Jump to content

వైసీపీ ఎంపీ అభ్యర్థి నిర్వాకం.. వింటే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే?


Recommended Posts

https://www.andhrajyothy.com/artical?SID=782064

 

వైసీపీ ఎంపీ అభ్యర్థి నిర్వాకం.. వింటే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే?
02-05-2019 11:54:44
 
636923951461383204.jpg
ఆయన కోస్తాజిల్లాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన నేత. ఆయన వలలో చిక్కుకున్న ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ విషయాన్ని పార్టీ అధినేతకు చెప్పుకుని బోరుమన్నారట. కులాలు, సమాజం, అవినీతి గురించి అద్భుతంగా ఉపన్యాసాలు దంచే ఆ ఎంపీ అభ్యర్థి నిర్వాకం ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అధినేత వరకు వెళ్లి.. ఆ పార్టీలో సుడులు తిరుగుతున్న ఆ ఎంపీ అభ్యర్థి వ్యవహారం గురించి వింటే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. ఇంతకీ ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు? ఏమిటాయన కథ? పూర్తి వివరాలు తెలుసుకోండి
 
 
    గతంలో ఎంపీగా పనిచేసిన ఆ అభ్యర్థి మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికలకు ముందు తన బంధువులతో సహా వెళ్లి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. తాను పోటీచేయబోయే పార్లమెంట్‌ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు అయ్యే ఖర్చంతా కూడా తానే పెట్టుకుంటానని గట్టిగా నమ్మబలికారు. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి.. నామినేషన్లు పూర్తయ్యాక అయ్యగారు అసలు విషయం చల్లగా చెప్పారు. తనవద్ద పెద్దగా డబ్బులు లేవనీ, తననుంచి ఏమీ ఆశించవద్దనీ అసెంబ్లీ అభ్యర్థులకు స్పష్టంచేశారు. దీంతో ఆ ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు ఎవరి తిప్పలు వారు పడ్డారు.
 
 
   అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనకు పరిచయం ఎక్కువగా ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఒకరోజు ఉదయం ఆయన తన వద్దకు పిలిపించుకున్నారట. బ్రేక్‌ఫాస్ట్ పెట్టి వారిని బాగా దువ్వారట. "మీరు పోటీచేసే రెండు అసెంబ్లీ స్థానాల్లో నాకు విస్తృతంగా అనుచరగణం ఉంది. పైగా ఒక అసెంబ్లీ స్థానం నా సొంత నియోజకవర్గం'' అని వారికి చెప్పుకొచ్చారట. "ఆ రెండు స్థానాల్లో మీరు పంచాలనుకుంటున్న డబ్బులు నాకే ఇవ్వండి. నా డబ్బులతోపాటు మీ డబ్బులు కూడా కలిపి ఓటర్లకు పంపిణీ చేస్తాను'' అని వారిని నమ్మించారట. పాపం! రాజకీయాలకు కొత్తయిన ఆ అమాయక అభ్యర్థులు ఇరువురూ ఎంపీ అభ్యర్థి మాటలకు బుట్టలో పడ్డారట. ఓటర్లకు తాము పంచాలనుకున్న డబ్బును పెద్ద మొత్తంలోనే ఆయనకు సమర్పించుకున్నారట.
 
 
   పోలింగ్‌కు అయిదు రోజుల సమయం ఉన్న తరుణంలో ఓటర్లకు డబ్బు పంపిణీ జరగలేదని అసెంబ్లీ అభ్యర్థులకు తెలిసింది. వెంటనే వారు సదరు ఎంపీ అభ్యర్థి దగ్గరకు వెళ్లి సంగతేమిటని నిలదీశారు. దీంతో ఆయన డబ్బు పంపిణీ చేసినంటూ బుకాయించారట. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు పార్టీ శ్రేణులు తమకు డబ్బులు అందలేదనీ, ఓటర్లకు పంచలేదనీ ఆ ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారట. దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
 
   వెంటనే వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ విషయంపై ఆరాతీసింది. అప్పుడు తెలిసిందట అయ్యగారి అసలు నిర్వాకం. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాను డబ్బులు పంపిణీ చేశానంటూ మరోసారి బుకాయించారట. ఆయనదంతా బుకాయింపేనని పార్టీ పెద్దలు గ్రహించారట. అప్పటికే సమయం మించిపోవడంతో కొంత మొత్తాన్ని ఆ అభ్యర్థులు ఇద్దరికీ సర్దుబాటు చేశారట. ఈ డబ్బు కూడా పూర్తిస్థాయిలో ఓటర్లకు చేరకపోవడంతో అసెంబ్లీ అభ్యర్థులు డీలాపడ్డారు. ఆ ఎంపీ అభ్యర్థి తమకు సహాయం చేయకపోగా, నిండా ముంచేశారని ఇప్పుడు వారు బోరుమంటున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు కూడా సదరు ఎంపీ అభ్యర్థిపై ఫిర్యాదు చేశారు.
 
