Jump to content

Amaravati


Recommended Posts

ఏపీ రాజధాని రోడ్లకు పేర్లు చెప్పండి!
 
 
636337198248750750.jpg
  • ప్రజాభిప్రాయం కోరిన ఏపీ సీఆర్డీయే
 
అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రతి కీలక పరిణామంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తున్న ఏపీ సీఆర్డీయే... నవ్యాంధ్ర రాజధానిలోని రహదారులు, కూడళ్లు తదితరాలకు పెట్టాల్సిన పేర్లను కూడా సూచించాల్సిందిగా ప్రజలను కోరింది. మన ఘన చరితను చాటే పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతోపాటు అమరావతిలో నిర్మితమవనున్న 9 థీమ్‌ సిటీల్లో... ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఉపకరించే సమాచారాన్ని ఇవ్వాలని కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థిస్తోంది. రాజధానిలోని రహదారులు, వీధులు, కూడళ్లు, కార్యాలయ భవనాలు, ఉద్యానవనాలు, క్రీడా ప్రాంగణాలు, కళావేదికలు, అతిథి గృహాలు తదితరాల
 
కు మన సంస్కృతి, వారసత్వం అద్దం పట్టే పేర్లను ఉంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నదులు, పర్వతాలు, నైసర్గిక విశేషాలు, ప్రాశస్త్య ప్రదేశాలు, చారిత్రక సంఘటనలు, రాజవంశాలు, రాజులు, వివిధ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన ప్రముఖులను గుర్తించి, ప్రజా రాజధానిగా రూపొందుతున్న అమరావతిలో సముచిత ప్రాధాన్యం కల్పించాలనుకుంటున్నారు. మొత్తం ప్రక్రియలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తే అసలుసిసలైన పీపుల్స్‌ క్యాపిటల్‌గా రాజధాని రూపొందుతుందన్న అభిప్రాయంతో వారి నుంచి సలహాలు, సూచనలను సీఆర్డీయే ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రపంచంలో ఎక్కడ ఉండే తెలుగువారైనా తమ అభిప్రాయాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించలేదు.
Link to comment
Share on other sites

 

ఏపీ రాజధాని రోడ్లకు పేర్లు చెప్పండి!

 

 
636337198248750750.jpg
  • ప్రజాభిప్రాయం కోరిన ఏపీ సీఆర్డీయే
 
అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రతి కీలక పరిణామంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తున్న ఏపీ సీఆర్డీయే... నవ్యాంధ్ర రాజధానిలోని రహదారులు, కూడళ్లు తదితరాలకు పెట్టాల్సిన పేర్లను కూడా సూచించాల్సిందిగా ప్రజలను కోరింది. మన ఘన చరితను చాటే పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతోపాటు అమరావతిలో నిర్మితమవనున్న 9 థీమ్‌ సిటీల్లో... ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఉపకరించే సమాచారాన్ని ఇవ్వాలని కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థిస్తోంది. రాజధానిలోని రహదారులు, వీధులు, కూడళ్లు, కార్యాలయ భవనాలు, ఉద్యానవనాలు, క్రీడా ప్రాంగణాలు, కళావేదికలు, అతిథి గృహాలు తదితరాల
 
కు మన సంస్కృతి, వారసత్వం అద్దం పట్టే పేర్లను ఉంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నదులు, పర్వతాలు, నైసర్గిక విశేషాలు, ప్రాశస్త్య ప్రదేశాలు, చారిత్రక సంఘటనలు, రాజవంశాలు, రాజులు, వివిధ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన ప్రముఖులను గుర్తించి, ప్రజా రాజధానిగా రూపొందుతున్న అమరావతిలో సముచిత ప్రాధాన్యం కల్పించాలనుకుంటున్నారు. మొత్తం ప్రక్రియలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తే అసలుసిసలైన పీపుల్స్‌ క్యాపిటల్‌గా రాజధాని రూపొందుతుందన్న అభిప్రాయంతో వారి నుంచి సలహాలు, సూచనలను సీఆర్డీయే ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రపంచంలో ఎక్కడ ఉండే తెలుగువారైనా తమ అభిప్రాయాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించలేదు.

 

 

names pettakunda numbering vuntene navigation easy outsiders/tourists ki. for e.g you are on E1, need to go to E7, just cross 5 major intersections.

