Jump to content

Amaravati


Recommended Posts

ప్రపంచానికి అమరావతి విడిది
 
 
636340406100109667.jpg
  • అత్యుత్తమ స్మార్ట్‌సిటీగా ఖ్యాతి పొందాలి
  • సీఆర్డీఏ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు 
 
అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారికి అమరావతి నగరం ఒక విడిదిగా మారాలి. విద్య, వైద్యం సహా ఆతిథ్య రంగంలోనూ మన రాజధాని ప్రత్యేకత సాధించాలి. ప్రపంచంలోని అత్యుత్తమైన స్మార్ట్‌సిటీగా ఖ్యాతి పొందేలా అమరావతిని నిర్మిద్దాం’’ అని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆదివారం ఆయన సీఆర్‌డీఏ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని నగరం ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్మార్ట్‌ నగరాల గుర్తింపును పొందిందని, రాష్ట్రానికి అమరావతి స్మార్ట్‌ మణిహారమైందని సీఎం అన్నారు. రాష్ట్ర రాజధానిలో పౌరులందరికీ భరోసా కలిగేలా భద్రతను కల్పించేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటుకు, వీధి దీపాల అమరిక తదితర మౌలిక సదుపాయాల కల్పనకు తొలివిడతగా రూ.1874 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి కింద విడుదలయ్యే ఈ నిధులను తక్షణమే వ్యయం చేయడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాజధాని నగరమంటే ఆకాశహర్మ్యాలు మాత్రమే కాదు, సగటు మనిషి హాయిగా జీవించేలా గృహం, విద్య, వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలకు నిరంతరం భరోసా కల్పించేలా భద్రత వ్యవస్థ ఉండాలన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దాలన్నారు. ఆ గుర్తింపును పొందాలంటే ప్రతి చిన్న ప్రజావసరాన్ని తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా మాత్రమే కాదు, నీటి సరఫరాలోనూ డిజిటలైజేషన్‌ మీటరింగ్‌ నమూనాను అమలు చేయాలని చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన జరిగాక కట్టుబట్టలతో రాజధాని నగరం వెతుకుంటూ వచ్చేశాం. అభివృద్ధి చెందాలన్న పట్టుదలతో ప్రపంచ ఖ్యాతి నగరాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించాం. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతి సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూనే ప్రపంచ శ్రేణి నగరంగా మలచాలని ఆలోచించాను. సహచర మంత్రులు, ఉన్నతాధికార వర్గాలు.. నా ఆలోచన సహేతకుమైనదేనని సమ్మతించారు. నా మనస్సులోని మాటను అమరావతి నగర ప్రాంత రైతాంగానికి చెప్పాను. వారు పెద్ద మనస్సుతో భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. భూసమీకరణ విధానంలో పైసా ఖర్చు లేకుండా 33 వేల ఎకరాలు ఇచ్చారు. నా రైతులను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా ప్రతిపక్షాల మాటను వారు వినలేదు. నాపైన విశ్వాసం ఉంచారు. వారి విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. గ్రీన్‌-బ్లూ అమరావతి నగర నిర్మాణ వేగాన్ని పెంచుదాం. ప్రపంచంలోని అత్యుత్తమైన స్మార్ట్‌సిటీగా అమరావతి ఖ్యాతి చెందేలా నిర్మిద్దాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోదించారు.
Link to comment
Share on other sites

ప్రపంచబ్యాంక్‌ రుణానికి ఇబ్బంది లేదు: సీఆర్డీఏ కమిషనర్‌
 
 
636341913521669261.jpg
అమరావతి: ప్రపంచబ్యాంక్‌ రుణానికి ఇబ్బంది లేదని సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ అన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.3500 కోట్ల రుణం జులైలో వస్తుందని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ చెప్పారు. ఫిర్యాదులకు, రుణాల మంజూరుకు సంబంధం లేదని శ్రీధర్ వెల్లడించారు. ప్రపంచబ్యాంక్‌కు రైతుల ముసుగులో ఫిర్యాదు ఇది రెండోసారి చేశారన్నారు. ప్రపంచ బ్యాంక్‌ డైరెక్టర్‌కు అన్ని విషయాలు వివరించామని శ్రీధర్‌ స్పష్టం చేశారు. పర్యావరణం, కొండవీటివాగు ముంపు, ఆహారభద్రత గురించి చెప్పగా మా వివరణతో సంతృప్తి చెందారని సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. కావాలని ఫిర్యాదులు చేస్తున్నట్టు గ్రహించామని శ్రీధర్ అన్నారు.
 
