Jump to content

తెలంగాణలో పొలిటికల్ హీట్.. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం


Recommended Posts

హైదరాబాద్‌: సీఎల్పీ విలీనంపై పార్టీమారిన ఎమ్మెల్యేలు గురువారం సంచలన నిర్ణయం తీసుకుంటూ ఓ తీర్మానం చేశారు. తీర్మానం చేసిన పత్రంపై 12 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన విలీన పత్రాన్ని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా స్పీకర్‌ను కలిసినవారిలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు ఈ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలుసుకున్నారు.
 
12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి మారడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు తగ్గింది. ఇక కాంగ్రెస్‌లో మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, పొదం వీరయ్యలు ఉన్నారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగానే జరుగుతుందని రేగా కాంతారావు పేర్కొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం జరిగిందని ఆయన అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆమోదించారని ఆయన అన్నారు.
Link to comment
Share on other sites

2 hours ago, koushik_k said:

Valla bondha valle theskonturru.. Ippudu congress payi BJP osthadi dora tikka kudurusthadi

Yeah killing congress will only help BJP to gain more momentum in TG. Dangerous game start chesaru 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...