Jump to content

Nammaka drohi


girikurnool

Recommended Posts

టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌ ఓ దర్శకుడ్ని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘ఆ దర్శకుడు ఎవరు?’ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఆయన ఎవరో మాత్రం పూనమ్‌ బయటపెట్టలేదు.

ఓ దర్శకుడు తన నాలుగు కుటుంబాల సహాయంతో ఎన్నారై హీరోయిన్‌కు మద్దతుగా ఉన్నారని పూనమ్‌ వ్యాఖ్యానించారు. తనకు హిట్లు లేవని, మరి ఆమెకు (ఎన్నారై హీరోయిన్‌) ఉన్నాయా? అని ప్రశ్నించారు. కొన్ని ఉద్యోగాలు చేయకుండా ఉండటమే మంచిదని అన్నారు. ‘జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో పడేస్తాడు.. జాగ్రత్త.. నమ్మకద్రోహి’ అని ట్వీట్‌ చేశారు. ‘మంచికి విలువ ఇస్తే.. చెడు (దర్శకుడికి) వచ్చేది కాదు’ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

పూనమ్‌ ట్వీట్లకు ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘మీరు కుంగుబాటులో ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే వైద్యుడ్ని సంప్రదించండి’ అని కామెంట్‌ చేశారు. ఆయనకు పూనమ్‌ తిరిగి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘ఇది నిజం.. కుంగుబాటుతో చేసిన వ్యాఖ్యలు కావు. మీ గురువులు జీవితాల్ని నాశనం చేయడంలో చాలా గొప్పవారు. వారి దగ్గరకు వెళ్లు.. నన్ను ట్విటర్‌లో అనుసరించడం ఆపు’ అని ట్వీట్‌ చేశారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...