sonykongara Posted December 5, 2018 Author Posted December 5, 2018 నలుదిక్కులా.. ఖ్యాతి05-12-2018 15:20:00 ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన విమాన రంగంలో ఇదో సరికొత్త అధ్యాయం.. రవాణా రంగానికి ఆయువుపట్టు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. బెజవాడ విమానాశ్రయం భవిష్యత్‌లో మరింత విస్తరిస్తుందని ఆశాభావం విజయవాడ(ఆంధ్రజ్యోతి): అమరావతి ఖ్యాతిని దేశస్థాయిలో చాటేలా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు అడుగుపడింది. అమరావతిని ఆర్థిక, పర్యాటక, సాంస్కృతికతలకు వారధిగా నిలిపేలా రూ.611 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు సురేష్ ప్రభు, జయంత్ సిన్హాలు భూమి పూజ చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధిలోనే ఇది సరికొత్త నూతనాధ్యాయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దేశంలో 129 విమానాశ్రయాలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఇండియా నిర్వహిస్తోంది. ఇందులో 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో విజయవాడ విమానాశ్రయం ఒకటి! ఇవి కాకుండా దేశంలో ఎనిమిది కస్టమ్స్ విమానాశ్రయాలు, 98 డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ శ్రేణిలో ఉన్న విమానాశ్రయాలలో కూడా ఇటీవల కాలంలో ఎక్కడా నిధులు కేటాయించనంతగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు రూ.611 కోట్లు కేటాయించారు. ఇటీవల కాలంలో పబ్లిక్ అండ్ పార్టనర్‌షిప్ పద్దతిలోనో, పూర్తిగా ప్రైవేటు నియంత్రణలో చేపట్టేవాటికే అనుమతులు ఇస్తున్నారు. ఇలాంటి దశలో ప్రభుత్వ నేతృత్వంలో భారీ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. దేశంలోనే ఆదర్శంగా.. ఈ తరహా మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలవబోతోంది. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అనుసంధానం మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద రెండవ రైల్వే జంక్షన్ విజయవాడలోనే ఉంది. ఆసియా ఖండంలోనే మూడవ అతిపెద్ద బస్‌స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. తాజాగా దేశంలోనే అత్యద్భుత టెర్మినల్‌లో ఒకటిగా విజయవాడ నిలుస్తోంది. విజయవాడ ప్రస్తుత విమానాశ్రయంలో ఎలాంటి వాతావరణ పరిస్ధితుల్లో అయినా ఎయిర్‌బస్ 321 నడవటానికి అనుకూలంగా ఉంది. మే 3, 2015న విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా వచ్చింది. చెంతనే రాజధాని ఏర్పడిన తరువాత విజయవాడ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు పెరిగాయి. దీంతో పాత టెర్మినల్‌ను ఆధునికీకరించారు. ఇది కూడా సరిపోకపోవడంతో రూ.163 కోట్ల వ్యయంతో ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇది పూర్తి చేసుకున్న తరువాతనే అంతర్జాతీయ హోదా వచ్చింది. ఈ క్రమంలో 2286 మీటర్ల పొడవు ఉన్న రన్‌వేను, 3360 మీటర్ల మేర రూ.వంద కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. దీని వల్ల బోయింగ్ 747, 777 విమానాలు కూడా నడవటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత టెర్మినల్ కూడా విమానా ప్రయాణికులతో నిండిపోతోంది. ఇలాంటి సమయంలో శాశ్వత టెర్మినల్ బిల్డింగ్ అవసరం ఏర్పడింది. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ కార్యరూపం ఇచ్చింది.ప్రస్తుతం విమానాశ్రయంలో 16 విమానాలు నిలపటానికి పార్కింగ్ బేలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ద్వారా 25 విమానాలు వరకు ఇక్కడ నిలుపుదల చేయటానికి అవకాశం ఉంది. దీంతోపాటు 3 కోడ్ - ఇ, ఆరు కోడ్ - సి విమానాలు నిలుపుదల చేయటానికి అవకాశం ఉంది. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన రంగాల ద్వారా పెద్ద ఎత్తున ఉత్పాదకత వస్తుంది. వ్యాపార ఉత్పాదకతలు కూడా ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వీటిని ఎగుమతి చేయటానికి కార్గో సేవలు కూడా అవసరం ఉంది. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకున్న తరువాత భవిష్యత్తులో ఇవి కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. విమాన రంగంలో సరికొత్త చరిత్ర.. చారిత్ర ప్రాధాన్యత కలిగిన విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ దోహదపడుతుంది. రవాణా రాకపోకలు పెరిగితే అభివృద్ధికి సూచిక అవుతుంది. విజయవాడ నుంచి సింగపూర్‌తో పాటు అనేక దేశాలకు విమాన సర్వీసులు రావలసిన అవసరం ఉంది. త్వరలో ఇవన్నీ వస్తాయి. రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల అనుసందానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. విజయవాడ సంస్కృతి, రాజకీయ, వ్యాపార కేంద్రంగా ఉంది. రవాణా రంగానికి ఆయువు పట్టుగా ఉంది. ఇలాంటి చోట రూ.611 కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసుకోవటం సంతోషంగా ఉంది. కూచిపూడి నాట్యం, మల్లెపువ్వు, కృష్ణానది పరవళ్లతో కూడిన ఆకారాలతో టెర్మినల్ నిర్మాణం జరగటం చాలా గొప్ప విషయం. 2020 నాటికి ఊహించని రీతిలో విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుంది. అమరావతి బౌద్ధ చారిత్రక ప్రాంతం కావడంతో జపాన్, చైనా తదితర దేశాల నుంచి కూడా విజయవాడకు రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో మామిడి, మిర్చి, టొబాకో, టోమాటో తదితర పంటలకు ఎగుమతి చేసుకోవటానికి కార్గో సదుపాయాలు కూడా లభిస్తాయి. - ఎం.వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్‌కు ఐకాన్.. విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పూర్తయిన తరువాత అమరా వతికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఐకాన్‌గా మారుతుంది. దేశంలోనే ఆధునికంగా ఉం టుంది. ప్రైవేటు విమానాశ్రయాలతో పోటీపడి విమాన ప్రయాణికులకు సదు పాయాలను కల్పిస్తుంది. ఇందు లో భాగంగానే విజయవాడ టెర్మినల్ బిల్డింగ్‌కు రూ 611 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల అభివృద్ధిలో విమానయాన రంగం ముఖ్య పాత్ర పోషిస్తోంది. దాదాపు 20 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. ఈ దేశంలో 65 బిలియన్ డాలర్లు వెచ్చించి వంద విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నారు. - సురేష్ ప్రభు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి
sonykongara Posted December 5, 2018 Author Posted December 5, 2018 Vijayawada airport gets international status, first flight takes off to Singapore Vice President Venkaiah Naidu said that the new air connectivity between Andhra Pradesh and Singapore would increase India's reach in South-East Asia. TNM Staff Wednesday, December 05, 2018 - 08:26 Share @Facebook Share @twitter Share @Email Share @google+ Share @reddit The Vijayawada airport in Andhra Pradesh officially turned ‘international’ as Vice President M Venkaiah Naidu on Tuesday inaugurated the first international flight from the city to Singapore and laid the foundation stone for the integrated passenger terminal building at the airport. The Vice President said that an international flight from Vijayawada to Singapore would further enhance the connectivity as well as Andhra Pradesh's business and tourism potential. It was in May last year, that the central government granted international status to the Vijayawada airport. However, it was only after the state government offered viability gap funding to service providers to encourage more airlines, that IndiGo stepped forward. It will now operate two flights a week. He said the new state-of-the-art terminal spread across 35,000 sq metre is being developed with Rs 611 crore to handle 1,200 passengers everyday with 24 check-in counters and eight gates. The terminal would also accommodate parking facility for 1,250 four wheelers. A total of 14 immigration counters, three customs counters, and five baggage