Jump to content

Kashmir files


MSDTarak

Recommended Posts

3 hours ago, KING007 said:

Movie tesaru good, next step enti? 

RRR- Recognise, Realise and Relocate, asalu recognise we cheyyakpote ela, many of us around are still calling it as an agenda even after showing facts. 

Link to comment
Share on other sites

  • Replies 364
  • Created
  • Last Reply

#KashmiriFakeFiles
( Credit : Rama Sundari )

కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి BJP  హిందుత్వ గ్రూపుల ప్రజలు కన్నీళ్లు కారుస్తున్నారట. నేను ఇంకా చూడలేదు కానీ, అందులో ఉన్న విషయాలు తెలుస్తున్నాయి. 'Kashmiri files' movie 'full of lies' / అబద్దాల పుట్ట అని అర్థం అయ్యింది. కశ్మీర్ గురించి రాసి, భక్తుల చేత గ్రాంధికంలో తిట్టించుకొన్న దాన్ని. ఇప్పుడు ఈ అబద్దాల సినిమాని జనం మీదకు వదిలి, ఏమీ తెలియని సామాన్యల బుర్రలను బలమైన ప్రచార సాధనమైన సినిమాతో పెద్ద ఎత్తున మార్చేసి, చేయబోతున్న మోసం, పెంచబోతున్న ద్వేషం తలుచుకొంటేనే భయం వేస్తుంది. 

నా చేతిలో ఉన్న ఒకే ఒక ప్రచార సాధనం ఈ ఫేస్ బుక్. నా ప్రయత్నం నేను చేయక తప్పదు. 

కశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవాలంటే ఓపెన్ మైండ్ అవసరం. ప్రభుత్వం చెప్పే ప్రతి విషయానికి ఉండే రెండో ముఖాన్ని, భాష్యాన్ని కూడా పరికించటానికి సిద్ధంగా ఉండాలి. ఏ దేశంలోనైనా ప్రజలు, ప్రభుత్వాలు వేరు అనే విషయాన్ని కూడా అంగీకరించాలి. 

ప్రశ్న: లక్షల కొలది కశ్మీరీ పండితులన్నీ కశ్మీర్ లో చంపేయలేదా? ఇంకా లక్షల కొలది పండితుల్ని కశ్మీర్ నుండి తరిమేయలేదా?

సమాధానం: కశ్మీర్ గురించి ఎక్కడ రాసిన ఈ ప్రశ్నతో ముందుకు వస్తారు. ఇది సామాన్య ప్రజల బుర్రలను కూడా బాగా ప్రభావితం చేస్తుంది.  

కశ్మీరీ పండితులు 1990 జనవరిలో లోయను వదిలి వెళ్లారు. అదే నెల మొదట్లో జగ్ మోహన్ మల్హోత్రా గవర్నర్ గా వచ్చాడు. 1989లో జరుగుతున్న సాయుధ తిరుగుబాటును పూర్తి స్థాయిలో అణచివేయటానికి అతన్ని నియమించారు. అతగాడు తన మారణకాండను కొనసాగించటానికి ముందు కశ్మీరీ బ్రాహ్మణులని సురక్షితంగా బయటికి పంపాడు. రాత్రికి రాత్రి బస్సులు వేసి వారిని జమ్మూలోని శిభిరాలకు తరలించారు. ఆ శిభిరాలలో వాళ్లు చాలా కష్టాలు పడ్డారు. 

కొంతమంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు పోగలిగారు. కొంతమంది ఇతర దేశాలకు కూడా పోయారు. తమ మాతృభూమిని వదిలిపెట్టి అలా వెళ్లాల్సి రావటం వారిని అనేకానేక ఇబ్బందులకు గురి చేసింది. అయితే బయటకు వెళ్లిన పండితుల్లో చాలామందికి తమ తోటి ముస్లిముల పట్ల ప్రేమ ఉండేది. వారిలో కొద్దిమంది మాత్రమే ఆనాటి హిందుత్వ శక్తుల గొంతుకను అరువు తీసుకొన్నారు. 

ఇప్పుడిక బీజేపీ పాలనలో ‘కశ్మీరీ పండితుల వలస’ ను రాజకీయంగా సక్కెస్ ఫుల్ గా మార్చుకోగలిగారు. కశ్మీరీ పండితుల వలస బీజేపీ డిజిటల్ సైన్యానికి పేలవ ప్రేలాపనగా తయారయ్యింది. వాళ్లెవరికి కశ్మీరీ పండితుల గురించి ఏమాత్రం తెలియదని అర్థం అవుతుంది. 

1990 సెప్టెంబర్ 22న  23మంది ప్రముఖ కశ్మీరీ పండితులు కశ్మీరీ ముస్లిములకు ఒక ఉత్తరం రాశారు. ‘We are sorry, We betrayed you’ (మమ్మల్ని క్షమించండి, మేము మీకు ద్రోహం చేశాము) .. అనే ఈ ఉత్తరం ఆ కాలంలో కశ్మీర్ లోని అతిపెద్ద సర్క్యులేషనున్న పత్రిక ‘గ్రేటర్ కశ్మీర్’ లో ప్రచురితం అయ్యింది. 