Link to comment
Share on other sites

బస్‌ టెర్మినల్స్‌ ఏర్పాట్లపై సమాలోచన
 
 
636338030681388985.jpg
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధాని నగరంలో ఏర్పాటు చేయాల్సిన బస్‌ టెర్మినళ్లు, డిపోలు, సిటీ ఇంటెగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌ తదితరాలకు ఎంతెంత స్థలం, ఎక్కడెక్కడ కావాల్సి ఉంటుందనే అంశాలపై ఏపీఎస్సార్టీసీ వీసీ అండ్‌ ఎండీ మాలకొండయ్య సీఆర్డీయే అధికారులతో చర్చించారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ సమావేశం జరిగింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ గురించి, అందులోని వివిధ ప్రతిపాదిత మౌలిక వసతులకు సంబంధించిన వివరాల గురించి సీఆర్డీయే అధికారులు తొలుత మాలకొం
 
డయ్యకు వివరించారు.
 
రాజధానిలో రవాణా వ్యవస్థ అత్యున్నత ప్రమా ణాలతో ఏర్పడాలన్న ఉద్దేశంతో రూపొందించిన ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లాన్‌ గురించి కూడా తెలిపారు. అనంతరం మాల కొండయ్య అమరావతిలో తమ సంస్థ అవసరాలను గురించి సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌కు వివరించారు. ఈ సమావేశంలో సీఆర్డీయే ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ విభాగపు ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కేంద్రం ప్రకటించిన నాలుగో జాబితాలో అమరావతికి చోటు..
 
 
636338404299407674.jpg
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్మార్ట్ సిటీ శోభను సంతరించుకోనుంది. కేంద్రం ప్రకటించిన నాలుగో జాబితాలో అమరావతికి చోటు దక్కింది. పట్టణ పాలనా సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అమరావతిని స్మార్ట్ సిటీగా ప్రకటించడం వల్ల కేంద్రం మంజూరు చేసే రూ. 200 కోట్లతో పాటు పీపీపీ పద్ధతిలో మరో రూ. 500 కోట్లు ప్రభుత్వానికి అదనంగా వస్తాయని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తానని చెప్పారని, దానిపై పోటీ పెట్టారని...వాటిలో ఏపీ నుంచి మూడు ఎంపిక అయ్యాయని...అవి విశాఖ, కాకినాడ, తిరుపతి అని చెప్పారు. ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ ఎంపిక జరిగిందని అందులో అమరావతికి చోటు దక్కిందని మంత్రి తెలిపారు. ఇందుకోసం సహకరించిన అధికారులందరికీ నారాయణ ధన్యవాదాలు తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతి.. అంతా ‘స్మార్ట్‌’!
 
 
  • ప్రతిపాదిత వ్యయం రూ.1874 కోట్లు
  • కేంద్రం, రాష్ట్రాల వాటా 1000 కోట్లు
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా 24 గంటలూ చైతన్యంతో తొణికిసలాడే ‘ప్రజారాజధాని’లా నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఆమేరకు ప్రజారాజధానిలో స్మార్ట్‌ సిటీని ‘పీపుల్స్‌ ప్రెసింక్ట్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఆనుకుని, 650 ఎకరాలను దాని కోసం కేటాయించింది. ఇందులో రూ.1874 కోట్ల వ్యయంతో వివిధ అంశాలకు సంబంధించిన ‘స్మార్ట్‌ థీమ్స్‌’ను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయంలో రూ.1,000 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్‌ రూపంలో ఇవ్వనుండగా మిగిలిన రూ.874 కోట్లను వివిధ కేంద్ర పథకాలతోపాటు రాజధాని నిధుల సమీకరణకు ఉద్దేశించిన వివిధ వనరుల ద్వారా పొందాలని ప్రతిపాదించారు. స్మార్ట్‌ సిటీవాసులకు అధునాతన వీధిదీపాలు, సీసీటీవీలు, స్మార్ట్‌ డ్రింకింగ్‌ వాటర్‌, బయో- టాయ్‌లెట్లు, డిజిటల్‌ హోర్డింగ్‌ బోర్డులు ఇత్యాదివి సమకూరుస్తారు. స్మార్ట్‌ సిటీలోని వివిధ వసతులు, వివిధ కార్యక్రమాల గురించి విస్తృత సమాచారాన్ని అందించే ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తారు. ప్రజల భద్రత కోసం ‘ఇంటెలిజెంట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ను కూడా ప్రతిపాదించారు.
 
మైక్రో క్లైమేట్‌ మేనేజ్‌మెంట్‌: పరిసర ప్రదేశాలతో పోలిస్తే అమరావతిలో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తక్కువ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ నీటితుంపర వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. మొక్కల పెంపకాన్ని చేపడతారు.
 
