Jump to content

నాలుగో వరుసలో రాహుల్‌!


swarnandhra

Recommended Posts

నాలుగో వరుసలో రాహుల్‌!
26-01-2018 02:50:52
 
636525318566872596.jpg
న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే శుక్రవారం జరిగే ఈ వేడుకల్లో ఆయనకు నాలుగో వరసలో సీటు కేటాయించారు! ‘గణతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేతకు మొదటి వరసలో సీటు కేటాయించడం ఆనవాయితీ. ఈసారి మాత్రం రాహుల్‌కు నాలుగో వరసలో సీటు కేటాయించినట్లు మాకు తెలిసింది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.
 
ఏ వరసలో సీటు కేటాయించారన్న దానితో సంబంధం లేకుండా రాహుల్‌ మాత్రం వేడుకలకు హాజరవుతారని చెప్పారు. ఆసియాన్‌ దేశాధినేతలంతా వస్తున్న ఈ వేడుకల్లో కాంగ్రెస్‌ అధినేతను అవమానించేందుకే ఇలా నాలుగో వరసలో సీటు కేటాయించారని మరో నేత వ్యాఖ్యానించారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. భారతీయులంతా రాజ్యాంగం, అది కల్పించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను పరిరక్షించాలని కోరారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
source: AndhraJyothy
 
Link to comment
Share on other sites

రాహుల్‌కు ఆరో వరుసలో సీటు
26-01-2018 17:05:37
 
636525831422063899.jpg
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారంనాడు రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యారు. ఆయనకు కేటాయించిన ఆరో వరుసలోని సీటులో ఆశీనులయ్యారు. అయితే ఆయనకు ఆరో వరుసలో ప్రభుత్వం సీటు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి చౌకబారు రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడిందంటూ దుయ్యబట్టింది.
 
 
రాహుల్ గాంధీ తనకు కేటాయించిన ఆరో వరుసలో రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తో కలిసి కూర్చుకున్నారు. రాహుల్ గాంధీకి మొదటి వరుసలో చోటు కేటాయించకపోవడాన్ని పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా తప్పుపట్టారు. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు మొదటి వరుసలో సీటు కేటాయిస్తూ వచ్చిన సంప్రదాయానికి మోదీ సర్కార్ తూట్లు పొడిచిందని, రాహుల్‌కు మొదటి వరుసలో సీటు కేటాయించకుండా చౌకబారు రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. 'మోదీ ప్రభుత్వ చిల్లర రాజకీయాలను అంతా చూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడికి నాలుగో వరుసలో సీటు కేటాయించినప్పటికీ ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఆరో వరుసకు మార్చారు. అహంకారులైన పాలకులు అన్ని సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారు. మాకు మాత్రం రాజ్యాంగపరమైన సెలబ్రేషన్స్ చాలా ముఖ్యం' అని సూర్జేవాలా హిందీలో ట్వీట్ చేశారు. ఆజాద్‌తో కలిసి రాహుల్ కూర్చున్న ఫోటోను కూడా ఆయన ట్వీట్‌కు జతచేశారు. ఆ ఫోటోలో మొదటి వరుసలో మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్.డి.దేవెగౌడ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, థావర్ చంద్ గెహ్లాట్‌ కూర్చున్నా‌రు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...