Jump to content

Rafale fighter jets fight


Recommended Posts

రాఫెల్‌పై యుద్ధం
24-07-2018 02:04:56
 
636679946952079006.jpg
  • బీజేపీ పాలిట బోఫోర్స్‌?
  • గోప్యత ఒప్పందం వల్లే రేట్లు చెప్పట్లేదు
  • మాటజారి ఇరుక్కున్న నిర్మలా సీతారామన్‌
  • ఒప్పందానికీ, ధరలకూ సంబంధం లేదు
  • 2008లో రాఫెల్‌ మన జాబితాలోనే లేదు
  • కాగ్‌కు చెప్పాక ఇక గోప్యతేముంటుంది?
  • అనుభవం లేని కంపెనీపై ఎందుకంత ప్రేమ?
  • నిలదీసిన మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ
  • ఫ్రెంచి అధ్యక్షుడు చెప్పగా నేనూ విన్నా
  • గోప్యత ఒప్పందాల్లేవన్నారు: ఆనంద్‌ శర్మ
  • కాంగ్రెస్‌, బీజేపీ పరస్పర హక్కుల తీర్మానాలు
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ముప్పయ్యేళ్ల క్రితం బోఫోర్స్‌ కుంభకోణం తిరుగులేని నేత రాజీవ్‌గాంధీని గద్దె దించింది. తాజాగా రాఫెల్‌ విమానాల కొనుగోలు వ్యవహారం ప్రధాని మోదీ సర్కారుకు ఎసరు పెడుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేవనెత్తిన రాఫెల్‌ యు ద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు కాంగ్రె్‌సకు ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారనుంది. రాఫెల్‌ విమానాల కొనుగోలులో ధరలను వెల్లడించకపోవడం గోప్యత ఒప్పందంలో భాగమనీ, ఆ ఒప్పందం 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కుదిరిందని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. ఆ వ్యాఖ్యల ద్వారా ఆమె ఇరుక్కుపోయారని, కాంగ్రెస్‌ పన్నిన ఉచ్చులో నరేంద్ర మోదీ ప్రభుత్వం చిక్కుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
 
ధర మాత్రమే కాదు, ఒక భారతీయ వ్యాపారికి టెక్నాలజీని బదిలీ చేయించేందుకు మోదీ సర్కార్‌ చూపిన చొరవ కూడా వివాదాస్పదమైంది. రూ.58 వేల కోట్ల రాఫెల్‌ డీల్‌లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారి ఉంటాయనే అనుమానం కాంగ్రెస్‌ వ్యక్తం చేస్తోంది. రాఫెల్‌ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని, రక్షణ మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా రాహుల్‌ పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ బీజేపీ ఎంపీలు నిషికాంత్‌ దుబే, అనురాగ్‌ ఠాకూర్‌, దుష్యంత్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ జోషీ సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలిస్తానని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సోమవారం చె ప్పారు. దీంతో రాఫెల్‌ ఒప్పందంపై సభను తప్పుదోవ పట్టించినందుకు మోదీ, నిర్మలపై కూడా హక్కుల తీర్మానం పెడతామని కాంగ్రెస్‌ ప్రకటించింది.
 
రంగంలోకి ఆంటొనీ
రాహుల్‌ ఆరోపణలను నిర్మలా సీతారామన్‌ ఖండించి, గోప్యత ఒప్పందం యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కుదిరిందని చెప్పారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్‌ అంటోంది. నిర్మల మాటల్లో వాస్తవం లేదని చెప్పడం కోసం స్వయంగా మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటొనీ రంగంలోకి దిగారు. రాఫెల్‌ విమానాల ధరలను ప్రకటించేందుకు భారత, ఫ్రాన్స్‌ దేశాల మధ్య 2008లో కుదిరిన గోప్యత ఒప్పందం అడ్డు పడుతున్నదని నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని ఆంటొనీ స్పష్టం చేశారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని, రక్షణ మంత్రి పచ్చి అబద్దాలాడారని ఆరోపించారు. అసలు 2008లో రాఫెల్‌ విమానాల కొనుగోలుకు ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు. అప్పటికి రాఫెల్‌ను యుద్ద విమానాల కొనుగోలు జాబితాకు ఎంపికే చేయలేదని తెలిపారు. భారత్‌కు యుద్ధ విమానాలు అమ్మేందుకు రెండు అమెరికన్‌ కంపెనీలు, ఒక రష్యన్‌ కంపెనీ, ఒక స్వీడన్‌ కంపెనీ, ఒక యూరప్‌ కంపెనీ(యూరో ఫైటర్‌ టైఫూన్‌)తో పాటు ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ కంపెనీ కూడా పోటీ పడిందని ఆంటోనీ చెప్పారు.
 