ఈ పండితులు 1990లో లోయనుండి వలస వెళ్లిపోయినవాళ్లు. అందులో సంతకం చేసినవారిలో బ్రిజ్ నాథ్ భాన్, ఎంఎల్ ధర్, కె.ఎల్. కవ్, చునిలాల్ రైనా, మోతిలాల్ మామ్, అశోక్ కౌల్, ఎం.ఎల్. మున్షి, బి.ఎన్. గుంజూ, పుష్కర్ నాథ్ కౌల్, కమల్ రైనా, ఇంకా కొంతమంది ఉన్నారు. జగ్ మోహన్ కున్న సొంత ఆశక్తుల కోసం, పండిత్ సముదాయానికి నాయకుడుగా చెప్పుకొని అదే పండిత సమూహాన్ని బలిపశువును చేశాడని ఒప్పుకొంటూ ఆ ఉత్తరం మొదలైయ్యింది. 

తాము వలసపోవడం అనేది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్, శివసేన తయారు చేసిన డ్రామా అని, అది రాసినవారు వర్ణించారు. లోయలో ముస్లిములు నోరుమూసుకొని, లొంగిపోయిన వెనువెంటనే పునరావాసం ఏర్పాట్లు చేస్తామని తమకు వాగ్దానం చేయటం వలన -‘ధర్మాన్ని కాపాడి పరిరక్షించటానికీ, భారతదేశపు ఐక్యమత్యాన్ని, సమగ్రతను కాపాడటానికి తమ వలస అత్యంత కీలకం’ అయ్యిందని ఆ ఉత్తరంలో సంతకాలు చేసినవారు ఒప్పుకొన్నారు. ‘కశ్మీరుకు శత్రువులు అయిన వారి చేతిలో కీలుబొమ్మలం అయినందుకు, పరాయిపాలన నుండి మాతృదేశాన్ని విముక్తం చేసే పోరాటంలో పాలుపంచుకోనందుకు సిగ్గుపడుతున్నామనీ’ ఆ ఉత్తరం చెబుతుంది. 

తన ఆధీనంలో ఉన్న ఈ ఉత్తరం కాపీ ఎవరికైనా కావాలంటే తన దగ్గర తీసుకోవచ్చునని మఖ్దూం చెబుతున్నాడు. ఈ మెహ్ బూబా మఖ్దూమి ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకానమీని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి, తన ఎంబీయేను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చేశాడు. 

అధికారిక లెక్కల ప్రకారం లోయనుండి వెళ్లిపోయేటపుడు పండితుల సంఖ్య 150000 నుండి 190000 దాకా ఉండింది. కొంతమంది కశ్మీరీ పండితులు ఇప్పటికీ లోయలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. శ్రీనగర్ నడిబొడ్డున కొన్ని పండితుల కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి.  

ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రకారమే, 1990-91 మధ్య హత్యకు గురి అయిన 1544 మంది కశ్మీరీలలో హిందువులు 1400 మంది. ఆ 1400ల మందిలో 209 మంది మాత్రమే కశ్మీరీ పండితులు. కానీ మిగతా 1200 మంది హిందువుల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ మిగతా 1200 మంది నిమ్నకులాల వాళ్లు. వారిలో చాలామంది విశ్వ హిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్ తో సంబంధంతో ఉంటారు. ఈ సంస్థలు పండితులు కాని హిందువులను వలస పోవటానికి అంగీకరించవు. వాళ్లు చనిపోయిన పర్వాలేదు. వాళ్లు వెనక్కి వస్తే తుపాకులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే వాళ్లు తుపాకీలతో శిక్షణ పొందినవాళ్లు కాదు. అందుకే పండితులు కానీ హిందువులు చాలామంది చనిపోయారు. 

ఇంకోవైపు జమ్మూకశ్మీర్ పౌరసమాజ సంకీర్ణ సంస్థ చెప్పినదాని ప్రకారం 1989 జనవరి నుండి డిసెంబర్ 2018 వరకు 70000 మంది రాష్ట్ర ప్రజలు(ముస్లిములు) చనిపోయారు. అనధికారికంగా చనిపోయినవారి సంఖ్య 100000 వరకూ ఉంటుంది. వీరి కుటుంబాల వారు ఎవరూ లోయను వదిలి వెళ్లలేదు. వీరిలో కొంతమందికి బయట స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్లలేదు. 

2016లో బుర్హాన్ వాని హత్య తరువాత తీసుకొన్నా, ప్రభుత్వ బలగాలు సామాన్య ప్రజల నిరసనల మీద ప్రయోగించిన చర్యలలో కనీసం 1100 యువకులు పాక్షికంగానో, పూర్తిగానో పెల్లెట్లతో కళ్లు పోగొట్టుకొన్నారు. 15000 మంది గాయపడ్డారు. 2017-18లలో ఎదురుకాల్పుల ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ, ప్రభుత్వ బలగాలతో ఘర్షణ పడుతూ చాలామంది పౌరులు చనిపోయారు. వాళ్ల కుటుంబాలు ఏవీ లోయను వదిలి వెళ్లలేదు.

