Jump to content

32,814 acres land denotified for Amaravati

Recommended Posts

రాజధానికి అటవీ భూములు!

18-08-2017 02:22:30

636386197520340842.jpg

  • బదిలీకి కేంద్ర పర్యావరణ శాఖ ఓకే
  • ఫలించిన ముఖ్యమంత్రి ప్రయత్నాలు
  • వెంకటాయపాలెంలో 1,835 హెక్టార్లు,
  • తాడేపల్లిలో 251.77 హెక్టార్లు బదిలీ
  • రాజధాని నిర్మాణానికి తొలగిన అడ్డంకి

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. రాజధాని నిర్మాణానికి అటవీ భూములను బదిలీ చేసుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కృషికి ఫలితం లభించింది. దీంతో తాడేపల్లి, వెంకటాయపాలెంలలో అటవీ భూములను రాజధాని కోసం ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కి మార్గం సుగమమైంది.

రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే నిరుపయోగంగా ఉన్న అటవీ భూములను ఉపయోగించుకోవడానికి విభజన చట్టంలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం కావలసిన అటవీ భూములను గుర్తించి రెండేళ్ల క్రితమే కేంద్ర అటవీశాఖ అనుమతి కోసం పంపింది. రాష్ట్రపతి రామ్‌నాఽథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారానికి ఇటీవల ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి.. అటవీ భూముల బదిలీకి అనుమతించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. నిజానికి అటవీ నిపుణుల కమిటీ ఈ ఏడాది జూన్‌ 19 నుంచి జూన్‌ 22 వరకూ క్షేత్రస్థాయి తనిఖీల కోసం అమరావతికి వచ్చింది. సీఆర్‌డీఏ అధికారులతో చర్చల అనంతరం సమగ్ర నివేదికను తయారు చేసింది.

ఈ నివేదికను జూలై 20వ తేదీన జరిగిన అటవీశాఖ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ) సమావేశంలో కేంద్రం ఆమోదించింది. అయితే సలహా కమిటీ పూర్తిస్థాయి భేటీలో మరోసారి ఈ నివేదికపై చర్చించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎఫ్‌ఏసీ సమావేశంలో అటవీభూముల బదిలీపై కూలంకషంగా చర్చించి రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెంలోని 1835.32 హెక్టార్ల అటవీభూము ల బదిలీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇంతే మొత్తం లో కర్నూలు, కడప, అనంతపురం జి ల్లాల్లో కొత్తగా అడవుల పెంపకానికి త గిన నిధులను, భూ ములను రాష్ట్ర ప్రభుత్వం సూ చించింది. తాజా నిర్ణయంతో మొత్తంగా 12444.89 హెక్టార్ల అటవీభూములను సీఆర్‌డీఏ వినియోగించుకోనుంది.

చింతలపూడికీ లైన్‌క్లియర్‌

చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం 347.64 హెక్టార్ల అటవీభూముల బదిలీకి కూడా ఎఫ్‌ఏసీ అనుమతించింది. 2016 చివరిలో ఈ ప్రాజెక్టు కోసం మొదట 469.18 హెక్టార్ల అటవీ భూముల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. కేంద్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అంచనాలను సవరించి 347.64 హెక్టార్ల అటవీ భూముల కోసం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జూలై 20వ తేదీన జరిగిన ఎఫ్‌ఏసీ భేటీలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును మాత్రమే నిర్మిస్తారా.. లేక వేరే ఇతర అవసరాలకు ఈ భూములను వాడుకునే ఉద్దేశం ఉందా.. అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా నివేదిక అందించడంతో గురువారం సమావేశంలో అనుమతులను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించింది.

Venkatapalem lo 1835 Hector's ekkada sachindhi :blink:

Link to comment
Share on other sites

mana vallu eppudo vatini polalu chesi untaru, ave ippudu godavalu emo

bro Venkatapalem revenue village lo monna land pooling appudu notification chudandi.. Govt land tho saha mention chesi vundhi.. 

Total around 1300 acres vundhi,, andhulo patta bhumi around 960 acres vuntadhi. Venkatapalem village Area lo chinna vuuru when compared to mandadam (mandadam revenue lo around 6k acres vundhi). atavi bhumi ante Krishna river lo vunna lanka bhumi ee..

