Jump to content

polavaram


Recommended Posts

1 minute ago, Bollu said:

distribution canals methodology kakunda anathapuram dist uravakonda lo 1 lac acres to dip irrigation to irrigate chesthunnaru. 
so same formula ikkada kooda follow chesthunnaru. most probably dist canals undavu.

don't compare godavari with anantpur. plenty of water available in polavaram rmc and lmc(17,500 cusecs at head) .  handri neeva main canal (3,800 cusecs) which needs to serve kurnool, anantpur , part of chittoor districts.

advantages of distribution canals:

improves ground water table.

possible for growing paddy.

almost zero power bill.

negligible maintenance. no need to replace pipes, 

disadvantages :

water utilization percentage is less compare to drip irrigation. 

 

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
8 minutes ago, ravindras said:

 don't compare godavari with anantpur. plenty of water available in polavaram rmc and lmc(17,500 cusecs at head) .  handri neeva main canal (3,800 cusecs) which needs to serve kurnool, anantpur , part of chittoor districts.

 advantages of distribution canals:

 improves ground water table.

possible for growing paddy.

almost zero power bill.

negligible maintenance. no need to replace pipes, 

disadvantages :

 water utilization percentage is less compare to drip irrigation. 

  

Agree with your points, land acquisition avoid cheyatam kosam move on avuthunnaru anukunta.  especially 2013 LA tadisi mopedu avuthunnattu undi. I don't know weather central govt will sponsor for distribution canals or not, for drip irrigation central govt sponsoring 80% royalty on instruments.

Link to comment
Share on other sites

34 minutes ago, Bollu said:

Agree with your points, land acquisition avoid cheyatam kosam move on avuthunnaru anukunta.  especially 2013 LA tadisi mopedu avuthunnattu undi. I don't know weather central govt will sponsor for distribution canals or not, for drip irrigation central govt sponsoring 80% royalty on instruments.

don't forget r&r cost for polavaram project out-sees 33,000 crores. total cost 58,000 crores. distribution channels won't cost more than 10% of 58,000 crores including land acquisition. 

in chintalapudi lift irrigation also  distribution channels are pending. 

Link to comment
Share on other sites

కలసి పనిచేద్దాం
గడువులోగా పూర్తి చేద్దాం
పోలవరానికి అక్టోబరు కీలకం
ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో కొత్త సీఈఓ జైన్‌
ఆకృతులకు ఆమోదంపై చర్చ
అంచనాల సవరణపై త్వరలో అథారిటీకి అధికారుల నివేదిక
ఈనాడు - అమరావతి
27ap-main13a.jpg