28వేల మంది రైతులు రాజధానికి భూములు ఇచ్చారని శ్రీధర్ చెప్పారు.
 
భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఫిర్యాదులు ఉన్నాయని శ్రీధర్‌ అన్నారు. భూసమీకరణ విధానాన్ని ప్రపంచబ్యాంక్‌ మెచ్చుకుందని శ్రీధర్ తెలిపారు. చంద్రబాబును ప్రపంచబ్యాంక్‌ డైరెక్టర్‌ అభినందించారని శ్రీధర్‌ అన్నారు. కొందరు కావాలని ఫిర్యాదులు చేస్తున్నట్టు గ్రహించారని ఆయన స్పష్టంగా చెప్పారు. ఏషియన్‌ బ్యాంక్‌ కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిందని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ అన్నారు.
Link to comment
Share on other sites

హరిత అమరావతికి దశ సూత్ర ప్రణాళిక
300 ఎకరాల్లో శాఖమూరు పార్కు
ప్రధాన రహదారుల వెంబడి హరిత ప్రాంతాలు
బ్లూప్రింట్‌, ఆకృతుల రూపకల్పన
ఈనాడు - అమరావతి
amar45.jpg

రాజధాని అమరావతిలో హరిత ప్రాంతాలు, ఉద్యానాల అభివృద్ధికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) బ్లూప్రింట్‌ సిద్ధం చేసింది. అమరావతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడీసీ, సీఆర్‌డీఏలకు పది ప్రాధాన్యాంశాలను నిర్దేశించారు. అనుగుణంగా ఏడీసీ తాజా ప్రణాళికలు రూపొందించింది. అమరావతిలో శాఖమూరు వద్ద 300 ఎకరాల్లో ప్రాంతీయ పార్కుని అభివృద్ధి చేయనుంది. ఈ పార్కు ఆకృతులు సిద్ధమయ్యాయి. రాజధాని పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించనున్నారు. బ్లూప్రింట్‌, ఆకృతులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

పది ప్రాధాన్యాలు ఇలా...
1. శాఖమూరు వద్ద ఉద్యానవనం: అమరావతిలో శాఖమూరు వద్ద 300 ఎకరాల్లో ప్రాంతీయ ఉద్యానవనం అభివృద్ధికి ఏడీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్కు మధ్యలో 50 ఎకరాల్లో తటాకం ఉంటుంది. పార్కు చుట్టుకొలత 4.4 కి.మీ.లు. పార్కులో పలు రకాల వృక్ష జాతులుంటాయి. అన్ని వయసుల వారికీ ఆహ్లాదకరంగా పార్కుని తీర్చిదిద్దుతారు. నడక దారులుంటాయి.

2. ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) వెంబడి హరిత ప్రాంతాల అభివృద్ధి: మొత్తం 18.2 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ రహదారి వెంబడి దక్షిణం వైపున 15 మీటర్ల ఈ ప్రాంతంలో నాటాల్సిన మొక్కలు, ల్యాండ్‌ స్కేపింగ్‌పై ఏడీసీ నియమించిన కన్సల్టెంట్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

3. ఏడు ప్రాధాన్య రహదారుల వెంట మొక్కల పెంపకం: రాజధానిలో తొలి దశలో నిర్మిస్తున్న ఈ రహదారుల వెంబడి దారికి ఒకపక్కన 15 మీటర్ల వెడల్పున హరిత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.

4. ఉండవల్లి కొండపై పెద్ద ఎత్తున మొక్కలు నాటడం: ఈ ప్రయత్నంతో సుందరమైన అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దుతారు. చారిత్రిక ప్రాధాన్యం ఉన్న ఉండవల్లి గుహల ప్రత్యేకతను కాపాడేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.

amar6.jpg

5. కొండవీటివాగు వెంబడి రెండు పక్కలా (కెనాల్‌ ఫ్రంట్‌) సుందరంగా తీర్చిదిద్దడం: కొండవీటి వాగు రాజధాని పరిధిలో 21.3 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దీని వెడల్పు 120 మీటర్ల నుంచి 170 మీటర్ల వరకు ఉంటుంది. వాగుకి రెండు పక్కలా 30 మీటర్ల వెడల్పున హరిత వనాలు అభివృద్ధి చేస్తారు.

6. కృష్ణా నదికి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలు, కాలువల అభివృద్ధి.

