Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
సింగపూర్‌ పోదాం.. చలో చలో

జోరందుకున్న టిక్కెట్ల విక్రయాలు
వెళ్లే ఛార్జి రూ.7508.. వచ్చేందుకు రూ.10,133
మొదటి సర్వీసులకు ఇప్పటికే 25 శాతం పూర్తి
ఈనాడు, అమరావతి

సింగపూర్‌ పోదాం.. చలో చలో

విజయవాడ- సింగపూర్‌ విమాన సర్వీసుకు టిక్కెట్ల విక్రయం జోరందుకుంది. డిసెంబర్‌ 4న గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కాబోతోంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇండిగో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమయ్యాయి. ఇండిగో 180 సీటింగ్‌ ఉన్న బోయింగ్‌ను సింగపూర్‌కు నడిపేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటి అంతర్జాతీయ సర్వీసుకు ఇక్కడి నుంచి  డిమాండ్‌ ఎలా ఉంటుందోననే ఆసక్తి చాలా కాలంగా అందరిలోనూ ఉంది. సింగపూర్‌ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం అక్టోబర్‌ 26 నుంచి ఆరంభమైంది. ఇప్పటికే మొదటి విమాన సర్వీసులో నాలుగో వంతు అమ్ముడయ్యాయి. విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లే మొదటి సర్వీసుకు శనివారం నాటికి 42 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అటునుంచి అదేరోజు విజయవాడకు వచ్చే సర్వీసులో ఇప్పటికే 51 టిక్కెట్లు బుక్కయ్యాయి. మరో నెల రోజుల సమయం ఉండడంతో డిసెంబర్‌ నాలుగు నాటికి టిక్కెట్లన్నీ పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే ధరతో సింగపూర్‌కు విమానం ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చింది. కేవలం రూ.7,508 టిక్కెట్‌తో సింగపూర్‌కు నేరుగా చేరే అవకాశాన్ని కల్పించడంతో టిక్కెట్ల విక్రయం వేగంగా జరుగుతోంది. సింగపూర్‌ నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు టిక్కెట్‌ ధర కొంచెం ఎక్కువ ఉంది. అటనుంచి ఇక్కడికి రూ.10,133 టిక్కెట్‌ ధరగా నిర్ణయించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు, అటునుంచి ఇక్కడికి అదే వేగంతో టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. వారంలో మంగళ, గురు రెండు రోజులు విజయవాడ నుంచి సింగపూర్‌కు, అదే సమయంలో అటునుంచి ఇక్కడికి సర్వీసులను ఇండిగో నడుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం 13.45గంటలకు సింగపూర్‌లో సర్వీసు విజయవాడకు బయలుదేరుతుంది. అదేరోజు విజయవాడలో సాయంత్రం 18.40కు సింగపూర్‌ సర్వీసు బయలుదేరి వెళ్తుంది. మళ్లీ గురువారం ఇవే సమయాల్లో అక్కడా.. ఇక్కడ సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కేవలం 4.35గంటల్లో సింగపూర్‌కు నేరుగా ఈ సర్వీసులో వెళ్లిపోవచ్చు.