కశ్మీరీ పండితులు ఎంతోమంది కశ్మీర్ విముక్తి ఉద్యమాల్లో పాల్గొన్నారు. జమ్మూ కేంద్రంగా పనిచేసే అనురాధా భాసిన్ అనే మానవహక్కుల లాయర్ తండ్రి వేద్ భాసిన్ షేక్ అబ్దుల్లాతో పాటు పనిచేశాడు. మోనా భాసిన్ అనే ఆంత్రోపలజిస్ట్ తాత రఘునాధ్ వైష్ణవి కూడా ప్లెబిసైట్ ఉద్యమంలో పాల్గొని చాలాకాలం జైల్లో ఉన్నాడు. ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు కశ్మీరీల హక్కుల కోసం పని చేస్తున్నారు. SAR Gelaani కోసం వాదించిన నందితాహస్కర్ కూడా కశ్మీరీ బ్రాహ్మిన్ యే. ఈ కేసులో SAR Gelaani  తరుఫు సాక్షి అయిన సంపత్ ప్రకాష్ కూడా కశ్మీరీ బ్రాహ్మిన్. కశ్మీర్ సమస్య మీద అద్భుతమైన డాక్యుమెంటరీ తీసిన సంజయ్ కక్ కశ్మీరీ బ్రాహ్మిన్. ఇంకా ఎంతోమంది కశ్మీరీ బ్రాహ్మలు కశ్మీరీ విముక్తి ఉద్యమానికి మద్దతునిస్తున్నారు. వీళ్లలో కొంతమంది రచయితలు ఉన్నారు. ఎందుకంటే వారికి కశ్మీరీ చరిత్ర తెలుసు కాబట్టి. 

ఇప్పటికీ చాలామంది కశ్మీరీ పండితుల, ముస్లిముల కుటుంబాల మధ్య రాకపోకలు, ఇచ్చి పుచ్చుకోవటాలు జరుగుతున్నాయి. నిన్న మొన్న చనిపోయిన కశ్మీరీ మిలిటెంట్లు రియాజ్ నైకూ, బుర్హాన్ వానిలు కూడా కశ్మీరీ బ్రాహ్మలు లోయకు తిరిగి రావాలని వాళ్ల వీడియో సందేశాల్లో కోరారు. అయితే ఇరువైపుల కొత్త తరాల వాళ్లు ఈ సయోధ్యనూ, సన్నిహితత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అనుపమ ఖేర్ లాంటి కశ్మీరీ పండితులు ప్రభుత్వ అల్ట్రా హిందూ నేషనలిజాన్ని మోస్తూ రెచ్చగొడుతున్నారు. యువతరం తెలిసో, తెలియకో వారిని అనుసరిస్తుంది.  

అయితే కశ్మీరీ పండితులకు లోయలో పునరావాసం గురించి బిజెపినే నోరు ఎత్తటం లేదు. ఈ విషయంలో లోక్ సభలో కూడా చర్చ జరిగింది. కశ్మీరీ పండితులని ఎవరు చంపారో విచారణ చేయటానికి ఒక్క కమిషన్ ను కూడా వేయలేదు. కశ్మీరీ పండితుల హంతకులను ఎందుకు శిక్షించటం లేదో, ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారో వాళ్లే సమాధానం చెప్పాలి. 

ప్రభుత్వానికి ఈ విషయంలో ఆసక్తిలో లేదు. కశ్మీరీ పండితుల పేరుని ఉపయోగించి రాజకీయాలు చేయటం, ప్రజలను రెచ్చగొట్టటమే వాళ్లకు కావాలి.
🔥☮️💥

కశ్మీర్ మీద వచ్చిన పుస్తకాలు 

కశ్మీర్ గురించి తెలుసుకోవాలంటే ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడటం కాదు. కశ్మీర్ సంబంధించిన పుస్తకాలు  చదవాలి. అవి చదువుతుంటే కలిగే భావన: ‘వాస్తవం ఎప్పుడూ హిమాలయాల్లో ప్రవహించే నదుల నీటి అడుగులాగా స్పష్టంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా కనిపిస్తుంది. అవాస్తవం ఎప్పుడూ తార్కికత, స్పష్టత లేక అల్లాడుతూ ఉంటుంది.’ ఏ పుస్తకాల్లో అయినా వాటిల్లో వాస్తవం ఉందో, అబద్ధం ఉందో తేల్చుకోవటానికి పెద్ద కష్టం అక్కర్లేదు. పై వాక్యాలు గుర్తు పెట్టుకొంటే చాలు.  