అత్యుత్తమ రవాణా వ్యవస్థ: అత్యాధునిక ప్రజారవాణా, మోటారురహిత రవాణాను ప్రతిపాదించారు. కాలుష్యాన్ని నివారించేందుకు 120 సైకిళ్లతో పబ్లిక్‌ బైక్‌ షేరింగ్‌ సిస్టం, 50 ఎలక్ట్రికల్‌ బస్సులు, నడకదారులు, స్మార్ట్‌ మల్టీలెవెల్‌ కార్‌ పార్కింగ్‌, స్మార్ట్‌ స్ట్రీట్‌ తదితరాలను ఏర్పాటు చేయనున్నారు.
 
బ్లూ- గ్రీన్‌ రాజధాని: ‘బ్లూ- గ్రీన్‌ కాన్సెప్ట్ ’తో అమరావతిని అభివృద్ధి చేయనున్నారు. 250 ఎకరాల్లో భారీ ఉద్యానవనం, పెద్ద పెద్ద సరస్సులు, 5 కిలోమీటర్ల పొడవైన కాల్వలు, 1 కి.మీ. పొడవైన రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి పరుస్తారు.
 
యాక్టివిటీ సెంటర్స్‌: రాజధానివాసులతోపాటు అమరావతికి వచ్చే పర్యాటకులకు మనోల్లాసాన్ని కలిగించే పలు సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేస్తారు. కళలకు కాణాచిగా నిలిచే క్రాఫ్ట్స్‌ బజార్‌, రెండు సిటీ స్క్వేర్లు, లెక్కకు మిక్కిలి దుకాణాలు, షాపింగ్‌ప్లేసె్‌సతోపాటు వినోద కేంద్రాలనూ నెలకొల్పుతారు.
Link to comment
Share on other sites

నిర్మాణ దశలోనే నాలుగో స్థానం

దేశంలోనే మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా అమరావతి

68.4 పాయింట్లతో నాలుగో స్థానం

పరిపాలన నగరంలో 650 ఎకరాల్లో స్మార్ట్‌ వసతులు

నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులు, ఆధునిక నీటి సరఫరా వ్యవస్థ

ఈనాడు - అమరావతి

23ap-story1a.jpg

దేశంలో ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్న మొదటి ‘గ్రీన్‌ ఫీల్డ్‌’ నగరంగా అమరావతి చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన ఆకర్షణీయ నగరాల జాబితాలో అమరావతి 68.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కొత్తగా నిర్మిస్తున్న (గ్రీన్‌ఫీల్డ్‌) ఒక నగరాన్ని ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. నిర్మాణ దశలోనే ఆకర్షణీయ నగరంగా ఎంపికవడం వల్ల మొదటి నుంచీ ‘స్మార్ట్‌ సిటీ’ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా ఎంపికైనందున అమరావతికి కేంద్రం ఏటా రూ.100 కోట్లు చొప్పున...ఐదేళ్లపాటు రూ.500 కోట్ల నిధులిస్తుంది. అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దడానికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రూ.1874 కోట్లతో ప్రాజెక్టు నివేదికలు సమర్పించింది. నిర్దిష్ట ప్రాంత అభివృద్ధి (ఏరియా డెవలప్‌మెంట్‌)లో భాగంగా పరిపాలనా నగరంలోని 650 ఎకరాల్లో కల్పించనున్న వివిధ ఆధునిక సదుపాయాలతో పాటు, మొత్తం నగరాభివృద్ధి (పాన్‌ సిటీ డెవలప్‌మెంట్‌)లో భాగంగా ఎలక్ట్రిక్‌ బస్సులు, నీటి సరఫరా వ్యవస్థల్ని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది.

అడుగడుగునా స్మార్ట్‌..!

ఆకర్షణీయ నగరంగా ఎంపిక కోసం ప్రతిపాదనలు పంపేటప్పుడే... ప్రజాభీష్ఠానికి అనుగుణంగా నగరంలోని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయాలి. ఈ ప్రాంతం విస్తీర్ణం వెయ్యి ఎకరాలకు మించకుండా ఉండాలి. కొన్ని ‘స్మార్ట్‌’ ప్రతిపాదనలు అందజేయాలి. రాజధానిలో పరిపాలనా నగరాన్ని 900 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఒక కి.మీ. వెడల్పు, సుమారు 4 కి.మీ. పొడవు ఉండే... ఈ ప్రాంతాన్ని నాలుగు బ్లాకులుగా విభజించారు. దక్షిణంవైపు ఉండే మొదటి బ్లాకులో శాసనసభ, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు వంటివన్నీ వస్తాయి. మిగతా మూడు బ్లాకుల విస్తీర్ణం 650 ఎకరాలు. ఈ 650 ఎకరాల్లో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే అవకాశం ఉంటుంది. దీనికి ‘ప్రజావరణ (పీపుల్స్‌ ప్రిసింక్ట్‌)’గా నామకరణం చేసి... స్మార్ట్‌సిటీలో ఏరియా డెవలప్‌మెంట్‌ విభాగంలో దీన్ని పొందుపరిచారు. 650 ఎకరాల ప్రాంతంలో సమకూర్చే సదుపాయాలకు రూ.1424 కోట్లతో ప్రతిపాదనలు అందజేశారు.

