Jump to content

Democracy in Danger cbn live


sonykongara

Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply
ప్రమాదంలో ప్రజాస్వామ్యం!
28-10-2018 02:59:20
 
636762970685018682.jpg
  • అభివృద్ధి కంటే కక్ష సాధింపుపైనే దృష్టి
  • మోదీ హయాంలో అన్నింటా వైఫల్యాలే
  • ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ మంత్రాంగం
  • బెదిరించడం, హెచ్చరించడమే నైజం
  • గిట్టని వాళ్లపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు
  • నాయకుడన్నవాడే లేకుండా చేసే కుట్ర
  • ఢిల్లీలో కీలక అధికారులంతా గుజరాతీలే
  • ప్రధాని, పార్టీ అధ్యక్షుడిదీ అదే రాష్ట్రం
  • ఇతర రాష్ట్రాలకు న్యాయంపై ఏదీ భరోసా?
  • సహకార సమాఖ్య, బలమైన రాష్ట్రాలు, అవినీతి నేతల దండన... అన్నీ కబుర్లే!
  • ఏం జరుగుతోందో చెప్పడం నా బాధ్యత
  • ఫిర్యాదులు కాదు.. పరిష్కారం కోసమొచ్చా
  • నాపైనా దాడులు జరగవచ్చు: చంద్రబాబు
‘కుట్రలన్నీ అర్థమయ్యాయి. ఏం జరుగుతోందో మొత్తం చాటి చెబుతా’ అని ప్రకటించిన చంద్రబాబు... ఢిల్లీ వేదికగా గళం విప్పారు. నాలుగున్నరేళ్ల మోదీ పాలనలో వైఫల్యాలు ఇవీ అంటూ విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులకు బెదిరింపులు, వారిపై దాడులే లక్ష్యంగా చేసుకుని... ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతం దిశగా చర్చలు జరిపారు.
 
 
న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని మోదీ నాలుగున్నరేళ్ల క్రితం చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ‘అచ్చేదిన్‌ ఎక్కడ’ అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌పై కక్ష, వివక్ష ఎందుకని ఆగ్రహించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. మరో నాయకుడు లేకుండా చేయాలన్నదే మోదీ ఉద్దేశమని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
‘ఒక సీనియర్‌ నాయకుడిగా దేశంలో ఏం జరుగుతోందో చెప్పడం నా బాధ్యత. అందుకే ఢిల్లీకి వచ్చాను. ఫిర్యాదులు చేసేందుకు కాదు... పరిష్కారం వెతికేందుకే వచ్చాను. ఇది ప్రారంభం మాత్రమే! మున్ముందు అనేక వేదికలపై గొంతెత్తుతాను’’ అని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. సర్వతోముఖ వైఫల్యంతో దేశ ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు. విశాఖ విమానాశ్రయంలో విపక్ష జగన్‌పై దాడి... ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై మూకుమ్మడి విమర్శల నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆయా అంశాలపై చంద్రబాబు ఏమన్నారంటే...
 