1. Kashmir: The Unwritten History పుస్తకాన్ని రాసినవాడు క్రిష్టఫర్ స్నిడెన్ ఒక ఆస్ట్రేలియన్. కశ్మీర్ గురించి కశ్మీరిలే రాస్తే, పోనీ భారతీయ ముస్లిములు రాస్తే -దానికి పక్షపాతాన్ని అంటగట్టి చూసేవాళ్లు ఉంటారు. కశ్మీర్ చరిత్రను విదేశస్తులు రాస్తే అలా చూడలేరు. ఎందుకంటే వారికి భారతదేశ మతాలపట్ల ఎక్కువ తక్కువలు ఉండవు. ఎంతో పరిశోదన చేసి రాసిన ఈ పుస్తకంలో సగభాగం ఆయన రాసిన వాటికి ఆధారమైన డాక్యుమెంట్స్ ను చేర్చి పుస్తకానికి పూర్తి విశ్వసనీయత తెచ్చాడు. 1947 ఆగస్టు 14,15లలో భారత, పాకిస్తాన్ లకు స్వాతంత్ర్యం వచ్చి సంబరాలు జరుగుతున్నపుడు జరిగిన విభజన, హింస గురించి కొంత మనకు తెలుసు. కానీ అదే సంవత్సరం ఆగస్టు నెల మొదటి నుండి నవంబర్ చివరి వరకు జమ్మూకశ్మీర్ లలో జరిగిన హింసలో 200000 ల మందికి పైగా ముస్లిములు మరణించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సాక్షాత్తు అప్పటి డోగ్రా హిందూ ప్రభుత్వం కక్ష కట్టి తన సైన్యం ద్వారా జరిపించిన మారణకాండ. ఈ హింస తరువాత జమ్మూ ప్రాంతంలో ముస్లిముల శాతం 60 నుండి 30కి తగ్గిపోయింది. జమ్మూకి చెందిన జర్నలిష్టు, హక్కుల కార్యకర్త, కశ్మీరీ పండిత్ అనురాధ బాసిన్ రాసిన వ్యాసంలో ఆమె జమ్మూ సంగతులను ప్రస్తావింది. చాలామంది కశ్మీర్ పండితులు ఆ ఉద్యమంలో ఉన్నారు. 

2. Kashmir: Glimpses of History and the story of struggle: కాంగ్రెస్స్ గవర్న్మెంట్ లో యూనియన్ మినిస్టర్ గా పని చేసిన సైఫుద్దీన్ సోజ్ (81 సంవత్సరాలు) రాసిన ఈ పుస్తకం 2018 మేలో వచ్చింది. కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్ట గట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

సైఫుద్ధీన్ తన పుస్తకం మొదటి చాప్టర్స్ అంతటిలో కశ్మీర్ చరిత్ర గురించే రాశారు. ఆయన రాసిన ప్రతి పదానికి చారిత్రక, రాతపూర్వక  ఆధారాలు ఇచ్చారు. కల్హానా రాసిన రాజతరంగిణితో మొదలు పెట్టి ప్రపంచ యాత్రికులు వివిధ కాలాల్లో దర్శించిన కశ్మీర్ సౌందర్యాన్ని గురించి రాస్తూ ఆయా కాలాల్లో కశ్మీర్ లో ప్రజల పరిస్థితుల గురించి పరిచయం చేస్తారు. అసలు కశ్మీర్ లో ఇస్లాం రావటానికి ఈ ముస్లిం రాజుల పాలన కారణం కాదనీ, అంతకు ముందే కొంత మంది సూఫీల ప్రభావం కశ్మీర్ సమాజం మీద ఉందనీ, ఇప్పటికీ కశ్మీర్ లో హిందూమత ఆదరణకు, పరమత సహనానికి కారణం ఆ సూఫీ తత్వం కశ్మీర్ సమాజం వంట పట్టించుకోవటమేనని అంటారు.

3. Kashmir in Conflict పుస్తకాన్ని విక్టోరియా స్కాఫీల్డ్ రాశారు. ఆమె బ్రిటిషర్. ఈమె కశ్మీర్ ను స్వాతంత్ర్యానికి ముందు నుండి పరిచయం చేసి, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వచ్చిన మార్పుల గురించి ఎక్కువగా చర్చించారు. కశ్మీర్ భారతదేశానికి అనుబంధం అయిన తరువాత కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలకు దారి తీసిన పరిస్థితుల గురించి సవివరంగా ఈ పుస్తకం నుండి తెలుసుకోవచ్చు. భారతదేశానికి ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో, ఎందుకు కశ్మీర్ కన్నీటి లోయగా మిగిలి పోయిందో ఈ పుస్తకం ద్వారా అర్థం అవుతుంది. 2003లో ముష్రాఫ్ ప్రయత్నించిన శాంతి ప్రయత్నం వరకూ ఈ పుస్తకం వివరిస్తుంది. 

4. 1993 -The flames of Chinar -ఈ పుస్తకం షేక్ అబ్దుల్లా ఆత్మకథ. కశ్మీర్ చరిత్రకు సంబంధించిన అనేక వాస్తవాలను ఈ ఆత్మకథ చెబుతుంది. కశ్మీరీల రాజకీయ తిరుగుబాటుకు నాయకత్వం వహించి, చివరకు నెహ్రూతో స్నేహం చేసి కశ్మీర్ కు ద్రోహం చేసిన షేక్ అబ్దుల్లా జీవిత కథ కశ్మీర్ ను అర్థం చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. 

5. Kashmir: Misgovernment. రాబర్ట్ థోర్పే చనిపోయాక పబ్లిష్ అయిన ఆయన పుస్తకం ఇది. రాబర్ట్ తోర్పే బ్రిటిషర్. కశ్మీర్ వెళ్లి అక్కడ ప్రజల దైన్యం గురించి బయట లోకానికి తెలియచేసి, డోగ్రా ప్రభువుల చేతిలో హత్యకు గురి అయినవాడు. ‘అమృత్ సర్ ఒప్పందంలో ఎక్కడా కూడా కశ్మీర్ ప్రజలకు న్యాయం, మానవత్వ పాలన ఉండాలనే సంగతే లేదు. వారు అసహ్యించుకొన్న ప్రభుత్వాన్నే మనం వారికి బలవంతంగా అంటగట్టాము’ అని రాశాడు. రాబర్ట్ తోర్పే పుస్తకం బయట ప్రపంచానికి చాలా విషయాలు చెప్పిన తరువాత బ్రిటిష్ కళ్లు తెరిచినట్లు నటించింది. 