ఇక్కడి నుంచి రద్దీ చాలా ఎక్కువ..
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి నాలుగు జిల్లాలకు గన్నవరం విమానాశ్రయం దగ్గరిగా ఉంటుంది. రాష్ట్రంలోని ఈ నాలుగు జిల్లాల నుంచే అత్యధికంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రవాసాంధ్రులు ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంటికొకరు చొప్పున విదేశాల్లో ఉంటారు. దీనికితోడు నిత్యం చదువు, పర్యాటకం, వ్యాపార, వైద్యం ఈ నాలుగు అంశాలకు సంబంధించి వేల మంది వెళ్లి.. వస్తుంటారు. ప్రస్తుతం వీళ్లంతా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లి అంతర్జాతీయ సర్వీసులను అందుకుంటున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్‌ విమానాశ్రయానికే దేశీయ, విదేశీ ప్రయాణికులు రాష్ట్రం నుంచి ఏటా 25లక్షల మందికి పైగా వెళుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ పక్కాగా సర్వే నిర్వహించి పౌరవిమానయానశాఖ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)కు నివేదికలు అందించింది. గన్నవరం నుంచి అంతర్జాతీయస్థాయి డిమాండ్‌ చాలా ఎక్కువుందనే విషయాన్ని స్థానిక వ్యాపార, వాణిజ్య సంఘాలు తమ లేఖల ద్వారా కేంద్రానికి అనేకసార్లు విన్నవించాయి. ప్రస్తుతం మొదటి అంతర్జాతీయ సర్వీసు టిక్కెట్లు అమ్ముడవుతున్న విధానమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. సాధారణంగా.. అంతర్జాతీయ ప్రయాణికులు కొత్త విమానాశ్రయం నుంచి అలవాటుపడడానికి కొంత సమయం పడుతుంది. కొన్నాళ్లు చూశాక.. ఆ తర్వాత నెమ్మదిగా అలవాటు పడతారు. కానీ.. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి డిసెంబర్‌ 04, 06, 11, 13 తేదీల్లో ఇప్పటికే మొదలైన విమాన టిక్కెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల డిమాండ్‌ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉండడంతో వారానికి రెండు రోజులు మాత్రమే నడుపుతున్నారు. డిమాండ్‌ పెరుగుతున్న కొద్దీ మిగతా రోజులకూ సర్వీసులను పెంచనున్నారు.

మిగతా విమానాశ్రయాలతో పోలిస్తే..
అంతర్జాతీయ ప్రయాణికుల డిమాండ్‌ మిగతా విమానాశ్రయాలతో పోలిస్తే.. ఇక్కడి నుంచి అత్యంత వేగంగా ఊపందుకోనుంది. కేవలం నాలుగేళ్లలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 220శాతం గన్నవరానికి పెరిగింది. ఏ నగరానికి సర్వీసులను ఆరంభించినా.. టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 80శాతం పైగా ఆక్యుపెన్షీతో అన్ని నగరాలకూ ఇక్కడి నుంచి సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నాలుగు జిల్లాల నుంచి దేశీయ ప్రయాణికుల కంటే.. అంతర్జాతీయానికే ఎక్కువ మంది ఉంటారు. ఏటా చదువుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, కెనడా లాంటి దేశాలకు వేల మంది విద్యార్థులు వెళుతుంటారు. వీరిలో సగం మంది అక్కడే స్థిరపడిపోతున్నారు. తర్వాత.. వాళ్లను చూసేందుకు ఇక్కడి నుంచి వెళ్లే బంధువులు, అటునుంచి వాళ్లు ఏటా రెండు మూడు సార్లు వచ్చి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి. వ్యాపార కార్యకలాపాలు, సమావేశాలకు వెళ్లేవారు ఈ ప్రాంతం నుంచి చాలా ఎక్కువ. పర్యాటకంగానూ ఏటా కనీసం రెండుసార్లు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఈ నాలుగు జిల్లాల్లోనే అధికం. వీటన్నింటి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ దేశీయం కంటే గణనీయమైన వృద్ధిని అతితక్కువ కాలంలోనే సాధించనుంది.

విజయవాడ - సింగపూర్‌ టిక్కెట్‌: రూ.7,508
సింగపూర్‌ - విజయవాడ టిక్కెట్‌: రూ.10,133
టిక్కెట్లు ఇప్పటివరకూ అమ్ముడయ్యాయిలా..

విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లే సర్వీసు..
డిసెంబర్‌ 04న: 42
డిసెంబర్‌ 06న: 21
డిసెంబర్‌ 11న: 30
డిసెంబర్‌ 13న: 22

సింగపూర్‌ నుంచి విజయవాడ వచ్చే సర్వీసు..
డిసెంబర్‌ 04న: 51
డిసెంబర్‌ 06న: 36
డిసెంబర్‌ 11న: 34
డిసెంబర్‌ 13న: 31

అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వృద్ధి ఖాయం..
సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసు ఆరంభమవ్వడంతో రాత్రికి రాత్రే గన్నవరం విమానాశ్రయానికి ప్రపంచ పటంలో స్థానం లభించింది. ఇంక దేశవిదేశీ ప్రయాణికులు ఈ ప్రాంతానికి రావాలంటే.. గన్నవరం అతిపెద్ద కేంద్రం కాబోతోంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, ప్రతి దేశానికీ విమాన సర్వీసులు ఉండే సింగపూర్‌తో అనుసంధానం ఏర్పడడం చాలా మంచి పరిణామం. ఇక్కడి నుంచి సింగపూర్‌కు నేరుగా వెళ్లిపోతే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత తేలికగా చేరుకునే వెసులుబాటు ఉంటుంది. దశాబ్దాలుగా ఇక్కడివారి ఎదురుచూపులు ఫలించాయి. అతి తక్కువ కాలంలోనే గన్నవరం అత్యంత రద్దీ కలిగిన అంతర్జాతీయ విమానాశ్రయంగా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- ముత్తవరపు మురళీకృష్ణ, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి సలహా మండలి సభ్యులు
Link to comment
Share on other sites

Direct Singapore flights to take off from Dec 4

THE HANS INDIA |   Nov 01,2018 , 11:55 PM IST
   

 
 
Direct Singapore flights to take off from Dec 4
Direct Singapore flights to take off from Dec 4
 
 
Guntur: Flights will be operated from Gannavaram Airport to Singapore  from December 4 on wards. First International flight from Singapore to Vijayawada will land at Gannavaram Airport on December 4 at 3.45 p.m. The same flight will departure at 6.25 p.m. from Gannavaram Airport. The IndiGo Airlines will operate Airbus-320 with 180 seats facility weekly twice. 
 
 
 
 
It will operate flights to Singapore on every Tuesday and Thursday for the convenience of the passengers.  Singapore flight which will start at 6.25 p.m. at Gannavaram Airport, will reach Singapore at 1.30 a.m. The Indigo Airlines has already opened ticket booking for the convenience of the passengers. Chief Minister N Chandrababu Naidu is likely to inaugurate Singapore flight.
 
Speaking to the Hans India, Gannavaram Airport director G Madhusudan Rao said, “All necessary permissions were given to IndiGo Airlines to operate flights to Singapore. Ticket booking has  already opened. Chief Minister N Chandrababu Naidu is likely inaugurate the flight to Singapore.
 
Similarly efforts are going on to operate flights to Dubai also.” Meanwhile, nine-seater mini flights will be operated to Nagarjunasagar and Puttaparthy within two weeks.  Supreme Airlines is making arrangements to start flights operation to Nagarjunasagar and Puttarparthy and got necessary permissions.
 
CEO of AP Airports Development Corporation Virendra Singh said, `` Under the Regional Airport Development and Regional Connectivity scheme, flights will be extended to Nagarjunasagar and Puttarparty soon. Donakonda airport will come into operation next year. We have already taken steps to develop the airport at Donakonda.”
 
 

Link to comment
Share on other sites

59 minutes ago, Yaswanth526 said:

Vijayawada Airport Stats For the 1st 6 Months (April - Sep)

2017-18 No. of passengers Traveled - 3,46,266

2018 -19 No. of Passengers Traveled - 6,02,290

Growth Rate : 73.9 % :terrific:

By 2019 March 1.18 - 1.2 Million Passengers are expected 2 Travel from VGA

Terrific 

Link to comment
Share on other sites

అమరావతి నుంచే విదేశాలకు..
19-11-2018 02:19:14
 
636781907526515221.jpg
  • విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానం
  • డిసెంబరు 4న సింగపూర్‌ సర్వీసు ప్రారంభం
  • ప్రతి జిల్లాకూ విమానాశ్రయం ఏర్పాటు
  • టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నవశకానికి నాందిపడింది. విజయవాడ నుంచి తొలి అంతర్జాతీయ విమానం ఎగరబోతోంది. డిసెంబర్‌ 4న విజయవాడ-సింగపూర్‌ విమాన సర్వీసు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది మరపురాని రోజుగా నిలుస్తుందని అన్నారు. విజయవాడ నుంచి తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమవనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ తాను చేసిన ప్రయత్నాల వలన అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తిచూపుతున్నాయని అన్నారు. ఫలితంగా వివిధ రంగాల్లో వేగంగా అభివృద్ధి జరగడంతో విజయవాడ విమానాశ్రయానికి ఈ నాలుగన్నరేళ్లలో ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానయాన సదుపాయాలు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
 
రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. భోగాపురం (విజయనగరం), దగదర్తి (నెల్లూరు) విమానాశ్రయాల గురించి అధికారులు వివరించగా... పునరావాసం, పరిహారం చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసి మిగిలిన భూములను కూడా విమానాశ్రయాలకు అప్పగించాలన్నారు. ప్రతి జిల్లాకూ విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే సామాజిక ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడులు, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ సీఎంకు వివరించారు. విజయవాడ-పుట్టపర్తి-విజయవాడ (రోజుకు రెండుసార్లు), విజయవాడ-నాగార్జునసాగర్‌-విజయవాడ (రోజుకోసారి) విమానాలను నడపాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ మార్గాల్లో 9 సీట్ల విమానాలు తిప్పుతామని, ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని వివరించారు.
 
విజయవాడ-సింగపూర్‌ మధ్య వారానికి రెండుసార్లు నడిపే నాన్‌స్టా్‌ప విమాన సర్వీసులకు గాను రాష్ట్ర ప్రభుత్వం వయబుల్‌ గ్యాప్‌ ఫండింగ్‌ను సమకూర్చనుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ఇండిగో సంస్థ ఈ మార్గంలో 180 సీట్ల ఎ320 విమానాన్ని నడపనున్నట్లు వెల్లడించారు. రాబోయే 3-6 నెలల్లో దుబాయ్‌కి కూడా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు ప్రతి మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.40 గంటలకు, సింగపూర్‌ నుంచి ప్రతి మంగళ, గురువారాల్లో మధ్యాహ్నం 1.40 గంటలకు విమానాలు బయల్దేరతాయని తెలిపారు. సమీక్షలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఎస్‌ అనీల్‌చంద్ర పునేఠా, సీఎం ప్రత్యేక సీఎస్‌ సతీ్‌షచంద్ర, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్థసారధి, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రన్‌వే.. ఆలస్యం
తొలగని అనేక అడ్డంకులు
అంతర్జాతీయానికి అత్యవసరం
భారీ విమానాలు రావడం కుదరదు
amr-gen5a.jpg
గన్నవరం అంతర్జాతీయ విమానాల రాకపోకలు డిసెంబరు నుంచి ఆరంభమవుతున్నాయి. పూర్తిస్థాయిలో అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు రావాలంటే.. ముందుగా రన్‌వే విస్తరణ పూర్తవ్వాలి. రెండేళ్ల కిందట ప్రారంభించిన రన్‌వే విస్తరణ పనులు వచ్చేనెల డిసెంబర్‌ నాటికి పూర్తవ్వాల్సి ఉంది. జనవరి నుంచి అంతర్జాతీయస్థాయి రన్‌వే పై విమాన సర్వీసులు రాకపోకలు ఆరంభమవ్వాల్సి ఉంది. కానీ.. వాస్తవ పరిస్థితి చూస్తే.. ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రన్‌వే విస్తరణకు అవసరమైన.. అడ్డంకులు ఇంకా తొలగలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సహా అనేక విషయాల్లో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో రన్‌వే విస్తరణ పనులు కనీసం మరో ఆరు నెలలు ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది.
ఈనాడు, అమరావతి

న్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు డిసెంబరు 4 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి సాధారణ 180 సీటింగ్‌ విమానాలను నడిపేందుకు అవసరమైన రన్‌వే ఉంది. అంతర్జాతీయస్థాయి సంస్థలకు చెందిన భారీ విమానాలు రాకపోకలు సాగించే వీలు లేదు. రన్‌వే విస్తరణ త్వరితగతిన చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. రూ.120 కోట్లతో విస్తరణ పనులను 2017 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. పనులు సైతం జోరుగానే సాగుతూ వచ్చాయి. కానీ.. ప్రస్తుతం చివరి దశలో ఎదురైన ఆటంకాలు తొలగించకపోవడంతో పనులు మందగించే పరిస్థితి వచ్చింది.