Numbers koncham atu itu ga vunna.. 1835 Hectars ante impossible

Link to comment
Share on other sites

Pooling area lo venkatayapalem/ venkatapalem village okkate bro vundhi..

Venkatayapalem anee village achampeta daggara undi n aaa village surrounding's lo antha forestee may be adi ayyi untadi. Pooling villages lo undi venkatapalem akkada 1acre kuda govt land or forest land ledu
Link to comment
Share on other sites

Venkatayapalem anee village achampeta daggara undi n aaa village surrounding's lo antha forestee may be adi ayyi untadi. Pooling villages lo undi venkatapalem akkada 1acre kuda govt land or forest land ledu

Ohhkk.. may be bro. paina Tadepalli,Venkatapalem ani vundesariki pooling area emo anukunna.. Pooling area lo vunna lands (Lanka bhumulu) lo forest lands kuda vunnai.. vati permission kosam State govt try chesindhii..

Link to comment
Share on other sites

Venkatayapalem anee village achampeta daggara undi n aaa village surrounding's lo antha forestee may be adi ayyi untadi. Pooling villages lo undi venkatapalem akkada 1acre kuda govt land or forest land ledu

its bellamkonda mandalam...venkatayapalem.. full forest area...

Link to comment
Share on other sites

అమరావతికి అటవీ భూములు

మళ్లింపునకు కేంద్రం ఆమోదం

రాజధాని అవసరాల కోసం 12,444 హెక్టార్ల వినియోగానికి ఎఫ్‌ఏసీ అనుమతి

చింతలపూడి ఎత్తిపోతలకూ మార్గం సుగమం

17ap-main2a.jpg

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాజధాని నిర్మాణం కోసం 12,444.89 హెక్టార్ల అటవీభూమి మళ్లింపునకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆమోదముద్ర వేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని ఈ భూములను రాజధాని అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి మార్గం సుగమమైంది. దీనివల్ల రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అమరావతి అవసరాల కోసం అటవీ భూమి మళ్లింపునకు అనుమతివ్వాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 3న ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మే 16న జరిగిన సమావేశంలో అటవీ సలహా సమితి(ఎఫ్‌ఏసీ) ఆ ప్రతిపాదనపై చర్చించి నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఏపీ కోరిన ప్రతి అంశంపైనా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని కమిటీకి నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ అటవీ భూమిని ఏయే అవసరాలకోసం ఉపయోగించబోయేదీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్పష్టంచేసింది. అందుకు అనుగుణంగా నిపుణుల కమిటీ జూన్‌ 19 నుంచి 22వ తేదీవరకూ సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటించింది. సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై వారి అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకొని అటవీ సలహా సమితికి నివేదిక సమర్పించింది. జులై 20న జరిగిన ఎఫ్‌ఏసీ సమావేశంలో దానిపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేశారు. అయితే ఆ సమావేశంలో పూర్తిస్థాయి సభ్యులు లేకపోవడంతో సదరు నివేదికను తదుపరి సమావేశంలో సభ్యులందరికీ అందించాలన్న ఉద్దేశంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. గురువారం జరిగిన తాజా సమావేశంలో నిపుణుల బృందం ఇచ్చిన నివేదికపై ఎఫ్‌ఏసీ సభ్యులంతా చర్చించి తుది ఆమోదముద్ర వేశారు. ప్రసుత్తం అనుమతిచ్చిన 12,444.89 హెక్టార్లలో రాజధాని పరిధిలోని తాడేపల్లి (251.77 హెక్టార్లు), వెంకటాయపాలెం (1,835.32 హెక్టార్లు) పరిధిలోని అటబీభూములు ఉన్నాయి.

చింతలపూడి ఎత్తిపోతలకు మోక్షం

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం 347.64 హెక్టార్ల అటవీభూమి మళ్లింపునకూ కేంద్ర అటవీ సలహాదారుల సమితి ఆమోదముద్ర వేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించిన ఎఫ్‌ఏసీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణలు ఇవ్వడంతోపాటు ప్రతిపాదనలను సవరించింది. తొలుత అడిగిన 469.18 హెక్టార్లకు బదులు 347.64 హెక్టార్ల మళ్లింపునకు అనుమతి ఇస్తే చాలని విజ్ఞప్తిచేసింది. దానిపై జులై 20న జరిగిన ఎఫ్‌ఏసీ సమావేశంలోచర్చించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు అడిగింది. ఎఫ్‌ఏసీ అడిగిన వివరాలన్నీ ఏపీ ప్రభుత్వం మరోసారి పంపడంతో గురువారం జరిగిన సమావేశంలో అటవీభూమి మళ్లింపునకు తుది ఆమోదముద్ర వేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.