6. The Collaborator పుస్తక రచయిత మీర్జా వాహెద్. కశ్మీర్ మీద వచ్చిన అతి తక్కువ కాల్పనిక నవలలలో ఇది ఒకటి. పేరుకు కాల్పనికమే కానీ ఇది కూడా కశ్మీర్ చరిత్రనే. కశ్మీర్ కాంటెక్స్ట్ లో Collaborator అర్థం ‘శత్రువుతో చేతులు కలిపిన వాడు’ అనవచ్చునేమో! ఈ కథను మనకు చెప్పే యువకుడు అలాంటి వాడే. ఇండియన్ ఆర్మీ దగ్గర కొలాబరేటర్ గా పని చేస్తున్న కశ్మీర్ యువకుడు అతను. సరిహద్దు రేఖ దగ్గర భారత సైనిక దళాల చేతిలో చనిపోయి, ఆ ఊరి లోయలో డంప్ చేయబడిన యువకుల శవాల నుండి వారి ఐడెంటిటీ కార్డులను, ఆయుధాలను తీసుకొని ‘కేప్టన్ కాడియన్’ కి అందచేయటం అతని పని. కేప్టన్ దృష్టిలో ఆ శవాలు చనిపోయిన మాంసాలు (Dead Meat) మాత్రమే. ఆ యువకుడికి మాత్రం ఆ శవాలు అత్యంత ప్రీతి పాత్రమైనవి. తనను విడిచి సరిహద్దులు దాటి వెళ్లిన చిన్ననాటి స్నేహితుల శవాలు వాటిలో ఉంటాయేమోనని వెతుకుతుంటాడు. ఆ శవాలతో సంభాషిస్తూ ఉంటాడు. ఆ శవాలు మనుషులుగా నడుస్తున్నపుడు, మాట్లాడుతున్నప్పుడు  ఏమి చేసేవారని అడుగుతుంటాడు. ఈ నవలా రచయిత మన ఆత్మను కశ్మీరంలో ముంచి ఉక్కిరిబిక్కిరి చేసి పైకి తేలుస్తాడు.

7. ‘Behold, I shine: Narratives of Kashmir’s Women and Children’. ఫ్రెని మానేక్ష (Freny Manecksha) రాసిన ఈ పుస్తకం 2017లో వచ్చింది. ఫ్రెని మానేక్ష మహారాష్ట్రకు చెందిన రచయిత్రి.  కశ్మీరీ ఇస్లామిక్ సమాజంలో భర్త చాటు భార్య స్థానం నుండి నేడు ఆర్మీపై రాళ్లు రువ్వుతున్నవిద్యాధికురాలైన మహిళ వరకు కశ్మీరీ మహిళ జీవనాన్ని అరలు అరలుగా, పొరలు పొరలుగా విప్పదీసి వర్ణిస్తూ రాసిన పుస్తకం ఇది. అక్కడి మహిళలకు గన్నులు పట్టుకొని ఆపాదమస్తకం శరీరాన్ని ఎక్స్ రే తీస్తూ నిలబడి ఉండే సైనికుడి ఉనికి ఎలాంటి భావనలు కలిగిస్తుంది? ఇది ఒక సైనికుడి గురించి కాదు, ఆరు వందల మిలటరీ కాంపులతో, 3.5 లక్షల ఎకరాల కశ్మీరీ భూములను ఆక్రమించుకొని ఉన్న మిలటరీ గురించి.

8. ‘Do you remember Kunan Poshpora?’ పుస్తకాన్ని ఇస్సాన్ బటూల్, ఇఫ్రాన్ భట్, శామ్రీన్ ముస్తాక్, మునాజ రషీద్, నటాష రాథర్ అనే ఐదుగురు యువతులు రాశారు. 1991 ఫిబ్రవరి 23-24 మధ్య రాత్రి. ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని జంట ఊర్లు కూనన్ ఫోష్పారాలను ఇండియన్ ఆర్మీ 4వ రాజపుత్న రైఫిల్స్, 68 పర్వత బ్రిగేడ్ కు సంబంధించిన 150 మంది సైనికులు చుట్టుముట్టారు. ఆ రాత్రి కూనన్ ఫోస్పరాలలో అత్యంత ఘోరం జరిగింది. మగవారినందరినీ ఊరి బయట విచారణ కాంపులకు తరలించారు. ఆడవారిపై ఘోర పైశాచిక కాండ నిర్వహించారు. ఈ వాస్తవాలను సాహసోపేతంగా బయటకు తీసుకొని వచ్చి, కూనన్ పోష్పోర బాధితులకు న్యాయం చేయమని డిమాండ్ చేశారు ఈ రచయిత్రులు. 