2012లోనే దసాల్ట్‌ కంపెనీ రాఫెల్‌ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ధరలపై కూడా చర్చలు ముగిశాయన్నారు. కొన్ని అంశాలు పరిష్కారం కానందువల్ల తాము ఒప్పందంపై సంతకం చేయలేక పోయామని ఆంటోనీ చెప్పారు. రాఫెల్‌ డీల్‌ విషయంలో రక్షణ మంత్రి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిజానికి భారత-ఫ్రాన్స్‌ ఒప్పందం గురించి తాను 2008లోనే పార్లమెంట్‌కు చెప్పానని ఆంటోనీ చెప్పారు. రక్షణ ఉత్పత్తుల ధరల గురించి సభలో వెల్లడించడాన్ని ఏ గోప్యత ఒప్పందమూ అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా ఆ కొనుగోలు జరిగిన తీరును కాగ్‌ ఆడిట్‌ చేస్తుందని, ఒప్పందం తాలూకు పత్రాలను, ధరలను పరిశీలిస్తుందని, తర్వాత పార్లమెంట్‌కు చెందిన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ(పీఏసీ) కూడా దానిపై సమీక్షిస్తుందని ఆంటోనీ చెప్పారు. ఇంకా రహస్యం ఏముంటుందని ప్రశ్నించారు.
 
రాహుల్‌కు నేను సాక్ష్యం: ఆనంద్‌ శర్మ
యుద్ధ విమానాలు తయారుచేసిన అనుభవం లేని కంపెనీని ఎందుకు ఎంపిక చేశారో కూడా బయటపెట్టాలని కాంగ్రెస్‌ ముఖ్యనేత ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ప్రధాని, రక్షణ మంత్రి పార్లమెంటులో వివరణ ఇవ్వాలని ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ యుద్ధ విమానాల ధరను వెల్లడించకూడదన్న నిబంధన ఒప్పందంలో లేదని ఒక సమావేశంలో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు స్వయంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తెలిపారని, ఆ సమయంలో తాను కూడా ఉన్నానని తెలిపారు.
 
ఎందుకు కుంభకోణమంటే?
యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌ ప్రభుత్వంలో జరిపిన చర్చల్లో కుదిరిన ధరకు మూడు రెట్లు చెల్లించి ఎన్డీఏ ప్రభుత్వం రాఫెల్‌ యుద్ధ్ద విమానాలను కొనుగోలు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. ఒక వ్యాపారికి ప్రయోజనం చేకూర్చేందుకే మోదీ సర్కార్‌ అధిక ధర చెల్లించిందని, రక్షణ మంత్రి దేశాన్ని తప్పుదోవ పట్టించారని రాహుల్‌గాంధీ స్వయంగా లోక్‌సభలో ఆరోపించారు. రాహుల్‌ ఆరోపణలను సమర్థించిన ఆంటోనీ విమానం కొనుగోలు చేసిన ధరలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన అవగాహన ప్రకారం టెక్నాలజీని భారత ప్రభుత్వరంగ సంస్థ హెచ్‌ఏఎల్‌కు బదిలీ చేయాల్సి ఉండగా, యుద్ధ్ద విమానాలను ఉత్పత్తి చేయడంలో ఎలాంటి అనుభవం లేని ఒక భారతీయ ప్రైవేట్‌ కంపెనీకి టెక్నాలజీ బదిలీ ఎందుకు చేశారో చెప్పాలని ఆంటోనీ నిలదీశారు. ప్రైవేటు లబ్ధిదారుకు కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆరోపించారు. 2016 సెప్టెంబర్‌ 23న రెండు ప్రభుత్వాల మధ్య గోప్యత ఒప్పందం కుదిరిందని ఫ్రాన్స్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఆ ఒప్పందం ధరల వెల్లడిని నిషేధిస్తుందా? అన్న విషయం స్పష్టీకరించలేదు.
 