7. విజయవాడలో రామవరప్పాడు నుంచి రమేష్‌ ఆస్పత్రి వరకు జాతీయ రహదారి వెంబడి ల్యాండ్‌ స్కేపింగ్‌.

8. విజయవాడలో తుక్కు పార్కు అభివృద్ధి.

9. కనకదుర్గ వారధి వద్ద గ్రీన్‌ జోన్‌ అభివృద్ధి.

10. పవిత్రసంగమం ప్రాంత అభివృద్ధి.

Link to comment
Share on other sites

త్వరలో ముక్త్యాల-అమరావతి జలమార్గానికి శంకుస్థాపన: నితిన్‌గడ్కరీ

ఈనాడు, దిల్లీ: ముక్త్యాల-అమరావతి మధ్య జలమార్గం అభివృద్ధికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర రవాణా, నౌకాయానశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ఓడల (క్రూజ్‌) పర్యాటకాభివృద్ధిపై కార్యాచరణ రూపొందించడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు త్వరగా శంకుస్థాపన చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను ఆహ్వానిస్తున్నారని, త్వరలో తామిద్దరం కలిసి పునాదిరాయి వేస్తామని పేర్కొన్నారు. 160 కిలోమీటర్ల ఈ తొలి దశ ప్రాజెక్టు కోసం రూ.వంద కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో క్రూజ్‌ పర్యాటకాభివృద్ధి కోసం మూడు నెలల్లో సరికొత్త విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. ముంబయి, గోవా, మంగళూరు, చెన్నై, కొచ్చిన్‌లలో క్రూజ్‌ టెర్మినళ్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు

Link to comment
Share on other sites

అమరావతిలో ఇండోర్‌ స్టేడియం

ఈనాడు, అమరావతి: అమరావతిలో 4వేల మంది వీక్షించేందుకు వీలుగా ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు కానుంది. 60 రకాల క్రీడా కార్యకలపాల నిర్వహణకు వీలుగా దీన్ని నిర్మిస్తారు. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న స్టాడిఅరెనా తరహాలో దీన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటన్‌కు చెందిన ట్రాన్స్‌స్టాడియా సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రతిపాదించింది. ఈ సంస్థ బ్రిటన్‌లో అతిపెద్ద నీటిశుద్ధి సంస్థల్లో ఒకటి. దీనిపై స్పందించిన సీఎం అధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా భూకేటాయింపులు పూర్తిచేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. బ్రిటిష్‌ హైకమిషనర్‌ డొమినిక్‌ అస్క్విత్‌ బృందం బుధవారం సచివాలయంలో సీఎంను కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది.

శాసనసభా భవనాల పరిశీలన: శాసనసభ వద్దకు వచ్చిన బ్రిటిష్‌ హై కమిషనర్‌ అస్కవిత్‌ బృందానికి సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఘనస్వాగతం పలికారు. శాసనసభ, మండలి భవనాల్లోకి తీసుకెళ్లి వివరాలు తెలియజేశారు. సమావేశాలు జరిగే విధానాన్ని సభాపతి ఆయనకు వివరించారు. అనంతరం కమిషనర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

Link to comment
Share on other sites

స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పర్యవేక్షణకు 2 కమిటీలు

సంయుక్త అమలు సారథ్య కమిటీ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య ఆర్థిక, సంస్థాగత అభివృద్ధి కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) అమలు పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. సంయుక్త అమలు సారథ్య కమిటీకి(జేఐఎస్‌సీ) ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆర్థిక, పురపాలక శాఖ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఎంఓయూ అమలు, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నాయకత్వాన్ని అందజేయడం, మార్గదర్శనం చేయడం ఈ కమిటీ బాధ్యతలు. ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. సంయుక్త అమలు కార్యనిర్వాహక కమిటీ (జేఐడబ్ల్యూసీ)కి పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి (సీఆర్‌డీఏ) ఛైర్మన్‌గా ఉంటారు. పురపాలక, పరిశ్రమలు-వాణిజ్య, పర్యాటక, ఆర్థిక, జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక అభివృద్ధి బోర్డు(ఈడీబీ) సీఈఓ, సీఆర్‌డీఏ కమిషనర్‌, అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సీఎండీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది.

Link to comment
Share on other sites

రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడమా?