9. ‘A Desolation Called Peace’ పుస్తకం కశ్మీరీ ప్రజల రాజకీయ ఆకాంక్షలనూ, స్వాతంత్ర్యం వచ్చాక వారి దృష్టికోణంలో వచ్చిన మార్పులనూ అర్ధం చేసుకోవటానికి అవసరమైన అంతర్దృష్టిని ఇస్తుంది. కశ్మీరీ రచయితలు రాసి, సంపాదకత్వం వహించిన ఈ మానవ సాంస్కృతిక శాస్త్ర సంబంధమైన వ్యాసాల సంకలనం- విముక్తి కాంక్షను చారిత్రిక, దేశీయ డిమాండ్ గా అన్వేషిస్తుంది. 1947 నుండి, సాయుధ పోరాటం ప్రారంభం అయిన మర్చిపోలేని ఆ 1989 సంవత్సరం వరకు నడిచిన ఈ వివరాలు - కశ్మీరీ ప్రజల మీదా, వారి ఆకాంక్షల మీదా  వలసానంతర రాజకీయాలు ఎలా ప్రభావం చూపాయో చిత్రీకరించాయి. ఈ రోజు జరుగుతున్న ఎడదెగని సంఘర్షణకు ఈ రాజకీయాలు ఎలా దారి చూపించాయో చెప్పాయి. లోతైన భావోద్వేగంతో రాసిన ఈ వ్యాసాల సంకలనం-  అసలు విషయాన్ని పరోక్ష యుద్ధంగా, ఉగ్రవాదంగా, లేక కేవలం శాంతిభద్రతల సమస్యగా తక్కువ చేసి చూపించే కాలం చెల్లిన అలంకారాలకు అతీతంగా కశ్మీర్ ను అర్ధం చేసుకొనే వీలును కల్పిస్తుంది. అథర్ జియా, జావైద్ ఇక్బాల్ భట్ ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించారు.   
          
10. మెహర్ చంద్ మహాజన్ ఆత్మ కథ Looking Back. ఈయన పంజాబ్ లోని టీకా నగ్రొత్త అనే గ్రామంలో మహాజన్ అనే అగ్రకులంలో పుట్టాడు. కశ్మీర్ చరిత్రతో ఈయన ముడిపడి ఉన్నాడు కాబట్టి ఇది చదవాల్సిన  పుస్తకం. మెహర్ చంద్ మహాజన్ కశ్మీర్ విలీనం సమయంలో (1947) జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రి. తరువాత భారతదేశ ఉన్నత న్యాయమూర్తి. భారత పాక్ విభజనలో సరిహద్దు కమిటీలో సభ్యుడుగా ఉన్నాడు. భారత ప్రభుత్వం చేత కశ్మీర్  ప్రధానమంత్రిగా నియమింపబడిన ఈ వ్యక్తి ఆత్మ కథ కశ్మీర్ కు సంబంధించిన అనేక నిజాలను బయటపెడుతుంది.  

11.  ‘The sentiment in my stone’ పుస్తకం కశ్మీర్ సంక్షోభాన్ని బాగా అర్థం చేయించే పుస్తకం. పుస్తక రచయిత 26 సంవత్సరాల అజీబ్ మంజూర్. పేరుకి కాల్పనికం కానీ, ఈ పుస్తకం సమకాలీన సంక్షోభ కశ్మీర్ చరిత్ర గురించి చెబుతుంది. ఒక యువకుడు తన దృష్టిలో ఈ సంక్షోభానికి ఉన్న అన్ని కారణాలను సరిగ్గా రాశాడు. అక్కడి సైన్యం మీద రాళ్లు రువ్వే యువకుడి అంతరంగం ఈ పుస్తకం. 

12. కశ్మీర్ గురించి ఇటీవల వచ్చిన ఇంకో మంచి పుస్తకం ‘Rumors of the spring’. కశ్మీర్ గురించి ఒక మహిళ రాస్తే -అక్కడ జరిగే అత్యాచారాలు, హాఫ్ విడోస్, బిడ్డలను కోల్పోయిన తల్లుల గురించి ఉంటుందని ఆశిస్తాము. కానీ రచయిత్రి ఫరా బషీర్ -పసి వయసు నుండి యుక్త వయసుకు మారే కాలంలో తన అనుభవం నుండి రచయిత్రి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొనే క్రమం -ఆ అర్థం చేసుకోవటం అనుభవంగా, జ్నాపకంగా మారి ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొని వచ్చిందో తిరుగులేని విధంగా రాసింది.  ఆమె కశ్మీర్ లో సామాన్య మహిళలు, ఇల్లాళ్లు, నాయనమ్మలు, పక్కింటి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, మంత్రగత్తెలు, ఉద్యోగ మహిళలు -వీళ్లంతా మిలటరైజేషన్ బారిన పడి ఉక్కిరిబిక్కిరి అయిన సంగతులు రాసింది. ఆమె బాల్యం, 18 ఏళ్ల ఆమె యవ్వనం కశ్మీర్ నడిబొడ్డున గడిచాయి. అది కశ్మీర్ కు సంబంధించి అతి ప్రమాద కాలం. ఆ ప్రమాదకాలంలో ఆమె ఆత్మస్మృతుల పుస్తకం ఇది.   