 
బెదిరింపులే విధానమా?
మోదీ సర్కారుకు ఎప్పుడు చూసినా ఎన్నికల ధ్యాసే. ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే అక్కడ మొత్తం యంత్రాంగాన్ని మోహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడం, వేధించడం, హెచ్చరించడానికే మోదీ సర్కారు పరిమితమైంది. దీనికోసం ఆదాయపు పన్ను శాఖను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను, సీబీఐని ప్రయోగిస్తున్నారు. మాట వినని వ్యాపారవేత్తలు, నేతలందరినీ లక్ష్యంగా చేసుకున్నారు. చివరికి... మీడియాను కూడా వదలడంలేదు. ఢిల్లీలో యోగేంద్ర యాదవ్‌, కేజ్రీవాల్‌పై గురిపెట్టారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో సోదాలు జరిపారు. బిహార్‌లో లాలుపై కేసు పునరుద్ధరించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మంత్రి శివకుమార్‌పై విరుచుకుపడ్డారు. జయలలిత ఉన్నన్ని రోజులు కిమ్మనకుండా... ఆమె మరణం తర్వాత ఏకంగా 19 చోట్ల సోదాలు జరిపారు.
 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నేత రవి తివారీపై దాడులు చేశారు. హిమాచల్‌, పశ్చిమ బెంగాల్‌, హరియానా... ఇలా ఏ రాష్ట్రం చూసినా ఇదే పరిస్థితి. తెలంగాణలో రేవంత్‌ రెడ్డిపై దాడులు, సోదాలు జరిపారు. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నంత వరకు ఐటీ సోదాల్లేవు. బయటికి రాగానే ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఒకేసారి 19 బృందాలను పంపించారు. రాష్ట్రంపైనే దాడి చేశారు. సుజనా చౌదరి నాలుగేళ్లు మోదీ సర్కారులో మంత్రిగా ఉన్నారు. అప్పుడు అంతా ఓకే! మేం బయటికి రాగానే ఆయనపైనా గురిపెట్టారు. ఎంపీ సీఎం రమేశ్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. గురువారం విశాఖపట్నంలో ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌, వన్డే మ్యాచ్‌ జరుగుతుండగానే పెట్టుబడిదారులపై దాడులు చేశారు. చివరికి... పోలవరం కాంట్రాక్టు సంస్థను కూడా వదల్లేదు. కేంద్రం ఏం చేయాలనుకుంటోంది? పెట్టుబడిదారులను, మీకు గిట్టని నాయకులను బెదిరించాలనుకుంటున్నారా? నేను దాడులను విమర్శించడం లేదు. కానీ, విభేదించిన వారి స్థైర్యాన్ని దెబ్బతీయడం, వేధించడం, వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం సరైనదా? అది ప్రజాస్వామ్యమా?
 
 
చిత్తశుద్ధితో ప్రయత్నించారా?
మొత్తం నల్లధనం తీసుకొచ్చి... ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. అదేమైంది? కనీసం... చిత్తశుద్ధితో ఒక ప్రయత్నమైనా చేశారా? పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేయలేదు. రద్దయిన నోట్ల కంటే ఎక్కువే వెనక్కి వచ్చింది. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి. డిజిటల్‌ లావాదేవీలపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడిగా నేను చేసిన సిఫారసులు పట్టించుకోలేదు. వందకు మించిన నోటు వద్దంటే ఏకంగా 2వేల నోటు తీసుకొచ్చారు. ఎన్నికల్లో సులువుగా డబ్బు పంచవచ్చనా? కేంద్రం వైఫల్యం వల్ల ఇప్పటికీ నగదు కొరత వేధిస్తోంది. తితలీ తుఫాను సహాయ చర్యలకు కూడా నగదు లభించలేదు.
 
 
‘నోట్ల రద్దుపై ఆర్బీఐని సంప్రదించలేదు. ఆ నిర్ణయం సరికాదు. సరైన ప్రణాళికతో అమలు చేయలేదు’ అని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ చెప్పారు. ఏదైనా చిత్తశుద్ధితో చేస్తే ఫలితం వచ్చేది. కానీ... ఇప్పుడు దేశ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. నల్లధనం వెనక్కి తెప్పించే సంగతి పక్కనపెడితే... విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, జతిన్‌ మెహతా వంటి వారు వేలకోట్లకు మంచి... దేశం నుంచి పారిపోయారు. వీరిని ఎవరు పంపించారు? చివరికి బ్యాంకులపైనా ప్రజలకు నమ్మకం పోయింది. డిపాజిట్లను ఈక్విటీగా పరిగణించాలనే బిల్లుతో... బ్యాంకుల్లో డబ్బు వేయాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. మోదీ వైఫల్యాలతో దేశమంతా నిరాశలో ఉంది.
 
 
అంతా ఒక విషవలయం
రూపాయి విలువ నాలుగున్నరేళ్లలో 58.60 నుంచి 74 రూపాయలకు పడింది. పెట్రోలు ధర లీటరు 62 రూపాయల నుంచి 84 వరకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ 6-7 శాతం పెరుగుతోంది. వృద్ధిరేటును లెక్కించే స్థిర విధానాన్ని స్వాతంత్య్రం వచ్చాక ఆరేడుసార్లు మార్చితే... ఈ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రెండుసార్లు మార్చింది. తద్వారా ‘సంతృప్తికరమైన వృద్ధిరేటును’ చూపిస్తోంది. కానీ... నిజమైన అభివృద్ధి మాత్రం ఉండదు. సంపద సృష్టి జరగదు. ఇదంతా ఒక విషవలయంగా మారింది. బయటికి రాలేని పరిస్థితి!
 