రైతుల ముసుగులో ప్రపంచబ్యాంకుకి ఫిర్యాదులా?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

ఆ బరితెగింపును ఉపేక్షించేది లేదని వెల్లడి

రాజధాని రైతుల కోసం ప్రత్యేక యాప్‌ ఆవిష్కరణ

ఈనాడు - అమరావతి

‘‘రైతుల ముసుగులో రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు ఎంతకైనా బరితెగిస్తున్నాయి. దానిలో భాగంగానే రైతుల పేరుతో ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వవద్దంటూ కొందరు ప్రపంచబ్యాంకుకి ఫిర్యాదు చేయడంపై ముఖ్యమంత్రి ఇలా తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల పేరు మీద ప్రపంచబ్యాంకుకి అదే పనిగా ఫిర్యాదులు చేస్తున్నవారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పురోగతిపై ముఖ్యమంత్రి బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. నిబంధనల ప్రకారం ప్రపంచబ్యాంకు తనిఖీ బృందం తమకు వచ్చిన ప్రతి ఫిర్యాదుని నమోదు చేసుకుంటుందని, దానిలో భాగంగానే ఈ ఫిర్యాదులూ నమోదు చేసుకుని పరిశీలించి వాటిలో వాస్తవం లేదని నిర్ధారించుకుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. ప్రపంచబ్యాంకు రుణం మంజూరుకి సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని, సెప్టెంబరు నాటికి తొలి విడత రుణం అందుకుంటామని తెలిపారు. రాజధాని గురించి అవగాహన కల్పించేందుకు, భూములిచ్చిన రైతుల స్థలాల క్రయ విక్రయాలకు ఉపయుక్తంగా ఉండేలా సీఆర్‌డీఏ రూపొందించిన ‘మన అమరావతి’ మొబైల్‌ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

చర్చకు వచ్చిన అంశాలు..

* అమరావతి, సీఆర్‌డీఏ ప్రాంతాలకు ప్రత్యేకంగా పట్టణ రవాణా ప్రణాళిక సిద్ధమవుతోంది. సమగ్ర ట్రాఫిక్‌, రవాణా విధానంపై అధ్యయనానికి జైకా కన్సల్టెన్సీ బృందాన్ని నియమించింది.

* రాజధానిలో నిర్మించే విశ్వవిద్యాలయాలకు ప్రహరీ గోడలు, ఫెన్సింగ్‌ లేకుండా డిజైన్‌ మార్గదర్శకాల రూపకల్పన.

* రాజధాని ప్రాంతంలో జలక్రీడలు, పర్యాటక ఆకర్షక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.

* కృష్ణా నదిలో అభివృద్ధికి అనుకూలంగా ఉన్న దీవులలో ఇంజినీరింగ్‌ పనులు చేపట్టేందుకు ఆసక్తి అభివ్యక్తీకరణ ప్రకటన విడుదల. నిరుపయోగంగా ఉండే ద్వీపాల్ని తొలగించి అక్కడి ఇసుకను రాజధాని అవసరాలకు వినియోగించుకునేలా ఏర్పాట్లు.

* ప్రభుత్వ పరిపాలన నగరాల ఆకృతుల రూపకల్పనలో జాప్యాన్ని సర్దుబాటు చేసుకునేలా నిర్మాణ ప్రణాళిక రూపకల్పన.

* 2.5 కి.మీ. మేర పెనుమాకలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, ఉండవల్లి పరిధిలో 2.2 కి.మీ. మేర భూసేకరణ జరపాలని, త్వరలో దీనికి నోటిఫికేషన్‌ ఇస్తున్నామని అధికారుల ప్రకటన. రాయపూడిలో భూసేకరణ అడ్డంకి తొలగిపోయిందని వెల్లడి.

* రాజధానిలో స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ విద్యాలయాల ఏర్పాటుపై ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థలతో సంప్రదింపులు కొనసాగించాలి.

* రహదారుల వెంబడి పెంచే హరిత వనాలు జపాన్‌ తరహాలో అత్యద్భుతంగా ఉండాలి.

* శాసనసభ భవన పైలింగ్‌ పనులకు జులై 31 నాటికి టెండర్లు.

* హైకోర్టు భవనానికి కూడా వీలైనంత త్వరగా పైలింగ్‌ పనులకు టెండర్లు పిలిచి, జాప్యాన్ని నివారించాలని నిర్ణయం.

* పరిపాలనా నగరానికి 961.10 ఎకరాలు అవసరం కాగా... 862.53 ఎకరాల సమీకరణ పూర్తి. మిగతా భూసేకరణకు ప్రకటన విడుదల.