ఫలించిన చంద్రబాబు కృషి...

గత రెండుమూడు పర్యాయాలు ముఖ్యమంత్రి దిల్లీకొచ్చిన ప్రతిసారీ ఈ అంశాలపై కేంద్రమంత్రులను కలుస్తూ వచ్చారు. ఇదివరకు అనిల్‌దవేతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్‌తో జూన్‌ 23న ఒకసారి, మళ్లీ జులై 25న సమావేశమై పరిస్థితిని వివరించారు. ఈ చర్చల నేపథ్యంలో కేంద్రం రెండు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది.

Link to comment
Share on other sites

ప్రసుత్తం అనుమతిచ్చిన 12,444.89 హెక్టార్లలో రాజధాని పరిధిలోని తాడేపల్లి (251.77 హెక్టార్లు), వెంకటాయపాలెం (1,835.32 హెక్టార్లు) పరిధిలోని అటబీభూములు ఉన్నాయి. evi Amaravati city 217.23 km2 paridi lonivi, migatanivi  crda 8,352.69 km2 paridi lonivi

Link to comment
Share on other sites

its bellamkonda mandalam...venkatayapalem.. full forest area...

avi kuda unnayi bro,  

అచ్చంపేటలో.. అన్నీ ఒకే చోట!

అకాడమీ, శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీ

అక్కడే పోలీసు నిలయం

ఏడీజీపీ సురేంద్రబాబు

gnt-panel4a.jpg

ఈనాడు, అమరావతి: శాఖాపరంగా మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఏపీ పోలీసు అకాడమీ, పోలీసు రవాణా శిక్షణ సంస్థ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీని ఒకే చోట నెలకొల్పనున్నామని ‘ఆక్టోపస్‌’ విభాగం చీఫ్‌, అదనపు డీజీపీ ఎన్‌వీ సురేంద్రబాబు అన్నారు. విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌ 12 రోజుల పాటు సెలవు వెళ్లిన నేపథ్యంలో ఇన్‌ఛార్జి సీపీగా సురేంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయన విలేకరుల మాట్లాడారు. ప్రధాన విభాగాలన్నీ ఒకేచోట ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట వద్దే ఇవన్నీ ఏర్పాటవుతాయని వివరించారు. కార్యాలయాలు, సిబ్బంది నివాస సముదాయాలను ఇందులోనే నెలకొల్పుతారు. దీనికోసం 2700 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనికి అవసరమైన అటవీభూమిని డీనోటిఫై చేయాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందన్నారు. భూమిని కేటాయించగానే కేంద్ర, రాష్ట్ర నిధులతో పకడ్బందీ ప్రణాళికతో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఒకేచోట వివిధ సంస్థల ఏర్పాటు వల్ల సమర్థంగా వనరుల పంపకం, సద్వినియోగం సాధ్యపడుతుందన్నారు. గ్రేహౌండ్స్‌- ఆక్టోపస్‌ల ప్రధాన కార్యాలయం రాజధాని పరిసరాల్లోనే వస్తుందన్నారు. ఏపీలో శిక్షణ కేంద్రాలు నిర్మించేదాకా హైదరాబాద్‌లో ఉన్న శిక్షణ వసతులనే వినియోగించుకుంటామని చెప్పారు.

Link to comment
Share on other sites

అటవీ భూములు..ప్రగతికి సోపానాలు!