పోలవరం ప్రాజెక్టు గడువు లోపు సాకారం కావాలంటే వచ్చే అక్టోబరు నెల ఎంతో కీలకమని ప్రాజెక్టు అథారిటీ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కొత్త కార్యనిర్వహణాధికారి(సీఈఓ) ఆర్‌.కె.జైన్‌ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించి వచ్చాక, గురువారం విజయవాడలో అథారిటీ సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా తాను ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసిన జైన్‌.. తాను ఎక్కువ సార్లు పోలవరం వచ్చి ప్రాజెక్టును  పరిశీలిస్తానని చెప్పారు. గడువు లోపు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కలిసి పని చేద్దామని అన్నారు. 2019 జూన్‌ కల్లా గ్రావిటీ ద్వారా కాలువలకు నీళ్లు ఇవ్వాలంటే ఇంకా ఏయే అడ్డంకులు అధిగమించాలనే విషయంపై ఈ సమావేశంలో కూలంకష చర్చ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంక్రీటు, మట్టి తవ్వకాలు, పునరావాసం, భూసేకరణ పరంగా అక్టోబరు ఎంతో కీలకమని అంతా అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, చీఫ్‌ ఇంజినీర్‌ ప్రదాన్‌లతో పాటు జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
* వర్షాల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కాంక్రీటు పనులు లక్ష్యం మేరకు పూర్తి కాలేదు. దీంతో అక్టోబరు నెలలోనే స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కలిపి 2,90,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉంటుంది. నవంబరు నెలలో 3,50,000 క్యూబిక్‌ మీటర్లు, డిసెంబర్‌ నెలలో 3,57,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాలి. మట్టి తవ్వకాలు వేగవంతం చేయాల్సి ఉంది. పోలవరం అథారిటీ సీఈవో ఇదే విషయం చెప్పారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకున్నట్లు అధికారులు చెప్పారు.
* 2019 జూన్‌కు నీళ్లు ఇవ్వాలంటే తక్షణమే నాలుగైదు ఆకృతులకు ఆమోదం లభించాల్సి ఉంది. కాఫర్‌డ్యాం నిర్మాణానికి సంబంధించి 42.5 మీటర్ల ఎత్తుకు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. ఆ ఆకృతుల ఆమోదానికి తాము కేంద్ర జలసంఘంతో మాట్లాడతామని అథారిటీ సీఈవో చెప్పారు. కాఫర్‌ డ్యాం ఎత్తుకు అంగీకరిస్తూనే దిగువన వెడల్పు పెంచాలని ఇప్పటికే సూచించిన మేరకు ఆకృతుల్లో మార్పులు చేసి పంపించారు. ప్రధాన డ్యాం ఆకృతులను ఇంకా అధికారులు పంపవలసి ఉంది. అక్టోబరు 15 కల్లా వాటిని సమర్పిస్తామని చెప్పారు. త్వరగా  ఆకృతులు సమర్పించాలని సీఈఓ సూచించారు.
* 41.15 మీటర్ల స్థాయికి ఇంకా పునరావాసం పూర్తి చేయాలంటే మరో 14,908 కుటుంబాలను ఆ గ్రామాల నుంచి తరలించాల్సి ఉంది. వీరి కోసం 48 పునరావాస కాలనీలను సకల సౌకర్యాలతో నిర్మించాల్సి ఉంది.
* పోలవరం సవరించిన అంచనాలపై కేంద్ర జలసంఘం లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు సిద్ధమయ్యాయని, నివేదిక రూపొందిస్తున్నామని సోమవారం నాటికల్లా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పిస్తామని అధికారులు జైన్‌కు తెలియజేశారు.
* పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో జైన్‌తో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం ఉదయం సమావేశమయ్యారు. ప్రాజెక్టు సకాలంలో సాకారమయ్యేలా సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందేలా చూడాలని  విన్నవించారు.

Link to comment
Share on other sites

On 9/26/2018 at 10:23 AM, ravindras said:

don't forget r&r cost for polavaram project out-sees 33,000 crores. total cost 58,000 crores. distribution channels won't cost more than 10% of 58,000 crores including land acquisition. 

 in chintalapudi lift irrigation also  distribution channels are pending. 

From cag report https://agap.cag.gov.in/English.pdf.  basically we need Distributary for 3 lac acres only.

2.1.11.4 Distributary network
Distributary network is an essential component in any irrigation project to deliver irrigation water to the fields of farmers. 
The Polavaram project contemplates creation of irrigation potential of 7.20 lakh acres. Out of this,3.92 lakh acres was being covered under Pushkara and Tadipudi lift irrigation schemes taken up to derive early benefits from Polavaram project. Audit observed that the Department was yet to take up the works of distributary
network for the remaining 3.28 lakh acres. 

Government replied that the entire canal network of these above lift irrigation schemes would become distributary network of the Polavaram Project. For the remaining ayacut, the GoAP and PPA were considering establishing of Micro Irrigation System (piped network) in place of open channel system due to increase in land cost. Audit however observed that micro irrigation was not part of the project proposals contemplated in the DPR. Further, as per the target dates, the works of Polavaram dam and canals were scheduled for completion by June 2019. To derive optimal benefits from the project, it was essential to develop distributary network by the time the project works are completed.

 

 

Link to comment
Share on other sites

పోలవరానికి రుణం తీసుకోండి
కేంద్రం ఇచ్చాక చెల్లించండి
వర్షాకాలం ముగిసినందున  పనుల వేగం పెంచాలి
ఈ 3 నెలలూ ఎంతో కీలకం
సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఈనాడు - అమరావతి
1ap-main15a.jpg

పోలవరానికి అవసరమైతే తొలుత జలవనరుల కార్పొరేషన్‌ ద్వారా వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని, కేంద్రం నుంచి నిధులు వచ్చిన వెంటనే రుణాన్ని సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సహాయ పునరావాస పనులను డిసెంబరులోగా పూర్తి చేయాల్సి ఉందని, నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రాజెక్టుకు ఏ దశలోనూ నిధుల ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉన్నందున ఈ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పోలవరంతోపాటు రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. సంగం బ్యారేజీ పనుల్లో జాప్యంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 15లోపు గుత్తేదారు పూర్తిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