13. Jaffna Street పుస్తకాన్ని డా. మిర్ ఖలిద్ రాశారు. ఇది ఒక చారిత్రిక సమాచారాన్ని ఇచ్చే పుస్తకం. కశ్మీర్ గురించి తెలుసుకోవటానికి ఉపయోగపడే మొదటి పది పుస్తకాల్లో ఈ పుస్తకం ఉంటుంది. 1991 సాయుధ పోరాటం కశ్మీర్ లో ప్రారంభం అయిన కాలానికి యువకుడు అయిన మిర్ ఖలీద్ -మిలిటెంట్స్ కు కౌంటర్ మిలిటెంట్స్ కు మధ్య జరిగిన యుద్ధాలను నిష్పక్షపాతంగా, ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా రాశారు. భారత్, పాకిస్తాన్ దేశాలు కశ్మీర్ లో ఆడిన ఆట గురించి వివరంగా ఉంటుంది ఈ పుస్తకంలో. 

14.  Resisting Disappearance: Military Occupation and Women’s Activism in Kashmir పుస్తకాన్ని రాసింది అథర్ జియా. భర్తలను, బిడ్డలను కోల్పోయిన కశ్మీరీ మహిళల కథనం ఇది. స్వతహాగా కవయిత్రి అయిన అథర్ గుండెను పిండే విధంగా వాళ్ల బాధలను వర్ణించారు. మిలటరైజేషన్ కశ్మీరీ మహిళల జీవితాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. Association of Parents of Disappeared Persons సంస్థలో పని చేసిన అథర్ ఈ పుస్తకంలో ప్రెజెంట్ చేసిన వాస్తవ కథనాలు మనసును కలచివేస్తాయి.

15. Half mother పుస్తకాన్ని షహనాజ్ బషీర్ రాశారు. పాపా 2 హింసా కాంపుకు వెళ్లి తిరిగిరాని బిడ్డకు తల్లి అయిన హాలీమా కథ ఇది. నిజానికి ఈ కథ కశ్మీర్ లోయలో వేల మహిళల కథ ఇది. 

16. Scattered Souls: ఈ పుస్తకాన్ని కూడా షజనాజ్ బషీర్ రాశారు. కశ్మీర్ లో సామాన్యుల కథనాలు ఇవి. ఈ కథనాల వెనుక ఆకలి, దారిద్యం, మిలిటరీకరణ వస్తువులుగా ఉన్నాయి. షహనాజ్ బషీర్ కథలకు, నవలకు అనేక అవార్డ్స్ వచ్చాయి.  

17. Kashmir: Rage and reason: కశ్మీర్ కల్లోలానికి కారణాలు వెదికే పుస్తకం ఇది. కశ్మీర్ సమస్య గురించి చర్చించటమే కాకుండా దాని పరిష్కారాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూచిస్తుంది ఈ పుస్తకం. సమకాలీన కశ్మీర్ లో వచ్చిన మార్పులను మైక్రో లెవెల్ లో రాశారు. ఈ పుస్తక రచయిత, జర్నలిస్టు అయిన  గౌహర్ గిలానీ మీద ఇప్పుడు అనేక కేసులు పెట్టి ఉన్నారు.  

18. Kashmir Looking back into Time: ఈ పుస్తక రచయిత ఖలీద్ బషీర్ అహమ్మద్ కశ్మీరీ చరిత్రకారుడు. మాయం చేసేస్తున్న కశ్మీరీ సంస్కృతి, బాష, మూలాల మీద రచయితకు ఎంతో కన్సర్న్ ఉంది. వివిధ దశల్లో కశ్మీర్ లోకి ప్రవేశించిన మతాలు వాటి వెనుక కారణాల గురించిన సమాచారం ఈయన పుస్తకాల్లో ఉంటుంది. ఈయన రాసిన ఇతర పుస్తకాలు Kashmir: Exposing the myth behind the narrative,  Jheelam: The River through my backyard కూడా ఇదే లైన్స్ లో ఎన్నో చారిత్రక సత్యాలను వెలికి తీస్తాయి. కశ్మీర్ గురించి రాయటానికి ముందుకొచ్చిన మొదటి కశ్మీరీ  చరిత్రకారుడు ఖలీద్ బషీర్ అహమ్మద్. అప్పటిదాక ఇతరులు కశ్మీర్ చరిత్ర రాశారు. 
 
19.  What Happened to Governance in Kashmir పుస్తకం రాసిన రచయిత అయిజాజ్ అశ్రఫ్ వాని కశ్మీర్ యూనివర్సిటీలో పోలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. 1947 తరువాత కశ్మీర్ ను ఏలిన ప్రభుత్వాలు కశ్మీర్ కు చేసిన ద్రోహాల గురించి ఈ పుస్తకం చర్చిస్తుంది. భారత ప్రభుత్వం చేత అతి ఎక్కువగా ముద్దు చేయించుకొన్న కశ్మీర్ పాలకులు తమ స్వప్రయోజనాల కోసం కూడా కశ్మీర్ కల్లోలానికి, తదనంతరం వచ్చిన సాయుధ తిరుగుబాటుకు కారణం అయ్యారు. షేక్ అబ్దుల్లా ‘నయా కశ్మీర్’ ప్రణాళిక ఆయన సహచరుల అవినీతి వలన ఎలా నీరు కారిపోయిందో చాలా బాగా రాశారు ఈ పుస్తకంలో.  
 
20.  Break Free: జక్రయ్య సులేమాన్ రాసిన ఈ కాల్పనిక నవల కశ్మీర్ యువత ఇంటా బయట ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి చెబుతుంది. చాలా సింపుల్ గా ప్రారంభం అయి కథ మనసుని లోతుగా గాయం చేసి వదిలిపెడుతుంది.