636388007022824545.jpg

  • తాడేపల్లి బ్లాక్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, బిజినెస్‌ సెంటర్లు, ఆఫీసులు
  • వెంకటాయపాలెం బ్లాక్‌లో భద్రతా విభాగాలు.. షూటింగ్‌ రేంజ్‌లు
  • పర్యావరణం, వన జీవరాశులకు విఘాతం కలుగని రీతిలో వినియోగం

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం అటవీ భూముల మళ్లింపునకు కేంద్రం అనుమతివ్వడంతో ప్రపంచ శ్రేణి నగర నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. 5 వేల ఎకరాల (2,087.09 హెక్టార్లు) అటవీ భూమిని రాజధాని నిర్మాణంలో అంతర్భాగంగా ఉండే ప్రాజెక్టుల ఏర్పాటుకు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాడేపల్లి(251.77 హెక్టార్లు), వెంకటాయపాలెం(1835.32 హెక్టార్లు) పరిధిలో చేపట్టే నిర్మాణాలు రాజధాని శోభను ఇనుమడింపజేసి, అది సమగ్రమైన వరల్డ్‌ క్లాస్‌ సిటీగా రూపుదాల్చడంలో గణనీయంగా దోహదపడనున్నాయి.

వాస్తవానికి అమరావతి కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మొత్తం 25 అటవీ బ్లాక్‌ల్లోని 12,444 హెక్టార్లను సీఆర్డీయే కోరగా, తొలిగా 2087.09 హెక్టార్లలో విస్తరించిన తాడేపల్లి, వెంకటాయపాలెం బ్లాక్‌ల మళ్లింపునకు కేంద్రం అనుమతించింది. కాలక్రమంలో, అప్పటి అవసరాలకు అనుగుణంగా మిగిలిన బ్లాక్‌ల్లోని అటవీ భూముల వినియోగం కోసం సీఆర్డీయే ప్రయత్నించనుంది. తాడేపల్లి, వెంకటాయపాలెం అటవీ భూముల్లో ఆక్రమణలు లేనందున ఒకట్రెండు నెలల్లో అవి సీఆర్డీయే అధీనంలోకి రానున్నాయి. ఇలా మళ్లింపునకు అనుమతించిన భూములు పర్యావరణహితంగా ఉండాలన్న విధాననిర్ణయంలో భాగంగా వెంకటాయపాలెం బ్లాక్‌లోని భూమిలో 60 శాతాన్ని సీఆర్డీయే పచ్చదనానికే కేటాయించనుంది.

తాడేపల్లి బ్లాక్‌లో 25 నుంచి 30 శాతం అటవీ భూమిని పచ్చదనం కోసం ఉంచాల్సినప్పటికీ ‘బ్లూ- గ్రీన్‌ కాన్సె్‌ప్ట’నకు అమరావతిలో అడుగడుగునా పెద్దపీట వేస్తున్న సీఆర్డీయే సుమారు 35 శాతం కేటాయించబోతోంది! 251.77 హెక్టార్లున్న తాడేపల్లి బ్లాక్‌ను అంతర్జాతీయస్థాయి వర్తక, వాణిజ్య కేంద్రానికి ఉపకరించే విధంగా తీర్చిదిద్దేందుకు సీఆర్డీయే ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, బిజినెస్‌ సెంటర్లను నిర్మించనుంది. ఇవి కాకుండా కొన్ని కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలూ ఇందులో రానున్నాయి.

ఇక 1835.32 హెక్టార్లున్న వెంకటాయపాలెం బ్లాక్‌ భూముల్లో సింహభాగం వివిధ భద్రతా విభాగాలకు కేటాయించనున్నారు. తద్వారా ఇది రాష్ట్ర ‘సెక్యూరిటీ హబ్‌’గా రూపాంతరం చెందబోతోంది. ఇందులో పోలీస్‌ హెడ్‌క్వార్టర్లు, సీఆర్పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌, గ్రేహౌండ్స్‌, ఆర్పీఎఫ్‌, ఆక్టోపస్‌, ఆర్మీ, నేవీ తదితర భద్రతాసంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతాయి. షూటింగ్‌ రేంజ్‌లు, భద్రతాపరమైన అంశాల్లో సిబ్బంది శిక్షణకు అవసరమైన మైదానాలు, ఇతర వసతులను కూడా ఈ బ్లాక్‌లో ఏర్పాటు చేయనున్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

bro Venkatapalem revenue village lo monna land pooling appudu notification chudandi.. Govt land tho saha mention chesi vundhi.. 

Total around 1300 acres vundhi,, andhulo patta bhumi around 960 acres vuntadhi. Venkatapalem village Area lo chinna vuuru when compared to mandadam (mandadam revenue lo around 6k acres vundhi). atavi bhumi ante Krishna river lo vunna lanka bhumi ee..