పనులు వేగవంతం చేయాలి..
పోలవరం నిర్మాణంలో ఈ మూడు నెలలూ కీలకమైనవని, వర్షాలు తగ్గినందున పనులను వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. మట్టి తవ్వకం పనులు ఇంకా 80 లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. సవరించిన అంచనాలకు సంబంధించి కేంద్ర జల సంఘం అనుమానాలను త్వరగా నివృత్తి చేయాలని సూచించారు. చెల్లింపులకు సంబంధించి పోలవరం వద్ద ఇటీవల ఎవరో టెంటు వేసి గొడవ చేసినట్లున్నారని సీఎం ఆరా తీశారు. ఉపగుత్తేదారులకు కొందరికి చెల్లింపు చేయాల్సి ఉందని, చిన్నమొత్తాలే అని అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెలలో పోలవరం గేట్ల ఏర్పాటు ప్రక్రియపైనా సీఎం చర్చించారు. గేట్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు ఆకృతులు ఆమోదం పొందవలసి ఉందని అధికారులు వివరించారు. ప్రధానడ్యాం, కాఫర్‌డ్యాం, ఇతర పనులను త్వరగా పూర్తి చేసేలా ప్రతిపాదించిన గుత్తేదారుకు బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. గండికోట జలాశయంలో 20 టీఎంసీలు నిల్వ చేసేలా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. మల్లెమడుగు పనులను డిసెంబరు చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీమ జిల్లాల్లో చివరి చెరువులకూ నీళ్లందేలా చూడాలని చెప్పారు. జలాశయాలు, కాల్వలకు సెన్సర్లు ఏర్పాటుచేసి జలవనరులను అంచనా వేస్తే సేద్యానికి ఎంత నీరు వస్తుందో రైతులకు అవగాహన లభిస్తుందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటుచేసి విద్యార్థులకు జలవనరులపై అవగాహన కల్పించాలని సూచించారు. మారాల, చెర్లపల్లిలకు ఈనెల 10న, మదనపల్లెకు నవంబరు 10, పుంగనూరుకు నవంబరు 15, కుప్పం బ్రాంచి కాలువకు నవంబరు 22న కృష్ణా జలాలను విడుదల చేస్తే కుప్పానికి డిసెంబరు ఒకటికి నీరు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.

నగదు తీసుకోవడానికి అడ్డుచెబితే..
‘పసుపు-కుంకుమ’ కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన మొత్తాలనుగానీ, మహిళా సంఘాల పొదుపు మొత్తాలనుగానీ తీసుకోడానికి బ్యాంకర్లు అడ్డు చెబితే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ శాఖల పనితీరు, పథకాల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఆయా వర్గాల్లో డిమాండుకు తగ్గట్టు పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎస్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను ఇచ్చే అంశాన్ని త్వరితంగా అమలయ్యేలా చూడాలని సూచించారు.

ప్రజా వేదికకు భారీగా జనం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును స్వయంగా కలసి తమ కష్టాలు చెప్పుకొనేందుకు ఉండవల్లిలోని ప్రజావేదికకు సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్యమంత్రి వారందరి సమస్యలు ఓపికగా విని, వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ముఖ్యంగా దివ్యాంగుల సమస్యలు, పేదలకు పింఛన్లు, గ్రామీణ గృహ నిర్మాణం, తాగునీటి ఇబ్బందులపై వచ్చినవారి సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వయోవృద్ధులకు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం మంజూరు చేశారు. వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు, శస్త్ర చికిత్సల నిమిత్తం ఆర్థిక సహాయం మంజూరు చేశారు.