 
గరుడ నిజమేనేమో!
శివాజీ అనే నటుడు ఆరేడు నెలల క్రితం ‘ఆపరేషన్‌ గరుడ’ గురించి చెబితే... నేను పట్టించుకోలేదు. కానీ... ఇప్పుడు ఆయన చెప్పిందే జరుగుతోంది.
 
 
కత్తి ఎక్కడిదో మీరే తేల్చాలి!
విశాఖపట్నం విమానాశ్రయంలో విపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక చిన్న కత్తితో దాడి చేశాడు. అది సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలో ఉండే ప్రాంతం. కేంద్రం పరిధిలోకి వస్తుందది. కనీసం అది కూడా తెలుసుకోకుండా వెంటనే బీజేపీ నేతలు మాపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. దాడిని ఖండించండి, సానుభూతి చూపండి. కానీ... కేంద్రం పరిధిలో ఉన్న ప్రాంతంలో దాడి జరిగితే మమ్మల్ని నిందిస్తారా? బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌, పవన్‌... ఇలా అంతా మాపై దాడి చేయడం ఎందుకు? విమానాశ్రయం లోపలికి కత్తి ఎలా వెళ్లిందో కనుక్కోవాల్సింది కేంద్రమే! ఈ ఘటనను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని భావించారు. ఇది సరైనదేనా?
 
 
ఇదేనా జగన్‌ బాధ్యత?
దాడి తర్వాత సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది నిందితుడిని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. బాధితుడైన జగన్‌ను మాత్రం పంపించేశారు. చొక్కాకు రక్తపు మరకలున్నా విమానంలోకి అనుమతించారు. కేసు వద్దనుకుంటే ఆయన ఇష్టం. కానీ... జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత జగన్‌కు లేదా?
 
 
గవర్నర్‌ సీక్రెట్‌ ఏజెంట్‌...
జగన్‌పై దాడి జరిగితే... గవర్నర్‌ నేరుగా డీజీపీకి ఫోన్‌ చేశారు. హుటాహుటిన ఢిల్లీకి వచ్చి... అందరినీ కలిసి ఏవో నివేదికలు ఇచ్చారు. సీఎంగా నాకు ఇప్పటికి 14ఏళ్ల అనుభవం ఉంది. ఎక్కడైనా పాలనలో గవర్నర్‌ జోక్యం చేసుకోవచ్చా? ఏ నివేదిక అయినా ప్రభుత్వాన్ని అడగాలి. సర్కారియా కమిషన్‌ నివేదికలో గవర్నర్‌ పాత్రను కూడా నిర్వచించారు. కేంద్రం తరఫున సీక్రెట్‌ ఏజెంట్లుగా వ్యవహరించే గవర్నర్‌ వ్యవస్థే వద్దని మేం చెప్పాం.
 
 
ఇవేనా అచ్చేదిన్‌?
నాలుగున్నరేళ్ల క్రితం మోదీ ఏం చెప్పారు? బలమైన ప్రజాస్వామ్యం, రాష్ట్రాలు-రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం, టీమ్‌ ఇండియా, సహకార సమాఖ్య ఇలా ఎన్నో చెప్పారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వ్యవస్థలు బలహీనమయ్యాయని, వాటిని గాడిన పెడతామని చెప్పారు. కాంగ్రెస్‌ మీడియాను కూడా వేధిస్తోందని... మీడియాకు పూర్తి స్వేచ్ఛ, సాధికారత కల్పిస్తామని హామీ ఇచ్చారు. చర్చలు, సంప్రదింపులతో అన్నీ సాధిస్తామని ప్రకటించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. కానీ... ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పటికే ఎన్నికల సంవత్సరం వచ్చేసింది. మరి... ‘అచ్చేదిన్‌’ ఎప్పుడొస్తాయి?
 