belts would be installed for the convenience of international and domestic passengers. The Vice President said the new air connectivity between Andhra Pradesh and Singapore would increase India's reach in South-East Asia. Venkaiah Naidu said India has the potential to become a global aviation hub for Maintenance Repair and Overhaul (MRO) following a growing aviation business, huge pool of engineering talent and low labour costs. "The Indian civil aviation industry is growing at a rapid pace and is considered the third largest domestic civil aviation market in the world. According to projections, it is poised to become the world's largest domestic civil aviation market in the next 10-15 years. Investments to the tune of Rs 1 lakh crore are expected in the next five years," Naidu said. He said the passenger traffic which witnessed 14.1 percent growth over the last five years is likely to touch about 400 million by the year 2020. He said that in spite of the growth in passenger traffic, some of the airlines were facing problems and hoped that things would improve soon for them. Union Civil Aviation Minister Suresh Prabhu, MoS Civil Aviation Jayant Sinha, state Finance Minister Y. Ramakrishnudu, state Law Minister Kollu Ravindra and other dignitaries were present on the occasion. Naidu said that the recent aviation initiatives such as development of Vizag Airport, extension of runway at Rajahmundry Airport and extension of runway at Tirupati Airport would give fillip to the growth prospects of the state. IANS inputs
sonykongara Posted December 5, 2018 Author Posted December 5, 2018 Sprawled over 35000 Sqm, @aaivjaairport's new Integrated Terminal Building of - a gateway to the state of Andhra Pradesh - is a steel & glass structure with state-of-the-art passenger friendly facilities & peak hour handling capacity of 1200 passengers. 9:23 PM - 4 Dec 2018
sonykongara Posted December 5, 2018 Author Posted December 5, 2018 Features of New Integrated Terminal Building Annual Passengers Capacity : 3.3 Million PPA Cars Parking : 1200 Check-in counters : 24 Immigration Counters : 4+10 (Dep+Arr) Custom Counters : 1+3 (Dep+Arr) Baggage Conveyors : 1 (Dep) Baggage Claim Carousels : 5 (Arrival)
sonykongara Posted December 5, 2018 Author Posted December 5, 2018 Airports Authority of IndiaVerified account @AAI_Official Dec 4 .@aaivjaairport is all set to get a New Integrated Terminal Building with passenger-friendly features. The Bhumi Poojan will be done by Hon. Vice President Sh.@MVenkaiahNaidu, 5PM today in the august presence of Sh. @ncbn, Sh. @sureshpprabhu, Sh. @jayantsinha & other dignitaries.
sonykongara Posted December 5, 2018 Author Posted December 5, 2018 IndiGoVerified account @IndiGo6E 9h9 hours ago 6E launched the flight from the land of Victory to the land of dreams, Vijayawada to Singapore! Here's a glimpse of celebration when we touched down. #6EMoment