ఆధునిక సదుపాయాల్లో కొన్ని..

*సూక్ష్మ వాతావరణ నిర్వహణ: ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లగా ఉంచేందుకు, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు పలు చర్యలు చేపడతారు. ఇందుకోసం చెట్లు పెంచడం, స్ప్రింక్లర్ల ద్వారా నీటిని వెదజల్లడం, అత్యాధునిక రాడార్‌, సెన్సర్లు ఏర్పాటుతో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పసిగడుతూ... అందుకు తగ్గ చర్యలు చేపడతారు.

* ప్రజా రవాణా వ్యవస్థ: కర్బన ఉద్గారాలులేని పర్యావరణ అనుకూల పట్టణ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. 50 ఎలక్ట్రిక్‌ బస్సులు ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ సైకిల్‌ డాక్‌లుంటాయి. పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, సైకిల్‌ ట్రాక్‌లుంటాయి. మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ ఉంటుంది.

* బ్లూ-గ్రీన్‌ సదుపాయాలు: అమరావతిని హరిత-నీలి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా 650 ఎకరాల ప్రజావరణ మధ్యలో 250 ఎకరాల్లో జీవవైవిధ్య పార్కు అభివృద్ధి చేస్తారు. ఈ పార్కు ఒక దీవిలా ఉంటుంది. దీని చుట్టూ కృత్రిమంగా ఏర్పాటు చేసిన కాలువలుంటాయి. పార్కుకి చుట్టూ సుమారు 10 కి.మీ. కెనాల్‌ ఫ్రంట్‌, కృష్ణా తీరంలో ఒక కి.మీ. పొడవునా రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు.

* యాక్టివిటీ సెంటర్లు: ప్రజలు, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తరచూ సందర్శించేందుకు వీలుగా క్రాఫ్ట్‌ బజారు, రెండు సిటీస్క్వేర్‌లు, రీటెయిల్‌, వినోద కేంద్రాలు అభివృద్ధి చేస్తారు.

* స్మార్ట్‌ యుటిలిటీస్‌: స్మార్ట్‌ వీధి దీపాలుంటాయి. వీటికే వైఫై రూటర్లు, సీసీటీవీ కెమెరాలు అమర్చుతారు. ఆధునిక తాగునీటి సదుపాయాలు, భూగర్భంలో డస్ట్‌బిన్‌లు, ఆధునిక ప్రజారోగ్య కేంద్రాలు, బయో టాయిలెట్‌లు, డిజిటల్‌ హోర్డింగ్‌ బోర్డులు ఏర్పాటు చేస్తారు.

* మెరుగైన పాలన: ప్రజలకు మార్గదర్శనం చేసేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందిస్తారు. ఈ ప్రాంతానికి ఏ పనిమీద వచ్చినవారికైనా... ఈ యాప్‌ ఆధారంగా తమకు కావలసిన చోటుకి వెళ్లి పని చక్కబెట్టుకునే వీలుంటుంది.

నగరానికి బ్రాండింగ్‌..

అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరంగా ఎంపిక చేయడంవల్ల అంతర్జాతీయ బ్రాండింగ్‌కు దోహదం చేస్తుందని, కేంద్రం ఇచ్చే రూ.500 కోట్లను ఈక్విటీగా చూపించి... మరో రూ.1500 కోట్లు వరకు వివిధ సంస్థల నుంచి రుణం తెచ్చుకోవచ్చునని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. స్మార్ట్‌సిటీల అభివృద్ధికి సంబంధించి ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాలతో భారత్‌కు ఒప్పందాలున్నందున.. వారి సహకారం, అనుభవం అమరావతి అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపాయి.

Link to comment
Share on other sites

ఊపందుకున్న రాజధాని రక్షణ కవచ నిర్మాణం.!
 
