్‌లో అమరావతి న్యూ క్యాపిటల్ అని టైప్ చేస్తే చాలు వెంటనే రాజధాని నిర్మాణ దృశ్యాలు కళ్ళముందు కన్పిస్తున్నట్లున్నాయి.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...