sonykongara Posted April 18, 2018 Posted April 18, 2018 (edited) Edited April 18, 2018 by sonykongara MSDTarak 1
sonykongara Posted April 18, 2018 Author Posted April 18, 2018 (edited) Edited April 18, 2018 by sonykongara
sonykongara Posted April 18, 2018 Author Posted April 18, 2018 నదీగర్భాన జలసిరి.. నవ్వుతోంది చేలో వరి!పాపాఘ్ని నదిలో భూగర్భ ఆనకట్టల నిర్మాణంతో సత్ఫలితాలుపెరుగుతున్న భూగర్భ జలమట్టంతో బోర్లు, బావుల్లో జలకళఆరుచోట్ల ప్రయోగాత్మకంగా నిర్మాణం.. రూ.26.36 కోట్ల వ్యయం0.796 టీఎంసీల సామర్థ్యం.. 7795 ఎకరాలకు ప్రత్యక్ష లబ్ధి4-5 మీటర్ల పైకి చేరిన పాతాళగంగ.. రూ.110 కోట్లతో మరో 16 నిర్మాణాలు నీటికి నడకలు నేర్పారు.. నదికి జీవం పోశారు.. చుక్కచుక్కనూ ఒడిసిపట్టి, భూగర్భపొరల్లో దాచిపెట్టి బంగారు భవిష్యత్తుపై భరోసా కల్పించారు.. బీడుబారిన భూముల్లో పచ్చదనాన్ని పెంపొందించి సీమలో మరో హరితవిప్లవానికి శ్రీకారం చుట్టారు.. ఒక్క ఆలోచన, ఒకే ఒక్క ప్రయోగం ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల గతిని మార్చేయగా.. వేలాది ఎకరాల సాగుకు అండగా నిలిచింది.. పాపాఘ్ని నదిలో పచ్చదనపు పరవళ్లకు కారణమైంది. ‘సుజలాం.. సుఫలాం’ ఉద్యమ సమయంలో జలవిజయ కథనం. ఈనాడు - కడప జిల్లాలో వ్యవసాయానికి అవసరమైన నీటికోసం వెంపర్లాడాల్సిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఎదురవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది.. రూ.6 వేల కోట్లకు పైగా వెచ్చించి 92 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను జిల్లాలో నిర్మించినా వాటిలోకి నీరు చేరే పరిస్థితి లేకపోవడంతో సమస్యగా తయారైంది. జిల్లా మొత్తం భూగర్భం రాతినేల కావడంతో నీరు ఇంకడమన్నదీ గగనమే. వాగులు, వంకల్లో ప్రవహించిన వర్షపునీరంతా సోమశిల పాలవడం ఏళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్యకు ప్రత్యేక పద్ధతుల్లో పరిష్కారం కనుగొనేందుకు జిల్లా జలవనరుశాఖ అధికారులు యోచన చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు ఈఈ ప్రతాప్ ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కడప భూమిలో నీటిని ఇంకింపజేయలేని క్రమంలో పాతాళాన్నే జలాశయంగా మార్చాలని భావించి భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్ డ్యామ్స్) నిర్మాణానికి సంకల్పించారు. జడ్‌షీట్ ఫైలింగ్ విధానంలో ఆనకట్టల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించగా భూమిలో ఆనకట్ట కడితే నీళ్లెలా నిలుస్తాయంటూ విమర్శించారు. జిలా ఉన్నతాధికారులు తోడ్పాటు ఇవ్వడంతో నమ్మకంతో ఒట¨్టపోయిన పాపాఘ్ని నదిని ప్రయోగానికి ఎంచుకున్నారు. అందులో అధ్యయనం చేసి 6 చోట్ల డ్యాముల నిర్మాణం చేపట్టారు. రూ.26.36 కోట్ల వ్యయంతో 0.796 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మూడేళ్ల కిందట నిర్మాణాలు చేపట్టి ఇటీవల పూర్తిచేశారు. కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని చక్రాయపేట, వేంపల్లి, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి మండలాల పరిధిలో ఆనకట్టలు ఏర్పాటయ్యాయి. ఎక్కడెక్కడ కట్టారంటే.. : చక్రాయపేటలోని సుగాలితండా వద్ద తొలి సబ్‌సర్ఫేస్‌డ్యాం నిర్మించారు. రూ.3.53 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన దీని ద్వారా 770 ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోంది. తక్కెలపల్లి వద్ద రూ.6.8 కోట్ల వ్యయంతో మరో ఆనకట్ట నిర్మించగా 1120 ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుంది. * వేంపల్లె-చక్రాయపేట మధ్యన గండిక్షేత్రం వద్ద మరో భూగర్భ ఆనకట్ట నిర్మించారు. రూ.2.36 కోట్ల వ్యయంతో 1780ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా దీన్ని నిర్మించగా రెండు మండలాలకు ప్రయోజనంగా ఉంటోంది. * వేంపల్లె వద్ద రూ.6.25 కోట్ల వ్యయంతో 1425 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూర్చడంతో పాటు.. వేంపల్లె, చింతలమడుగుపల్లి, ఫక్కీరపల్లి,కుమ్మరాంపల్లి గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఓ ఆనకట్ట నిర్మించారు. * పెండ్లిమర్రి మండలం నందిమండలం వద్ద రూ.2.80 కోట్ల వ్యయంతో మరో ఆనకట్ట చేపట్టగా.. తద్వారా వేంపల్లె, పెండ్లిమర్రి మండలాల్లో 1880 ఎకరాల ఆయకట్టుకు నీటి వసతి కలగనుంది. * వీరపునాయునిపల్లి మండలంలో యు.రాజుపాళెం వద్ద రూ.4.62 కోట్లతో నిర్మాణం చేపట్టగా.. 820 ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోంది. అన్ని నిర్మాణాలతో మొత్తం 7795 ఎకరాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చాలనేది లక్ష్యం. ఎలా కట్టారంటే.. : భూమిపై ఆనకట్ట నిర్మించాలంటే ముంపు పరిహారం ఇప్పించడం, భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు.. ఇలా చాలా తతంగం ఉంటుంది. ఇందుకు రూ.కోట్లలో నిధులు అవసరం. పాపాఘ్నిలో ప్రస్తుతం నిర్మించిన సబ్‌సర్ఫేస్ డ్యామ్స్ భిన్నమైనవి. వీటిని జడ్‌షీట్ ఫైలింగ్ విధానంలో నిర్మించారు. అంటే నదిలో ఆనకట్ట నిర్మించాలనుకున్న ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ నదికి అడ్డంగా కొంతమేర మట్టిని తొలగించారు. ఆ గోతిలో వరుసగా జడ్ షీట్లను యంత్రాల సాయంతో ఒకదానితో ఒకటి గొలుసు ఆకారంలో అమర్చారు. షీట్ల పైభాగాన్ని మట్టితో కప్పేసి ఉపరితలంపై కాంక్రీటు ఫైౖలింగ్ క్యాప్ వేశారు. అంటే ఇక్కడ ఉపరితలంపై వచ్చే నీరు దిగువకు వెళ్లి భూగర్భజలం గణనీయంగా పెరుగుతుంది. మారిపోయిన రూపం : పాపాఘ్నిలో సబ్సర్ఫేస్డ్యాములు ఇటీవలే నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. ఒక్క తక్కెల్లపల్లి వద్ద కాంక్రీటు ఫైౖలింగ్ క్యాప్ వేయాల్సి ఉండగా నదికి నీరు రావడంతో అధికారులు వదిలేశారు. మిగిలిన అన్నిచోట్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు వట్టిపోయిన బోర్లు, బావుల్లోనూ జలసిరులు కనిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. సుమారు 4-5 మీటర్ల మేర నీటిమట్టం పెరిగినట్లు గుర్తించారు. డిజిటల్ స్కానింగ్, భూగర్భజలశాఖ ద్వారా మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాతాళ జలసిరులతో ఈ ప్రాంతం పచ్చదనం సంతరించుకుంటోంది. నదీపరివాహకంలో వరిపైర్లతో హరితసోయగాలు కనిపిస్తున్నాయి. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్న 7795 ఎకరాల ద్వారా సుమారు 16,563 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశముందని లెక్కగట్టారు. వార్షిక జీవీఏ రూ.51.24 కోట్లు సాధించవచ్చన్నది అంచనా. మరో 16కు ప్రతిపాదనలు : ప్రస్తుతం పాపాఘ్నిలో నిర్మించిన 6 భూగర్భ ఆనకట్టలు సత్ఫలితాలను ఇస్తుండటంతో అధికారులు మరో 16 చోట్ల నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు రూ.110 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. పెన్నానదిలో 3, మాండవ్యలో 6, బాహుదాలో 4, చెయ్యేరులో 2, పాపాఘ్నిలో 1 చొప్పున నిర్మించాలన్నది లక్ష్యం. ప్రతిపాదనలు పంపించారు. పాపాఘ్నిలో సబ్సర్ఫేస్డ్యామ్స్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటి నిర్మాణ తీరుతెన్నులు తెలుసుకుని ప్రశంసించడం గమనార్హం. చాలా సంతోషంగా ఉంది : పాపాఘ్ని నదిలో ఏర్పాటు చేసిన సబ్‌సర్ఫేస్ డ్యాములు సత్ఫలితాలను ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భూగర్భజలమట్టం గణనీయంగా పెరగుతుండటం కళ్లముందే కనిపిస్తోంది. ఎండిపోయి, వట్టిపోయిన బోరు, బావుల్లో ఇప్పుడు నీళ్లు ఉబికి వస్తున్నాయి. రైతులు చక్కగా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 4-5 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. లోతుగా అధ్యయనం చేస్తున్నాం. మరో 16 చోట్ల నిర్మించేందుకూ ప్రతిపాదనలు సిద్ధం చేశాం. -ప్రతాప్, తెలుగుగంగ ఈఈ, సబ్‌సర్ఫేస్ డ్యామ్స్ సృష్టికర్త
anil Ongole Posted April 18, 2018 Posted April 18, 2018 Kadapa naa intha chesina manaki ee time 4 seats ina istharu antava bro vallu
Ntrforever Posted April 18, 2018 Posted April 18, 2018 apart from Seats should be proud of what we are doing
sonykongara Posted April 18, 2018 Author Posted April 18, 2018 4 hours ago, Ntrforever said: apart from Seats should be proud of what we are doing
sonykongara Posted April 18, 2018 Author Posted April 18, 2018 సబ్‌సర్ఫేస్ డ్యామ్స్... చంద్రబాబు విజన్ కు, మరో ప్రత్యేక్ష ఉదాహరణ... వర్షపు నీరు..సాగు, తాగుకు ఆధారం. కాలం అనుకూలిస్తే సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే వర్షపు నీరు లభ్యమవుతోంది. ఆ నీటిని సంరక్షించక పోవడం వల్లే దుర్భిక్ష పరిస్థితులు నెలకుంటున్నాయి. చెరువులు, కుంట లలో నిలువ చేసిన నీటిలో చాలా భాగం ఆవిరి రూపంలో వృథా అవుతోంది. నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలు సమృద్ధి పరచాలి. ప్రస్తుతం వర్షపు నీటి వినియో గం కేవలం పది శాతం మాత్రమే.. అందుకే ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలో ఇంకేటట్లు చూడాలి. ఇదే కార్యక్రమం కోసం, చంద్రబాబు వారంలో ఒక రోజు, నీరు - మీరు మీద సమీక్ష చేస్తూ, తగు సూచనలు ఇస్తూ, వివిధ రూపాల్లో, నీటి లభ్యత పెంచుతున్నారు... ఈ కోవలో, చంద్రబాబు విజన్ కు మరో ఉదాహరణ భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్ డ్యామ్స్) ఈ విధానాన్ని కడప జిల్లలో, పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు. రూ.6 వేల కోట్లకు పైగా వెచ్చించి 92 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను జిల్లాలో నిర్మించినా వాటిలోకి నీరు చేరే పరిస్థితి లేకపోవడంతో సమస్యగా తయారైంది. జిల్లా మొత్తం భూగర్భం రాతినేల కావడంతో నీరు ఇంకడమన్నదీ గగనమే. దీంతో ప్రభుత్వం ఈ సమస్య పై ద్రుష్టి సారించింది. కడప భూమిలో నీటిని ఇంకింపజేయలేని క్రమంలో పాతాళాన్నే జలాశయంగా మార్చాలని భావించి భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్ డ్యామ్స్) నిర్మాణానికి