Numbers koncham atu itu ga vunna.. 1835 Hectars ante impossible

వెంకటాయపాలెం వద్ద పోలీస్‌ అకాడెమీ

గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ప్రధాన కేంద్రాలూ...

ఈనాడు - అమరావతి

గుంటూరు జిల్లా అచ్చంపేట సమీప వెంకటాయపాలెం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు రక్షణ, భద్రతా విభాగాలకు కేంద్రస్థానం కాబోతోంది. చుట్టూ కొండలు, దట్టమైన అటవీప్రాంతం ఉండడంతో వ్యూహాత్మకంగా ఈ ప్రదేశం ఎంతో అనుకూలమని దీన్ని ఎంపిక చేశారు. ఏపీ పోలీస్‌ అకాడెమీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల ప్రధాన కేంద్రాల వంటివన్నీ అక్కడే రాబోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన భద్రత, శిక్షణ సంస్థలకు ప్రధాన కేంద్రాలను ఏర్పాటుచేసుకోవలసి ఉంది. వెంకటాయపాలెం ప్రాంతం అనుకూలమైనదిగా చాన్నాళ్ల క్రితమే గుర్తించారు. కానీ అదంతా అటవీ ప్రాంతం కావడంతో డీనోటిఫై చేసేందుకు కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. రాజధాని అవసరాల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోని రెండు బ్లాకుల్లో 2,089.09 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇటీవలే అంగీకరించింది. వీటిలో ఒక బ్లాకు రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి వద్ద, మరోటి వెంకటాయపాలెం వద్ద ఉంది. ఉండవల్లిలో 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెం వద్ద 1,835.32 హెకార్ట అటవీభూమిని కేంద్రప్రభుత్వం డీ నోటిఫై చేయనుంది. డీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడే.. ఆయా ప్రాంతాల్లో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు అందజేసింది.

వెంకటాయపాలెంలో వచ్చేవి..

వెంకటాయపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడెమీ, ఏపీ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌, షూటింగ్‌ రేంజ్‌, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ హెడ్‌క్వార్టర్లు, మిలిటరీ స్టేషన్‌, రైల్వే భద్రతాదళం అకాడెమీ, సీఆర్‌పీఎఫ్‌ కాంప్లెక్స్‌, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం వంటివి ఏర్పాటుచేయనున్నట్టు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. అక్కడ రూ.3,470కోట్ల పెట్టుబడులు వస్తాయని, 15వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. మొత్తంగా ఈ ప్రాజెక్టుల వల్ల 15లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొంది.

ఉండవల్లిలో..

తాడేపల్లి మండలం ఉండవల్లిలో 421.77హెక్టార్ల అటవీ భూములున్నాయి. వీటిలోనే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఉండవల్లి గుహలూ ఉన్నాయి. గుహలున్న ప్రాంతంతో కలిపి సుమారు 170 హెక్టార్ల భూమి పురావస్తుశాఖ అధీనంలో ఉంది. అది పోగా.. మిగతా 251.77 ఎకరాల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా డీనోటిఫై చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ ప్రాంతాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా తీర్చిదిద్దుతామని, బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పాటుచేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, టయర్‌-4 డేటా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మిస్తామని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తామంది. ఇక్కడ రూ.593.43కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఈ ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది.

అడిగింది 25 బ్లాకులు..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 25 బ్లాకుల్లోని 12,444.89 హెకార్టఅటవీభూమిని రాజధాని అవసరాల కోసం డీనోటిఫై చేయాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ తొలి దశలో రెండు బ్లాకులకే కేంద్రం అనుమతినిచ్చింది. మిగతా వాటికి.. అవసరమైనప్పుడు విడివిడిగా ప్రతిపాదనలతో రావాలని సూచించింది. అన్నింటికీ ఒకేసారి అనుమతులివ్వలేమంది. కేంద్రం డీనోటిఫై చేసిన అటవీ భూముల్లో.. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను ఐదేళ్లలోగా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. పనులు జరుగుతున్నాయో లేదో కేంద్ర అటవీశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. రాష్ట్రప్రభుత్వం కోరినట్టుగా 25బ్లాకుల్ని ఒకేసారి డీనోటిఫై చేసినా ఐదేళ్లలో అవన్నీ పూర్తిచేయడం కష్టమని, ఆయా బ్లాకులవారీగా ప్రతిపాదనలతో రావాలని కేంద్రం సూచించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అటవీ భూమినిస్తే, అంతే భూమిని ప్రత్యామ్నాయ వనీకరణ కోసం రాష్ట్రప్రభుత్వం వేరేచోట చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు డీనోటిఫై చేస్తున్న 2,089.09 హెక్టార్లకు సంబంధించి కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యామ్నాయ భూముల్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇవ్వనుంది. అక్కడ అడవుల అభివృద్ధికి రూ.210కోట్లు కూడా రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