 
636339802505202573.jpg
అమరావతి: రాజధాని అమరావతికి రక్షణ కవచంగా పనిచేయనున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనులు ఊపందుకుంటున్నాయి. ఆగస్టు 15 నాటికి ఈ పథకాన్ని ప్రారంభించాలన్న లక్ష్యంతో కాంట్రాక్టు ఏజెన్సీ... మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ పనుల్లో వేగాన్ని పెంచింది. పథకంలో ప్రధానమైన డెలివరీ సిస్టమ్‌ పనులను ఫిషర్‌మెన్‌ సొసైటీ మూడు మాసాలుగా అడ్డుకోవడంతో కొంతమేర పనుల్లో జాప్యం జరిగినట్టయింది. ఇటీవలే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ రేవు ఏర్పాటుకు హమీని ఇవ్వడంతో ఆ సమస్య పరిష్కారమైంది.
 
 
డిజైన్‌ రూపకల్పన ఇలా..
రూ.237 కోట్ల భారీ వ్యయంతో వరదనీటి ఎత్తిపోతలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు సంబంధించి ఈ ఏడాది మార్చి ఒకటవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. వాగులో గరిష్టంగా 17వేల క్యూసెక్కుల వరదనీటిని అంచనా వేస్తూ.. అందులో ఐదు వేల క్యూసెక్కులను ఎగువ కృష్ణలోకి ఎత్తిపోసే విధంగా, మరో ఐవేల క్యూసెక్కులను గ్రావిటీ రూపంలో కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించేలా డిజైన్‌ చేశారు. మిగిలిన ఏడు వేల క్యూసెక్కుల నీటిని రాజధాని నీటి అవసరాల నిమిత్తం వాడుకునే విధంగా రూపకల్పన చేశారు.
 
నాలుగు నిర్మాణాలు..
ఈ పథకంలో ప్రధానంగా నాలుగు నిర్మాణాలు వున్నాయి. వీటిలో ఒకటి సంపు కాగా, రెండోది పంపుహౌస్‌ కమ్‌ డెలివరీ సిస్టమ్‌. మూడోది ఎస్కేప్‌ రెగ్యులేటర్‌. నాలుగోది 132కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌. కొండవీటివాగు కృష్ణానదిలో కలిసేచోట కరకట్ట నుంచి దక్షిణం వైపు 250 మీటర్ల దూరంలో 120/120 మీటర్ల విస్తీర్ణంలో అంటే సుమారు మూడెకరాల పరిధిలో ఓ మినీ రిజర్వాయరు (సంపు) నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఆరు మీటర్ల లోతులో వుండి కొండవీటివాగు వరద నీటి కలెక్షన్‌ పాయింట్‌గా పనిచేయనుంది. దీనిలో సుమారు 0.1 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.
 
పంప్‌ హౌస్‌ నిర్మాణం
సంపునకు ఈశాన్యంగా కరకట్ట-కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ మధ్య పాత రెగ్యులేటర్‌ స్థానంలో పంప్‌హౌస్‌ నిర్మాణం చేపడుతున్నారు. సుమారు 15మీటర్ల లోతు నుంచి దీని నిర్మాణం జరుగనుంది. ఇందులో ఒక్కోటి 1,600 కిలోవాట్ల సామర్ధ్యం గల 16 మోటార్లను ఏర్పాటు చేస్తారు. ఈ మోటార్ల నుంచి కరకట్లకు నాలుగు మీటర్ల దిగువ నుంచి 65 మీటర్ల పొడవు, 34మీటర్ల మందం... రెండు మీటర్ల డయా వ్యాసార్ధం గల 16 పైపులను కృష్ణానది వైపుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 16 మోటార్లు, 16 పైపుల్లో ఒక జత స్టాండ్‌బైగా వుంటుంది. మొత్తంగా 15 మోటార్ల సాయంతో సెకనుకు 5,297 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయవచ్చు.
 
 
తరువాత కొండవీటివాగు నుంచి మరో ఐవేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించేందుకు సహజ ప్రవాహాన్ని ఎంచుకున్నారు. పశ్చిమ ప్రధాన కాలువ కొత్త హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి దక్షిణంగా రెండొందల మీటర్ల దూరంలో కాలువకు పశ్చిమంగా పీడబ్ల్యూడి వర్కుషాపు రోడ్డువద్ద 12 మీటర్ల లోతులో అయిదు గేట్లతో కూడిన రెగ్యులేటర్‌ నిర్మాణం చేపట్టారు. కొండవీటివాగు నుంచి 143 మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పుతో వుండేవిధంగా కొత్తగా ఓ కాలువను నిర్మించి దానిని ఈ రెగ్యులేటర్‌కు అనుసంధానం చేయనున్నారు, ఇలా వాగు నుంచి పదివేల క్యూసెక్కుల వరదనీటిని రెండువైపులా మళ్లించనున్నారు.
 
విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌
మొత్తం పథకం నిర్వహణకు శక్తిని అందించేది 132 కే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌. దీనిని కొత్తగా నిర్మించనున్న కాలువకు దక్షిణంగా సుమారు 1.20 ఎకరాల విస్తీర్ణంలో రూ 30 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ను తాడేపల్లి సబ్‌స్టేషన్‌తో అనుసంధానించేందుకు 21 టవర్లతో హెచ్‌టి లైనును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటిలో నాలుగు టవర్ల నిర్మాణం పూర్తయింది. విద్యుత్‌ సబ్‌ స్షేషన్‌ నిర్మాణ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
 
అవరోధాలూ ఉన్నాయి..
వర్షాకాలం రావడంతో పాటు కొండవీటివాగు నుంచి పంపుహౌస్‌ నిర్మాణ ప్రాంతంలోకి నీటివూట భారీగా లీకవతుండడం, ఆ ప్రాంతమంతా నల్లరేగడి నేల కావడం...వాతావరణం అంతగా అనుకూలించకపోవడంతో పాటు పీడబ్ల్యూడీ వర్కుషాపు రోడ్డులో వున్న సుమారు ఇరవై ఆక్రమిత నివాసాలు పనుల వేగానికి అవరోధంగా మారాయి. తొలగింపు త్వరితగతిన చేపడితే ఆగస్టు 15 నాటికి పథకాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యానికి చేరుకోగలుగుతారు. ప్రస్తుతం ప్రాంగణంలో భారీ మిషనరీతో పాటు రెండొందల మంది సిబ్బంది రెండు షిఫ్టులుగా పనిచేస్తున్నారు.
 
 
 
Link to comment
Share on other sites

అమరావతి పేరులోనే పెన్నిధి..
 
 
636339803791094948.jpg
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అన్ని హంగులతో ప్రపంచాన్ని ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి అభినందనీయం. రాజధాని నిర్మాణంలో సామాన్య ప్రజలను, విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులను భాగస్వామ్యం చేయడం గర్వించదగ్గ విషయం. ఇదే క్రమంలో ప్రస్తుతం రాజధాని కేంద్రంగా నిర్మిస్తున్న ఏడు రహదారులకు నామకరణం చేయడానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం.ఈ అంశంపై వర్సిటీలోని మేధావులను తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. - ఏఎన్‌యూ
 
 
మంచి ప్రయత్నం..
రాజధాని మార్గాలను ఎంపిక చేయడం, అభివృద్ధికి చేరువకు మంచి ప్రయత్నం. నవ్యాంధ్ర ప్రాంతంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లను, స్వాతంత్య్ర, సమరయోధులు, తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన వారి పేర్లను ఏడు రహదారులకు నామకరణం చేస్తే బాగుంటుంది. ఎన్టీఆర్‌, పీవీనరసింహారావు, దామోదరం సంజీవయ్య తదితర పేర్లను పరిగణలోకి తీసుకోవచ్చు.
- ఆచార్య ఎన్‌.శామ్యూల్‌,ప్రొఫెసర్‌, సోషల్‌ వర్క్‌ విభాగం
 
ఆధునిక కవుల పేర్లను..
నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో తెలుగు సాహిత్యం, భాషాభివృద్ధికి ఆవిరళ కృషి సల్పిన ఆధునిక కవుల పేర్లను రాజధాని ప్రాంతంలో నిర్మితమవుతున్న రహదారులకు పేర్లు పెట్టాలి. గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, వేమన, వేటూరి సుందరాంమూర్తి ప్రముఖ కవులను గుర్తింపు ఇవ్వాలి. గౌతమి పుత్ర శాతకర్ణి, వైధిక్‌, నాగార్జున, బోదిశ్రీ, శాంతి శ్రీ, బోధి ధర్మ, శ్రీకృష్ణదేవరాయులు, పోతులూరి వీరబ్రహ్మం పేర్లను పరిశీలించాలి. - ఆచార్య సీహెచ్‌ స్వరూపరాణి, మహాయన బుద్దిస్ట్‌ విభాగం
 