జలరక్షణే కరవు నివారణకు మార్గం 
ఈనాడు డిజిటల్‌, అమరావతి: జలరక్షణేే కరవు నివారణకు సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘నీరు-ప్రగతి’పై ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత లోటు 19 శాతం ఉంటే రాయలసీమ జిల్లాల్లో 45 శాతంగా నమోదైందని వివరించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలనిచ్చారు.
* చిత్తూరు జిల్లాలో వ్యాధులను నియంత్రించాలి.
* డిసెంబరు30 వరకూ చేపట్టే పశుగణనను విజయవంతం చేయాలి.
* 41 వేల ఎకరాల్లో నాలుగులక్షల టన్నుల పచ్చగడ్డిని అందుబాటులోకి తేవాలి.
* డ్వాక్రా మహిళల ద్వారా పశుగ్రాసం పంపిణీ చేయాలి.
* నెల్లూరు, చిత్తూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో గోకులాలు పురోగతి సాధించాలి.
* ఉపాధిహామీలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు 29 శాతమే వినియోగించుకున్నాం. ఇంకా రూ.835 కోట్లు వినియోగించుకోవాల్సి ఉంది.
Link to comment
Share on other sites

పోలవరం చుట్టూ సాయుధ బలగాల మోహరింపు
03-10-2018 11:52:06
 
636741643252333875.jpg
  • నలు దిక్కులా చెక్‌ పోస్టుల ఏర్పాటు
  • సీసీ కెమెరాల సాయంతో కదలికలపై ఆరా
  • పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమాచార మార్పిడి
  • చత్తీస్‌గడ్‌ వైపు అటెన్షన్‌.. మావోయిస్టులతో అప్రమత్తం
  • ప్రత్యేక వ్యూహంతో కట్టడి : జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌
 
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు రక్షణ నిమిత్తం అష్ట దిగ్బంధనం చేయబోతున్నారు. ఎప్పుడు, ఏ ఘటన జరిగినా అప్రమత్తమ య్యేలా నిఘా కెమెరాలను అమర్చారు. ప్రాజెక్టు వద్ద పని వాళ్లనూ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందరి వేలిముద్రలు, కనుపాపల వివరాలు సేకరించి కదలికలను కట్టడి చేస్తున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే అన్నిమార్గాలపైనా నిరంతర నిఘా ఉంటుంది. సాయుధ బలగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. పరిస్థితిని బట్టి డ్రోన్‌ కెమెరాలను వినియోగించబోతున్నారు. నలుదిక్కులా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చీపోయే వివరాలను నమోదు చేస్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి మావోయిస్టుల కదలికలకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు సమీపాన గోదావరి ప్రవాహం సాగుతుండడంతో తొలిసారిగా ‘రివరైన్‌ పోలీస్‌’ను రంగంలోకి దింపారు. చత్తీస్‌గడ్‌, ఒడిశా, తెలంగాణ పోలీసులతో సమాచార సంబంధాలను మరింత మెరుగు పర్చుకోనున్నారు. విశాఖ మన్యంలో మావోయిస్టులు ఇటీవల హత్యాకాండకు పాల్పడడం, అదును దొరికితే లక్ష్యాలపై విరుచుకుపడే వ్యూహంలో ఉన్నందున పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుకు సమాయత్తమయ్యారు. చీమ చిటుక్కుమన్నా.. వెంటనే అప్రమత్తం కావడానికి సంసిద్ధులై ఉన్నారు.
 
ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతుంది ?
ఉభయ గోదావరి జిల్లాల్లో నక్సల్స్‌ కదలికలకు ఆస్కా రం ఉన్నట్టు గుర్తించారు. పొరుగునే వున్న చత్తీస్‌గడ్‌ నుంచి ఇంతకుముందు మావోయిస్టు దళాలు ఈ ప్రాం తానికి వచ్చి ‘షెల్టర్‌’ తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారనే బలమైన సంకేతాలు నలుదిక్కులా వ్యాపించేలా ప్రాజెక్టు వద్ద కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎస్పీ రవిప్రకాశ్‌ నేతృత్వంలో విశాఖ ఘటన అనంతరం పోలవరం ప్రాజెక్టు భద్రతపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును కంటికి రెప్పలా రక్షణ ఇవ్వాల్సిందేనని, ఆ మేరకే రక్షణ బలగా లను మోహరించారు. ప్రాజెక్టు వైపు వున్న అన్నిమా ర్గాలను సాయుధ బలగాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకు న్నాయి. వచ్చీ పోయే వారి పూర్తి వివరాలు సేకరించిన తరువాతే అనుమతి ఇస్తున్నారు. బలవంతంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటాన్నారు. క్షణక్షణం ప్రాజెక్టు వద్ద కదలికలపైన, నదీ ఉపరితల సంచారంపైనా నిఘా పెం చారు. ఇవన్నీ అమరావతిలోని కంట్రోల్‌ రూమ్‌కు చేరేలా సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకున్నారు.
 