  • 9 months later...

Shivamogga tops the list in denotified forest land

Shivamogga district of Karnataka has seen the largest extent of denotified forest land, with 2,228.59 hectares being converted in the last two years under Karnataka Forest Act, 1963.

Published: 27th January 2018 11:01 PM  |   Last Updated: 28th January 2018 10:23 AM   |  A+A-

BENGALURU : Shivamogga district of Karnataka has seen the largest extent of denotified forest land, with 2,228.59 hectares being converted in the last two years under Karnataka Forest Act, 1963. From 2015 to 2017, of 3,095.17 hectares of forest land denotified in the state, more than 70% is in Shivamogga district. The highest percentage of forest land conversion (for relocating Sharavathi project displaced people) and regularisation of cultivated forest land has taken place in the taluks of Shivamogga (19), Sagar (16) and Hosanagara (13). Shikaripura, Tirthahalli, Nagara and Sorab taluks too have recorded many cases. But, the maximum extent of 1,004 hectares has been denotified in Shivamogga alone. Shivamo.jpg

As per the denotified list on the forest department website, hundreds of survey numbers fall in the reserve forests of Kardibetta, Masaruru, Mallanduru, Kyasanuru, Mysavi, Bellanduru, Kudi, Handravathi, Suduru, Annagere and Gillalagundi, the estate forests of Puradallu, Kumadavathi and Shankar, the Anupinakatte Minor Forest, and the state forests of Anesara, Avinahalli, Ulluru and Oruve.  The Kardibetta Reserve Forest has seen the highest extent with 558.38 hectares denotified in Shikaripura, Sagar and Shivamogga taluks. In fact, Sagar has seen denotification of 350 hectares of forest. 

“We are losing precious forest land because elected representatives are in the forefront to regularise encroached forest patches in many taluks. All this has been done either under Bagair Hukum, Akrama-Sakrama, Forest Rights Act or to rehabilitate displaced people due to Sharavathi submergence,” said an activist from the district.“Due to the pressure from legislators, the government itself has started destroying forests,” said G Veeresh, an activist.

Forest Minister Ramanath Rai said, “I am against denotification of forest land. Forest lands have not be denotified under Bagair Hukum in the state. But, under Karnataka Forest Act 1963, it has happened in cases of public cause. There were cases where people had to be rehabilitated due to Sharavathi submergence in Shivamogga district. They were provided land which are now a part of wildlife divisions.”

Link to comment
Share on other sites

అడవికి ఆ అడ్డూ తొలగింది!
05-09-2018 03:24:01
 
  • ‘వెంకటాయపాలెం’ డైవర్షన్‌కు ఓకే
  • అమరావతికి మరింతగా భూసంపద
  • నిర్ణీత మొత్తం చెల్లించిన సీఆర్డీయే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతికి చేరువగా కొలువు దీరాల్సిన పోలీస్‌, అనుబంధ విభాగాలతోపాటు భారత సైన్య కార్యాలయాల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌ మళ్లింపు (డైవర్షన్‌) ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు చెల్లించాల్సిన నిధులను సీఆర్డీయే పూర్తిగా చెల్లించి.. ఈ మళ్లింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌ మళ్లింపునకు అడ్డంకిగా ఉన్న ఈ ఒక్క అంశం కూడా తొలగిపోయింది. రాజధాని అమరావతికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, అచ్చంపేటకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌ ఉంది. ఈ బ్లాక్‌లోని 1,835 హెక్టార్ల (4,532.45 ఎకరాలు) భూమిని పోలీస్‌, సైన్యం సంబంధిత విభాగాల కార్యాలయాల స్థాపన కోసం తనకు ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను సీఆర్డీయే కోరింది. దీనిపై గత కొన్ని నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. సీఆర్డీయే ఉన్నతాధికారులు కొర్రీలకు ఎప్పటికప్పుడు సంతృప్తికరమైన సమాధానాలివ్వడంతో కేంద్రం సమ్మతించింది. ఒకదశలో మళ్లింపు సాధ్యం కాదేమోనన్న అనుమానాలు వ్యక్తమవగా, స్వయానా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి, సంబంధిత మంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
 