సహజ నదుల పేర్లను..
అమరావతిలో నిర్మితమవుతున్న సప్త రహదారులకు సహజ నదుల పేర్లను పరిగణలోకి తీసుకుంటే సంతోషం.కోస్తా నుంచి రాయల సీమ వరకు వ్యాప్తి చెందిన నదుల పరివాహక ప్రాంతాలకు అత్యంత ప్రాముఖ్యం కల్పించినట్లవుతుంది. నదుల అనుసంధానంతో ఖ్యాతి గడించిన నవ్యాంధ్ర మరింత ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర, మంజీర, నాగవలి, వంశధార పేర్లను రహదారులకు నామకరణం చేస్తే బాగుంటుంది.- డాక్టర్‌ ఎస్‌.మురళీమోహన్‌, కో ఆర్డినేటర్‌, అంబేడ్కర్‌ చైర్‌
 
తర్కశాస్త్ర వేత్తల పేర్లు పరిశీలించాలి..
బుద్ధిజం మాధ్యమిక తర్కశాస్త్రవేత్తలుగా కీర్తిగడించిన శాస్త్రవేత్తలను, వారి పరిపాలన పాఠవాలను పరిగణనలోకి తీసుకోవాలి. అమరావతిని కేంద్రంగా చేసుకుని ఆనాటి కాలంలో ప్రజోపయోగ పరిపాలనకు ఎన్నో సేవలు అందించారు. ఆచార్య భావవివేక్‌, ఆచార్య నాగార్జున, ఆచార్య ఆర్యాదేవ, బుద్ధ్దపాలిత, బుద్ధఘోష్‌, ధర్మకీర్తి వంటి తర్కశాస్త్రవేత్తల పేర్లను పరిగణనలోకి తీసుకోవాలి. - ఆచార్య రాంకుమార్‌ రత్నం, మహయాన బుద్దిస్ట్‌ స్టడీస్‌
 
 
బుద్దిని కాలంలో రోడ్ల మాదిరిగా...
జపాన్‌, కొరియా, చైనా వంటి దేశాలకు రోడ్డు మార్గానే బుద్ధిజం వ్యాప్తి జరిగింది. సింగపూర్‌, బెంగళూరు వంటి ప్రాంతాల్లో రహదారులను ప్రత్యేక గుర్తింపు లభించింది. బుద్దుడు అవలంబించిన ఆర్య అష్టాంగ మార్గాలను దృష్టిలో పెట్టుకుని రహదారులకు నామకరణం చేస్తే బాగుంటుంది. సిల్క్‌ మార్గం, రాజమార్గం, ధర్మకీర్తి మార్గం, నాగార్జున మార్గం, సిద్దార్థ మార్గం, వాషుబంధుమార్గం, కపిలవాస్తు మార్గం తదితర పేర్లను దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుంది.- డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, మహాయన బుద్దిస్ట్‌
 
చరిత్ర - రాజుల గౌరవార్ధం..
తెలుగు జాతి పాలనలో ప్రముఖులైన రాజులు, రాణులు, మంత్రులు, కవులు పేర్లను పరిగణనలోకి తీసుకోవాలి. గౌతమి పుత్ర శాతకర్ణి, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి, పులోమావి, వాసిస్థ పుత్ర, వీర పురుషదత్త, వంటి పేర్లను రహదారులకు నామకరణం చేస్తే బాగుంటుంది. అదే విధంగా స్వాతంత్య్ర సమరయోధులు ఎన్జీరంగా, పుచ్చలపల్లి సుందరయ్య, కొండా వెంకటప్పయ్య, వావిలాల గోపాలకృష్ణ, పొట్టిశ్రీరాములు పేర్లను పరిగణనలోకి తీసుకోవాలి. -డాక్టర్‌ ఈవీ పద్మజ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ.
Link to comment
Share on other sites

హరిత తోరణం

ఏడీసీ ప్రణాళిక రూపకల్పన

నర్సరీల నుంచి మొక్కల సేకరణ

శాఖమూరులో ఉద్యానవనం

మంగళగిరి, న్యూస్‌టుడే

amr-gen6a.jpg

రాజధాని అమరావతి దారులన్నీ హరితతోరణంగా తీర్చిదిద్దటానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అనాదిగా పచ్చదనంతో తొణికసలాడే ఈ ప్రాంతాన్ని మరింత హరిత శోభితంగా తీర్చిదిద్దటానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కార్యాచరణ చేపడుతోంది. ఏడీసీ సీఎండీ లక్ష్మిపార్థసారథి ఆధ్వర్యంలో హరిత అమరావతిగా మార్చటానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో రెండేళ్ల క్రితమే సీఆర్‌డీఏ, అటవీశాఖ, సామాజిక అటవీశాఖ వేర్వేరుగా సర్సరీలు ఏర్పాటు చేశాయి. సుమారు 52 లక్షల మొక్కలు అమరావతిలో నాటించాలన్నది నిర్ణయించగా.. దాన్ని అమలులోకి తెచ్చేలా ఏడీసీ కార్యరంగంలోకి దిగింది.