* శాసనసభ, హైకోర్టు, సచివాలయం, వీఐపీ హౌసింగ్‌, మౌలిక వసతుల పనులకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు డీపీఆర్‌లు సిద్ధం. నివాస గృహాలు, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణానికి హడ్కో నుంచి నిధులు.

రైతే ముందు..

* రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రథమ ప్రయోజనాలు దక్కేలా చూసేందుకు ‘రైతే ముందు’ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. రైతుల్లో నైపుణ్యాభివృద్ధి, రాజధానిలో అవకాశాల్ని అందిపుచ్చుకునేలా వారికి మార్గదర్శనం చేయడం ఈ విభాగం లక్ష్యాలు.

* డిసెంబరులోగా వంతెనలతో సహా ప్రధాన అనుసంధాన రహదారి నిర్మాణం పూర్తిచేసి సీఆర్‌డీఏకి అప్పగించాలని నిర్ణయించారు.

* తాము రుణంగా ఇచ్చే మొత్తంలో 30 శాతం నిధులు ముందుగా వేరే మార్గాల్లో సమకూర్చుకుని ఖర్చు చేసుకునేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. మొత్తం 10 రహదారుల నిర్మాణం ఆ నిధులతోనే చేస్తున్నామని సీఆర్‌డీఏ అధికారుల వెల్లడించారు.

కన్సల్టెంట్‌లపై సీఎం ఆగ్రహం..

రాజధానికి సంబంధించి వివిధ సేవలందిస్తున్న కొన్ని కన్సల్టెన్సీ సంస్థలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అవసరాలకు అనుగుణంగా సేవలందించడంలో ఆ సంస్థలు విఫలమవుతున్నాయని ఆయన మండిపడ్డారు.

Link to comment
Share on other sites

కృష్ణా నదిపై 2.7 కి.మీ. భారీ వంతెన!

త్వరలో తుది సర్వే మొదలు

అక్టోబరు కల్లా అమరావతి రైలు మార్గం సమగ్ర ప్రాజెక్టు నివేదిక

ఈనాడు -హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం అమరావతికి నూతన రైలు మార్గాలకు(అలైన్‌మెంట్‌) సంబంధించిన తుది సర్వే త్వరలో ప్రారంభం కానుంది. రైలు మార్గాలు ఏయే గ్రామాలమీదుగా వెళ్తాయి? స్టేషన్లు ఎక్కడ వస్తాయన్నదానిపై ఇందులో పూర్తిస్థాయి స్పష్టత రానుంది. రూ. 11.67 కోట్ల అంచనా వ్యయంతో తుది సర్వే చేపట్టేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. అర్హత కలిగిన సంస్థను కొద్దిరోజుల్లో ఎంపిక చేయనుంది. అక్టోబరు కల్లా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పూర్తి చేసి రైల్వేబోర్డుకు పంపించాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

గుంటూరు-విజయవాడ వయా అమరావతి నూతన రైలుమార్గానికి కేంద్రప్రభుత్వం ఫిబ్రవరిలో పచ్చజెండా వూపింది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ మార్గాల ద్వారా రాజధాని ప్రాంతానికి చేరుకునే విధంగా మూడు కొత్త లైన్లు రానున్నాయి. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) సంస్థ ప్రాథమికంగా సర్వే చేసి.. 106 కి.మీ. దూరం, రూ. 2,800 కోట్ల వ్యయంతో 3 మార్గల్లో కొత్త లైన్లు నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపడంతో దక్షిణమధ్యరైల్వే క్షేత్రస్థాయిలో తుది మార్గాన్ని (అలైన్‌మెంట్‌) ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది.

పనులు వచ్చే ఏడాదిలో

అమరావతికి వచ్చే మూడు మార్గాల్లో- తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి వచ్చే లైను కీలకం కానుంది. ఈ మార్గంలో కృష్ణా నదిపై 2.7 కి.మీ. దూరంతో రెండు లైన్ల రైలు మార్గంతో భారీ వంతెన నిర్మించాలని దక్షిణమధ్యరైల్వే గుర్తించింది. నదిలో సంవత్సరంలో ఎన్ని రోజులు వరద ఉంటుంది? నీటి లోతు ఎక్కడ ఎంత ఉంటుంది అన్న విషయాల్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. దానికి అనుగుణంగా మార్గంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. నేల స్వభావాన్ని పరిశీలించి స్టేషన్లు, ప్రధాన టెర్మినళ్లు ఎక్కడ ఏర్పాటుచేయాలన్న విషయాన్ని ఖరారుచేయనున్నట్లు ఆ వర్గాల సమాచారం. ఆర్‌వీఎన్‌ఎల్‌ చేసిన ప్రాథమిక సర్వేలో అమరావతి ప్రధాన ప్రాంతం అంచుల మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మార్గాన్ని ప్రతిపాదించారు. తుది సర్వే పూర్తయిన తర్వాత అంచనా వ్యయంలో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అక్టోబరులో కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపించి.. అక్కడ ఆమోదం లభించిన తర్వాత టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్మాణపనులు వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలున్నాయి.