 
ఇది నా బాధ్యత!
ప్రధానిగా పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. కానీ, వాటిపై మొట్టమొదటిసారి గట్టిగా మాట్లాడి, బలంగా అమలు చేసింది నేనే. రెండోతరం ఆర్థిక సంస్కరణలు సంస్కరణలను ప్రవేశపెట్టిందీ నేనే. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్‌ను ఒక నాలెడ్జ్‌ ఎకానమీగా, ఉత్తమ మౌలిక సదుపాయాలతో రూపుదిద్దినట్లు గర్వంగా చెప్పగలను. 40 ఏళ్లుగా నేను క్రమశిక్షణతో ఉన్నాను. చిల్లర రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతోందో దేశానికి చెప్పాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. మనది అద్భుతమైన దేశం. ఎన్నో వనరులున్నాయి. బలమైన టెక్నాలజీ, విస్తృతమైన మార్కెట్‌ మన సొంతం. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలున్నాయి. దీని గురించి పట్టించుకోకుండా... తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు.
 
 
ఏపీకి కేంద్రం వ్యతిరేకం
ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టం అమలు చేయాలని... దేశ నిర్మాణంలో భాగస్వాములమవుతామని మొదటి నుంచి చెబుతున్నాం. కానీ, మా డిమాండ్లేవీ పట్టించుకోలేదు. పైగా... కేంద్రం ఏపీకి వ్యతిరేకంగా పని చేస్తోంది. నవ్యాంధ్రను నమ్మించి మోసం చేశారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. విభజన చట్టంలోని 18 హామీలు, ప్రధాని హోదాలో మన్మోహన్‌ ఇచ్చిన ఆరు హామీలు సంపూర్ణంగా నెరవేర్చేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. ఢిల్లీ చుట్టూ నేను 29 సార్లు తిరిగినా పట్టించుకోలేదు. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి... మా ప్రభుత్వ ఖాతాలోంచి దౌర్జన్యంగా, ఏకపక్షంగా వెనక్కి తీసుకున్నారు. ఇదేం పద్ధతి.
 
 
తెలంగాణకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారు. దీనిని నేనూ హర్షిస్తున్నాను. తెలంగాణకు ఇంకా చేయండి. కానీ... ఏపీపై ఎందుకు వివక్ష? ఇంకా చేయండి. కానీ... ఏపీపై వివక్ష మాత్రం సరికాదు. 11 జాతీయ విద్యాసంస్థలకు నిధులు ఇస్తున్న తీరు చూస్తే.. అవి పూర్తయేందుకు మరో 30 ఏళ్లు పడుతుంది. కడపలో ఉక్కు, విజయవాడలో మెట్రో, విశాఖకు జోన్‌, కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌... ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదు. చివరికి... రెవెన్యూ లోటు 16వేల కోట్ల ఉందని తేలినా... రూ.3900 కోట్లతో సరిపెట్టారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి మేం ఖర్చుపెట్టిన రూ.3000 కోట్లు ఇంకా తిరిగి చెల్లించాలి. కొత్తగా ఏర్పడిన... నాలుగున్నరేళ్ల వయసున్న నవ్యాంధ్రపై ఇదీ కేంద్రం వైఖరి!
 
 
తితలీ సాయం ఏదీ?
హుద్‌హుద్‌తో విశాఖ ధ్వంసమైతే రూ.వెయ్యి కోట్లు ఇస్తామని... రూ.650 కోట్లు ఇచ్చారు. మొన్నటికి మొన్న తితలీతో శ్రీకాకుళం అతలాకుతలమైతే... విపత్తుల శాఖను కూడా చూస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గుంటూరులో బీజేపీ కార్యాలయానికి భూమి పూజ చేసి అట్నుంచి అటే వెళ్లిపోయారు. తుఫాను బాధితులను మాత్రం పరామర్శించలేదు. పైగా... అన్నింటికీ నన్నే నిందిస్తారు.
 
 
అంతా గుజరాత్‌మయం...
కేంద్రంలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులంతా గుజరాతీలే. ప్రధాన పార్టీ అధ్యక్షుడు, ప్రధాని ఒకే రాష్ట్రానికి చెందిన వారు ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. మేం నిష్పాక్షికంగా ఉన్నామని, అందరికీ న్యాయం చేస్తామని సంకేతాలు పంపించాలి. కానీ... ఇప్పుడేం జరుగుతోంది? సహకార సమాఖ్య వ్యవస్థ అని చెప్పిన వాళ్లు... ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల్లో కేంద్ర సచివాలయాలు పెడతామంటున్నారు.
 