కృష్ణా తీరంలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం ఒక వైపు ప్రారంభమైంది. తొలుత రాజధాని పాలనా భవనాలు, అసెంబ్లీ, సచివాలయం, రాజధాని ప్రాంతంలో ఏర్పాటయ్యే వైద్య, విద్యా, పారిశ్రామిక, ఆర్థిక నడవలు ఏర్పాటవుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో విశాల మైన లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ విశాలమైన రహదారుల నిర్మాణం ప్రారంభించారు ఈ నేపథ్యంలో హరితశోభతో రహదారులు ఉండాలని ఏడీసీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.

రాజధానిలో రహదారులు ఇలా...

రాజధాని పరిధిలో ఇప్పటికే సీడ్‌ యాక్సెస్‌ రహదారిని 19.5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. బోరుపాలెం నుంచి నేరుగా 16వ నెంబరు జాతీయ రహదారిని కలుపుతూ తాడేపల్లి కనకదుర్గమ్మవారధి వద్ద కలుస్తుంది. దీనికి ఇరువైపులా మొక్కలు నాటుతారు. అమరావతిలోని అన్ని గ్రామాలను కలుపుతూ వైద్య, విద్యా, పారిశ్రామిక, ఆర్ధిక నడవలు, లేఅవుట్‌లను అనుసంధానం చేస్తూ ఏడు ప్రాధాన్యత రహదారులను సుమారు 59.25 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ మేరకు మార్కింగ్‌ చేపట్టారు. 210 అడుగుల వెడల్పుతో విశాలమైన రోడ్లు వస్తాయి. మరో 11 రెండో ప్రాధాన్యాత రోడ్లను సుమారు 56.31 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఆయా రహదారుల నమూనాలను ప్లానింగ్‌ విభాగం సిద్ధం చేసింది.

తొలిదశలో రహదారుల వెంట మొక్కలు

రహదారుల నిర్మాణం ప్రారంభించిన వెంటనే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఏడీసీ నిర్ణయించింది. వర్షాలు ప్రారంభమైనందున ఇప్పుడే 50 వేల మొక్కలు నాటాలని భావిస్తున్నారు. రోడ్లు పూర్తయ్యే నాటికి మొక్కలు ఏపుగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తొలిదశలో సుమారు 157.5 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటనున్నారు. ఎక్కువగా నీడను ఇచ్చే మొక్కలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో రహదారులకు ఇరువైపులా కాకుండా ఆరు వరుసలతో ఉండే రోడ్ల మధ్యలో, డివైడర్లు మధ్యలో, సైకిల్‌ ట్రాక్‌ల పక్కన మొక్కలు నాటుతారు

ఆహ్లాదానికి ఉద్యానవనాలు

భవిష్యత్తులో ఉన్నత విద్య చదివేందుకు వచ్చే విద్యార్థులు, దేశ విదేశాల నుంచి పారిశ్రామిక, వైద్య, ఐ.టి. నిఫుణులు వస్తుంటారు. వీరందరికీ ఆహ్లాదకర వాతావరణం కల్పించటానికి విశాలమై ఉద్యాన వనాలు నిర్మించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. అమరావతిలో శాఖమూరు, వెంకటపాలెంలో ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిదశగా వెంకటపాలెంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనం ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. శాఖమూరులో ఎంపిక చేసిన 250 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనం అభివృద్ధి చేయనున్నారు. నీడనిచ్చే మొక్కలను నాటేందుకు కావాల్సిన మొక్కలను ఎంపిక చేస్తున్నారు. వివిధ రకాల ఆకర్షణీయమైన పూలమొక్కలు ఉండేలా ఉద్యానవనం రూపొందిస్తారు.

తక్షణమే కార్యరంగంలోకి..

హరితశోభిత అమరావతి రూపకల్పనకు ఏడీసీ తక్షణమే కార్యరంగంలోకి దిగింది. అటవీశాఖ, సామాజిక అటవీశాఖ, సీఆర్‌డీఏ సంయుక్త సహకారంతో విస్తృత ప్రాతిపదికన హరిత అమరావతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాజధాని ప్రాంతం హరిత అమరావతిగా భాసిల్లాలని అందుకు కావాల్సిన చర్యలు తక్షణం చేపట్టాలని ఏడీసీ సీఎండీ లక్ష్మిపార్వతి నిర్ణయించారు. అధికారులకు ఈమేరకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...