సాయుధ బలగాలు ఏం చేయబోతున్నాయి
నాలుగు స్పెషల్‌ పార్టీలు, ఏపీఎస్పీ, సీఆర్పీ కంపెనీ లను పోలవరం ప్రాజెక్టుకు రప్పించారు. తూర్పు గోదావ రివైపు నుంచి ఈ వైపు మావోయిస్టులు చొచ్చుకురావ డాన్ని నిరోధించేలా అన్ని ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. దేవీపట్నం-మారేడుమిల్లి మధ్య నదీ ప్రవాహం లో లాంచీలు, పడవుల ద్వారా కదలికలను గమనిస్తారు. రాకపోకల్లో అనుమానిత వ్యక్తులుంటే రక్షణ బలగాలు అదుపులోకి తీసుకుంటాయి. రివరైన్‌ పోలీసింగ్‌ పద్ధతిని పాటించడం ద్వారా గోదావరి నదీ ప్రవాహం నిడివిన.. మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నారు. నిత్యం కూంబింగ్‌ కొనసా గుతోంది. సీఎం చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు, ముఖ్య ప్రజా ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టును సంద ర్శించినప్పుడు అదనపు బలగాలను రంగంలోకి దింపారు.
 
నలు దిక్కులా చెక్‌ పోస్టులు
ప్రాజెక్టుకు నలుదిక్కులా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశా రు. సాయుధ బలగాలతోపాటు సాయుధ పోలీసులను ఇక్కడ నియమిస్తున్నారు. దీనికి అదనంగా పెద్దసంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం పసిగట్టేందుకు వీలైన సాంకేతికత ఈ కెమెరాల్లో నిక్షిప్తమై ఉంది. కెమెరాల పరిధిలో ఎవరైనా సంచరిస్తే కనిపెడతాయి. పాములు, ఇతరత్రా జీవులు శీతల రక్తం కలిగి ఉంటే వాటిని గమనించవు. మానవుల శరీర ఉష్ణో గ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలన్నీ కదలికలను గుర్తిస్తాయి. మెరుగైన సాంకేతిక పద్ధతులను అమలులోకి తెస్తున్నారు.
 
గుత్తికోయల కుటుంబాలపై దృష్టి
చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు అనుకూలంగా వ్యవహ రించే గుత్తికోయల కుటుంబాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే 70కు పైగా ఇలాంటి కుటుంబాలను గుర్తించి వారంతా మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా సంక్షేమ కార్యక్ర మాలను అమలు చేస్తున్నారు. పొరుగునవున్న అటవీ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని ఎప్పటికప్పుడు చత్తీస్‌గడ్‌ నుంచి ఈ ప్రాంతం వైపు మావోయిస్టు దళాలు కదలికలు ఉండకుండా కట్టడి చేయగలిగారు. నిరంతర నిఘా వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. తదనుగు ణంగానే ఇంతకు ముందు మావోయిస్టుల కదలికలు ఎలా ఉండేవనే దానిపై పూర్తి వివరాలను రాబట్టారు. ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకున్న తరువాతే అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగించడం, అనుమానితులు, మావోయిస్టులు ఈ ప్రాంతంలో చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
భద్రత కట్టుదిట్టం : ఎస్పీ రవిప్రకాష్‌
పోలవరం ప్రాజెక్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిం చేందుకు మా పద్ధతిలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుం టూనే ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను పరిగణ నలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులు ఈ ప్రాంతంవైపు చొరబడకుండా కట్టడి చేస్తున్నాయి. ఆఖరు కు పోలవరం క్యాంపులోవున్న రాష్ట్రేతరులను తేలిగ్గా తీసు కోవడం లేదు. వారి వివరాలను, వేలిముద్ర సహా సేకరి స్తున్నాం. గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. భద్రత విషయం లో రాజీ లేదు. తాజా పరిణామాల నేపథ్యంలోనే కాదు.. ఇంతకుముందు నుంచి పోలవరం ప్రాజెక్టుకు అవస రమైన భద్రతలో రాజీ పడడం లేదు.
Link to comment
Share on other sites