ఎప్పుడో పరిష్కరించాల్సినవి..
రన్‌వే విస్తరణ కోసం ఇళ్లు కోల్పోయిన వారి సమస్యను ఎప్పుడో పరిష్కరించాల్సి ఉంది. 70 ఇళ్ల వాసులు ఇంకా రన్‌వే విస్తరణ స్థలంలోనే ఉన్నారు. వీరిని తరలించాలంటే.. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద కొత్తగా ఇళ్లను కట్టించి ఇవ్వాలి. మొదట్లో రూ.2.60లక్షల చొప్పున ఒక్కో ఇంటికి కేటాయించి.. కట్టించి ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ.. ఎంత విస్తీర్ణంలో ఒక్కో ఇంటిని నిర్మించాలనే విషయంలో వివాదం వచ్చి ఆగిపోయాయి. ఈ ఇళ్లను తరలించకుండా రన్‌వేను వినియోగించడం కుదరదు. ప్రస్తుతం టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపట్టినా కనీసం ఆరు నెలలు పడుతుంది. దీనికితోడు రన్‌వే విస్తరణ స్థలంలో ఉన్న ఆలయాలను వేరేచోటికి తరలించాల్సి ఉంది. వీటిలో కొన్నింటి విషయంలో న్యాయస్థానాలకు వెళ్లినవీ ఉన్నాయి. అన్నింటికంటే కీలకమైన వంతెన సైతం మూసేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయం అందుబాటులోనికి తీసుకొచ్చాకే.. పాత వంతెన మూయాల్సి ఉంది. వీటికితోడు ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. వీటన్నింటినీ అత్యవసరంగా తొలగించాల్సి ఉంది.

అంతర్జాతీయ సంస్థలు రావాలంటే..
అంతర్జాతీయ విమానాలను దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం 7500 అడుగులు ఉన్న రన్‌వేను.. 11,023 అడుగులకు పెంచుతున్నారు. అప్పుడే భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. ఎమిరేట్స్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు రావాలంటే ఖచ్చితంగా పెద్ద రన్‌వే అవసరం. చాలా అంతర్జాతీయ సంస్థలకు చెందిన విమానాలన్నీ పెద్దవే. గన్నవరం విమానాశ్రయం కోసం చిన్న వాటిని తయారుచేయించుకుని రావడం కుదరదు. ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 777, 747 వంటి పెద్ద సర్వీసులు రాకపోకలు సాగించాలంటే.. రన్‌వే విస్తరణ పూర్తవ్వాలి. అప్పుడే పూర్తిస్థాయి అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకుంటుంది.

Link to comment
Share on other sites

ముహూర్తానికి వేళాయే!
28-11-2018 09:08:45
 
636789929764156660.jpg
  • డిసెంబరు 4న సింగపూర్‌కు ఇండిగో సర్వీసులు ప్రారంభం
  • ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక
  • ఏర్పాట్లపై నేడు ఎయిర్‌పోర్టు, జిల్లా యంత్రాంగం పరిశీలన
  • పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాజధానికి తలమానికమైన విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసుల ప్రారంభోత్సవ ముహూర్తానికి వేళయింది! డిసెంబర్‌ 4 వ తేదీన సింగపూర్‌కు ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభించటానికి భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. ఇద్దరు వీవీఐపీలు పాల్గొంటున్న నేపథ్యంలో, కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం జిల్లా యంత్రాంగం నేతృత్వంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఎయిర్‌ పోర్టులో క్షేత్రస్థాయి సమీక్ష జరగనుంది.
 