ఇదీ అమరావతి మార్గం

* ఎర్రుపాలెం (విజయవాడ-కాజీపేట మార్గం)-నంబూరు (గుంటూరు-తెనాలి మార్గం). డబుల్‌లైన్‌. 57 కి.మీ.

* అమరావతి-పెద్దకూరపాడు. సింగిల్‌లైన్‌. 24.5 కి.మీ.

* సత్తెనపల్లి -నర్సారావుపేట. సింగిల్‌లైన్‌. 23 కి.మీ.

Link to comment
Share on other sites

మన అమరావతి యాప్‌!
 
 
636343004788979922.jpg
  • రాజధాని ప్రజలకు 20 రకాల సేవలు
  • ప్లాట్లకు అంతర్జాతీయస్థాయిలో మార్కెటింగ్‌
  • ఆధార్‌ నంబరు నమోదుతో ప్లాట్ల గుర్తింపు
  • ఫిర్యాదుల పరిష్కారానికీ అవకాశం
  • సీఆర్డీయే సమీక్షలో ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
 
 
అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని వాసులకు 20 రకాల సేవలను ఒకే వేదికపై అందించే ‘మన అమరావతి యాప్‌’ను సీఎం చంద్రబాబు బుధవారం ఆవిష్కరించారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో దీన్ని ఆవిష్కరించిన ఆయనకు యాప్‌ సేవల గురించి దాన్ని రూపొందించిన అజ్నా నెట్‌వర్క్స్‌ సీఈవో సతీశ్‌ చంద్ర వివరించారు. దేశంలోనే తొలిసారిగా పౌరులకు 20 ఉపయోగకరమైన సేవలను మన అమరావతి యాప్‌ అందించనుంది. భవిష్యత్తులో దీని ద్వారా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజధానికి భూములిచ్చినందుకు ప్రతిగా రైతులు పొందిన రిటర్నబుల్‌ ప్లాట్లను వారు తేలిగ్గా అమ్ముకునేందుకు ఈ యాప్‌లోని ‘బై అండ్‌ సెల్‌’ మాడ్యూల్‌ ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్లకు యాప్‌ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ను కల్పిస్తుంది. ప్లాట్ల యజమానులు ఈ యాప్‌లో లాగిన్‌ అయి, తమకు చెందిన స్థలాలను అమ్మకం, డెవలప్ మెంట్‌ లేదా లీజుకు ఇస్తామని ప్రకటనలు ఇవ్వవచ్చు. తద్వారా పూర్తి పారదర్శకంగా, మధ్యవర్తులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా దేశ విదేశాల్లోని వారితో లావాదేవీలు నిర్వహించవచ్చు. తమ ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసినంతనే రాజధాని రైతులు తమ ప్లాట్ల కోడ్‌ తదితర వివరాలను తెలుసుకునే వీలును కూడా ఈ యాప్‌ కల్పిస్తుంది. వాటి ఆధారంతో వారు తమ ప్లాట్లను ఖచ్చితంగా గుర్తించుకోగలుగుతారు. కాగా, యాప్‌ పనితీరును తెలుసుకున్న సీఎం చంద్రబాబు దీని రూపకల్పన చేసిన అజ్నా నెట్‌వర్క్స్‌ ప్రతినిధులు, సీఆర్డీయే అధికారులను అభినందించారు.
 
వినియోగదారులు సలహాలు ఇవ్వొచ్చు: సతీష్ చంద్ర
ఈ యాప్‌ అందించే సేవలపై వినియోగదారులు తమ ప్రతిస్పందన, సలహాలు తెలియజేసేందుకు కూడా అవకాశం కల్పించినట్లు దీని రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన అజ్నా నెట్‌వర్క్స్‌ సీఈవో కోగంటి సతీష్ చంద్ర తెలిపారు. ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం ద్వారా ప్రభుత్వం అందించే అన్ని సేవలనూ దీని ద్వారా ప్రజలు సులభంగా, సత్వరమే పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...