పోలవరానికి ఇక సొంత నిధులే!
03-10-2018 02:41:12
 
636741312715558886.jpg
  •  ఎత్తిపోతల తరహాలో బ్యాంకుల నుంచి రుణం
  •  డబ్ల్ల్యూఆర్‌డీసీ ద్వారా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం
  •  తుది అంచనాలపై కేంద్రం అవే కొర్రీలు
  •  కేంద్ర నిధులతో పనిలేకుండానే ప్రాజెక్టు పూర్తి
  •  2019కల్లా గ్రావిటీ ద్వారా నీరివ్వాల్సిందే
  •  అధికారులకు సీఎం నిర్దేశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సాయం చేసే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి ఏకోశానా లేదని రాష్ట్రప్రభుత్వానికి అవగతమైంది. జాతీయ హోదా ప్రకటించి నాలుగేళ్లు దాటినా.. ఇప్పటిదాకా ప్రధాన పనుల డిజైన్లను ఆమోదించలేదు. 2013-14 సవరణ అంచనాల ఆమోదానికి కేంద్రం మోకాలడ్డుతుండడంతో.. ఇక దానిపై ఆధారపడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ముందు సొంత నిధులను ఖర్చుపెట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలని సంకల్పించారు. ఇందుకోసం జలవనరుల అభివృద్ధి సంస్థ (డబ్ల్యూఆర్‌డీసీ) ద్వారా వాణిజ్య బ్యాంకు ల నుంచి రుణసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు ఎత్తిపోతల పథకాలకు రూ.4,000 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. నిజానికి సత్వరమే ప్రాజెక్టు పూర్తికి రూ.10,000 కోట్లను అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. దీనికి ఇంతవరకు సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వినతిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి.
 
తర్వాత రీయింబర్స్‌మెంట్‌ యత్నాలు!
2019 జూన్‌నాటికి గ్రావిటీ ద్వారా సాగునీరు అందించాలంటే.. కేంద్ర నిధుల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం అనవసరమని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ముందు సొంత నిధులతో పూర్తిచేసి.. ఆనక కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌ కోసం ప్రయత్నించి సర్దుబాటు చేసుకోవాలని అనుకుంటోంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోతే.. పనుల్లో వేగం తగ్గుతుందని, లక్ష్యాన్ని చేరుకోలేమని ముఖ్యమంత్రి కలవరపడుతున్నారు. సోమవారం జలవనరుల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ‘పోలవరం ప్రాజెక్టు తొలి డీపీఆర్‌ను 1984లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపించింది. దీనిపై జల సంఘం అప్పట్లోనే కొర్రీలు వేసింది. ఏకంగా 80 కొర్రీలు వేసి వెనక్కి పంపడంతో ఈ ప్రాజెక్టుకు సా యం చేసేందుకు కేంద్రం ఆసక్తిగా లేదని అర్థమైంది. ఇప్పుడు.. 2013-14 సవరించిన అంచనాల విషయంలోనూ ఇదే పునరావృతమైంది. 2017లో తుది అంచనాలను జల సంఘానికి పంపితే.. ఏడాదిలో తొమ్మిది సార్లు కొర్రీలు వేసింది. చివరకు సొంతగా ఒక ఫార్మాట్‌ ఇచ్చి.. దాని ప్రకారం సమాచారం కావాలని కోరింది.
 
సర్వే నంబర్లు, వ్యక్తిగతంగా భూ నిర్వాసితులకు చెల్లించిన పరిహారం, ముంపునకు గురయ్యే గ్రామాల్లోంచి ఖాళీ చేసిన వారికి అమలు చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాల సమాచారాన్నంతటినీ క్రోడీకరించి.. అదే ఫార్మాట్‌లో అందజేయబోతున్నాం. ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు బృందం బుధవారం ఢిల్లీ వెళ్తోంది. జల సంఘానికి ఆ సమాచారం ఇచ్చిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కేంద్ర జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్‌ సూచించారు. జల సంఘానికి నివేదిక ఇవ్వగానే ఆయన వద్దకు వెళ్తాం’ అని జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ చెప్పారు.
 