సంకల్పించారు. పాపాఘ్ని నదిని ప్రయోగానికి ఎంచుకున్నారు. అందులో అధ్యయనం చేసి 6 చోట్ల డ్యాముల నిర్మాణం చేపట్టారు. రూ.26.36 కోట్ల వ్యయంతో 0.796 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణాలు చేపట్టి ఇటీవల పూర్తిచేశారు. కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని చక్రాయపేట, వేంపల్లి, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి మండలాల పరిధిలో ఆనకట్టలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు వట్టిపోయిన బోర్లు, బావుల్లోనూ జలసిరులు కనిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. సుమారు 4-5 మీటర్ల మేర నీటిమట్టం పెరిగినట్లు గుర్తించారు. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్న 7795 ఎకరాల ద్వారా సుమారు 16,563 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశముందని లెక్కగట్టారు. వార్షిక జీవీఏ రూ.51.24 కోట్లు సాధించవచ్చన్నది అంచనా. అసలు ఏంటి ఈ భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్ డ్యామ్స్) ? ... వాటర్‌షెడ్ ప్రాంతంలో భూమిలోకి ఇంకింపజేసిన నీటిని కాపాడుకోవాలి. నిల్వ ఉన్న భూగర్భ జలాన్ని వాడక పోయినా నీరు భూమిలో ప్రవహించి వాటర్ షెడ్ హద్దు దాటి పోయే అవకాశం ఉంది. భూగర్భ ఆనకట్టలు వాటర్ షెడ్ పరిధి అంచున కాల్వలా తవ్వి నిర్మించాలి. ఇది నది నీరు బయటకు పోకుండా చేసే అడ్డుగోడలా పని చేస్తుంది. ఈ కట్టడాన్ని హెచ్డీపీఈ ఫిల్మ్‌తో కప్పినట్టయితే నీరు బయటకు రాదు. మామూలు భూగర్భ జలాల సంరక్షణకు అయ్యే ఖర్చులో కేవలం నాలుగో వంతు ఖర్చుతో ఈ నిర్మాణం పూర్తి చేయవచ్చు.
DVSDev Posted April 18, 2018 Posted April 18, 2018 7 hours ago, anil Ongole said: Kadapa naa intha chesina manaki ee time 4 seats ina istharu antava bro vallu Seats di emi vundi ley Brother Thopulaaga develop chesina Hyd loney manalni pakkana pettaaru - name will be there in the hearts for ever - that blessings will come handy for his next generations.
LuvNTR Posted April 18, 2018 Posted April 18, 2018 7 hours ago, Ntrforever said: apart from Seats should be proud of what we are doing waste...entha sesina vote veyyaru sari kada. okka appreciation maata kuda raadu. ilantivi ATP, KNL, NLR, PKSM dist. lo anna sesthe vote percentage baaga perigi appreciation kuda baaga vasthundi.
LuvNTR Posted April 18, 2018 Posted April 18, 2018 1 hour ago, DVSDev said: Seats di emi vundi ley Brother Thopulaaga develop chesina Hyd loney manalni pakkana pettaaru - name will be there in the hearts for ever - that blessings will come handy for his next generations. HYD public worst to the core. Antha develop chesina gratitude supinchaledu aa sannasulu. ippudu anubhavisthunnaru. okappudu HYD public ante full smart people and nice educated people anukone vadini. 2014 results chusina tharuvatha vallani chusthe intha dumb and stupidest people rest of the AP state lo ekkada undaru ani anentha ga naa outlook maripoyindi.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now