sonykongara Posted December 6, 2018 Author Posted December 6, 2018 విజయవాడ విమానాశ్రయం.. ఆకాశమంత అవకాశం06-12-2018 03:17:34 ప్రపంచానికి దగ్గరి దారిగా బెజవాడ ఇప్పటికే సింగపూర్‌తో తొలి అడుగు కొత్త ఏడాదిలో దుబాయ్ విమానం? ఇక 300 నగరాలతో అనుసంధానం హైదరాబాద్, చెన్నై వెళ్లక్కర్లేదు ప్రవాసాంధ్రులకు కలిసొచ్చే ప్రయాణం అయితే... హైదరాబాద్! కాదంటే.. చెన్నై! కోస్తా జిల్లాల నుంచి అమెరికా, యూరప్ లేదా దుబాయ్ తదితర అరబ్ దేశాలకు వెళ్లాలంటే ఇదీ పరిస్థితి! రోడ్డు మార్గంలో దాదాపు సగం రోజు ప్రయాణం చేసి... అక్కడిదాకా వెళ్లి విమానం ఎక్కాలి. అతి త్వరలోనే ఈ దుస్థితి తప్పే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ నుంచి ఇప్పటికే సింగపూర్‌కు విమాన సర్వీసు మొదలైంది. ఇక, దుబాయ్ విమానం కూడా వచ్చేస్తే.... ప్రపంచంలోని 300 నగరాలతో నవ్యాంధ్రకు అనుసంధానం ఏర్పడుతుంది. అప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లి మరో విమానం ఎక్కాల్సిన అవసరం రాదు. (విజయవాడ - ఆంధ్రజ్యోతి) రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాతే సింగపూర్-విజయవాడ విమానం కల సాకారమైంది. దీనిని వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది. దీంతో మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, ఇండొనేషియా పర్యాటకం సులువుగా మారింది. ఇక... అమెరికాతోపాటు యూర్‌పదేశాలకు వెళ్లే వారిలో 70 శాతానికి పైగా ప్రయాణికులు దుబాయ్ లేదా షార్జా మీదుగా వెళ్తున్నారు. దుబాయ్ దాకా వెళ్లాలంటే... హైదరాబాద్ లేదా చెన్నైకి వెళ్లి విమానం ఎక్కాల్సిందే. కొత్త సంవత్సరం నుంచి విజయవాడ-దుబాయ్ సర్వీసు ప్రారంభించేలా విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆరు నెలల కిందట దుబాయ్ - భారత్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వచ్చిన స్లాట్స్ అన్నీ నిండిపోయాయి. దీంతో ఇన్నాళ్లు విజయవాడ నుంచి దుబాయ్/షార్జా సర్వీసు నడిపేందుకు వీలు కాలేదు. తాజాగా జెట్ ఎయిర్‌వేస్ సంస్థ దుబాయ్‌కి 10 సర్వీసులను ఉపసంహరించుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దుబాయ్ సర్వీసు ప్రవేశపెట్టే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అదే జరిగితే... కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతోపాటు... తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వారికి విజయవాడ అతి దగ్గరి ‘అంతర్జాతీయ విమానాశ్రయం’గా మారుతుంది. మరోచోటికి వెళ్లి విమానం ఎక్కాల్సిన బాధ తప్పుతుంది. ఇక్కడి నుంచే అధికం... హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో దాదాపు 40 శాతం మంది నవ్యాంధ్ర జిల్లాలకు చెందిన వారే అని అధికారిక సర్వేల్లో తేలింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 5 లక్షల మంది వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. అమెరికాలో రెండు లక్షల మంది, పశ్చిమాసియా దేశాల్లో 2 లక్షల మంది, ఇతర దేశాల్లో మరో లక్ష మంది దాకా నివసిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతరత్రా ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాల్లో వేలాది మంది స్థిరపడ్డారు. ఇక.. ప్రతి ఏటా 30 నుంచి 40 వేల మంది విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి విమానాలు ఎక్కుతున్నారు. విజయవా డ నుంచి సింగపూర్‌తోపాటు దుబాయ్ విమా నం అందుబాటులోకి వస్తే వీరందరికీ విదేశీ యానం సులువు అవుతుంది. ఆధునికతతో హంగులు: ఇప్పటికే విజయవాడ విమానాశ్రయం దేశీయంగా అనూహ్య వృద్ధిని నమోదు చేస్తోంది. గత మూడేళ్లుగా 250 శాతం వృద్ధిని సాధిస్తోంది. విజయవాడ విమానాశ్రయంలో రూ.161 కోట్లతో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్‌ను ఆధునీకరించారు. 611 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల వ్యయంతో రన్‌వేను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయంలో 16 పార్కింగ్ బేలు ఉన్నాయి. 500 కార్లు పార్క్ చేయవచ్చు. త్వరలోనే 25 పార్కింగ్ బేలు ఏర్పాటు చేయనున్నారు. వీకెండ్‌లో వచ్చి వెళ్లొచ్చు! విజయవాడ-సింగపూర్ మధ్య ప్రయాణ దూరం 3.30 గంటలు మాత్రమే. వీకెండ్స్‌లో విమానాలు నడిపితే తమకు అనుకూలంగా ఉంటుందని...ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి రాత్రికి సింగపూర్ చేరుకుని, మరుసటిరోజు ఉద్యోగాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కార్గో రవాణా సదుపాయం కూడా కల్పిస్తే ఇక్కడి పంటలు, ఆహార ఉత్పత్తులు విదేశాలకు నేరుగా ఎగుమతి చేయొచ్చు.