అనుకున్న గడువుకు పూర్తికావాలి..
కేంద్రం ప్రతిసారీ ఇదిగో అదిగో అంటూనే ఉందని చంద్రబాబు ఆక్షేపించారు. ‘త్వరగా నిర్ణయం తీసుకోవడం లేదు. పోలవరం హెడ్‌వర్క్స్‌ అనుకున్న సమయానికి పూర్తి చేయాలి. వర్షాకాలం ముగిసినందున కాంక్రీట్‌ పనుల్లో వేగాన్ని పెంచాలి. ఇందుకు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి రానివ్వొద్దు. వాణజ్య బ్యాంకుల ద్వారా రుణం తీసుకొచ్చి, పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరపాలి. కేంద్రం నుంచి నిధులొచ్చాక ఈ రుణాలకు జమ చేయవచ్చు’ అని సూచించారు. డబ్ల్యూఆర్‌డీసీ ద్వారానే బ్యాంకుల నుంచి రుణసమీకరణ చేస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర తెలిపారు.
Link to comment
Share on other sites

పోలవరం వేగం పెరగాలి
24 వారాలే సమయం ఉంది..
సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
దసరాకు గేటు ఏర్పాటు కష్టమే
ముఖ్యమంత్రికి వివరించిన ప్రాజెక్టు అధికారులు
రెండు రోజుల క్రితమే ఆకృతులను ఆమోదించారని వెల్లడి
ఈనాడు - అమరావతి
8ap-main15a.jpg

సరా నాటికి పోలవరం ప్రాజెక్టుకు ఒక గేటు అయినా అమర్చాలని అనుకున్నామని..కాని ఏర్పాటు సాధ్యం కావడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కేంద్ర జలసంఘం నుంచి ఆకృతులకు సంబంధించిన ఆమోదం రావడంలో ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. పోలవరం స్పిల్‌ వేలో గేట్లు ఏర్పాటుకు సంబంధించి ప్రి స్ట్రక్చర్‌ కాంక్రీటు, ఇతర ఆకృతులకు సంబంధించిన అనుమతులు వచ్చి రెండు రోజులే అయిందని వివరించారు. సోమవారం నీటిపారుదల ప్రాజెక్టులపై చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టులో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేందుకు ఇక 24 వారాల గడువు మాత్రమే ఉందని, పనుల వేగం పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. స్పిల్‌ వే పనుల్లో పురోగతి ఉందని, స్పిల్‌ ఛానల్‌ పనుల వేగం పెంచాలన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ ఇవ్వనంతగా పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నామని చెప్పారు. నిర్వాసితుల గృహాల నిర్మాణం వేగం పుంజుకోవాలన్నారు. సహాయ పునరావాస పనులు డిసెంబర్‌ కల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.

ఇక అన్నీ ప్రారంభోత్సవాలే
గతంలో పునాదిరాళ్లు, శంకుస్థాపనలకే పరిమితమైన ప్రాజెక్టుల రూపు రేఖలను తమ ప్రభుత్వం మార్చివేసిందని, తాము చేపట్టిన 57 ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనమని సీఎం అన్నారు. పెదపాలెం, గండికోట జలాశయం పథకాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ పథకం ప్రారంభంతో ఆ జిల్లా రూపురేఖలే మారిపోతాయన్నారు. నిర్మాణంలో ఉన్న 27 ప్రాజెక్టులను వచ్చే ఏడాది జూన్‌ 5 లోగా దశలవారీగా పూర్తి చేసి ప్రారంభించాలన్నారు. మిగిలిన ప్రాధాన్య ప్రాజెక్టులపైనా సీఎం సమీక్షించారు. వచ్చే ఏడాది జూన్‌కు జీడిపల్లి నుంచి ఎగువ పెన్నార్‌కు ఎత్తిపోతల ద్వారా నీరు ఇవ్వాలని, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎం కార్యాలయ అధికారులు రాజమౌళి, గిరిజాశంకర్‌, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సీమలో చెరువులు నింపాం
వర్షపాతం లోటు ఈ ఏడాది మైనస్‌ 24 శాతంగా ఉన్నా రాయలసీమ జిల్లాల్లో చెరువులు నింపామని ముఖ్యమంత్రి తెలిపారు. గండికోటలో 12.5 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచామని, వచ్చే ఏడాది 20 టీఎంసీలు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘అనంతపురంలో సూక్ష్మపోషకాల పంపిణీ వేగవంతం చేయాలి. తెగుళ్లపై దృష్టి పెట్టాలి. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పంట రుణాలను మరింత అందించాలి. తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌ చొరవతో వంద శాతం పంట రుణాలు కౌలు రైతులకు అందాయి’ అని చెప్పారు. ఈ ఏడాది ఉపాధి హామీ చట్టం(నరేగా) నిధుల వినియోగం రూ.10 వేల కోట్లకు చేరాలని సీఎం లక్ష్యం నిర్దేశించారు. ప్రకాశం జిల్లాలో 16, చిత్తూరులో ఐదు మండలాలకు వచ్చే వారం నుంచి అదనపు పనిదినాలు మరో 50 కల్పించాలన్నారు.