 
అవినీతిపరులతో అంటకాగుతూ..
రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని... బీజేపీ మాతో రాజకీయంగా కూడా సరిగా వ్యవహరించలేదు. కలిసి పోటీ చేసిన తెలంగాణలో ఏకపక్షంగా కటీఫ్‌ చెప్పారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు తీసుకున్నారు. ఆ పార్టీతో రహస్య అవగాహన పెట్టుకున్నారు. ఒక్క ఏడాదిలో అవినీతి రాజకీయ నాయకులపై విచారణ ముగించి, శిక్షిస్తామన్న ప్రధాని మోదీ... చివరికి వారితోనే అంటకాగుతున్నారు. వీటన్నింటి వల్లే బీజేపీతో విభేదించి, కేంద్రం నుంచి బయటికి వచ్చాం. తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాష్ట్ర సమస్యపై అవిశ్వాసం పెట్టింది. దీనికి అన్ని పార్టీలు మద్దతు పలికాయి. చర్చలో ప్రధాని నన్ను నిందించారు. నేను వైసీపీ ట్రాప్‌లో పడ్డానన్నారు. కానీ... ఆయనే అవినీతి ట్రాప్‌లో పడ్డారని నేను చెప్పాను. ఇది దేశానికి మంచిది కాదన్నాను. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని, గొడవలతో ఫలితం ఉండదని నేను రాజీపడుతూ వస్తే... కేసీఆర్‌కు మెచ్యూరిటీ ఉందని, నాకు లేదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించాల్సిన ప్రధానే... గొడవలు పెట్టాలనుకున్నారు.
Link to comment
Share on other sites

సంకీర్ణంతోనే న్యాయం
28-10-2018 02:54:06
 
636762976304846743.jpg
  • జాతీయపార్టీతోనే కూటమికి రూపు
  • కాంగ్రెస్‌, మిత్రపక్షాలతో కలిసి
  • సంఘటిత కార్యాచరణకు సిద్ధం
  • ఢిల్లీలో చంద్రబాబు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సంకీర్ణ ప్రభుత్వాలతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు ప్రభుత్వానికి సంఖ్యా బలం తగినంత లేకపోయినా కీలక సంస్కరణలు చేపట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నా, ఎట్టి గట్టి నిర్ణయాలూ తీసుకోవడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సంకీర్ణం వైపు దేశం అడుగులు పడుతున్నాయన్నారు. నాయకుడు సమర్థుడయితే సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా అభివృద్ధి సాధ్యమేనని తెలిపారు.
 
 
అయితే, జాతీయ పార్టీ వెంట లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌, మిత్రపక్షాలతో కలిసి సంఘటిత కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. యునైటెడ్‌ ఫ్రంట్‌, నేషనల్‌ ఫ్రంట్‌, ఎన్డీఏ - 1 కూటములకు టీడీపీ మద్దతిచ్చిందని, వివిధ పార్టీల నేతలను అప్పుడూ, ఇప్పుడూ కలుస్తూనే ఉన్నామని, ఇలా కలవడం తనకు కొత్తేమి కాదని చంద్రబాబు తెలిపారు.
 
 
తాను చిన్న వ్యక్తినని, తమ రాష్ట్రంలో 25 సీట్లు మాత్రమే ఉన్నాయని, అయినా దేశాన్ని రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. అందుకే తాను ముఖ్య నేతలను కలిసి చర్చలు జరపడానికి ఢిల్లీకి వచ్చానని వివరించారు. ‘‘దేశం పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరిని కలుపుకుపోవాలి. కలిసొచ్చే పార్టీలు, నాయకులు ఉన్నారు. అయితే, అందరినీ ఎలా సంఘటితం చేస్తామన్నదే ముఖ్యం’’ అని వివరించారు. కలిసి వచ్చే పార్టీల్లో కొన్ని తమ రాష్ట్రాల్లో అధికారం కోసం పరస్పరం తలపడుతున్న అంశంపై స్పందిస్తూ.. ‘‘దేశంలో రాజకీయ ఒత్తిళ్లు, సిద్ధాంతపరమైన ఒత్తిళ్లు ఉంటాయి.
 