   అధినేత జగన్‌ మాత్రం ఏంచేయగలరు? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్న ఉద్దేశంతో "అన్ని విషయాలు నేను చూసుకుంటా..'' అని ఆ ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులకు నచ్చచెప్పి పంపించారట. ఈ నేపథ్యంలో జగన్‌ సన్నిహితులు సదరు ఎంపీ అభ్యర్థి బంధువులను పిలిపించి లెప్ట్ అండ్ రైట్ పీకారని వినికిడి.
 
   వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉద్దేశపూర్వకంగానే ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులను బోల్తా కొట్టించినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వారితో పాటు మరో అసెంబ్లీ అభ్యర్థిని కూడా పిలిపించి ఆయన బ్రేక్‌ఫాస్ట్‌ ఇచ్చాడట. నీ నియోజకవర్గంలో పంచే డబ్బు నాకు ఇస్తే నేనే ఓటర్లకు పంపిణీ చేస్తానంటూ ఆయనకీ ఆఫరిచ్చాడట. అయితే ఎన్నికల రంగంలో ఆరితేరిన ఆ అసెంబ్లీ అభ్యర్థి "మీ డబ్బులు కూడా నాకే ఇవ్వండి. పంపిణీ సంగతి నేనే చూసుకుంటా..'' అంటూ ట్విస్ట్‌ ఇచ్చారట. ఈ తరుణంలో ఆ ఇద్దరు నేతల మధ్య మాటామాటా పెరిగి "నువ్వెంత?'' అంటే "నువ్వెంత'' అనుకున్నారట. మధ్యలో ఉన్న కొందరు వ్యక్తులు వారిని సముదాయించారట. ఎంపీ అభ్యర్థి చేతిలో మోసపోయిన ఇరువురు అసెంబ్లీ అభ్యర్థులు మాత్రం ఆయన తమను ఎలా చీట్ చేశారో పార్టీలోని అగ్రనేతలందరికీ చెప్పి లబోదిబోమంటున్నారు. మేము ఓడిపోతే ఆ పాపం ఆ ఎంపీ అభ్యర్థిదేనని శాపనార్థాలు పెడుతున్నారు! ఇదండీ వైసీపీలోని ఓ ఎంపీ అభ్యర్థి అసలు రంగు!
Link to comment
Share on other sites

25 minutes ago, vinayak said:

గతంలో ఎంపీగా పనిచేసిన ఆ అభ్యర్థి మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

 

6 minutes ago, RKumar said:

Pvp/modugula?

PVP never won as MP right?

Link to comment
Share on other sites

3 minutes ago, Venu_NTR said:

AJ gadi pulihora kakapothe.. MLA dabbulu evadina MP cbethilo pedthaara... At max dabbulu istha ani hand ichi vundachu ... MLA lu Maree vp la kanipisthunnaara endhi..

akkada MLA lu kadu kothaga vacharu ani rasadu ga.money distribution lo anubhavam lekapovatam valana,expereinced aina MP candidate ki ichi undochu 

Link to comment
Share on other sites

18 minutes ago, Venu_NTR said:

AJ gadi pulihora kakapothe.. MLA dabbulu evadina MP cbethilo pedthaara... At max ah MP dabbulu istha ani hand ichi vundachu ... MLA lu Maree vp la kanipisthunnaara endhi..

Modugula is also an MLA of Guntur kadha.

Link to comment
Share on other sites

17 minutes ago, vinayak said:

akkada MLA lu kadu kothaga vacharu ani rasadu ga.money distribution lo anubhavam lekapovatam valana,expereinced aina MP candidate ki ichi undochu 

Entha kottaga vachina.. em vachina... Ala evaru pettaru in my opinion.. eh sari both parties MLA lu antha mudhuru tenke lu... Mp le koncham soft natured people vunnar

Link to comment
Share on other sites

Bala sowri anukunta. Yenduku cheyyaru ala? YCP seat ippisthaanu ani nani gadu iddaru candidates daggara oka 10C daaka laagadu from last 2 years. Okati gannavaram, inkoti penamaluru. Gannavaram vachcindhi, penamaluru biscuit aiyindhi. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...