Link to comment
Share on other sites

వచ్చే నెలలో పోలవరం గేట్ల అమరిక ప్రారంభం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
12000309BRK75A.JPG

పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలో వచ్చే నెలలో గేట్ల అమరిక ప్రారంభిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన అక్కడ ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసేందుకు పనులు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. మరో 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రిట్‌ వేస్తే స్పిల్‌వే నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మంత్రి వెంట సీఈ వి.శ్రీధర్‌, నవయుగ కంపెనీ ఎండీ కె.శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

రెండో డీపీఆర్‌ ఆమోదమే కీలకం
పోలవరంపై జలసంఘం ఏం చెబుతుందో..
కేంద్ర బృందాలు వస్తాయా? టీఏసీ సమావేశమా?
జలసంఘం కోరిన లెక్కలు,  పత్రాలన్నీ దిల్లీకి...
ఈనాడు - అమరావతి
14ap-main16a.jpg

పోలవరం ప్రాజెక్టు నుంచి 2019 జూన్‌ కల్లా గ్రావిటీ ద్వారా నీళ్లు, 2019 చివరికి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పుడు పోలవరంలో అత్యవసరం నిధులు. రూ.57,900 కోట్లతో సమర్పించిన రెండో డీపీఆర్‌ కేంద్రం ఆమోదించి నిధులు ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఏడాదిగా కసరత్తు సాగుతోంది.

తాజా పరిస్థితి: కేంద్ర జలసంఘం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు, అవసరమైన పత్రాలు, మ్యాప్‌లు తదితర మొత్తం వివరాలతో పోలవరం అధికారులు దిల్లీకి  తీసుకువెళ్లి కేంద్ర జలసంఘం అధికారులకు సమర్పించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి మరో ప్రతి సమర్పించారు. రెండు చోట్లా సమాంతర పరిశీలన జరుగుతోంది.

14ap-main16b.jpg

తదుపరి ఏమిటి?
* కేంద్ర జలసంఘం ఈ వివరాలతో సంతృప్తి చెందితే తదుపరి సాంకేతిక సలహా కమిటీ సమావేశం (టీఏసీ) ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీలో రెండో డీపీఆర్‌ను వారే ప్రతిపాదించి ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆ సమావేశంలో అనుమానాలన్నింటికీ కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరే సమాధానపరచవలసి ఉంటుంది. టీఏసీలో ఆమోదం పొందితే రెండో డీపీఆర్‌ కీలకదశ దాటినట్లే.

* ప్రస్తుతం రాష్ట్రం సమర్పించిన సమాచారంతో కేంద్ర జలసంఘం సంతృప్తి చెందుతుందా అన్నది చూడాలి. ఈ వివరాలు సమర్పించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాలను పంపుతామని ఇప్పటికే రాష్ట్ర అధికారులకు సమాచారం ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో భూసేకరణ, పునరావాసంపై పరిశీలనకు నాలుగు నుంచి అయిదు బృందాల వరకు రానున్నాయని సమాచారం. ఇప్పటికీ ఆ బృందాలను పంపే ఉద్దేశం ఉందా లేక తదుపరి టీఏసీ సమావేశానికి ప్రతిపాదిస్తారా అని రాష్ట్ర అధికారులు ఎదురుచూస్తున్నారు. బృందాలు రాష్ట్రానికి వస్తే ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది.

14ap-main16c.jpg

త్వరలో పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు దిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘంతో సంప్రదింపులు జరపనున్నారు. అప్పటికి ఈ విషయం ఓ కొలిక్కి వస్తుంది.

Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టు పనులు 59.32% పూర్తి: చంద్రబాబు
15-10-2018 12:56:41
 
636752050017388725.jpg
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 59.32% పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం పోలవరం ప్రాజెక్టుపై 78వ సారి సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా  పరిశీలించారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 64.28% పూర్తి అయ్యిందని, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 61.88% పూర్తి అయ్యాయని తెలిపారు. అలాగే కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 96.90% పూర్తి అయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...