 
ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలు.. జాతీయ పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. జాతీయ స్థాయిలో అవి కలిసిరావడంలో సమస్య ఉంటుంది. కానీ, దేశ ప్రయోజనాల కోసం ఎలా సంఘటితం కావాలన్నది ముఖ్యం. కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ మఽధ్యే ప్రధానపోటీ ఉంటుంది. కానీ, కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు గతంలో సీపీఎం మద్దతు ఇచ్చింది. అలాగే కొన్ని పార్టీలు తక్షణమే ఫ్రంట్‌లోకి రాకపోవచ్చు. ఎన్నికల తర్వాత అవి చేరతాయి. ఇది నిరంతర ప్రక్రియ’’ అని తెలిపారు.
 
 
తెలంగాణలో మహా కూటమిపై...
తెలంగాణలో టీడీపీ మహాకూటమిలో ఉందని, సీపీఐ, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్‌, టీడీపీ కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేశాయని చంద్రబాబు వివరించారు. తెలంగాణలో విభిన్న పరిస్థితులు ఉన్నాయని, వాటిని అర్థం చేసుకోవాలని సూచించారు. ‘‘కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి విభజన చట్టాన్ని రూపొందించింది. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. వాటిని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇది ఎలా సమర్థనీయం?’’ అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీని కలుస్తారా అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కాదు.. వైసీపీ ప్రతిపక్ష పార్టీ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Link to comment
Share on other sites

2 hours ago, Kiran said:

Not a big fan of Shah dude, his mode is only jenda pathenge, and crosses the red line at times

Only support to Modi for fast paced development and less corruption (except AP related issues)

Yes he supports corporates, they should grow invest and provide employment. Ippudu #self4society tho he is also trying to promote social responsibility

???

Link to comment
Share on other sites

8 hours ago, ask678 said:

Ee third grade vedhava Dhoval gaadu...country ki davoodh lekka ayyadu...chillara gaadu

Kauravula pakshana kooda oka Bheeshmudu Dronacharyulu unnattu...Prathi dhantllo manchi chedu rendu untai ask annai....Dhoval is India's James Bond....a very upbright and efficient former Intelligence officer...currently India's National Advisor..

Link to comment
Share on other sites

25 minutes ago, Vishal_Ntr said:

I hate Mayawati...why didnt she meet my leader Janasena adhineta... This is CBNs conspiracy to gain political advantage. I heard Lokesh gave 100 cr to her to cancel her appointment with our God PSPK, but instead meet CBN

pilla kaki( pk)fans gola na edi..

Link to comment
Share on other sites

11 minutes ago, chsrk said:

Kauravula pakshana kooda oka Bheeshmudu Dronacharyulu unnattu...Prathi dhantllo manchi chedu rendu untai ask annai....Dhoval is India's James Bond....a very upbright and efficient former Intelligence officer...currently India's National Advisor..

Vaadu baffas party office bearer lekka behave chesthunnadu...anni institutes lo veedi politics...veedu malli country ki advisor...

Dhoval not good guy...you will come to know soon about him once baffas gone 

Link to comment
Share on other sites

8 minutes ago, ask678 said:

Vaadu baffas party office bearer lekka behave chesthunnadu...anni institutes lo veedi politics...veedu malli country ki advisor...

Dhoval not good guy...you will come to know soon about him once baffas gone 

Ok ok..

Link to comment
Share on other sites

దేశవ్యాప్తంగా ధర్మపోరాటం!: చంద్రబాబు
29-10-2018 02:15:20
 
636763761191561005.jpg
  • తెలుగోళ్ల ప్రాబల్య ప్రాంతాల్లో సభలు
  • భావసారూప్య పార్టీలున్న రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు పోరుబాట
  • చెన్నైలోనూ సభకు సీఎం నిర్ణయం
  • బెంగాల్లో కూడా పెడదామన్న మమత
  • కేంద్రంపై పదునెక్కనున్న టీడీపీ పోరు
నవ్యాంధ్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా ధర్మపోరాటం చేస్తున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. దీనిని దేశమంతటికీ విస్తరించాలని నిర్ణయించారు. తెలుగువారి ప్రాబల్య ప్రాంతాల్లో, భావసారూప్య పక్షాలున్న రాష్ట్రాల్లో ఈ పోరాట సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిశ్చయించారు.
 