21. Our moon has blood clots: రాహుల్ పండిత రాసిన ఈ పుస్తకం వలసల సమయంలో పండితుల పడిన కష్టాల గురించినది. రాహుల్ పండిత కుటుంబ కథ ఇది. 80 గదుల ఇల్లును వదిలి పెట్టి, జమ్మూ శిభిరంలో ఆ కుటుంబం పడిన పాట్ల గురించి చాలా బాగా రాశారు. కశ్మీరీ పండితుల మీద వచ్చిన ఈ ఏకైక పుస్తకంలో వాళ్ల కండగండ్ల గురించిన సమాచారం ఉంది కానీ కూడా ఎక్కడా అవాస్తవాలు కనబడవు. 

22. Until my freedom has come: New Intifada in Kashmir. పండిత కుటుంబానికి చెందిన సంజయ్ కక్ రాసిన ఈ పుస్తకం కశ్మీరీల స్వాతంత్ర్య కాంక్షను ఎత్తి పడుతుంటుంది. కశ్మీర్ మూల జాతీవాసులను మతాల వారీగా విడదీయదు ఈ పుస్తకం. కశ్మీర్ లో ధర్నాలు, జైలు భరోల దగ్గర నుండి సాయుధ పోరాటం వరకూ -అక్కడ నుండి ప్రజా ప్రతిఘటన వరకూ జరిగిన అంచెలంచెల ఉద్యమాల గురించి సవివరంగా చెబుతుంది ఈ పుస్తకం.
 
23. The many Faces of Kashmiri Nationalism పుస్తక రచయిత్రి నందితా హస్కర్. ఈమె కూడా పండిత మహిళ. లాయర్ కూడా. కశ్మీరీ సమస్యను చక్కగా అర్థం చేసుకొని, పాలక వర్గాల భావజాల ఉచ్చులో పడకుండా ఆమె పని చేశారు. SAR గిలానీ కేసును ఈమె మొదట్లో వాదించారు. ఈ పుస్తకంలోని వ్యాసాల్లో కశ్మీరీ ముస్లిములకూ, కశ్మీరీ పండితులకు ఉన్న అవినాభావ సంబంధం గురించి రాస్తారు.

24. Curfewed night: బషారత్ పీర్ రాసిన ఈ ఆత్మకథ 1990ల నాటి నుండి కశ్మీరీల కష్టకాలాలను రాస్తుంది. మానవ అదృశ్యాలు, లాకప్ మరణాలు, కర్ఫ్యూలు, పేరులేని సమాధులు, సామూహిక అత్యాచారాల గురించిన సవివరమైన పుస్తకం ఇది.

25. Paradise in Fire: సయ్యద్ ఆలీ గిలానీ జీవిత చరిత్ర గురించి అబ్దుల్ హకీం రాసిన ఈ పుస్తకం కశ్మీరీ పోరాట చరిత్రను చెబుతుంది. ఏడు దశాబ్దాల పాటు కశ్మీర్ విముక్తి కోసం పోరాడిన సయ్యద్ ఆలీ గిలానీ జీవితం నుండి కశ్మీర్ లో భూ సమస్య, ప్రతిఘటన, అక్కడ జరిగిన మానవ తప్పిదాలు, కశ్మీరీ పండితుల ఇంటెగ్రిటీ, సాయుధ పోరాటం, ఎన్నికలు, కాల్పుల విరమణ లాంటి అనేక ప్రాముఖ్యమైన విషయాల ప్రస్తావన ఉంది.

26. మృదు రాయ్ రాసిన Hindu rulers and Muslim subjects కశ్మీరీ చరిత్ర రికార్డ్ చేయటంలో ఒక మైలు రాయి. బెంగాల్ కు చెందిన చరిత్రకారిణి మృదు రాయ్ ఎంతో రీసర్చ్ చేసి రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం కశ్మీర్ పట్ల నా అపోహలను, ఆలోచనలను మార్చేసింది. 
పాలకులు హిందువులుగా పాలితులు ముస్లిములుగా ఉన్న కశ్మీర్ లో ముస్లిములు రాజకీయ కార్యాచరణ ప్రారంభానికి కారణాలను లోతుగా అధ్యయనం చేసి అనేకానేక సాధికార ఆధారాలతో రాశారు. వివిధ రాజుల కాలంలో వాళ్లను ఆశ్రయించి పండితులు పొందిన పదవులు, సంపాదించుకొన్న ఆస్తులు, విద్యా గ్రంధం లేని ముస్లిములపై సాగించిన పెత్తనం -ఇవన్నీ ఆమె పుస్తకంలో ఉన్నాయి. 
కశ్మీర్ మీద వచ్చిన పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం ఇది. 🌳🏵️

Link to comment
Share on other sites

Ee baffa batch only pandits chanipothene kanneellu kaarusthaara leka thoti maanavulu evariki ala jarigina kanneellu vasthaaya? Baffas enthamandini champaru last 20 years to for Hindu votes? Eppudu main elections vachhina these riots became normal. Vodipothamante denikaina digajaaruthaaru. Adhikaaram kosam terrorist pakisthan party tho kooda kalusthaaru.

First be human.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...