ravindras Posted December 12, 2018 Posted December 12, 2018 gannavaram airport lo second runway kattadaaniki scope vundhaa?
sonykongara Posted December 12, 2018 Author Posted December 12, 2018 5 minutes ago, ravindras said: gannavaram airport lo second runway kattadaaniki scope vundhaa? no chance ledu,ippudu kastam
ravindras Posted December 12, 2018 Posted December 12, 2018 Just now, sonykongara said: no chance ledu,ippudu kastam i mean land availability for second runway for future
sonykongara Posted December 12, 2018 Author Posted December 12, 2018 Just now, ravindras said: i mean land availability for second runway for future eluru canal diversion cheyyali
sonykongara Posted December 12, 2018 Author Posted December 12, 2018 http://environmentclearance.nic.in/auth/FORM_A_PDF.aspx?cat_id=IA/AP/MIS/58075/2016&pid=New
rk09 Posted December 12, 2018 Posted December 12, 2018 59 minutes ago, sonykongara said: eluru canal diversion cheyyali Second runway ki chance ye ledu kani taxiway (and also small planes like ATR models) lanti runway ki chance vundi - between current runway and terminal taxiway vunte chalu - next 5 years varaku saripothundi
sonykongara Posted December 12, 2018 Author Posted December 12, 2018 19 minutes ago, rk09 said: Second runway ki chance ye ledu kani taxiway (and also small planes like ATR models) lanti runway ki chance vundi - between current runway and terminal taxiway vunte chalu - next 5 years varaku saripothundi bro ippudu unna run way ni 3,800 m penchtame kastam hyd 4,260 daka unnadi inkoti
rk09 Posted December 12, 2018 Posted December 12, 2018 2 hours ago, sonykongara said: bro ippudu unna run way ni 3,800 m penchtame kastam hyd 4,260 daka unnadi inkoti yes, pedda flights ki kastam but 3000 m ki plan chesi natlu vunnaru - like Kannur airport my point is - immediate need of taxi way - so that take of and landings can be done quickly otherwise need to wait atleast 5 min or more
swarnandhra Posted December 12, 2018 Posted December 12, 2018 2 hours ago, sonykongara said: bro ippudu unna run way ni 3,800 m penchtame kastam hyd 4,260 daka unnadi inkoti more than 3000m is not needed except for airbus A380. current extension is good enough for all potential flights.
rk09 Posted December 12, 2018 Posted December 12, 2018 (edited) 11 minutes ago, swarnandhra said: more than 3000m is not needed except for airbus A380. current extension is good enough for all potential flights. even A380 ki kuda - 2900 m (only take off) is enough. While landing its less than that. The extra length in runways are for extreme conditions Edited December 12, 2018 by rk09
rk09 Posted December 12, 2018 Posted December 12, 2018 AAI vadu inka update avvala AAI katte, almost all airpots lo taxiway ledu
swarnandhra Posted December 12, 2018 Posted December 12, 2018 17 minutes ago, rk09 said: AAI vadu inka update avvala AAI katte, almost all airpots lo taxiway ledu taxiway lekunda konnallu nadipinchavacchu. especially Gannavaram like small airport in the foreseeable future. But immediate need is to install aerobridges. ekkado half km dooram ga aapi busses lo move chestunnaru passengers ni.
ravindras Posted December 13, 2018 Posted December 13, 2018 as per bhogapuram airport rfp is building with runway dimensions 3800*60 (length * width) to handle a380 mumbai airport runway dimesions 3660*60 currently handling airbus a380 flights gannavaram airport runway can be extended upto 3925 meters without canal diversion . i unable to understand why aai want to extend runway upto 4430 meters https://deccanchronicle.com/nation/current-affairs/260816/vijayawada-hurdles-to-airport-expansion.html
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now