 
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ప్రభుత్వంపై చేస్తున్న ధర్మపోరాటాన్ని రాష్ట్రానికే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ధర్మ పోరాట సభలు నిర్వహించాలని నిశ్చయించారు. కర్ణాటకలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన పిలుపు మేరకు బీజేపీకి వ్యతిరేకంగా వారు ఓటేశారని సీఎం గుర్తుచేస్తున్నారు. తమిళనాడులో కూడా తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున చెన్నైలో ఒక ధర్మపోరాట బహిరంగ సభ పెట్టాలని అనుకుంటున్నారు. సీబీఐ, ఈడీల నుంచి ఐటీ శాఖల వరకు ప్రతి వ్యవస్థను మోదీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్న తీరు గురించి ఢిల్లీ వెళ్లి పలు పార్టీల నేతలకు వినిపించిన చంద్రబాబు.. ఇదే అంశంపై కలిసొచ్చే ఇతర నాయకులతోను మాట్లాడాలని భావిస్తున్నారు.
 
బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌యాదవ్‌, కేజ్రీవాల్‌, సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, రాజా వరకు అందరినీ ఢిల్లీలో కలిశారు. దీనికి కొనసాగింపుగా జరుగుతున్న పరిణామాలు, కుట్రలపై టీఎంసీ నాయకురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కూడా చంద్రబాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. బెంగాల్లో కూడా కేంద్ర కక్షపూరిత వ్యవహారాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. తొలుత జనవరిలో ఈ సభను నిర్వహించాలనుకున్నా.. కేంద్ర వైఖరిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుగానే జరిపితే బాగుంటుందని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం.
 
దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని చంద్రబాబు భావిస్తున్నారు. ‘ప్రశ్నిస్తే వేధింపులు.. పోరాడితే సాధింపులు.. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కక్షసాధింపు కోసం వాడుకుంటున్నారు. ప్రజాస్వామ్య గొంతుకలు వినపడకూడదు. తామనుకున్నదే శాసనం అన్నట్లుగా నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడింది. దీన్ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ధర్మపోరాటం నిర్వహించాలి’ అని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.
 
ఇది కొత్త కుట్ర..
రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరులు ఎల్లకాలం నడవవని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్రానికి రావలసినవి అడిగినందుకు మొదలైన కక్ష.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేంత వరకు వెళ్లిందని మండిపడుతోంది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉండే విమానాశ్రయంలో.. ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిని అడ్డుపెట్టుకుని.. పలు పార్టీలను కలుపుకొని.. చివరకు గవర్నర్‌ను రంగంలోకి దించి ఏదో చేయాలనుకోవడం కొత్త కుట్రని అభిప్రాయపడుతోంది. ‘కాలం మారుతుంది.. అన్ని సమయాల్లో దౌర్జన్యం నడవదు.. ప్రకృతి అన్నిటినీ సమతుల్యం చేస్తుంది.. అంతిమంగా ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది.. అప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా వెనకడుగు వేయకుండా పోరాడాలి’ అని చంద్రబాబు టీడీపీ అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
 
అధికార బలంతో కుట్రలకు సహకరించే పలు పార్టీలతో లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని.. కేసుల కోసం రాజీపడేవారిని అక్కున చేర్చుకుని బీజేపీ చేస్తున్న రాజకీయం ఒక్క ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ‘తమిళనాడులో ఏం జరిగిందో తెలుసు.. అవినీతిపరులను ఎలా చంకన పెట్టుకుని వెళ్తోందో తెలుసు.. దేశవ్యాప్తంగా కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలను దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటేందుకు.. కలిసొచ్చే పార్టీలన్నిటితో కార్యాచరణకు వెళ్దాం’ అని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది: అఖిలేశ్ యాదవ్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రితో అన్న అఖిలేశ్ యాదవ్

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...