వెంటాడిన నిధుల కొరత..
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నిబంధనల ప్రకారం డైవర్షన్‌ చేసే అటవీ భూమికి సమానంగా అటవీ శాఖకు ఇవ్వాల్సిన ప్రత్యామ్నాయ భూముల్లో అడవులను పెంచడంతోపాటు పదేళ్లపాటు సంరక్షించేందుకు ‘క్యాంపా’(కాంపెన్సీటరీ అఫోరెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌)’కు చెల్లించాల్సిన రూ.219.92 కోట్ల విషయంలోనే ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ మొత్తంలోని రూ.204.26 కోట్లను ఈ ఏడాది మార్చిలోనే చెల్లించినప్పటికీ మిగిలిన రూ.15.66 కోట్లను జమ చేయలేకపోయింది. ఎట్టకేలకు ఆ మొత్తాన్ని సీఆర్డీయే కొద్దిరోజుల క్రితం చెల్లించడంతో నిధుల చెల్లింపు పూర్తయి, ఈ అటవీ భూముల మళ్లింపు ప్రక్రియకు ఉన్న అవరోధం తొలగిపోయింది. అయితే, ఇతర అధికారిక ప్రక్రియలు, నివేదికల సమర్పణలు ముగిసి, భూములు సీఆర్డీయే చేతికి వచ్చేందుకు 3, 4 నెలలు పట్టవచ్చునని తెలుస్తోంది.
 
పచ్చదనం తరగదు
డైవర్షన్‌ ప్రక్రియ ద్వారా సీఆర్డీయేకు దఖలు పడబోతున్న 4,532.45 ఎకరాల్లో 40 శాతం (సుమారు 1813 ఎకరాలు) భూముల్లో మాత్రమే నిర్మాణాలను అనుమతిస్తారు. మళ్లించే అటవీ భూముల్లో 60 శాతం విస్తీర్ణంలో పచ్చదనం ఉండాలి. ఈ దృష్ట్యా వెంకటాయపాలెం అటవీ బ్లాక్‌లో పచ్చదనానికి అంతగా ఢోకా లేనట్లేనని చెప్పుకోవాలి. మరొకపక్క.. ఈ భూములకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలో కేటాయించిన 4532.45 ఎకరాల్లో పెద్దసంఖ్యలో వివిధ జాతుల మొక్కలను నాటి, వాటిని జాగ్రత్తగా సంరక్షించడం ద్వారా వాటిల్లో అడవులను రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి పరుస్తుంది.
 
కొండవీడుకు కేంద్ర బృందం
అమరావతికి సమీపాన ఉన్న కొండవీడు అటవీ బ్లాక్‌లోని 2,156 ఎకరాలను మళ్లించి, తనకు అప్పగించాలంటూ సీఆర్డీయే సమర్పించిన ప్రతిపాదనలపై ప్రత్యక్ష పరిశీలన నిమిత్తం కేంద్ర బృందం త్వరలోనే ఇక్కడకు రానున్నట్లు తెలిసింది. ఈ ఫారెస్ట్‌ భూముల్లో అటవీ శాఖ ప్రధాన కార్యాలయం, ఫారెస్ట్‌ అకాడమీ, అటవీ అభివృద్ధి సంస్థ, నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌, కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఇత్యాది అటవీ, పర్యావరణ సంబంధిత కార్యాలయాలన్నింటినీ నెలకొల్పాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగానే కొండవీడు బ్లాక్‌లోని 2,156 ఎకరాల కోసం సీఆర్డీయే.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు నాలుగు ప్రతిపాదనలను పంపింది. వీటిని పరిశీలించిన ఆ శాఖ.. చెన్నై ప్రాంతీయ కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని త్వరలోనే కొండవీడు పంపనున్నట్టు తెలిసింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...