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసుకు శ్రీకారం చుట్టారు. డిసెంబరు 4న సింగపూర్‌కు ఇండిగో సర్వీసు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ శ్రేణిలో నడుస్తున్న మొట్టమొదటి సర్వీసు కావటంతో ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. సింగపూర్‌కు సర్వీసుతో అంతర్జాతీయ శ్రేణిలో విజయవాడ విమానాశ్రయం నూతనాధ్యాయాన్ని సృష్టించబోతోంది. పొరుగు రాష్ట్రం హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి 100 మంది ప్రయాణికులలో 46 మంది మన ప్రాంతానికి చెందిన వారే ఉండటం చూస్తే అంతర్జాతీయ యానం విజయవాడ కేంద్రంగా వేళ్ళూనుకునే అవకాశం ఉంది. దేశీయంగా ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు రికార్డులను సృష్టిస్తోంది.
 
వృద్ధిరేటులో దేశంలోని మెట్రో పాలిటన్‌ ఎయిర్‌పోర్టులను కూడా సవాల్‌ చేస్తోంది. పది లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్టులలో దేశంలోనే విజయవాడ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో నిలుస్తోంది. దేశం నలుమూలలా విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కొద్ది నెలలుగా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నెలకు లక్ష మందికి పైగా గమ్యస్థానాలకు చేరుకుంటుండటం విశేషం. సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయ ఆపరేషన్స్‌కు విజయవాడ ఎయిర్‌పోర్టు వేదిక కావటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రాండ్‌గా అంతర్జాతీయ సర్వీసు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఇటు జిల్లా యంత్రాంగం, అటు ఎయిర్‌ పోర్టు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
 
బుధవారం నాటి క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్ష తర్వాత ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రిలు ఇద్దరూ పాల్గొంటున్నందున ప్రజలతో సభను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని జిల్లా యంత్రాంగం, ఎయిర్‌పోర్టు వర్గాలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ను కూడా సిద్ధం చేశారు. పూర్తి ఆధునీకరణ చెందిన అంతర్జాతీయ టెర్మినల్‌ ప్రాంగణంలో కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ విభాగాలు కూడా ఏర్పాటయ్యాయి. ఆయా విభాగాలు సేవలు అందించటానికి సమాయత్తమయ్యాయి. ఇదే టెర్మినల్‌లో జ్యోతి వెలిగించి విమాన సర్వీసును ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సింగపూర్‌కు వెళ్ళే ప్రయాణికులకు వెంకయ్యనాయుడు, చంద్రబాబు చేతుల మీదుగా బోర్డింగ్‌ పాస్‌లు ఇప్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం ముగిశాక బహిరంగ సభలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నది ప్రాథమిక అంచనాగా ఉన్నట్టు తెలుస్తోంది.
 
నూతన ప్రయాణికులకు వీసా కష్టాలు
సింగపూర్‌కు వెళ్ళాలనుకునే నూతన ప్రయాణీకులకు వీసా కష్టాలు దాపురించాయి. సింగపూర్‌కు తొలి సర్వీసుగా బయలుదేరే విమానంలో వెళ్ళాలని భావించిన ప్రయాణికులు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అంత త్వరగా రావటం లేదని తెలుస్తోంది. సింగపూర్‌ కాన్సులేట్‌ నుంచి నిర్ణీత సమయంలో ప్రక్రియ పూర్తి కాకపోవటం వల్ల వీసా మంజూరులో తీవ్ర జాప్యం నడుస్తోందని తెలుస్తోంది. దీని ప్రభావం టికెటింగ్‌పై చూపిస్తోంది. డిసెంబర్‌ 4 వతేదీన కిందటి శనివారం వరకు అందిన సమాచారం ప్రకారం 65 మంది టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది. అదే రోజు సింగపూర్‌ నుంచి విజయవాడకు 95 మంది బుక్‌ చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచి బయలు దేరే వారి కంటే అక్కడి నుంచి వచ్చే వారే ఎక్కువుగా ఉన్నారు. సింగపూర్‌కు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువుగానే ఉన్నా వీసాలను పొందటంలో ఎదుర్కొంటున్న ఇబ్బందల వల్ల టిక్కెటింగ్‌ తక్కువుగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...