Jump to content

Nara Lokesh USA Tour


sonykongara

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply
Posted
14 hours ago, Mobile GOM said:

Inthaki ee company adi?

it is a alliance company of all IT consulting companies of telugu people. they usually lobby bills with us congress like brokers. they recently sued US Immigation agency to get refund of H1b fees. some day FBI going to behind these people. that is for sure. Recently FBI shut down NATA association as they were doing matching grants scam. it is very dangerous to associate with this IT Serve.

Posted

Greedy IT consulting brokers. Paisa use vundadhu. Kavalante 10Billion investment chestham ane statement isthaaru headlines kosam.

anthaku minchi no use. Investments kosam US raavadame waste. IT companies already vunnai kadha india lo. 

  • 2 weeks later...
Posted

Nara Lokesh: మంత్రి లోకేశ్‌కు శాన్‌ఫ్రాన్సిస్కోలో అపూర్వ స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తెచ్చేందుకు అమెరికా వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌కు శాన్‌ఫ్రాన్సిస్కోలో అపూర్వ స్వాగతం లభించింది.

Updated : 26 Oct 2024 13:12 IST
 
 
 
 
 
 

124193732_261024-lokesh-brk.jpg

శాన్‌ఫ్రాన్సిస్కో: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘‘ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారు ఓ వెలుగు వెలుగుతున్నారంటే అందుకు తెదేపా జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లనే. భారత దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ హైటెక్ సిటీ పేరు చెప్పగానే చంద్రబాబు గుర్తుకు రాక మానరు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 అంటూ ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. ఆ క్రమంలోనే తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రి లోకేశ్‌ 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు’’ అని ఎన్నారై ప్రముఖులు కొనియాడుతున్నారు.

తన తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు ఐటీ రంగంపై చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను కూడా లోకేశ్‌ పుణికి పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో లోకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు తెదేపా ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఏపీలో ఎన్డీఏ కూటమి ‘అఖండ’ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. తెదేపా ఘన విజయం సాధించడంతో పార్టీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మంగళగిరి ఎన్నికల్లో ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టి తిరుగులేని విజయం సాధించి మంత్రి అయిన లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎన్నారై తెదేపా యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై తెదేపా మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక తెదేపా నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, తెదేపా జోనల్ ఇన్‌ఛార్జి రవి మందలపు, ఐటి సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్‌ మండువ, సురేశ్‌ మానుకొండ తదితరులు ఉన్నారు.

అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల 29న లాస్‌వేగాస్‌ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పలు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ఎన్నారై తెదేపా నేతలు, అభిమానులు, ఎన్నారైలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.

124193732_261024-lokesh-brk2.jpg

261024-appjv-6.jpg

Loading video
Posted

Nara lokesh: ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ అభివృద్ధి: మంత్రి లోకేశ్‌

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Updated : 26 Oct 2024 11:21 IST
 
 
 
 
 
 

lokesh-123.jpg

శాన్‌ఫ్రాన్సిస్కో: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ‘‘ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నాం. పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు చేస్తున్నాం’’ అని లోకేశ్‌ తెలిపారు.

Posted

శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించాను. "పరిపాలనలో AI వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే ఆ ప్రభుత్వ లక్ష్యం. విభజిత ఆంధ్రప్రదేశ్ లో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు విజనరీ సిఎం చంద్రబాబునాయుడు సరికొత్త పి-4 విధానం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవవనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం" అని పారిశ్రామిక వేత్తలకు వివరించాను. ప్రముఖ పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ రామ అక్కిరాజు, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు, న్యూటానిక్స్ ప్రెసిడెంట్ రాజీవ్ రామస్వామి, దేవ్ రేవ్ సిఇఓ ధీరజ్ పాండే, గ్లీన్ సంస్థ సిఇఓ అరవింద్ జైన్, నెక్సస్ వెంచర్స్ ఎండి జిష్ణు భట్టాచార్య, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని, స్పాన్ ఐఓ సిఇఓ ఆర్చ్ రావు, మిహిరా ఎఐ సిఇఓ రాజా కోడూరి, ఇవాంటి చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ముక్కామల, హిటాచీ వంటారా సిఓఓ ఆశిష్ భరత్, గూగుల్ క్లౌడ్ జనరల్ మేనేజర్ సుని పొట్టి, వెస్ట్రన్ డిజిటల్ సిఐఓ శేషు తిరుమల, ఈక్వెనిక్స్ గ్లోబల్ ఎండి కెజె జోషి, త్రీడి గ్లాస్ సొల్యూషన్ సిఇఓ బాబు మండవ, పారిశ్రామికవేత్తలు వంశీ బొప్పన, రాజీవ్ ప్రతాప్, సతీష్ మంత్రి ప్రగడ, సతీష్ తాళ్లూరి పాల్గొన్నారు.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...