బీజేపీ నేతలు దేశ రక్షణ రహస్యాలంటూ దాటవేస్తున్నా యుద్ధ విమానాల ధరను మూడు రెట్లు పెంచి ఎందుకు కొన్నారో, టెక్నాలజీ బదిలీని భారతీయ వ్యాపారికి ఎందుకు అప్పగించారో సంతృప్తికర సమాధానం చెప్పలేదు. నిజానికి యుద్ధ విమానాలను ఏ ధర చెల్లించి కొనుగోలు చేశారో చెప్పడానికి నిర్మల నిరాకరిస్తున్నప్పటికీ 2016-2017కు చెందిన దసాల్ట్‌ ఏవియేషన్‌ వార్షిక నివేదిక ప్రకారం 7.5 బిలియన్‌ డాలర్లకు 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను భారత్‌కు అమ్మినట్లు వెల్లడించారు. అంటే ఒక్కో యుద్ధ విమానానికి రూ.1670 కోట్లు చెల్లించారు. దసాల్ట్‌ ఏవియేషన్‌ వార్షిక నివేదికలోనే ధర వెల్లడించినపుడు అది గోప్యత ఒప్పందంలో భాగమని నిర్మలా సీతారామన్‌ ఎందుకు చెప్పారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాహుల్‌ ప్రసంగంతో ఈ విషయం రచ్చకెక్కింది. గత ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ సభ్యుడు రాజీవ్‌గౌడ ఒక్కో విమానం ఎంత ధరకు కొన్నారనిరాజ్యసభలో ప్రశ్నించారు. భారత ప్రభుత్వం, ప్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలోని 10వ అధికరణం ప్రకారం రహస్య సమాచారాన్ని వెల్లడించలేమని నిర్మల ప్రకటించారు. దాంతో రక్షణమంత్రి చుట్టూ ఉచ్చు బిగించడం ప్రారంభమైంది.
 
మూడు రెట్లు ఎలా అయ్యింది?
యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన రాఫెల్‌ యుద్ధ విమానం ఖరీదు ధర ఒక్కొక్కటీ రు.560 కోట్లు. రాఫెల్‌ విమానం ధర రూ.740 కోట్లు కాగా దాన్ని 20 శాతం తగ్గించాలని డిమాండ్‌ చేసి భారత ప్రభుత్వం ఆ మేరకు కంపెనీని ఒప్పించింది. అదే విమానాన్ని ఈజిప్టు, ఖతార్‌ దేశాలకు రూ.1319 కోట్లకు అమ్మారు. తాజాగా ఎన్‌డీఏ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.1670 కోట్లు వెచ్చించినట్లు తేలింది. ఆ రకంగా చూసినా ఖజానాకు రు. 12,632 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. యూపీఏ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరకే ఒప్పందం కుదిరినా ఇతరత్రా కారణాల వల్ల తుదికాంట్రాక్టుపై సంతకాలు చేయలేదు.
Link to comment
Share on other sites

France govt. pettina rod ki face saving attempt. Ika ee Raul baba tho foreign dignitaries skip button kodatharemo. Scam kosam mari desperate ga unnaru, idhi scam ante poye as govt.’s won’t  reveal the price lol ? 

Link to comment
Share on other sites

1 hour ago, Kiran said:

France govt. pettina rod ki face saving attempt. Ika ee Raul baba tho foreign dignitaries skip button kodatharemo. Scam kosam mari desperate ga unnaru, idhi scam ante poye as govt.’s won’t  reveal the price lol ? 

Aa 3 times matter enti annai? Adi nijama kaada? 

Link to comment
Share on other sites

2 hours ago, Sree Ram said:

Aa 3 times matter enti annai? Adi nijama kaada? 

Vadi bondha, maa modi critic Mihir rasina article sadhuvu details kavalante

https://www.newslaundry.com/2018/02/09/rafale-deal-misconceptions-defence-ministry-dassault

Also defence expert guy

https://www.orfonline.org/research/nda-government-no-reason-secretive-rafale-deal/

Link to comment
Share on other sites

1 hour ago, Kiran said:

whatever it is, modi govt started a very bad practice.. if the govts in future follow the same for every small deal... even God might not save this country...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...